4, సెప్టెంబర్ 2013, బుధవారం

పద్య రచన – 454 (శివ గంగ)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో)

27 కామెంట్‌లు:

 1. అభ్రసీమలనుండి యమిత వేగంబుతో
  ....నవని పైకి దుముకు నమర గంగ
  సంభ్రమంబును గాంచి సర్వేశ్వరుండట్టి
  ....యెడ నెట్టి యాపద యేని జగతి
  గలుగ రాదనెడు సంకల్పంబుతో నట
  ....నిల్చి యా గంగను దాల్చి జడల
  నటనుండి మెల్లగా ననిపె హిమాలయ
  ....భూధరాగ్రమునుండి పుడమి పైకి
  నఖిల పావన కర్త్రిగా నలరు గంగ
  యాపదుద్ధారకుండగు త్ర్యంబకుండు
  కనుల విందౌట నా శివ గంగ దలచి
  ప్రార్థన మొనర్చి వందన మాచరింతు

  రిప్లయితొలగించండి

 2. గంగను విడుము పార్వతి చాలున్ అంటే
  విడిబడ్డ గంగా ప్రవాహం లో శివుడే మునిగె
  ప్రకృతి ప్రళయం లో పురుషుడు నామమాత్రుడే
  అనంగ శివా నీవూ బందీ అయ్యావయ్యా !?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. శ్రీ కంది శంకరయ్య గారు & శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  శుభాశీస్సులు.
  "క్షీరదాత" అనే శబ్దము పురుషవాచకము కదా. క్షీరదాత్రి/క్షీరదాయిని అంటే సాధువు (స్త్రీలింగము).
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. శ్రీ నేమాని వారికి నమస్కారములు. మీరు చూపిన మార్పు " క్షీర దాత్రి " తో నాపద్య సవరణ.. ధన్యవాదములు.


  మరదల ! నీవా తక్కువ?
  వరలెదవుగ చెల్లి రామ వైరికి నీవై ! (శూర్పణఖ)
  వరకృష్ణు క్షీర దాత్రివి (పూతన)
  మరిజూడగ లక్ష్మికక్క మాటను వినవే ! (పెద్దమ్మ)

  రిప్లయితొలగించండి
 5. గంగ పొంగెనె నీల కంఠమ్ము తెలుపు జే
  యగ నెంచెనో యన! నమ్మ వనుచు
  కొలిచేటి నరజాతి కొఱకైన శాంతమ్ము
  నందవే సురనదీ, యర్చనలివె
  యందుకొనవె! యల యాకాశ సీమలో
  చూపించు వేగమ్ము చూపదగునె?
  మొఱలను వినుమమ్మ, మ్రొక్కుల గొనుమమ్మ
  మమ్ము, మందాకినీ! మనగ నిమ్మ!

  బహు కరాళ రూపమ్మున భయము గొలుప
  తగదు, శాంతించు శాంతించు! ధరణి యందు
  జనుల క్షుద్బాధ, దాహార్తి చల్లబఱచు
  తల్లివై వెలుగొందవె దరిని జేర్చి!

  రిప్లయితొలగించండి
 6. ఈ పద్యం మా అన్న గారు, అందవోలు రామ మోహన్ గారి రచన.

  పొంగుచు వచ్చిన వరదల
  శృంగాటక మందు నున్న శివ విగ్రహమే
  కంగారై ప్రవహించెను
  గంగమ్మయె శివుని మింగె కడు చోద్యముగన్.

  జటలందున కట్టు బడుచు
  కటకట పడియున్న గంగ కట్టలు మీరెన్
  చటులోద్ధతి బ్రవహించుచు
  చిటికెలలో నాగ్రహించె చిన్మయు పయినన్

  వ: అయ్యో! అపచారము.

  పొరపాటుగ నంటి నేను
  పొరపొచ్చము లేవి లేవు పొలతికి విభుకున్
  ధర కొకపరి విలయంబును
  పరిచయ మీయంగ గంగ బంపెను శివుడే

  కట్టలు తెంచిన పాపమె
  నిట్టనిలువు ముంచు మిమ్ము నిజము తెలియుడీ
  కట్టడముల నడ్డంబుగ
  కట్టినచో నీరు మీకు కష్టములిచ్చున్.

  భగవంతుని నిందించక
  జగమందున నియమములను జను బాటింపన్
  తగవే యీ ధన దాహము?
  తగునే యవినీతి మనకు తలచుడి మీరల్.

  (శృంగాటకము = కూడలి)

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవుల ధన్యవాదములు.

  పరమ శివుడు ఒక్క క్షణము నరుని వలె భవబందమున జిక్కిన ప్రళయములు సంభవించునని
  ========*=======
  శివ గంగ ముదమున జేర శివపాద సీమను నాడు
  జవరాలి సొగసును గన్న శశిధరుండు మరులు గొనగ
  భవ బందమున జిక్క స్వామి,భక్తుల మొరలిన కుండె
  శివ శివ యని భక్తు లెల్ల జేరెను శివపాద సీమ!

  రిప్లయితొలగించండి
 8. చిత్ర మందు జూడ శివుడు గంగ నడుమ
  నుండి జంతు వొకటి యురము నందు
  పెట్టు కొనిన యట్లయె ట్టు లుం డె నొగద !
  ఏది యే మయినను నీ శు గొలుతు


  రిప్లయితొలగించండి
 9. పూజ్యులు నేమనివారికి, మిత్రులు శంకరయ్యగారికి, కవిపండిత మిత్రులందఱికి నమస్కారములు.

  వామ నోన్నత పాద ప్రక్షాళితో
  ద్భవ వియచ్చారిణీ భవ్య గంగ;
  ఘన భగీరథ తపోగత వర్తనానుసా
  రీద్ధ చారిత్ర సంబద్ధ గంగ;
  శంత నావిష్కృత సత్ప్రేమ సంభావ్య
  సంసార బద్ధ సంస్కర్త్రి గంగ;
  భూజన పాప నిర్మూల నోత్కంఠ ప్ర
  వాహ సముత్తుంగ భావ గంగ;

  శివ జటాజూట నిర్ముక్త జీవ గంగ;
  వార్ధి సంలగ్న హృదయ సత్వరిత గంగ;
  రంగ దుత్తుంగ భంగ తరంగ గంగ;
  కలుషిత ధ్వస్త సంస్తుత్య గగన గంగ!

  రిప్లయితొలగించండి
 10. శ్రీ మధుసూదన్ గారు: శుభాశీస్సులు.
  సంస్కృత సమాస భూయిష్ఠముగ చక్కని సీసపద్యమును ఆవిష్కరించేరు. బహుధా ప్రశంసనీయము మీ కృతి. చిన్న సూచనలు:
  1. 1వ పాదములో కొన్ని అక్షరములు తక్కువగ నున్నవి.
  2. తేటగీతి 3వ పాదములో "భంగ తరంగ" అనే ప్రయోగము సరి కాదేమో అని సంశయము. గంగను "అభంగ తరంగ" అని వ్యవహరిస్తారు - అనగా ఆగిపోని కెరటములు కలదని అర్థము.
  పరిశీలించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ వరప్రసాద్ గారు: శుభాశీస్సులు. మీ పద్యమును చూచేను.
  1. పరమేశ్వరుడు - పరమ పవిత్రుడే - గంగా జారుడు అని కొందరు వేసే నిందను నేను వ్యతిరేకించుతాను.
  2. 3వ పాదములో: మొరలినకుండె? = టైపు పొరపాటా? : మొర వినకుండె అనవలనా?
  3. 4వ పాదములో: భక్తులెల్ల జేరెను - భక్తులెల్ల జేరిరి అనుట సాధువు. మీరు పూర్తిగా ఆ భావమును నిర్మూలించుచు క్రొత్త పద్యమును వ్రాస్తే మాకు ఆనందము. స్వస్తి

  రిప్లయితొలగించండి
 12. శ్రీ నేమాని గురుదేవుల ధన్యవాదములు,
  పద్యమును మార్చి వ్రాసితిని గురువు గారు

  భవ హరుని గొలువ జనులు భక్తి తోడ వెడలె వేగ!
  శివ శివ యని బల్కి వారు శివపాద సీమను జేర,
  శివ శివ యనుచును గంగ శివుని శిరముజేరు చుండ
  సవినయమున మ్రొక్కి రంత శాంతించ మనుచును వారు!

  రిప్లయితొలగించండి
 13. శ్రీహరిపదములపుట్టిశ్రీకరమై
  జటాజూటమునుచేరిజగతినేలు
  పరమపావనగంగవుప్రళయమేల
  ఫాలనేత్రునిశివగంగప్రణతులమ్మ

  రిప్లయితొలగించండి
 14. శ్రీ వరప్రసాద్ గారు: శుభాశీస్సులు.
  మీ 2వ పద్యమును చూచేను. బాగుగనున్నది. ఒక సూచన:
  1వ పాదములో: భక్తితో వెడలిరి వేగ అని సవరించండి.

  రిప్లయితొలగించండి
 15. శిరమున గంగను దాచిన జీవేశ్వరా
  ఎదుటనదియే గంగమఏమి మాయ
  వంక జాబిలి నవ్వెలేవరుసజూసి
  మురిసిపోకయ్యలోకేశ ముప్పుగనుమ

  రిప్లయితొలగించండి
 16. పూజ్యులు నేమానివారికి ధన్యవాదములు. సంస్కృత దీర్ఘ సమాసములతో వ్రాయ సాహసించినందులకు మన్నించఁగలరు.

  1. సీసపద్య ప్రథమ పాదమున "బ్రహ్మ" యను పదము టైపాటు వలన నెగిరిపోయినది.

  2. తేటగీతి తృతీయ పాదమున "అభంగ" యనియే యుండవలెను. కాని యక్షర మెక్కువ యయినందున "భంగ" యని విధిలేక టైపు చేసినాను. దానిని "తుంగ రంగ దభంగ తరంగ గంగ" యని సవరించుచుంటిని. పరిశీలించఁగలరు.

  సీ.
  వామ నోన్నత పాద బ్రహ్మ ప్రక్షాళితో
  ....ద్భవ వియచ్చారిణీ భవ్య గంగ;
  ఘన భగీరథ తపోగత వర్తనానుసా
  ....రీద్ధ చారిత్ర సంబద్ధ గంగ;
  శంత నావిష్కృత సత్ప్రేమ సంభావ్య
  ....సంసార బద్ధ సంస్కర్త్రి గంగ;
  భూజన పాప నిర్మూల నోత్కంఠ ప్ర
  ....వాహ సముత్తుంగ భావ గంగ;

  గీ.
  శివ జటాజూట నిర్ముక్త జీవ గంగ;
  వార్ధి సంలగ్న హృదయ సత్వరిత గంగ;
  తుంగ రంగ దభంగ తరంగ గంగ;
  కలుషిత ధ్వస్త సంస్తుత్య గగన గంగ!

  రిప్లయితొలగించండి
 17. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

  సవరణతో మరొక మారు
  =====#======
  భవ హరుని గొలువ జనులు భక్తితో వెడలిరి వేగ!
  శివ శివ యని బల్కి వారు శివపాద సీమను జేర,
  శివ శివ యనుచును గంగ శివుని శిరముజేరు చుండ
  సవినయమున మ్రొక్కి రంత శాంతించు గంగమ్మ యనుచు!

  రిప్లయితొలగించండి
 18. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

  తృప్తి జెందక మది మరియొక పద్యము వ్రాయమనెను
  =====$======$=====
  తన్మయుడై భక్త వరుడు ధరణి పైన దిరుగు చుండ,
  చిన్మయ రూపుని జెంత జేర చెలుగు చుండె గంగ!
  మన్మథ రూపము జూడ మనుజులెల్ల శివుని జేర,
  నిన్మడి యుత్సాహి!గంగ యీశ్వర దరి జేరు చుండె!

  రిప్లయితొలగించండి
 19. శ్రీ వరప్రసాద్ గారూ: శుభాశీస్సులు.
  మీ పద్యమును చూచేను. ఆఖరి పాదములోఈశ్వర దరి కి బదులుగా ఈశ్వరు దరి అంటే బాగుండును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. తొలుతను భగీరధుడు నను
  పిలువగ భయపడితి గాని వృషవాహనుడే
  తలపై ధరించునని విని
  ఇలకేతెoచితిని పెద్దలెల్లరు మెచ్చన్

  గడచెను యుగములు నను నీ
  జడయందున దాచియుంచ సాంబశివా! నా
  యెడ కాఠిన్యము తగునా
  విడువుము నను కౌగిలింప వేడెదను భవా

