17, జనవరి 2016, ఆదివారం

సమస్య – 1917 (భార్యకు భాష రాదనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.
ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు. 

45 కామెంట్‌లు:

 1. ఆర్యులు సంచరించెనట యాదిని భారతదేశ మందునన్
  శౌర్యప రాక్రమం బునను శాంతము నందున సాటియేరికిన్
  భార్యలు వీరమా తలుగ భాసుర మొప్పగ పుణ్య మూర్తులౌ
  భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖంబుగన్

  హమ్మయ్య .కుస్తీ ఐతేపట్టాను గానీ....?

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి అక్కయ్యా,
  పద్యం వరకు నిర్దోషం. కాని సమస్య సమర్థంగా పరిష్కరింపబడలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆర్యులు సంచరించెనట యాదిని భారతదేశ మందునన్
   శౌర్యప రాక్రమం బునను శాంతము నందున సాటియేరికిన్
   భార్యలు పాతి వ్రత్యమున భాసుర మొప్పగ మౌనముద్ర లో
   భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖంబుగ
   --------------------------------------
   గురువులుక్షమించాలి సవరించిన పద్యము .ఇప్పుడు సరిపోతుందను కుంటాను

   తొలగించండి
  2. అక్కయ్యా,
   ఇప్పుడు పూరణ సమర్థంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి !

  భట్టి విక్రమార్క సినిమాలో మాయా సిద్ధుడు
  విక్రమార్కుని భార్య రూపము మార్చి మూగదానిగా జేసినపుడు
  ఆమె బాధలను గాంచి ఆమె కేమయ్యిందని అడిగిన వాణితో బ్రహ్మ :

  01)
  _________________________________________

  క్రౌర్యపు బుద్ధితో నపుడు - కౌక్కుటికుండదె మాయసేయుతన్
  వీర్యము ధైర్యమున్ గలుగు - విక్రము డామెను గుర్తువట్టకన్
  భార్యకు దూరమై మిగుల - బాధకు లోనవ ; తీర్చ పాపమా
  భార్యకు భాష రాదనుచుఁ - బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్ !
  _________________________________________
  కౌక్కుటికుడు = మాయలమారి
  విక్రముడు = విక్రమార్కుడు
  గుర్తువట్టుడు = ఆనవాలు పట్టడం

  రిప్లయితొలగించండి
 4. గురువు గారికి కవిమిత్రులకు నమస్సుమాంజలులు
  బ్రహ్మ యని పేరుగల వాని మాటలు

  కార్యము గోరి వెళ్ళినట కన్నెను గాంచితి సుందరాంగి యా
  హార్యము నెంచి మెచ్చితి సుహాసిని భామిని సౌకుమార్యము
  న్నార్యులు సమ్మతించిరియనార్యుని పుత్రికబెండ్లియాడ, నా
  భార్యకు భాషరాదనుచు బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘వెళ్ళి యట’ అనండి.

   తొలగించండి
  2. కార్యము గోరి వెళ్ళియట గన్నెను గాంచితి సుందరాంగి యా
   హార్యము నెంచి మెచ్చితి సుహాసిని భామిని సౌకుమార్యము
   న్నార్యులు సమ్మతించిరియనార్యుని పుత్రికబెండ్లియాడ, నా
   భార్యకు భాషరాదనుచు బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్

   తొలగించండి
 5. ఆర్యులు కొంతమంది యొక యాగముజేయుచు నుండి రచ్చటన్
  కార్యమునిర్వహించు మన బ్రహ్మకు తోడుగ నాలువచ్చె,నా
  చార్యులు కొంతమంది ఘన సంస్కృతమందున మాటలాడగా
  భార్యకు భాషరాదనుచు బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   కాని ఆమె పేరే గీర్వాణి. ఆమెకు భాష రాకపోవడమేమిటి?

   తొలగించండి
  2. కార్యమునిర్వహించు వారిని పురొహితుని బ్రహ్మ అంటారు కదండీ...ఆయన భార్య అని నాభావం ....ధన్యవాదములు.

   తొలగించండి
  3. హనుమచ్ఛాస్త్రి గారూ,
   వివరణకు ధన్యవాదాలు. బ్రహ్మ = బ్రాహ్మణుడు, ఋత్వికుడు అనే అర్థాన్నిచ్చి ఉంటే పూరణలోని చమత్కారం సులభగ్రాహ్య మయ్యేది.

   తొలగించండి
  4. మాస్టరుగారూ..మీ సూచన ప్రకారము చిన్న మార్పు చేశాను..ధన్యవాదములు.


