పండిత నేమాని వారూ, విరుపుతో దమ్ము శబ్దానికి గల విస్తృతార్థంతో ఔత్సాహిక కవులకు మార్గదర్శకమైన చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. శైలజ గారి పద్యానికి చక్కని సవరణ చేసినందుకు ధన్యవాదాలు. * శైలజ గారూ, మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు. మీ పద్యంలో మొదటి పాదంలో ‘ఉత్తరుడు’ అన్నచోట గణదోషం. ‘పోదామనుచు, మోదం పోగా’ అనేవి వ్యావహారికాలు. పండిత నేమాని వారి సవరణ అద్భుతంగా ఉంది. మీ రెండవ పూరణ చాలా బాగుంది. జైపూర్ కాలు తగిలించుకొని నాట్యం చేసిన సుధాచంద్రన్ గుర్తుకు వచ్చింది మీ పూరణ చదివాక. అభినందనలు. ‘పనులు + ఇలను’ అన్నప్పుడు సంధి జరిగి ‘పనులిలను’ కావాలి కదా. అక్కడ ‘పనుల నిలను’ అనండి. * గుండు మధుసూదన్ గారూ, పాదమునకున్న మరో అర్థాన్ని సమర్థంగా పూరణలో వినియోగించుకున్నారు. చాలా బాగుంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, ఇతరుల చేయూతతో కుంటివారు నడిచారన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, ‘దుర్బల పాదమ్ములు లేని నరుడు’ అని చక్కని పూరణ చేసారు. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
శ్రీ నేమాని గురుదేవుల పద్యము అద్భుతం.. శ్రీ లక్ష్మి గారి విరుపు చాలా చాలా బాగున్నది. శ్రీ శంకరయ్య గారి "ఈ దేశపు వీధులలో"చాలా చాలా బాగున్నది శ్రీ నాగరాజు రవీందర్ గారి "ఘోర ప్రమాదం" చాలా చాలా బాగున్నది శ్రీ తిమ్మాజీ రావు గారి "పాదార్చన " చాలా చాలా బాగున్నది
లక్ష్మీదేవి గారూ, పూరణకు నన్నే లక్ష్యంగా చేసుకున్నారే. బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘విద్యార్థిని నా’ అనండి. అరసున్నాలు ఎక్కడ ఎందుకు ప్రయోగించాలో తెలుసుకోండి. చాలా రోజులుగా అరసున్నాల గురించి ఒక పాఠం పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ వీలుచిక్కడం లేదు. * నాగరాజు రవీందర్ గారూ, క్రమాలంకారంలో మొదటి పూరణ, విరుపుతో రెండవ పూరణ చాలా బాగున్నవి. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ రూటే సపరేటు. కారు లేనివాణ్ణి పరుగెత్తించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు. * రామకృష్ణ గారూ, మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
గురువు గారూ నమస్సులు, ధన్యవాదములు. చేదండములను చేతి కఱ్ఱలు ( crutches ) అనే అర్ధముతో వ్రాసాను. వివరిద్దా మనుకొనే మరో వ్యాపకములో పడి అశ్రద్ధ చేసినందులకు క్షమార్హుడిని.
లేదయ్యె శౌర్యమా దా
రిప్లయితొలగించండిమోదరుడే లేమి, నోడిపోయె విజయుడే
కాదే సంగరమున నధి
పా! దమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్
నాదే గెలుపనెనుత్తరుడు
రిప్లయితొలగించండిపోదామనుచుపరుగునపోరుకువెడలెన్
మోదంపోగాదళముగని
పా!దమ్ములులేనినరుడుపరుగిడజొచ్చెన్
శ్రీమతి శైలజ గారి భావమునకు తగిన రీతి పద్యమును సవరించుచూ:
రిప్లయితొలగించండినాదే గెలుపని తలచెను
గాదే యుత్తరుడు రిపులగని భీతిల్లెన్
దా దిగె నరదము నో యధి
పా! దమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్
"పాదము" శబ్దమునకున్న యర్థములలో "నాల్గవ భాగ"మను నర్థముం గ్రహించి, చేసిన పూరణము...
రిప్లయితొలగించండిమోదముతో నాస్తి మువురు
సోదరులే సర్వముఁ గొని సుఖముగ నుండన్;
వేదన తోడుతఁ దన కే
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్!
(తన ముగ్గురు సోదరులు చేసిన మోసమును న్యాయాధికారులకుం దెలుపుటకై పరుగులు దీసినాఁడని తెలియునది)
సమస్య పాదమ్ములను విరిచి దమ్ములను చూపిన నేమాని గారూ ! బాగు..బాగు..అబినందనలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిత్యము నేను చూసేదే !
రిప్లయితొలగించండివేదన నొందుట గంటెను
సాధనమున బ్రతుకు నీడ్చు సంకల్పముతో
చేదండము లూతగొనుచు
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్!
