నుయ్యి , నూయి , నూతి , బావి అనే పదాలు తప్ప ఈ "నూత" అనే పదం నాకెక్కడా అగుపించలేదు ! సంధి కార్యం వల్ల "త" వచ్చిందేమో ననుకున్నా! కాని కాదంటిరి ! మరి ఈ పదమెక్కడిది ? ఆంధ్రభారతిలో గాని ,జి ఎన్ రెడ్డి గారి నిఘంటువులో గాని లేదే !
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. మీ రీ సమస్య నే సమయమున నిచ్చితిరో యర్థము గాకున్నది. సమస్యా ప్రచురణ సమయము: 12.10 AM అని యున్నది. మొదటి పూరణ సమయము: 1.50 AM అని యున్నది. గమనించఁగలరు. ఇఁక నా పూరణము.
హరినామ స్మరణము చేయుచున్న ఘోరనాథుఁడను దన కుమారుని నొక రాక్షస స్త్రీ వారించుచున్న సందర్భము...
భక్త ప్రహ్లాదుఁ డొసఁగిన పావనమగు హరి జపమ్మును జేయంగ నిరతము విని, యొక్క దనుజ బాలుని దల్లియు ననె, "ఘోర నాథ! ’ఓం నమో నారాయణాయ’ యనకు; మదియ విన్నచో మన రాజు మదిని గోప మావహించును; విధియించు మరణ శిక్ష! మఱువు మోయయ్య, హరినామ మంత్ర జపము!"
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో, శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు. శ్రీ వసంత గారికి ధన్యవాదములు. మీ ఆరోగ్యము మాకు ముఖ్యము. శ్రీ వసంత గారికి మా(నా)విన్నపము నిత్యమూ బ్లాగున ఒక్క పద్యమైనా వ్రాసి మమ్ము దీవించ ప్రార్థన.
శ్రీ నేమాని గురుదేవుల కోరిక కూడా ఇదే, అందరూ రోజుకొక్క పద్యము వ్రాసి, వాటిపై వ్యాఖ్యలతో బ్లాగున భాగమైన సాహితీ ప్రియులకెల్లా మోదమగును.
"ప్రహ్లాద తల్లి పలుకులు " ======*======= వలదు సుతునిపై కోపమ్ము వలదు ప్రాణ నాథ!ఓం నమో నారాయణాయ యనకు పుత్ర! నీ తండ్రి కోపమ్ము పుడమి నెల్ల బుగ్గి జేయు హరిని వీడు పూర్తిగాను!
వసంత కిశోర్ గారూ, లీలావతి మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘అనకు యనుచు’ను ‘అనకు మనుచు’ అనండి. నూతఁ బడు... గురించి... వ్యాకరణ గ్రంధాలు అందుబాటులో లేక వివరంగా, సప్రమాణంగా చెప్పలేక పోతున్నాను. చేయి → చేత → చేతఁ జిక్కు; వాయి(నోరు) → వాత → వాతఁ బడు; నూయి → నూతఁ బడు. వీలైనంత తొందరగా వివరంగా తెలియజేస్తాను. * తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, చండామార్కులవారి మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, వసంత కిశోర్ గారు “మీరెలాగూ పోస్టులను షెడ్యూల్ చేస్తున్నారు కనుక అదేదో ఇంగ్లీషు తేదీ మారగానే అంటే అర్ధరాత్రి 12 గం. దాటగానే ప్రకటిస్తే విదేశాలలో ఉండే వారికి సౌకర్యంగా ఉంటుంది” అన్నారు. వారి మాటను మన్నించి ఇకనుండీ పద్యరచన 12.05 am,కు సమస్యాపూరణ 12.10 am.కు ప్రకటింపబడే విధంగా షెడ్యూల్ చేస్తున్నాను. ఘోరనాథునికి తల్లి హితబోధగా మీ పూరణ బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, అష్టాక్షరీ మంత్ర మహత్తును వివరిస్తూ అనకు శబ్దాన్ని అన కుమారునికి అని విరిచి విశేషార్థాన్ని సాధించిన మీ పూరణ మాబోంట్లకు ఒక పాఠం. ధన్యవాదాలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * గన్నవరపు నరసింహ మూర్తి గారూ, ఇంతవరకూ విష్ణునామ స్మరణ చేయకుమని చెప్పిన భార్య లెవరూ లేరనుకున్నాను. దేశకాలపాత్రతల నెరిగి దేవకి మాటగా చక్కని పూరణ నిచ్చారు. వైవిధ్యంగా ఉంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, అటు నాథునకు, ఇటు కుమారునికి చెప్పిన మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, అన కులము అంటూ చెప్పిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, నారాయణ నామాన్ని నిరతం పలికే నారదునితో లీలావతి మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
సుబ్బారావు గారూ, సకామ భక్తి వద్దని హితవు చెప్పిందా భార్య? బాగుంది మీ పూరణ. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, నారాయణ అన్న మాత్రాన కుటిలమతులు మోక్షాన్ని పొందుతారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. నాస్తికు డొకడు మరణ శయ్యపై ఉన్నాడు. చచ్చేముందైనా దైవనామ స్మరణ చేయిద్దామని బంధువులు చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. చివరికి కనీసం నారాయణలో సగమైనా అనిపిద్దామనుకొని ఒకడు నార తెచ్చి చూపి “ఇదేమిటి?” అంటే, వాడు “పీచు” అని చెప్పి చచ్చాడట! మీ పూరణ ఆ కథను గుర్తుకు తెచ్చింది. ధన్యవాదాలు. * నాగరాజు రవీందర్ గారూ, దైవాన్ని సంబోధించి దయలేదని అనకు అంటూ చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గుండు మధుసూదన్ గారూ, మీ రెండవ పూరణ ‘అన కుజనులు’ అన్న విరుపుతో చాలా బాగుంది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు.
