8, నవంబర్ 2012, గురువారం

పద్య రచన - 154

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. మంచు కొండన నివసించు మంచి దేవ
    మంచు లింగమ్ము రూపున మహిని నిలచి
    ఉంచి నీమీద భక్తి పూజించు వార్కి
    మంచి జేతువు మహిమనే మంచు జెపుదు.

    రిప్లయితొలగించండి
  2. చల్లని వాడవీవు శివ శంకర! నీదు నివాస మొప్పుగా
    చల్లని కొండ, తాల్తువట చల్లని గంగను బాలచంద్రునిన్
    జల్లుచు నుందు వెప్పుడును సార కృపారసమున్ హిమాద్రిజా
    వల్లభ! దేవ దేవ! నిను భక్త వరప్రదు సంస్తుతించెదన్

    మిత్రులారా!
    మంచు లింగమును హిమాలయములలో చూచుట పరిపాటియే. నేను 2009-10 లో 1 సంవత్సరము కాలము అమెరికాలో లాంకాస్టర్ (ఫిలాడెల్ఫియా రాష్ట్రము) అనే ఊరిలో నున్నాను. అప్పటిలో మంచు కురిసిన సమయములో 2 పర్యాయములు మా ఇంటి పెరటిలో మంచుతో శివలింగమును చేసి ఆనందించేము. మంచు కరుగుట అక్కడ ఆలస్యము అవుతుంది కాబట్టి మేము చేసిన శివలింగములు 1నెల చొప్పున ఉండినవి. అది యొక్క భక్తి పారవశ్యముతో కూడిన అనుభూతి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    ధన్యవాదములు దెలుపుచు
    ========*=======
    తెల్లని వాడవై నిలువ దీన జనావళి కెల్ల వేడుకై
    చల్లని కొండ నెక్కి గనె చక్కని రూపము మోదమొంద గా
    జల్లెను మంత్ర పుష్పములు చాలును భాగ్యము జన్మ జన్మలన్
    మెల్లగ వల్లభున్ మదిని మెండుగ మ్రొక్కె ముక్తికై |

    రిప్లయితొలగించండి
  4. కొండ కాదది యొక మన గుండె కాని
    గుహయు కాదది మన బ్రహ్మ కుహర మదియె
    మంచు లింగము గాదది మాన వతయె
    భావ నాజగ ము న లస ద్భా వ మదియె .

    రిప్లయితొలగించండి
  5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    చల్లని మాటలతో చల్లని దేవుని గురించి చక్కగా చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    వరప్రసాద్ గారూ,
    వృత్తరచనలోనూ ప్రావీణ్యం సంపాదించారు. సంతోషం.
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. జంగిడి రాజేందర్గురువారం, నవంబర్ 08, 2012 6:48:00 PM

    ఎచ్చోట లేవందు నీశ్వర నీవు?
    మంచుకొండలలోన మహిమతో నుండి
    జనులను బ్రోచెడి జంగమ దేవ!
    శ్రీరాజ శ్రీరాజ శివరామ రాజ!!

    రిప్లయితొలగించండి
  7. హిమ శిఖరము కైలాసము
    సుమములచే పూజ లంది శుభముల నిడుచున్ !
    దమమును పరిహృతి చేయగ
    హిమ లింగ మైతి వీవు హేలా రతుడై !

    రిప్లయితొలగించండి
  8. మంచు కొండ పైన మసలెడు శంకరా
    మంచు ముద్దవోలె మారి నావ
    మంచు కొండ కన్నమించె నా పాపమ్ము
    కంటి మంట తోడ కరుగ నీవె.

    రిప్లయితొలగించండి
  9. జంగిడి రాజేందర్ గారూ,
    మీ ద్విపద బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘మంచు కొండ కన్నమించె నా పాపమ్ము
    కంటి మంట తోడ కరుగ నీవె.’ ఎంత చక్కని భావం! మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి