నమస్కారములు ముందుగా మీ ఆరోగ్యము జాగ్రత్త గా చూసుకోండి శ్రమదీసుకుని ఇలా సమస్యలు ఇస్తే మాకు మనసు బాధగా ఉంటుంది.ఆరోగ్యం జాగ్రత్త .తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించి.అక్క
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ప్రబలత్వము’ టైపాటు వలన ‘ప్రభలత’మయింది. ‘భవిషత్తు అన్న పదం లేదు. ‘భవితవ్య మేమగునొ యీ...’ అనండి.
నమస్కారములు
రిప్లయితొలగించండిముందుగా మీ ఆరోగ్యము జాగ్రత్త గా చూసుకోండి శ్రమదీసుకుని ఇలా సమస్యలు ఇస్తే మాకు మనసు బాధగా ఉంటుంది.ఆరోగ్యం జాగ్రత్త .తొందరగా కోలుకోవాలని ఆశీర్వదించి.అక్క
అక్కయ్యా,
తొలగించండిధన్యవాదాలు.
గురువు గారికీ, కవిమిత్రులకు నమస్సుమాంజలులు
రిప్లయితొలగించండిగురువు గారూ ఆరోగ్యము జాగ్రత్త
భవితను దిద్దెడు గుడులని
యువతయె జేరి నచట తమ యునికిని జాట
న్నవలక్షణులై మసలెడు
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్ 1.
వివరింపను వింతేమిటి?
యవలక్షణ మైన నేత లధమపు చర్యల్
యువకులను రెచ్చ గొట్టెడు
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘...జేరి యచట...’ అనండి.
లవలేశము తిలకించని
రిప్లయితొలగించండివివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
భవితను మరచిన యువకులు
వివరణ లేకుండ యలజడి భీభత్స ముగన్
రాజేశ్వరి అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవపాదంలో గణదోషం. ‘వివరణ లేకనె యలజడి...’ అనండి.
లవలేశము తిలకించని
తొలగించండివివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
భవితను మరచిన యువకులు
వివరణ లేకనె యలజడి భీభత్స ముగన్
కంది వారు,
రిప్లయితొలగించండిఆరోగ్యము జాగ్రత్త !
అవనిన చదువుల నెల్లను
అవసరముగ చదువ వెళితి ఆంధ్రా వర్సిటి
అవురా ! గంటిని అచటను
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అవని’ ఇకారంతం. దానిని ‘అవనిన్, అవనిని’ అనాలి. ‘ఎల్లను-అవసరము’ అని విసంధిగా వ్రాశారు. ‘...చదువుల నన్నిటి| నవససరముగ..’ అనండి. రెండవపాదం దీర్ధంతో అంతం కావాలి. ‘ఆంధ్ర వర్సిటీ’ అనండి. ‘అవురా’ తరువాత సరళాదేశం అవసరం లేదు. ‘కంటిని-అచటను’ అని విసంధిగా వ్రాశారు. ‘అవురా! కాంచితి నచటను’ అనండి.
మిత్రులందఱకు నమస్సులు!
తొలగించండిఆంధ్రవర్సిటీ యనిన గణభంగమగును గదా!
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండినిజమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఅవురా వినగను తెలిసెను
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
కవచము తొడిగితి వెళితిక
రవాలము గదయు ఢమఢమ రావము తోడన్
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వెళితిని’ అనడం వ్యావహారికం. ‘కవచము తొడిగి వెడలితి క...’ అనండి.
శంకరయ్య గారికి జ్వరముతగ్గి స్వస్ధత చేకూరాలని ఆపార్వతీ పరమే శ్వరులను కోరుకొనుచున్నాను
రిప్లయితొలగించండిపోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
జవసత్వములిడ మానుచు
రిప్లయితొలగించండిశవాల యరుణోదయమ్ము జాతికొసంగన్
సవరించలేని పాలక
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్!
గురుదేవులకు త్వరగా స్వస్థత చేకూర ప్రార్థన.
తొలగించండిగురుదేవులకు త్వరగా స్వస్థత చేకూర ప్రార్థన.
తొలగించండిగుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీకు త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకుంటూ
తొలగించండిప్రవిమల సంస్థానమ్ములు
వివేక విజ్ఞాన నిధులు విద్యార్థులకున్
భవితవ్య దాయకమ్ముల
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్.
పోచిరాజు కామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
భువిలో నెక్కడ జూచిన
రిప్లయితొలగించండివివాద నిలయములువిశ్వవిద్యాలయముల్
రవములునరుపులతోనట
వివశతయగునట్ల యుండె వింటే సాయీ!
పోచిరాజు సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాస్టరు గారూ ! ఆరోగ్యము జాగ్రత్తగా చూచుకొనగలరు...త్వరగా మీకు స్వస్థత చేకూరాలని ఆకాంక్షించుచున్నాను.
రిప్లయితొలగించండిఅవి చదువు నేర్ప బూనగ
నవలక్షణ 'పాలిట్రిక్సు ' లావేశముతో
నవనవ విధముల జేరగ
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారూ ఆరోగ్యము జాగ్రత్తగా చూచుకొనగలరు...త్వరగా మీకు స్వస్థత చేకూరాలని ఆకాంక్షించుచున్నాను.