శంకరార్యా !
రిప్లయితొలగించండినా విన్నపం మన్నించినందులకు ధన్యవాదములు !
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిబిడ్డను దండింప బూనిన హిరణ్యకశిపునితో లీలావతి :
01)
______________________________
పిచ్చుకల మీద బ్రహ్మాస్ర్త్ర - పీడనమ్మె ?
వలదు వలదోయి వలదోయి - వలదు వలదు
పసితనంబున నీరీతి - పలుకు చుండె
బిడ్డ డాతడు వానిపై - పెలుచలేల?
వంశవర్థనుడు, మరి మీ - యంశ గాదె ?
నచ్చ జెప్పెద ! నామాట - లిచ్చగించు
నాథ ! “ఓం నమో నారాయ - ణాయ”యనకు
యనుచు జెప్పిన నామాట - వినును వాడు !
______________________________
పెలుచ = కోపము
వసంతకిశోర్ గారూ! మీ సూచన చాల అభినందనీయము.మన్నించిన శంకరార్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
చండామార్కులవారు ప్రహ్లాదునిపై అభియోగము చేయుచూ హిరణ్య కశిపునితో
పలు విధముల ప్రహ్లాదుడు పలుక దైత్య
నాథ! “ఓం నమోనారాయణయ”, యనకు
బాలకా!యని చెప్పినన్ పాడు చేయు
చుండె తోటి బాలుర తన చుట్టు చేర.
శర్మగారూ ! నా సూచన మీకు నచ్చినందులకు సంతోషము !
రిప్లయితొలగించండిమరియు ధన్యవాదములు !
ఇది యెందరికో ఉపయుక్తముగా నుండగలదు !
ముఖ్యముగా విదేశంలో నివసించే వారికి !
శంకరార్యా !
రిప్లయితొలగించండి"నుతజల పూరితం బయిన నూతఁ బడం దగు సజ్జనాళికిన్."
నుయ్యి , నూయి , నూతి , బావి అనే పదాలు తప్ప
ఈ "నూత" అనే పదం నాకెక్కడా అగుపించలేదు !
సంధి కార్యం వల్ల "త" వచ్చిందేమో ననుకున్నా!
కాని కాదంటిరి !
మరి ఈ పదమెక్కడిది ?
ఆంధ్రభారతిలో గాని ,జి ఎన్ రెడ్డి గారి నిఘంటువులో గాని లేదే !
మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. మీ రీ సమస్య నే సమయమున నిచ్చితిరో యర్థము గాకున్నది. సమస్యా ప్రచురణ సమయము: 12.10 AM అని యున్నది. మొదటి పూరణ సమయము: 1.50 AM అని యున్నది. గమనించఁగలరు. ఇఁక నా పూరణము.
రిప్లయితొలగించండిహరినామ స్మరణము చేయుచున్న ఘోరనాథుఁడను దన కుమారుని నొక రాక్షస స్త్రీ వారించుచున్న సందర్భము...
భక్త ప్రహ్లాదుఁ డొసఁగిన పావనమగు
హరి జపమ్మును జేయంగ నిరతము విని,
యొక్క దనుజ బాలుని దల్లియు ననె, "ఘోర
నాథ! ’ఓం నమో నారాయణాయ’ యనకు;
మదియ విన్నచో మన రాజు మదిని గోప
మావహించును; విధియించు మరణ శిక్ష!
మఱువు మోయయ్య, హరినామ మంత్ర జపము!"
