27, జనవరి 2016, బుధవారం

పద్యరచన - 1158

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

31 కామెంట్‌లు:

 1. కంటి కగుపించ లేడంచు కలత జెంది
  దేవు డెక్కడ గలడంచు దేవులాడ
  నేల? కనుముందు కదలాడు నీదు తండ్రి
  నీకు దేవుడంచు మరచి పోకు సుమ్మి

  రిప్లయితొలగించండి
 2. కనగ లేనట్టి వేల్పులన్ కాంచనెంచి
  యెవని భుజమెక్కి వెదకెద వవని యందు
  భారమనక మోయుటదన బాధ్యతనెడు
  తండ్రి మించిన దైవమ్ము ధరణి లేడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘బాద్యత యను’ అనండి.

   తొలగించండి
 3. నాన్న భుజముల పైనెక్కి నయము గాను
  గుడిని దేవుని గాంచిన వేడు కనగ
  దైవ మున్నది యెదుటనే తండ్రి కంటె
  తెలుసు కొనుమోయి మించిన దేవు డెవరు ?

  రిప్లయితొలగించండి
 4. శుభోదయం

  ఎక్కితి నాన్న భుజముపై
  మిక్కిలిగ ప్రభునిగాన మిహిరుని గానన్
  చిక్కిన నాన్న శరీరము
  ఇక్కిలిగ తెలిపె సకార ఈశుడితడనన్ !

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘మిక్కిలిగా’ అనండి. లేకుంటే గణదోషం. (బహుశా మీరు ‘మిక్కిలిగ ప్రభుని’ అన్నపుడు ప్ర ముందున్న గ గరువనుకున్నారేమో? అది లఘువే)

   తొలగించండి
 5. తండ్రి భుజము పైకి తనయుడెక్కి యనెను
  దైవమెవరొకాదు తండ్రి యౌను
  తల్లిదండ్రులరయ దైవసమానులు
  వారి బాగు చూడ వలయు సుమ్శు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. కన్నా యని భుజములపై
  "నాన్నారె " క్కించి జూపె నాడా దేవున్
  కన్నారా గాంచితి, నను
  కొన్నానా దేవునెక్కి కూర్చుంటినిగా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   ‘నాన్నారు’ అనడం గ్రామ్యం. ‘నాన్నయె యెక్కించి జూపె...’ అనండి. అలాగే ‘కన్నారన్’ అనండి.

   తొలగించండి
  2. మాస్టరుగారూ ! ధన్యవాదములు.


   నాన్నా యని భుజములపై
   నాన్నయె యె క్కించి జూపె నాడా దేవున్
   కన్నారన్ గాంచితి, నను
   కొన్నానా దేవునెక్కి కూర్చుంటినిగా !

   తొలగించండి
 7. రిప్లయిలు
  1. అనురాగం బుప్పొంగగఁ
   దనయుని నిజభుజ మృదుతర తల్పము నందుం
   దనరారగ నుంచిన నా
   తనికి నెఱుక లేదు గురుడె దైవం బనియున్

   తొలగించండి
  2. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. అప్పని జూపెను దండ్రియె
  గొప్పగ తన భుజము పైన గూర్చొన నాకున్
  జిప్పిలఁ గనులఁ దెలిసె నే
  నప్పని భుజమందె నుంటి నను సత్యమ్మున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 9. 1.ఆ.వె:తండ్రి భుజము నెక్కి దైవమున్ గననేల
  జన్మకారకుడైన జనకు డుండ
  తల్లి దండ్రులేగ ధరణిలో దైవాలు
  యనుచు భక్తి తోడ నరయు డయ్య.

  2.ఆ.వె:జనకు భుజము నెక్కి జవమున గుడికేగ
  దైవ మెచట నంచు దలచి వెదుక
  జన్మ నొసగి నట్టి జనకుడే యిలయందు
  దైవ మనెడి భావ నధిక మయ్యె.
  3.కం:మక్కువ తోడను జనకుడు
  నెక్కించు కొనియె తనయుని నిలలో జూడన్
  మిక్కుటమగు ప్రేమ యిదియె
  నక్కరతో జూచుతండ్రె హరియను కొనుమా.
  4.ఆ.వె:తల్లి దండ్రులనగ ధరలోని దైవాలు
  దాని నరయ లేక దారి దప్పి
  దిక్కు లరయు వాడు దేనికి కొరగాడు
  వారి నాదరించ బతుకు పండు/నిండు
  5.ఆ.వె:తండ్రి భుజము నెక్కి తనయుడానందాన
  దలచ లేక పోయె తండ్రె దైవ
  మంచు; నరసి జూడ నవనిలో తండ్రియే
  చదువు సంధ్య నేర్పు స్వామి గాదె.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   మొదటిపద్యం రెండవపాదంలో గణదోషం. ‘జన్మకారకుడగు జనకు డుండ’ అనండి. అలాగే ‘తల్లిదండ్రులె గద...దైవమ్ము|లనుచు...’ అనండి.
   రెండవపద్యంలో ‘భావన+అధిక’మన్నపుడు యడాగమం వస్తుంది. ‘భావ మధిక మయ్యె’ అనండి.

