శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. ==========*=========== ఆరు పదుల వయసునకు చేరు కొనగ మరలి వచ్చె వసంతము మనకు ననుచు తాత పెండ్లి కుమారుడై తరలి నాడు విందు జేయ మనుమలార!వేగ వేగ రండనుచు బిల్చి, నానమ్మ,దండు తోడ తాతను వివాహ మాడెను,తరుణి మెచ్చి ముద్దుల నిడె దంపతులకు ముందుగాను!
శైలజ గారూ, ‘వయసు ఉడిగినా’ అని విసంధిగా, వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘వయ సుడిగినను’ అనండి. * తిమ్మాజీ రావు గారూ, ‘మగడు + ఏ = మగడే’ అవుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘భర్తయే’ అనండి. మూడవ పాదంలో ‘తాతనిచ్చి’ అంటే అన్వయం దెబ్బతినది.
వైజ యంతిని ధరియించు వల్ల భుండు
రిప్లయితొలగించండిశేష శయనుడ టంచువి శేష మదియె
విశ్వ మంతను పాలించు వేల్పు ..తాత
తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి
తాత తాత _ విష్ణు మూర్తి
బ్రహ్మ మానస పుత్రిక వాణి నపుడు
రిప్లయితొలగించండిపెండ్లి యాడంగ నలువ తపింపఁ గాను;
బ్రహ్మ కోర్కిని దలఁదాల్చి వఱలఁ దాను
తాతను వివాహమాడెను తరుణి మెచ్చి!
(తాత=తండ్రి, బ్రహ్మ, ముసలివాఁడు, తండ్రి తండ్రి, తల్లి తండ్రి...మొదలగు నర్థములు గలవు)
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కథావతారిక :
తల్లిదండ్రు లకట - తలరాత మరణింప
తాత యొంటి బెంచె - ప్రీతి , ప్రీతి !
తల్లి లేని తనను - తాతయ్య పెంచుటన్
తాత యనిన మిగుల - ప్రీతి హెచ్చు !
పిల్ల పెద్దదాయె - ప్రేమించె రాముని
పెళ్లి నిశ్చయించె - పెద్దలపుడు !
పెద్ద వయసు నిండు - ముద్దుల తాతను
పెద్ద మనసు తోడ - ప్రీతి జూచు !
01)
______________________________
పక్షవాతంబు సోకిన - శిక్షకునకు
పెద్ద చక్రాల కుర్చీని - ప్రీతి దెచ్చి
ప్రేమ త్రోసి కొనుచు వచ్చి - పెళ్ళికడకు
తాతను; వివాహమాడెను - తరుణి మెచ్చి !
______________________________
శిక్షకుడు = గురువు(తాత)
02)
రిప్లయితొలగించండి______________________________
మెఱుగుబోడికి, మాంథాత - మేనమామ !
మేనమామను వలచెనా - మీననేత్రి !
తాతయని యంద్రు, ముద్దు , మాం - థాత నచట !
తాతను వివాహమాడెను - తరుణి మెచ్చి !
______________________________
03)
రిప్లయితొలగించండి______________________________
తనరె సింధుజ క్షీరాబ్ది - త్రచ్చు వేళ
తనకు వలెనని మన్మథు - దండ్రి యడుగ
ధీరు డంతట చేతి నం - దీయ; తాత
తాతను వివాహమాడెను - తరుణి మెచ్చి !
______________________________
ధీరుడు = సముద్రుడు
తాతతాత - విష్ణువు
కుఱ్ఱవాడు తాతారావు కోరుకొనగ
రిప్లయితొలగించండివనజ ప్రేమించె నతడిని 'వల్లె ' యనుచు
పెద్ద లంగీక రించగ పెళ్ళి కొరకు
తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి
తాత పాత్రతో నటనలో ఖ్యాతి గాంచె
రిప్లయితొలగించండినొకడు తాత యనబడు నయ్యువకుని స్మర
సముని ప్రేమించి మురియుచు సుమతి ఖ్యాత
తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి
తాత యను నింటి పేరుతో దనరు వాని
రిప్లయితొలగించండినంద చందాలలో గుసుమాస్త్ర సముని
నీడు జోడైన వానిగా నెంచి యట్టి
తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి
అమ్మి కమ్మమ్మ కడగొట్టు తమ్ముడైన
రిప్లయితొలగించండిచిన్నవాడు మంచి గుణము లున్నవాడు
తనకు బంధువు వరుసకు తాత యగును
తాతను వివాహ మాడెను తరుణి మెచ్చి
అందగాడగు బావయే నతివనొల్ల
రిప్లయితొలగించండిపంతమూనుచు వెదకెను పడతి, కుదిరె
నందమందున చూడగా నధిపు ' వాని
తాతను ' వివాహ మాడెను తరుణి మెచ్చి
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
==========*===========
ఆరు పదుల వయసునకు చేరు కొనగ
మరలి వచ్చె వసంతము మనకు ననుచు
తాత పెండ్లి కుమారుడై తరలి నాడు
విందు జేయ మనుమలార!వేగ వేగ
రండనుచు బిల్చి, నానమ్మ,దండు తోడ
తాతను వివాహ మాడెను,తరుణి మెచ్చి
ముద్దుల నిడె దంపతులకు ముందుగాను!