సప్రణవమ్మైన స్వామి! అష్టాక్షరి
రిప్లయితొలగించండి....మంత్ర జపమ్ము క్షేమంకరమ్ము
ఆ మంత్ర మహిమచే నఖిల లోకమ్ములు
....భద్రములను గాంచి వరలుచుండు
ఆ మంత్ర మహిమచే నఖిల పాపమ్ములు
....సంపూర్ణముగ వినాశనమునొందు
ఆమంత్ర మహిమమ్ము నాదిజుండేనియు
....నెరుగ జాలడట నేనెంత దాన?
నాథ! ఓం నమోనారాయణాయ యన కు
మారునికి పరిత్రాతయై మాధవుండు
హాయి గూర్చుచునుండు నిరంతరంబు
భక్త బృందంబు పాలి కల్పద్రుమంబు
శ్రీ నేమానిగారూ ! బాగుంది.. మీ బాటలోనే....
రిప్లయితొలగించండిలీలావతి హిరణ్య కశిపునితో...
నాథ! ’ఓం నమో నారాయణాయ’ యన కు
మారు జంపగ నెంతురా మారు మారు
మార మన్నను మీమనసు మారదేమి
మరణమెవరికి వచ్చినన్ మనసు చెదరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారాగారములో వసుదేవునితో దేవకి ;
రిప్లయితొలగించండిపుణ్యఫలమున పరమాత్మ పుట్టె మనకు
తనయు గాంచుచు దండ్రిగ దనర దగును
ముద్దులిడవయ్య బిడ్డకు , సద్దు వలదు !
నాథ! ’ఓం నమో నారాయణాయ’ యనకు !
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో,
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
శ్రీ వసంత గారికి ధన్యవాదములు. మీ ఆరోగ్యము మాకు ముఖ్యము.
శ్రీ వసంత గారికి మా(నా)విన్నపము నిత్యమూ బ్లాగున ఒక్క పద్యమైనా వ్రాసి మమ్ము దీవించ ప్రార్థన.
శ్రీ నేమాని గురుదేవుల కోరిక కూడా ఇదే, అందరూ రోజుకొక్క పద్యము వ్రాసి, వాటిపై వ్యాఖ్యలతో బ్లాగున భాగమైన సాహితీ ప్రియులకెల్లా మోదమగును.
"ప్రహ్లాద తల్లి పలుకులు "
======*=======
వలదు సుతునిపై కోపమ్ము వలదు ప్రాణ
నాథ!ఓం నమో నారాయణాయ యనకు
పుత్ర! నీ తండ్రి కోపమ్ము పుడమి నెల్ల
బుగ్గి జేయు హరిని వీడు పూర్తిగాను!
నీదు నామము విడువక నిన్నె దలువ-
రిప్లయితొలగించండినాథ! ఓం నమో నారాయణాయ యన , కు
లముల నెల్ల నుద్ధరణమ్ము లభ్యమౌను
తాత భక్తుండయె, ఫలము దక్కె బలికి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచండామార్కులవారు ప్రహ్లాదునితో...
రిప్లయితొలగించండిదనుజ సంహారి శ్రీశుఁ డాతని పగతుఁడు
రాక్షసేశుఁడై వరలు హిరణ్యకశిపు
వరసుతుండవు ప్రహ్లాద! భావి దనుజ
నాథ! “ఓం నమో నారాయణాయ!” యనకు.
హరిని దలచుచు సతతమ్ము తిరుగు మౌని
రిప్లయితొలగించండిదైత్య నాథుడౌ కశపుని దరికివచ్చు
నారదుని గని గలడు నా నాథుడు ముని
నాథ! “ఓం నమోనారాయణయ”యనకు!!!
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిలీలావతి మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అనకు యనుచు’ను ‘అనకు మనుచు’ అనండి.
నూతఁ బడు... గురించి...
వ్యాకరణ గ్రంధాలు అందుబాటులో లేక వివరంగా, సప్రమాణంగా చెప్పలేక పోతున్నాను. చేయి → చేత → చేతఁ జిక్కు; వాయి(నోరు) → వాత → వాతఁ బడు; నూయి → నూతఁ బడు.
వీలైనంత తొందరగా వివరంగా తెలియజేస్తాను.
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
చండామార్కులవారి మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
వసంత కిశోర్ గారు “మీరెలాగూ పోస్టులను షెడ్యూల్ చేస్తున్నారు కనుక అదేదో ఇంగ్లీషు తేదీ మారగానే అంటే అర్ధరాత్రి 12 గం. దాటగానే ప్రకటిస్తే విదేశాలలో ఉండే వారికి సౌకర్యంగా ఉంటుంది” అన్నారు. వారి మాటను మన్నించి ఇకనుండీ పద్యరచన 12.05 am,కు సమస్యాపూరణ 12.10 am.కు ప్రకటింపబడే విధంగా షెడ్యూల్ చేస్తున్నాను.