   తొలగించండి
 10. నాన్నగారి భుజమునెక్కి నక్కినక్కి జూచినా
  ఎన్నదగిన దైవమచట ఏలకానరాడనన్
  నాన్న నొక్క దేవుడేగ నయము భయము నుంచుమా
  కన్నవారు మనకునెపుడు కానుపించు మూర్తులే|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కె. ఈశ్వరప్ప గారూ,
   మీ పద్యం బాగుంది. అభినందనలు.
   ‘చూచినా, దేవుడేగ’ అని గ్రామ్యాలను వాడినారు. ‘...జూచి నే|నెన్నదగిన...దేవుడె గద...’ అనండి.

   తొలగించండి
 11. తండ్రి మెడపైన గూర్చుండి దైవ దర్శ
  నమ్ము చలిపితి చి న్న తనమ్ము నందు
  తెలిసికోనైతి నానాడు తెల్లముగను
  తండ్రియన భువిపైనున్న దైవ మంచు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. తల్లి దండ్రిని గురువునే దైవమనుచు
  దలుచు గుణమున్న తనయుడే ధరణియందు
  సుజనుడనబడు బడయును సుఖములన్ని
  ధర్మదేవత నాల్గుపాదాలనడుచు !!!

  సంసారాబ్ధిన మున్కలేయుచు సదా సత్యంబు తాదప్పకన్
  పుంసామోహన రూపుడైన రాఘురాముంగొల్చు సన్మార్గుడే
  హింసామార్గము నుగ్రవాదములనే హీనంబుగానెంచి వి
  ద్వాoసుండై నలరారు వాడె ధరణిన్ దక్షుoడగున్ యోగ్యుడౌ !!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మంద పీతాంబర్ గారూ,
   మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
   ‘వి|ద్వాంసుండై యలరారు’ అనండి.

   తొలగించండి
 13. * గు రు మూ ర్తి ఆ చా రి *

  క్షేత్రము లేగ నేల శ్రమచేకొని ? పొ౦దుచు దైవ దర్శన౦
  బాత్రము తోడ,పుణ్య సముపార్జన కై తపియి౦చ నేటికిన్?
  మిత్రమ!తల్లి ద౦డ్రులను మి౦చిన.దేవత లు౦దురె కాన,నీవు స
  త్పుత్రుని వౌచు వారలను పోషణ జేయుము జీవితా౦తమున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   మూడవపాదంలో గణదోషం. ‘దేవత లుండబోరు స|త్పుత్రునివౌచు...’ అనండి.

   తొలగించండి
 14. మిత్రులందఱకు నమస్సులు!

  కం.
  "దేవుండెచ్చట నుండెను?
  దేవునిఁ జూపింపు" మనఁగ, ♦ దివముం జూపన్;
  దేవునిఁ గన భుజమెక్కియు
  దేవుండగు నా జనకుని ♦ దిగువఁ గననహో!

  తే.గీ.
  దేవుఁ డెక్కడ నుండెనో ♦ తెలియఁ జెప్పు
  మనఁగ నా తండ్రి దివిఁ జూపె; ♦ నపుడు చూడ,
  నాదు తండ్రి భుజ మ్మెక్కి♦నట్టి నేను
  తండ్రియే దేవుఁడని నాఁడు ♦ తలఁచనైతి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండు మధుసూదన్ గారూ,
   ఒకే భావాన్ని కించిత్తైనా మార్పు లేకుండా రెండు వేర్వేరు ఛందాలలో చెప్పిన మీ నైపుణ్యం బహుధా ప్రశంసనీయం. ఔత్సాహికులకు మార్గదర్శకం. అభినందనలు.

   తొలగించండి