పావని తనకు బంధువు , వరుసకైన
రిప్లయితొలగించండితాతను వివాహ మాడెను , తరుణీ మెచ్చి
వేయి రూప్యము లిచ్చెను వికట కవికి
నాత నికధలు జదువగ హర్ష మొంది
తనకు పెళ్ళిచేయతగిన ధనము లేక
రిప్లయితొలగించండికలత పడుచున్న తలిదండ్రి కలలు తీర
వయసు ఉడిగినా మనసున్న వాని జూచి
తాత నువివాహ మాడెను తరుణి మెచ్చి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిషష్టి పూర్తినా డమ్మమ్మ సంతసమున
రిప్లయితొలగించండితాతను వివాహ మాడెను; తరుణి మెచ్చి
తాత, అమ్మమ్మ పెండ్లికి దనివి తీర
వంటకములను వడ్డించె బంధువులకు.
పలికె నిట్టుల శ్రీవల్లి , వనజ మున్ను
రిప్లయితొలగించండివలదు వలదని పలుమార్లు పలికి పలికి
వెంట దిరిగిన వాసునే ,వింటివా ల
తా ! తను వివాహ మాడెను తరుణి మెచ్చి !!!
మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండినమస్కృతులతో,
ఘూర్జరేశ్వరసుత, సుమకోమలాంగి
చంద్రలేఖ మహాకవిచంద్రు బిల్హ
ణాఖ్యు, వాణీస్వరూపుఁ, బ్రత్యణుకృత కవి
తా తను వివాహ మాడెను తరుణి మెచ్చి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
పేద యింటిదే కావచ్చు పెద్ద గుణము
రిప్లయితొలగించండివరుడు మెచ్చిన యందాల వధువు! లేవు
కట్నకాన్కలు! కరమును కలిపెను విన-
తా! తను వివాహ మాడెను తరుణిఁ మెచ్చి.
వరునికై నెదకి వెదకి వశము గాక
రిప్లయితొలగించండితల్లిదం(డి భాదను జూసి తట్టుగొనక
దూర బంధువు యువకునితో వరుసకు
తాత,ను నివాహమాడెను తరుని మెచ్చి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండితండ్రి కన్నను మగడుయే తనకు మిన్న
యనిన కూతునకొక కుంటి యంధుడైన
తాతకిచ్చి పెండిలి సేయ దైవమిడిన
తాతను వివాహమాడెను తరుణి మెచ్చి
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
రిప్లయితొలగించండిమాఊరిలో రామతాత యను పేరుగల వారు గలరు వారి పేరును వాడుకొనుచు
సరదాగా:
=========*========
రామాపురమునందు రామతాత యనెడి
....యువకునకు దొరలె యుక్తవయసు
కమలాపురమునందు కవితకు గనబడె
.... జాతర యందున,చతురడయిన
రామతాతను కోరి రయమున దెల్పెను
.... తల్లిదండ్రులకంత దన మనమ్ము
సంతసమ్మున దెల్ప సమ్మతిని దనకు
.... బంధు తతిని బిల్చి వైభవముగ
కవిత రామతాతను వివాహ మాడెను
తరుణి మెచ్చి మంచి తావి జల్లె
వారి పైన, జూచు వారిజాక్షులపైన
స్వాగతము బలుకుచు సాదరమున!
సవరణతో.....................
రిప్లయితొలగించండివరునికై వెదకి వెదకి వశము గాక
తల్లిదండ్రి బాధను జూసి తట్టుకొనక
దూర బంధువు యువకునితో వరుసకు
తాత,ను వివాహమాడెను తరుణి మెచ్చి
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమా బంధువు చనిపోతే వెళ్ళి ఇప్పుడే ఇల్లు చేరాను. ఈరోజుకు పూరణలను, పద్యాలను సమీక్షించలేను. మన్నించండి.
*
ప్రయాణంలో బస్సులో వ్రాసిన నా పూరణలు...
(1)
కలఁడు తాటి తమ్మారావు కడపలోన
‘తా.త’ యని ముద్దుపేర నాతనిఁ బిలుతురు
సద్గుణోపేతుఁడని సర్వజనులు పలుక
తాతను వివాహమాడెను తరుణి మెచ్చి.
(2)
తల్లిదండ్రులు పోయిన పిల్లను కడు
ప్రేమతోఁ బెంచి యామెకుఁ బెండ్లి సేయ
గాఁ దగిన వరుఁ దెచ్చిన గౌరవించి
తాతను, వివాహమాడెను తరుణి మెచ్చి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అందరికీ అభినందనలు !
ఈ రోజు రెండు పూరణల నిచ్చిన శంకరార్యులకు
అభినందనా సహిత ధన్యవాదములు !
మనోహరమైన పూరణలు చెప్పిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యకు,
గుండు మధుసూదన్ గారికి,
వసంత కిశోర్ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
వరప్రసాద్ గారికి,
సుబ్బారావు గారికి,
శైలజ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
మంద పీతాంబర్ గారికి,
ఏల్చూరి మురళీధర రావు గారికి,
మిస్సన్న గారికి,
కుసుమ సుదర్శన్ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ మొదటి పూరణను ఇప్పుడే చదివాను. నిన్ననే చదివి ఉంటే నా రెండవ పూరణను ప్రకటించేవాడను కాదు.
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణలో ‘తాత’ అనే ముద్దుపేరును ప్రస్తావించారు. దానితో నా మొదటి పూరణకూడా పరాస్తమయింది. చాలా సంతోషం.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండిమన యిద్దరి యాలోచనలు ఒకే రకంగా ఉన్నట్టున్నవి !
శైలజ గారూ,
రిప్లయితొలగించండి‘వయసు ఉడిగినా’ అని విసంధిగా, వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘వయ సుడిగినను’ అనండి.
*
తిమ్మాజీ రావు గారూ,
‘మగడు + ఏ = మగడే’ అవుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘భర్తయే’ అనండి. మూడవ పాదంలో ‘తాతనిచ్చి’ అంటే అన్వయం దెబ్బతినది.