శోధన చేయగచాలును
రిప్లయితొలగించండిసాధింతురుపనులుఇలనుశ్రమతోనయినన్
పాదముజైపూరివితొడిగి
పాదమ్ములులేనినరుడుపరుగిడజొచ్చెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేదాద్యయనము, శ్రీహరి
రిప్లయితొలగించండిపాదార్చన, గురువుసేవ వరహృదయమునన్
పాదుకొనజేయ దుర్బల
పాదమ్ములులేని నరుడు పరుగిడజొచ్చెన్ !!!
శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారి ప్రశంసలకు మా సంతోషము. శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిహరిపాదములను మనసున నిలిపిన వానికి యెప్పుడు తలచినా కనబడతాయి. ఆ శక్తి లేని వాడు బయట వెతుకుతూ పరుగిడుతుంటాడు.
రిప్లయితొలగించండినీదయ జూపుమ హరియని
పాదములను మనసు దలచు ప్రాజ్ఞుండొకడే
యేదని మనసున గానగ
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీదకు రానేరడు గద
రిప్లయితొలగించండిపాదమ్ములు లేని నరుడు , పరుగిడ జొచ్చె
న్నీ దరి కాదరి కా తడు
వేదన మఱి దాళ లేక వీ రడు మిగులన్
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండివిరుపుతో దమ్ము శబ్దానికి గల విస్తృతార్థంతో ఔత్సాహిక కవులకు మార్గదర్శకమైన చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
శైలజ గారి పద్యానికి చక్కని సవరణ చేసినందుకు ధన్యవాదాలు.
*
శైలజ గారూ,
మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
మీ పద్యంలో మొదటి పాదంలో ‘ఉత్తరుడు’ అన్నచోట గణదోషం. ‘పోదామనుచు, మోదం పోగా’ అనేవి వ్యావహారికాలు.
పండిత నేమాని వారి సవరణ అద్భుతంగా ఉంది.
మీ రెండవ పూరణ చాలా బాగుంది. జైపూర్ కాలు తగిలించుకొని నాట్యం చేసిన సుధాచంద్రన్ గుర్తుకు వచ్చింది మీ పూరణ చదివాక. అభినందనలు.
‘పనులు + ఇలను’ అన్నప్పుడు సంధి జరిగి ‘పనులిలను’ కావాలి కదా. అక్కడ ‘పనుల నిలను’ అనండి.
*
గుండు మధుసూదన్ గారూ,
పాదమునకున్న మరో అర్థాన్ని సమర్థంగా పూరణలో వినియోగించుకున్నారు. చాలా బాగుంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఇతరుల చేయూతతో కుంటివారు నడిచారన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
‘దుర్బల పాదమ్ములు లేని నరుడు’ అని చక్కని పూరణ చేసారు. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
పాదమొకటి యొసగి గురువు
రిప్లయితొలగించండిమోదంబలరగను పద్యపూరణ నడుగ
న్నేదారి నెఱుగక తగిన
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్.
ఈ దేశపు వీధులలో
రిప్లయితొలగించండివేదనకు గురియగు బాల విద్యార్థిని యా
వేదనతో పోరగఁ పా
పా! దమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్.
వేదండమునకు నాల్గివి !?
రిప్లయితొలగించండిఆదాయము లేని వాడి ననవచ్చు నిలా !?
బాదగ గుక్కేమి సలిపె ?
పాదమ్ములు ; లేని నరుడు ; పరుగిడ జొచ్చెన్
ఘోర ప్రమాదంలో తన రెండు కాళ్ళను పోగొట్టుకున్న ఒక నిర్భాగ్యుడి గురించి :
రిప్లయితొలగించండివేదనతో గూర్చుండెను
పాదమ్ములు లేని నరుడు ; పరుగిడ జొచ్చెన్
మోదమున నెదుట బుడుత - ప్ర
మాదమ్మున నయ్యొ ! కాళ్ళు మట్టిని గలిసెన్
పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు
రిప్లయితొలగించండిఆదుకొనువాడు శ్రీహరి
పాదార్చన జేసి యతని ప్రార్ధించుచు త
త్పా దోదకమ్ము గ్రోలిన
పాదమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములు
రిప్లయితొలగించండిసాహసము జేయరా డింభకా!లభియించును రాజ పుత్రిక గుర్తుకువచ్చి.
======*=======
సాధించగలవు డింభక
సాధనలోన సమకూరు సకల సిరుల నా
మోదమునను వ్యత్యస్తపు
పాదమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్!
శ్రీ నేమాని గురుదేవుల పద్యము అద్భుతం..
రిప్లయితొలగించండిశ్రీ లక్ష్మి గారి విరుపు చాలా చాలా బాగున్నది.