  అని ప్రార్థించిన గంగను
  త్రినయనుడు గాంచి పల్కె దేవీ! కాశిన్
  నను నీ కౌగిలి నిల్పుము
  అనుకాంక్షను వదలుకొనుము హర్షించ జనుల్

  రిప్లయితొలగించండి
 21. పండిత నేమాని వారూ,
  గంగాప్రాశస్త్యాన్ని చక్కగా వర్ణించారు. అభినందనలు.
  *
  జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం.....
  గంగ విడుము చాలు గౌరి నీ కనినంత
  విడిన గంగలోన మృడుఁడు మునిఁగె
  ప్రకృతి ప్రళయమందు పరికింపఁ బురుషుండు
  నామమాత్రుఁడయ్యె నేమనందు?
  *
  పండిత నేమాని వారూ,
  ‘క్షీరదాత్రి’ని గురించిన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మందాకిని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కొలిచేటి’ అనే వ్యావహారికాన్ని ‘కొలిచెడి’ అనండి.
  *
  అందవోలు విద్యాసాగర్ గారూ,
  మీ అన్నగారు రామ మోహన్ గారి పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘మింగె’కు సాధురూపం ‘మ్రింగె’.
  మూడవ పద్యం మొదటి పాదంలో గణదోషం. దానిని ‘పొరపాటున నే నంటిని’ అంటే సరి!
  *
  వరప్రసాద్ గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  సంస్కృత సమాస భూయిష్ఠమైన మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ రెండు పద్యాలలో భావం బాగుంది. అభినందనలు.
  మొదటి పద్యంలో రెండు పాదాల్లో గణదోషం. నా సవరణలతో మీ పద్యం.....
  శ్రీహరి పదంబులను బుట్టి శ్రీకరమయి
  శివ జటాజూటమును జేరి భువిని బ్రోచు
  పరమపావనగంగ యీ ప్రళయమేల
  ఫాలనేత్రుని శివగంగ ప్రణతులమ్మ
  రెండవ పద్యానికి నా సవరణ....
  శిరమునన్ గంగ దాల్చిన శివ! త్రినేత్ర!
  ఎదుట గనుమది గంగమ యేమి మాయ
  వంక జాబిలి నవ్వెలే వరుసజూసి
  మురిసిపోకయ్య లోకేశ ముప్పుగనుమ
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘నిల్పుము అను కాంక్షను’ అన్నదానిని ‘నిల్పుట యను కాంక్షను’ అనండి.

  రిప్లయితొలగించండి
 22. నమస్కారములు
  గురువులు క్షమించాలి ఇదినా ప్రధమ ప్రయత్నము ఈ సీస బంధనం

  నాకము నందుండి నగధరు శిరముపై
  దిగివచ్చి దుమికిన దేవ గంగ
  తపమున మెప్పించి ధరనేలు రాజైన
  భాగీరధుని వెంట భోగ వతిగ
  త్రిపధగ పేరొంది తేజో మయం బైన
  గంగా జలంబులౌ కాశి గంగ
  గంగాతి శయమ్మును గాంచిన పరమేశు
  పట్టి బంధించె తా జటల నడుమ

  బిందు సరమున సొగసుల విందు యనగ
  సురలు మెచ్చిన గంగయె సుడులు దిరిగి
  జహ్నుకన్య యనంగ జాహ్నవి గను
  భువిని పావన మొనరించి భాగ్య మిడగ

  రిప్లయితొలగించండి
 23. క్షమించాలి చివరి లైను
  భువిని పావన మొనరించి భోగ మిడగ .......అని ఉండాలి

  రిప్లయితొలగించండి
 24. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  కొన్ని లోపాలు....
  ‘భాగీరథుని వెంట’ అనడం తప్పు. ‘భగీరథుని వెంట’ అనాలి. అలా అంటే గణభంగ మౌతుంది.
  ‘గంగాతిశయమ్మును’ అంటే గణదోషం. ‘గంగాతిశయమును’ అంటే సరి!
  సీసం నాల్గవ పాదం ఉత్తరార్థంలో యతి తప్పింది.
  ‘విందు + అనగ’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘విందనంగ’ అనండి.
  ‘జహ్నుకన్య’ అన్నా, ‘జాహ్నవి’ అన్నా ఒకటే కదా. ఆ పాదంలో గణదోషం.

  రిప్లయితొలగించండి