ఆంజనేయ శర్మ గారూ, యతిదోషాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘హేతువాదు లందు రిటుల|దైవనింద...’, ‘పరమమూర్ఖు డనును|దైవనింద...’ అని సవరిస్తే సరి! మీకు కలిగించిన ఇబ్బందికి క్షమించండి.
కవిమిత్రులు మన్నించాలి... రాత్రి సమస్యను షెడ్యూల్ చేసే తొందరలో యతిని గమనించలేదు. సమస్యలోని దోషాన్ని తెలిపిన ఆంజనేయ శర్మ గారికి, అక్కయ్యకు ధన్యవాదాలు. సవరించాను. జరిగిన పొరపాటుకు క్షంతవ్యుణ్ణి.
జిలేబీ గారూ, మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. సంధి చేయవలసిన చోట యడాగమాలు చేశారు. మీ పద్యానికి నా సవరణ... ఎవఁడు హరి యటంచు నెగసిపడియె నొక్కఁ డవనిజఁ జెరవట్టి యణగె నొక్కఁ డెవ్వరు తనవారొ యెఱుఁగు నా యీశుండు దైవనింద కడు హితమ్ముఁ గూర్చు.
శైలజ గారూ, ఆ పదాన్ని నేనెక్కడా వినలేదు. మీరన్నాక ఆంద్రభారతిలో వెదికితే పర్యాయపద నిఘంటువు తప్ప మరి ఏ నిఘంటువూ ఆ పదాన్ని ప్రస్తావించలేదు. జి.ఎన్.రెడ్డి గారికి అదెక్కడ దొరికిందో?
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మౌజుతో పైకి స్క్రోల్ చేస్తుండగా మీ పూరణ తప్పిపోయింది. మా బంధువు ఒకరు చనిపోతే వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. మన్నించండి. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండి(చిన్న సందేహము గురువు గారూ
" దై " కి " దె " యతి చెల్లుతుందా అని
1.
అభయ మిచ్చి బ్రోచు నాది దేవు డనుచు
ఆస్తి కుండు గొలుచు ననవరతము
వసుధ లోన హేతు వాదులే నిరతమ్ము
దైవ నింద హితము దెచ్చునంద్రు.
2.
పాల రాతి గుడిన పరమాత్మునే గని
శిలను దొలచి నట్టి శిల్పమనెడు
పాప భీతి లేని పరమ మూర్ఖులెపుడు
దైవ నింద హితము దెచ్చు నంద్రు.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండియతిదోషాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘హేతువాదు లందు రిటుల|దైవనింద...’, ‘పరమమూర్ఖు డనును|దైవనింద...’ అని సవరిస్తే సరి!
మీకు కలిగించిన ఇబ్బందికి క్షమించండి.
ధన్యవాదములండి.....ఇందులో ఇబ్బందేమి లేదండి.
తొలగించండిగురువు గారికి నమస్కారములు
తొలగించండి1.
అభయ మిచ్చి బ్రోచు నాది దేవు డనుచు
ఆస్తి కుండు గొలుచు ననవరతము
వసుధ లోన హేతు వాదులందురిటుల
దైవ నింద కడు హితమ్ము గూర్చు.
2.
పాల రాతి గుడిన పరమాత్మునే గని
శిలను దొలచి నట్టి శిల్పమనెడు
పాప భీతి లేని పరమ మూర్ఖుడనును
దైవ నింద కడు హితమ్ము గూర్చు.
గురువులు క్షమించాలి నాకూ అదే సందేహము బహుశ " తచ్చు ,తచ్చి " [తగ్గు , తగ్గుట } ఐ ఉంటుందేమొ అని
రిప్లయితొలగించండిపరమ భక్తు డొకడు పరమేశు బూజించి
రిప్లయితొలగించండినిహప రమ్ము మరచి నిష్ట గాను
నెంత వేడె నేని సుంతైన గనరాడు
దైవనింద హితముఁ దెచ్చు నండ్రు
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సుంత గనక యనె|దైవనింద...’ అంటే సరి.
పరమ భక్తు డొకడు పరమేశు బూజించి
తొలగించండినిహప రమ్ము మరచి నిష్ట గాను
నెంత వేడె నేని సుంత గనకయనె
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు
శుభోదయం ->
రిప్లయితొలగించండియెవడు హరియనియెని యెగిసిపడె నొకడు
అవనిజ చెరబట్టి అణిగె నొకడు
యెవరు తనదు వారొ యెరుగును ఈశుడు
దేవ నింద హితము దెచ్చు నండ్రు !
సావేజిత
జిలేబి
కవిమిత్రులు మన్నించాలి...
రిప్లయితొలగించండిరాత్రి సమస్యను షెడ్యూల్ చేసే తొందరలో యతిని గమనించలేదు. సమస్యలోని దోషాన్ని తెలిపిన ఆంజనేయ శర్మ గారికి, అక్కయ్యకు ధన్యవాదాలు. సవరించాను. జరిగిన పొరపాటుకు క్షంతవ్యుణ్ణి.