   ఆర్యులు కొంతమంది యొక యాగముజేయుచు నుండి రచ్చటన్
   కార్యములోన ఋత్వికుడు బ్రహ్మకు తోడుగ నాలువచ్చె,నా
   చార్యులు కొంతమంది ఘన సంస్కృతమందున మాటలాడగా
   భార్యకు భాషరాదనుచు బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్

   తొలగించండి
 6. ఆర్యులు దేవతల్ మునుల కా రమ విందు నొసంగుచుండఁగా
  కార్యనిమగ్నురా లగుచుఁ గాంతుని భారతి పల్కరించ దా
  చర్య సమర్థనీయ మని చప్పునఁ దాఁ బరిహాస మాడుచున్
  భార్యకు భాష రా దనుచు బ్రహ్మయె పల్కె సభాముఖమ్మునన్.

  రిప్లయితొలగించండి
 7. సమస్య. . * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { స౦ తో ష౦. గు రు వు గా రూ దా దా పు
  ప ది ఏ౦ డ్ల క్రి త.౦ , T .V.-- DD. 8. ్ లో ఈ. స. మ .స్య . ఇ చ్చా రు |
  నే నీ స మ స్య పూ రి౦ చ గా నా కు కీ. శే. క వి తా ప్ర సా ద్ గా రు ప్రధమ బ హు మ తి
  ప్ర క టి ౦ చా రు. అ దే పూ ర ణ మీ ము౦దు
  ఉ౦ చు తు న్నా ను. }
  ........................................................
  ప్రభూ, సోమకాసురుడు వేదముల తస్కరి౦చి స౦ద్రములో డాగిన తర్వాత నా భార్య యైన వాణి మూగ వోయినది. అని బ్రహ్మ. హరి తో
  మొరపెట్టుకొనెను .....

  .........................................

  చౌర్యము జేసి వేదముల స౦ద్రము జొచ్చెను సోమకు౦డు|ని
  ర్వీర్యము జె౦దె విశ్వమున విఙ్ఞత|పల్కుల-రాణి యైన నా
  భార్యకు భాష రాదనుచు పల్కెను బ్రహ్మ.సభా ముఖమ్మునన్|
  ధుర్యత గల్గి రాక్షసుని ద్రు౦చెను విష్ణువు మీన మూర్తియై

  { ధుర్యత = సామర్థ్యము }
  ి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉంది. ఇది ప్రథమబహుమతికి సంపూర్ణంగా అర్హమైనది. అభినందనలు.

   తొలగించండి
  2. గురుమూర్తి ఆచారి గారికి జయహో!

   తొలగించండి
 8. భార్యకు భాష రాదనుచు బల్కెను బ్రహ్మ సభా ముఖమ్ము న
  న్నార్యులు నమ్మిరే ? యిదియ భార్యకు భాషను రాదనంగ నా
  నార్యుడు బ్రహ్మగా రొదవ నాయనకు న్మరి పట్టెనా దగన్
  వార్యము గా నిపిచ్చి యట ,భారత మాతకు వందనం బు సూ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మొత్తానికి పూరణ చేశా ననిపించారు. బాగుంది. అభినందనలు.
   ‘నా నార్యుడు’...?

   తొలగించండి
 9. ఆర్యుడు గౌరవాన్వితుడు నాగమశాస్త్రమునన్ ప్రవీణు డా
  చార్యుడు విజ్ఞుడున్ సకల శాస్త్ర కవిత్వ పురాణ వేత్తయున్
  శౌర్య కులీన బ్రాహ్మణుని చక్కనిదౌ సతి మూగ దౌటచే
  భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాగవతుల కృష్ణారావు గారూ,
   మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. సూర్యుని తాతతండ్రి మధుసూదన సూనుడు పద్మజుండిల
  న్నార్యులు నిత్య సత్య వచనారతు లుత్తము లట్టి వారికిన్
  కార్యము కాదు పల్కగ నకారణ నిందలు మేలె చెప్పుమే
  భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 11. భార్యగ పొందె తారలను వారిజవైరి, గనంగ సూర్యుడున్
  భార్యగ పొందె పద్మినిని,వారిజనాభుడు మౌన మేదినిన్,
  ఆర్యునికెల్ల వేళలను హాయిని గూర్చగ భాష యేల?నీ
  భార్యకు భాష రాదనుచు పల్కెను బ్రహ్మ సభాముఖమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. ధుర్యత మాసి చట్టసభఁ దూషణలన్ చెలరేగు సభ్యదు
  శ్చర్యల నాపదేల తవశాబ్ది మనమ్ముల జొచ్చి యంచనన్
  క్రౌర్యము చౌర్యముం గలసి కాపురముండెడు తావులందు నా
  భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.