ఘోరనాథునికి తల్లి హితబోధగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
అష్టాక్షరీ మంత్ర మహత్తును వివరిస్తూ అనకు శబ్దాన్ని అన కుమారునికి అని విరిచి విశేషార్థాన్ని సాధించిన మీ పూరణ మాబోంట్లకు ఒక పాఠం. ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఇంతవరకూ విష్ణునామ స్మరణ చేయకుమని చెప్పిన భార్య లెవరూ లేరనుకున్నాను. దేశకాలపాత్రతల నెరిగి దేవకి మాటగా చక్కని పూరణ నిచ్చారు. వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
అటు నాథునకు, ఇటు కుమారునికి చెప్పిన మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
అన కులము అంటూ చెప్పిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
నారాయణ నామాన్ని నిరతం పలికే నారదునితో లీలావతి మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
పలుకు మిట్లని బలికె భర్త తోడ
రిప్లయితొలగించండినాధ ! ఓం నమో నారాయణాయ !, యనకు
మెప్పు డెవరిని నేమియు నిచ్ఛ తోడ
మంచి వారల లక్షణ మదియ సుమ్ము
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ వసంత కిషోర్ గారు నన్ను మన్నించగలరు,మీ పేరు కాఫీ జేసి పెష్ట్ జేయునపుడు కట్ అయినది.
పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.
రిప్లయితొలగించండి"ఎటుల ప్రాప్తించె మోక్షమ్ము కుటిలమతుల"
కనిన నారదుడు తెలిపె "వినుము యమర
నాథ !ఓం నమో నారాయణాయ"యన "కు
టిలకుమతులకు సద్గతి కలుగు"నంచు
స్వామి కేశవ మాధవ శరణు! కమల
రిప్లయితొలగించండినాథ ! “ఓం నమో నారాయణాయ ! " యనకు
నీకు నాపైన దయలేదని హరి నీవె !
భక్తులను బ్రోచి కరుణించు వాసుదేవ !
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిసకామ భక్తి వద్దని హితవు చెప్పిందా భార్య? బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
నారాయణ అన్న మాత్రాన కుటిలమతులు మోక్షాన్ని పొందుతారన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
నాస్తికు డొకడు మరణ శయ్యపై ఉన్నాడు. చచ్చేముందైనా దైవనామ స్మరణ చేయిద్దామని బంధువులు చేసిన ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. చివరికి కనీసం నారాయణలో సగమైనా అనిపిద్దామనుకొని ఒకడు నార తెచ్చి చూపి “ఇదేమిటి?” అంటే, వాడు “పీచు” అని చెప్పి చచ్చాడట! మీ పూరణ ఆ కథను గుర్తుకు తెచ్చింది. ధన్యవాదాలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
దైవాన్ని సంబోధించి దయలేదని అనకు అంటూ చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి"స్థిర! మురాంతక! లక్ష్మీశ! దేవ దేవ!
విశ్వరూపా నమోస్తుతే! విమల! దీన
నాథ!", "ఓం నమో నారాయణాయ"యన, కు
జనుల, సుజనులఁ జేతువు స్వామి నీవు!
రాణి వచియించె నడుగగ రాజు , ప్రాణ
రిప్లయితొలగించండినాథ! ’ఓం నమో నారాయణాయ’ యన,కు
రియును నెలమూడు వర్షాలు రూడి గాను
తొలగు దుఃఖము ప్రజలకు గలుగు సుఖము!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ ‘అన కుజనులు’ అన్న విరుపుతో చాలా బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కోరి రూపము నడుగంగ కోతి వైతి
రిప్లయితొలగించండిహరిని శపియించె నరునిగ నాగ్ర హించి
తగదు జపియించ నారద తగవు నీవు
నాధ ! ఓం నమో నారాయ ణాయ యనకు
రిప్లయితొలగించండిశంకరార్యులకు ధన్యవాదములతో :
అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
బిడ్డను దండింప బూనిన హిరణ్యకశిపునితో లీలావతి :
01అ)
______________________________
పిచ్చుకల మీద బ్రహ్మాస్ర్త్ర - పీడనమ్మె ?
వలదు వలదోయి వలదోయి - వలదు వలదు
పసితనంబున నీరీతి - పలుకు చుండె
బిడ్డ డాతడు వానిపై - పెలుచలేల?
వంశవర్థనుడు, మరి మీ - యంశ గాదె ?
నచ్చ జెప్పెద ! నామాట - లిచ్చగించు
నాథ ! “ఓం నమో నారాయ - ణాయ”యనకు
మనుచు జెప్పిన నామాట - వినును వాడు !
______________________________
పెలుచ = కోపము