కంది వారు అది ఏమి విష్ణు మాయయో గాని
తొలగించండిమీ చేతి లో పదాలు పదనిసలు పాడుతాయండీ బాబు !
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు!
యెవడు హరియనియెని యెగిసిపడె నొకడు
అవనిజ చెరబట్టి అణిగె నొకడు
యెవరు తనదు వారొ యెరుగును ఈశుడు
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు
జిలేబీ గారూ,
తొలగించండిమీ ప్రశంసకు ధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సంధి చేయవలసిన చోట యడాగమాలు చేశారు. మీ పద్యానికి నా సవరణ...
ఎవఁడు హరి యటంచు నెగసిపడియె నొక్కఁ
డవనిజఁ జెరవట్టి యణగె నొక్కఁ
డెవ్వరు తనవారొ యెఱుఁగు నా యీశుండు
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు.
శిల్పి చేతిలో చెక్కబడిన బొమ్మ లాగా, గురువర్యుల దీవెనలతో జిలేబి కవిగా దినదినాభి వృద్ధి చెందు తున్నారు.
తొలగించండిఎంత కులుకుచుంటి వెవడబ్బ సొమ్మంచు
రిప్లయితొలగించండిరామదాసు దిట్టె రామచంద్రు
భక్తిపరవశుండు రక్తితోఁ జేసెడి
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు.
రావణాది దనుజు లావంతయైనను
రిప్లయితొలగించండిలెక్కసేయకుండ నక్కజముగ
వైరభక్తిఁ జూపి వైకుంఠుఁ బొందిరి
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు.
పాప పంకిలమున పడవేయు జనులను
రిప్లయితొలగించండిదైవనింద, కడు హితమ్ము గూర్చు
ఆత్మ శుద్ధితోడనర్చించ ధీవుని
కంటిపాప వోలె గాచు నతడె!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దేవుని’ టైపాటువల్ల ‘ధీవుని’ అయినట్టుంది.
ధన్యవాదములు గురువుగారు... దేవుడుకు మరొక పేరు ధీవుడు వుంది కదాని అది వాడాను..
తొలగించండిశైలజ గారూ,
తొలగించండిఆ పదాన్ని నేనెక్కడా వినలేదు. మీరన్నాక ఆంద్రభారతిలో వెదికితే పర్యాయపద నిఘంటువు తప్ప మరి ఏ నిఘంటువూ ఆ పదాన్ని ప్రస్తావించలేదు. జి.ఎన్.రెడ్డి గారికి అదెక్కడ దొరికిందో?
రిప్లయితొలగించండిభృగువు శాప మిడగ పృథివి పై విష్ణువు
వెంకటేశ్వరుడుగ వెలసి జనుల
సంకటముల బాపి సర్వార్ధముల దీర్చ
దైవనింద కడు హితమ్ము గూర్చు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిభృగువు శాప మిడగ పృథివి పై విష్ణువు
వెంకటేశ్వరుడుగ వెలసి జనుల
సంకటముల బాపి సర్వార్ధముల దీర్చ
దైవనింద కడు హితమ్ము గూర్చు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమౌజుతో పైకి స్క్రోల్ చేస్తుండగా మీ పూరణ తప్పిపోయింది. మా బంధువు ఒకరు చనిపోతే వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. మన్నించండి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిలచి చర్చ బెట్టి ప్రేక్షకులనుపెంచ
రిప్లయితొలగించండిటీవి చానలులకు నీవి గాన
రాము కృష్ణు దిట్టు " రాములు " జేసెడు
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెప్పుచున్నదేది చెవినబడదు నీకు
రిప్లయితొలగించండిదైవచింత కడు హితమ్ము గూర్చు
నన్న వ్రాసితివిల వ్యతిరేక భావాన
"దైవనింద కడు హితమ్ము గూర్చు'
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లాఁతి దైవములను సైతాను లనిచెప్పి
రిప్లయితొలగించండిస్వమత బోధనమ్ము సలుపువారు
మతసహనము లేని మనుజు లెంచెద రన్య
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు.
మాస్టరు గారూ ! ఈరోజు చక్కని మూడ్ తో ముచ్చటగా మూడు పూరణలతో మాకు ఆనందం కలిగించారు.
తొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
పాపమొద వు మనకు పనియులే కనుజేయ
రిప్లయితొలగించండిదైవ నింద ,కడుహితమ్ము గూర్చు
సాటి మనుజునికిల సంతసమును జేయ
పరుల సంత సమ్ము భవ్య ముగద
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పతకములను గూర్చి బందిఖానాకేగి
రిప్లయితొలగించండినమ్మకమున గొలువ వమ్ముకాగ
దూఱునంత హరియె కోరి గావగ వచ్చె
దైవనింద కడు హితమ్ముఁ గూర్చు.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భక్తి పేరు జెప్పి భక్తులం దోచిన
రిప్లయితొలగించండిదైవనింద, కడు హితమ్ముఁ గూర్చు
ప్రాణుల దయజూడ పరమ రాగంబొప్ప
దేవ దేవు డెలమి బ్రోవ రాడె
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కష్టములు కలుగును ఖచ్చితముగ చేయ
రిప్లయితొలగించండిదైవ నింద, కడుహితమ్ము గూర్చు
శౌరి భజనలెప్డు, సతతము పూజించ
కోరుకోర్కె లన్ని తీరువేగ
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విశ్వసించ మనుచు విశ్వమందున హేతు
రిప్లయితొలగించండివాదులంత గూడి వాసిగాను
దైవనింద కడు హితమ్ము గూర్చుననుచు
మూఢనమ్మకమున మునిగిరైరి.