రిప్లయితొలగించండివరప్రసాద్ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
జవసత్వములిడ మానుచు
రిప్లయితొలగించండిశవాల యరుణోదయమ్ము జాతికొసంగన్
సవరించలేని పాలక
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్!
ఛవి కట ప్రాధాన్యత లే
రిప్లయితొలగించండిక వివక్షత జూపి సకల కైంకర్యములున్
సువిధు లాచార్యుల కను
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
"నవగతి పరిశోధన లీ
రిప్లయితొలగించండిప్రవిమల పర్యావరణము బాగు పరచునా?"
వివిధము లగు చర్చలతో
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్!
"నవగతి పరిశోధన లీ
రిప్లయితొలగించండిప్రవిమల పర్యావరణము బాగు పరచునా?"
వివిధము లగు చర్చలతో
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
భవితను గూర్చి తలంచక
రిప్లయితొలగించండినవిరళమున శాంతి తోడ నడుగిడ యువకుల్
వివిధ మతముల, తెగలతో
వివాదనిలయములు విశ్వ విద్యాలయముల్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యువతకు యీదేశములో
రిప్లయితొలగించండిభవికము విచ్ఛిన్నమయెడి ప్రకటన లిడగా
నవ యువకుల ప్రతి ఘటనలు
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్.
భాగవతుల కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘యువతకు నీదేశములో...’ అనాలి కదా!
భవితను తీరిచి దిద్దగ
రిప్లయితొలగించండియువతకుతగువిద్యనేర్పు యోగ్యులుకరువై
యవినీతి మయులు గనపడు
వివాదనిలయములు విశ్వవిద్యాలయముల్
మంద పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నవభారతనిర్మాతలు
రిప్లయితొలగించండియువకులు కులపిచ్చిముదుర యుక్తాయుక్త
మ్మువదలు దురిచ్చట గనగ
వివాద నిలయము విశ్వవిద్యాలయముల్ .
ఎవడిని గొట్టిన నెవ్వడు
నువల దనుచు జెప్పవలదు నోరెత్తినచో
యువకులు కులములు నొకటౌ
వివాద నిలయము విశ్వ విద్యాలయముల్
ఆంజనేయ శర్మ గారూ,
తొలగించండిమీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
నవయుగ మందున చదువులు
రిప్లయితొలగించండివివాదనిలయములు|విశ్వ విద్యాలయముల్
భవితకుబంగము గూర్చగ
అవిరళ కృషి ఫలిత మంత అవమానములే|
2.అవివేకంబును మాన్పెడి
వివరణలనుబంచగలుగు విద్యాలయముల్
నివురును గప్పిన నిప్పుగ
వివాద నిలయములు|విశ్వ విద్యాలయముల్.
కె. ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అవినీతి నాయకులకున్
జెవి యొగ్గుచు చదువు లెక్క సేయక చను బల్
చవటలచే నయ్యెను గద
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
* గు రు మూ ర్తి ఆ చా రి *
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అవురా ! " ర్యాగి౦గులు " నె
క్కువ యయె " సూసైడులు " మరి కోకొల్ల లయెన్
" లవు గేమ్సు " ముదిరి పోయెను
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ (అన్యదేశ్యాలున్నా) బాగున్నది. అభినందనలు.
యువతను తీరిచి దిద్ద బ్ర
రిప్లయితొలగించండిభవించి శాస్త్రముల, కళల పలు విషయములన్
ప్రవచింపక నయ్యెను గద
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్!
బొడ్డు శంకరయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఅవగాహన కొరత వలన
రిప్లయితొలగించండివివరంబులనరయకుండ విద్యార్థులెల్లన్
యవివేకముతో చెడుటకు
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విద్యార్థులెల్లన్’ అన్నచోట గణదోషం. ‘ఎల్లన్+ అవివేకము’ అన్నపుడు యడాగమం రాదు. ‘విద్యార్థులు తా| మవివేకముతో...’ అనండి.
నవ తరపు స్వార్థ ఘర్షణ
రిప్లయితొలగించండిభవమొందెను రాజకీయ ప్రభలత్వముతో
భవిషత్తే మగునో ఈ
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్
గండూరి లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ప్రబలత్వము’ టైపాటు వలన ‘ప్రభలత’మయింది. ‘భవిషత్తు అన్న పదం లేదు. ‘భవితవ్య మేమగునొ యీ...’ అనండి.
ఏవా దంబులు లేకన్
రిప్లయితొలగించండిసువాద సుందర తలపులు సుంతయు రాకన్
కువాద ములెక్కు వైనన్
వివాద నిలయములు విశ్వ విద్యాలయముల్
విద్వాన్ డాక్టర్ మూలె రామమునిరెడ్డి ప్రొద్దుటూరు
డా. మూలె రామముని రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చవిగొని కులమత గొడవల
రిప్లయితొలగించండివివశత్వముతో రణగొణ పీడిత నదము
న్నవిరళమౌ భాషణతో
వివాద నిలయములు విశ్వవిద్యాలయముల్
...అన్నీ విద్యార్థుల "దుష్ట" సమాసములే :)
రిప్లయితొలగించండిఅవియివి యని యన్నియు సూ
వివాద నిలయములు! విశ్వవిద్యాలయముల్,
కవిరాట్ వాటికి మూలము
చెవియొగ్గి వినదగనివయ చెకుముకి పలుకుల్:)
జిలేబి