  రిప్లయితొలగించండి
 13. మా అన్నగారి పద్యానికి నాకు తోచిన మెరుగులు:

  భార్యకు భాష రాదనుచు బల్కెను బ్రహ్మ సభా ముఖమ్ము న
  న్నార్యులు నమ్మిరే ?తనదు నాతికి భాషయె రాదనంగఁ దా
  నార్యుడు బ్రహ్మదేవునకు నారయఁ జిత్తము రిత్త వోయెనో
  వార్య విహీనమై తుదకు, వందన మిత్తరి భారతీ సతీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్యము వ్రాయడము బహుకష్టము. సవరణలు సూచించడము తేలిక.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ సవరణ బాగున్నది. సంతోషం.
   పద్యాలలో తప్పులు వెదకడం మాత్రమే తేలిక. సవరణలు సూచించడం కష్టమే. అనుభవంతో చెప్తున్నాను.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిజమే మీరు చెప్పినది.

   తొలగించండి
 14. ఆర్య! ఇదేమి చిత్రమిల నాలయ మందున స్ర్తీలు నర్చనా
  కార్యము నెట్లు జేతురరె! కాంచము పూర్వమునుండి యిట్టి దు
  ష్కార్యము చేయ నర్చనకు సద్గుణ శీలను కోరనేల నా
  భార్యకు భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. ఆర్యుడొకండు వేదముల నందరకున్ ప్రవచించు లక్ష్యమున్
  కార్యము నిర్వహిమ్పగను కాదనలేక విదేశవాసమున్
  ధుర్యతజేసె, స్నేహితునితో ననుమానము సుంతలేక నా
  భార్యకు భాష రాదనుచు బల్కెను బ్రహ్మ సభా ముఖమ్మునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 16. (దక్షయజ్ఙము వేదికగా)
  సూర్యుని విస్మరించగ సతి చూడగ బోయిన యజ్ఙవాటిక
  న్నార్యుని పిల్వలేదనుచు నబ్బనికోరిన కారుకూతలన్
  దుర్యశమాడినంత సతి దూకిన నాకథఁ దెల్ప నాకు,నా
  భార్యకు భాషరాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్మునన్
  ( సూర్యుడు=శివుడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘విస్మరించ’ టైపాటు వల్ల ‘విస్మరించగ’ అయి గణదోషం.

   తొలగించండి
 17. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
  (దక్షయజ్ఙము వేదికగా)
  సూర్యుని విస్మరించ సతి చూడగ బోయిన యజ్ఙవాటిక
  న్నార్యుని పిల్వలేదనుచు నబ్బనికోరిన కారుకూతలన్
  దుర్యశమాడినంత సతి దూకిన నాకథఁ దెల్ప నాకు,నా
  భార్యకు భాషరాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్మునన్
  ( సూర్యుడు=శివుడు)

  రిప్లయితొలగించండి
 18. గురదేవులు శ్రీ కంది శంకరయ్య గారికి మరియు కవి మిత్రులందరకు నమస్కారములు.

  ఆర్యుడు పెండ్లి చేసుకొని హాయిగ నుండగ మిత్రు నింట ఆ
  శ్చర్యము గల్గు నట్టు లొక స్వాగత వేదిక నిర్వహించి చా
  తుర్యముతో వచింపమని తొందర పెట్టగ మిత్రు లెల్ల; నా
  భార్యకు భాష రాదనుచు బల్కెను బ్రహ్మసభాముఖమ్మునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బొడ్డు శంకరయ్య గారూ,
   బహుకాల దర్శనం... సంతోషం!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. భార్యను హైద్రబాదునను బ్రహ్మయ జేకొని "టాజికృష్ణ" లో
  వీర్యము హెచ్చుచుండగను వెన్కను షాపున మోముజూపగా:
  "కేర్యు ప్రెటీ కపుల్ ఫరెనెగేట?"ని నంతనె గాభరాను "నా
  భార్యకు భాష రా"దనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్ :)

  Taj KrishNa (5-Star Hotel in Banjara Hills)

  Agate = gem stone

  రిప్లయితొలగించండి
 20. వీర్యము క్రుంగగా కనుచు వింతగు క్రొత్తవి ల్యాపుటాపులన్
  ధైర్యము కోలుపోవుచును తబ్బిబు లాడుచు నెత్తిమొత్తి యి
  క్కార్యపు సాఫ్టువేరుదగు కమ్మని దైనది యొక్కటైన...నా
  భార్యకు...భాష రాదనుచుఁ బల్కెను బ్రహ్మ సభాముఖమ్ముగన్

  రిప్లయితొలగించండి