2.
దూషణముల నైన భూషణాలుగ దల్చి
భక్త జనుల బ్రోచు పక్షపాతి
దైవనింద కడు హితమ్ము గూర్చుననెడు
మూఢు నైన బ్రోచు మురిపముగను
3.
ఇలన హేతు వాది దేవుడు లేడంచు
దైవనింద కడు హితమ్ము గూర్చు
ననుచు పలుకనేమి యమ్మను మరచునా?
తల్లి దైవ మనుచు తలచు సుమ్ము.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఆస్తికులకు నెల్ల హరియె సర్వస్వంబు
రిప్లయితొలగించండికొలుత రెల్ల రతని కోరి ముక్తి
నాస్తిక జనులెపుడు నమ్మక శ్రీహరిన్
దేవ నింద హితము దెచ్చునండ్రు.
2.కనక కశిపు డెపుడు కమలాక్షు దిట్టుచూ
హరిని కొలుచు సుతుని యనవరతము
హరిని జూపు మంచు నారళ్ళు బెట్టుచు
దైవ నింద కడు హితమ్ముఁగూర్చు
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో ‘దిట్టుచున్, సుతుని ననవరతము, ..నారళ్ళు బెట్టెను’ అనండి.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
నాస్తికు లొక వాహన౦బులో పోవుచు
దైవ ని౦ద కడు హితమ్ము గూర్చు
ననుచు వాగు చు౦డ . నయె ప్రమాద౦ | బ౦దు
బ్రతికి నట్టి వారు భక్తు లైరి ! !
{ అయె = " అయ్యె " యొక్క రూపా౦తరము}
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దైవ నింద కడు హితమ్ము గూర్చు
రిప్లయితొలగించండిననుటయే పాప కర్మంబు మనుజ తతికి
దైవ దర్శన,స్తోత్రంబు,తాత్వ్తికతయు
ముక్తి మార్గంబు జూపు నాసక్తి గొలువ!
"""""""""" -"""""""""
కనుము శుభాకాంక్షలు' సాహితీ మిత్రులందఱకు!
"""""""""--"----""""""""
పొన్నెకంటి సత్యనారాయణ రావు గారూ,
తొలగించండిపూరణ బాగుంది. కాని సమస్య ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాశారు. సవరించండి.
ఘోర పాపములవి గోవధ, భ్రూణహ
రిప్లయితొలగించండిత్య, గురు వంచనయును, యతుల హింస,
దైవ నింద, కడుహితమ్ముగూర్చు భగవ
ద్భక్తియు, గురుదివ్య పాద సేవ.
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
‘..గురు వంచనమ్ము, నతులహింస...’ అనండి.
నాటిరామదాసు చాటిన కీర్తనల్
రిప్లయితొలగించండిదైవనింద “కడుహితమ్ముగూర్చు
భక్తి శక్తియెపుడు భగవంతుడనుకొను
నమ్మకమ్ము”?దమ్ముసమ్మతమ్ము.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుదేవుల పరిశీలనకు నాపూరణ నోచుకోలేదు
రిప్లయితొలగించండిపరిశీలించాను. కాని ఆలస్యంగా...
తొలగించండినమ్మకమ్ములేని నాస్తికుల్జేతురు
రిప్లయితొలగించండిదైవనింద, కడు హితమ్ముఁ గూర్చు
దేవతోత్తములను భావములోనమ్మి
పూజ జేతురు కద పుడమిలోన.
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కష్టనష్టమున్న కనికరంబు లేద?
రిప్లయితొలగించండిదయనుజూపకున్న దైవనింద|
కడుహితమ్ము గూర్చు కరుణా మయుడివే
వేంకటేశ|”భక్తివిలువ బెంచు
2.కక్కడెంచు కొన్న కఠినత్వ భాషణ
దైవనింద –కడుహితమ్ము గూర్చు
వీర బ్రహ్మ చరిత వివరణ గమనించ
భక్తి తత్వమందుభాగమేమొ|
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమాన్యులు శంకరయ్య గారికి నమస్సులు.పొరబాటుకు క్షమార్హుడ.సవరణ పద్యము.
రిప్లయితొలగించండి"""""""""""""
చిత్త శుద్ధి లేమి చేయుచునుండును
దైవ నింద--కడు హితమ్ము గూర్చు
లోక రక్షకు నుతి ప్రాకట మార్గమన్
భావముండ వలయు ప్రాణులకును.