17, నవంబర్ 2012, శనివారం

పద్య రచన - 163

దధీచి
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. అమర హితము కొరకు నర్పించెను దధీచి
    తన శరీర మంత దాని నుండి
    చేసి యాయుధమును చెలగి యుద్ధమ్ములో
    నసుర తతుల గెలిచె నమర విభుడు

    రిప్లయితొలగించండి
  2. వెన్నుని యనుజుని గెలుపున
    కున్నది యొక మార్గ మిదియె ఓ ముని వర్యా
    అన్నారని దేవతలకు
    వెన్నిచ్చెను మన దధీచి వేగమె ప్రీతిన్.

    రిప్లయితొలగించండి
  3. తనువున యెముకల నర్పణ
    ముని దా చేసె,నసురులను మోదగ వజ్రం
    బను నాయుధమున నమరుల
    నని గెలిపించెనె, దధీచి యక్కర తోడన్.

    రిప్లయితొలగించండి
  4. తనువు త్యాగమొనర్చెను ఘన దధీచి
    యమర నాధుని కోర్కెపై నాయుధముగ
    వెన్ను నీయగ వెరువక నెన్న తరమె
    ఋషి ఋణమ్మును తీర్చగా నెవరి తరము?

    పరుల కుపకార మొనరింప పరమ ధర్మ
    పాలనమ్మను సూక్తిని జాల నమ్మి
    ప్రాణ మైనను పణమిడు భారతీయ
    భవ్య సంస్కృతి కిడుదము వందనమ్ము.

    రిప్లయితొలగించండి
  5. చెడుపైసమరానికిముని
    విడుమా నీకాయమనుచు వేడగ
    సురులే
    వడిగావజ్రాయుధమై
    యడచ నసురులన్ దధీచి యమరుండాయెన్!

    రిప్లయితొలగించండి
  6. లోకకళ్యాణార్థం తనువును త్యాగం చేసిన దధీచి ప్రాశస్త్యాన్ని చక్కని పద్యాలలో వివరించిన....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    మిస్సన్న గారికి
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. దనుజుల హతమా ర్చుటకని
    వెనుకాడక తనువు నిచ్చె వేలుపు తానై !
    ఇనునకు వజ్రా యుధమిడి
    ముని గణ మందున దధీచి మోక్షము నొందెన్ !

    రిప్లయితొలగించండి