శ్రీ శంకరయ్య గారి "ఈ దేశపు వీధులలో"చాలా చాలా బాగున్నది
శ్రీ నాగరాజు రవీందర్ గారి "ఘోర ప్రమాదం" చాలా చాలా బాగున్నది
శ్రీ తిమ్మాజీ రావు గారి "పాదార్చన " చాలా చాలా బాగున్నది
వేదాద్రిని తిరునాళ్ళకు
రిప్లయితొలగించండిమోదమ్ముగ కారులోన ముందుగ నేగెన్
యాదయ్య, నొవ్వకుండను
పాదమ్ములు, లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్.
సోదరు లారా మీమీ
రిప్లయితొలగించండివాదమ్ములుమీవి గాగ పదవియె నాదౌ
వాదమని రాచరికమున
పాదమ్ములు లేని నరుడు పరుగిడజొచ్చెన్
వేదన విడి, కఠినమ్మౌ
సాధన తో నేర్చివెస చదరంగమ్మున్
మోదము నాక్రీడందున
పాదమ్ములు లేని నరుడు పరుగిడజొచ్చెన్
పాదమ్ములు లేకున్నను
ఈధాత్రింబ్రతుకవచ్చు నెడదబలంబున్
ఖేదము శూన్యమనుచునిల
పాదమ్ములు లేని నరుడు పరుగిడజొచ్చెన్
నే మూడవ పద్యం లో మనవి చేసిన విషయం ఈ లంకెకు సంబంధించినది :: http://www.youtube.com/watch?v=nIEzjN1cgZs
రిప్లయితొలగించండిభవదీయుడు
చాలా దినిముల తరువాత పద్యం కట్టటానికి ప్రయత్నించటం వల్ల.. తప్పులు వస్తున్నాయి..
రిప్లయితొలగించండిరెండవ పద్యం లొ గణభంగమును సవరిస్తూ:
వేదన విడి, కఠినమ్మౌ
సాధనతో నేర్చియె వెస చదరంగమ్మున్
మోదము నాక్రీడందున
పాదమ్ములు లేని నరుడు పరుగిడజొచ్చెన్
(పాండురంగ మహత్యం సినిమా పరంగా )
రిప్లయితొలగించండివేదన స్వయం కృతంబని
బాధపడుచుఁ దల్లితండ్రి పాదము లొత్తన్
మోదమున పుండరీకుడు
పాదమ్ములు లేని నరుడు పరుగిడ జొచ్చెన్!
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిపూరణకు నన్నే లక్ష్యంగా చేసుకున్నారే. బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘విద్యార్థిని నా’ అనండి. అరసున్నాలు ఎక్కడ ఎందుకు ప్రయోగించాలో తెలుసుకోండి.
చాలా రోజులుగా అరసున్నాల గురించి ఒక పాఠం పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ వీలుచిక్కడం లేదు.
*
నాగరాజు రవీందర్ గారూ,
క్రమాలంకారంలో మొదటి పూరణ, విరుపుతో రెండవ పూరణ చాలా బాగున్నవి. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ రూటే సపరేటు. కారు లేనివాణ్ణి పరుగెత్తించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
రామకృష్ణ గారూ,
మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ధన్యవాదములు గురువు గారూ ! ధన్యవాదములు వరప్రసాద్ గారూ !
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు!
రిప్లయితొలగించండిగురువుగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురువు గారూ నమస్సులు, ధన్యవాదములు. చేదండములను చేతి కఱ్ఱలు ( crutches ) అనే అర్ధముతో వ్రాసాను. వివరిద్దా మనుకొనే మరో వ్యాపకములో పడి అశ్రద్ధ చేసినందులకు క్షమార్హుడిని.
రిప్లయితొలగించండిగురువుగారు,
రిప్లయితొలగించండినా పద్యములో దోషము కనిపించినది. సవరించి ప్రచురిస్తున్నాను.
పాదమొకటి యొసగె గురువు
మోదంబలరగను పద్యపూరణ కొఱకై,
నాదము, లయ, భావము గల
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్.
"మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ |
రిప్లయితొలగించండియత్కృపా తమహం వందే పరమానంద మాధవం ||"
గోదానము భూదానము
వేదాధ్యయనమ్ము లేక వెన్నుని ప్రీతిన్
పాదమ్ములు పట్టుకొనగ
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్
రిప్లయితొలగించండిభేదంబేమియు లేకన్
వేదనపడు జనుల నమ్మ పిరిమిగ బిలువన్
చేదించుచు భవ బంధము
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్!
జిలేబి
సాదరముగ చక్రమ్ములె
రిప్లయితొలగించండినాదరువుగ పీట క్రింద నమరుచు ప్రీతిన్
భూదేవిని నంటుకొనగ
పాదమ్ములు లేని నరుఁడు పరుగిడఁ జొచ్చెన్