గుండు మధుసూదన్ గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. ‘సంతుష్టునిఁ జేతు’ అంటే బాగుంటుందేమో? * రాజేశ్వరి అక్కయ్యా, మంచి ప్రయత్నం చేసారు. మీ పూరణలో అన్వయం లోపించినట్లుంది. ఒకసారి పరిశీలించండి. * వసంత కిశోర్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. ‘దేవకికి నష్టమ..’, ‘సాధ్విని నొంటిదాని..’, ‘భయదోజ్వల..’ అనండి. * పండిత నేమాని వారూ, నిశ్చయార్థంగా మీరు వ్రాసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, వైవిద్యమైన విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందలు. * చింతా రామకృష్ణారావు గారూ, కాలానుగుణమైన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘దినం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘రాజ్యములోన నిప్పుడే’ అందామా? * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘భ్రష్టము’ సాధురూపం. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.
శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సూచనలు: 1. 1వ పాదములో యతి మైత్రి మీరు పాటించలేదు. 2. 2వ పాదములో "తోయదళాక్షుడు" అనుట సరికాదు. తోయజదళాక్షుడు అనుట సాధువు. గణముల కొరకు "తోయజనేత్రుడు" అనండి. 3. 3వ పాదములో మళ్ళికి బదులుగా "వెండి" అనండి. స్వస్తి.
శ్రీ కంది శంకరయ్య గారూ! ఈ నాటి సమస్య "శిష్ట జనాళి మెచ్చెదరె" అను దానిని అదే అర్థములో (ప్రశ్నార్థకముగా)నుంచుట సనాతన ధర్మ పరాయణులమైన మనకు భావ్యము కాదు. శ్రీహరి సంకల్పములను కాని, చేష్టలను కాని మెచ్చక యెవరమైన ఆ స్వామి పట్ల కృతజ్ఞతలేని భావముతో ఉండగలమా. ఎందుకో నాకు మిత్రుల పూరణలను చూచిన తరువాత మనస్సులో కొంత వెలితి గోచరించుచున్నది. స్వస్తి.
సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘సంతస మందుదురు’... ‘సంతస మందురు’ అయింది. ‘సంతస మందెద రీ ధరాస్థలిన్’ అందామా? * గుండు మధుసూదన్ గారూ, పూరణలో ‘మెచ్చెదరె’ తర్వాత ప్రశ్నార్థకం ఉండడంవల్ల ఆ విధంగా పొరపాటు జరగడానికి అవకాశం కలిగింది. ప్రశ్నార్థకంతో వ్యాక్యం పూర్తయి, తరువాత చెప్పిన అంశము మరో వాక్యం అనుకున్నాను. మీ వివరణ యుక్తంగా, సమర్థనీయంగా ఉంది. ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదుష్టు దురాత్ము రావణుని దూషిత కర్ముని, ధర్మమార్గులౌ
రిప్లయితొలగించండిశిష్టజనాళి మెచ్చెదరె? శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
హృష్ట హృదబ్జమందు ఘనరీతిని నిల్పి, భజించి, కొల్చి, సం
తుష్టునిఁ జేయు వస్తుతతిఁ దోరముగా నిడి, మెచ్చునట్లుగన్.
కష్ట ములందు మున్ గినను కాదన కుండగ దేవతా ర్చనల్
రిప్లయితొలగించండినిష్టగ జేయు వారలగు నీమము దప్పని భక్త కోటులౌ
శిష్ట జనాళి మెచ్చెదరె ? శ్రీ రమణీ హృదయేశు నచ్యు తున్
స్రష్టయె జెప్పినన్ వినరు జాల్ముని పల్కుల దూషణా వళుల్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
దుష్టుడూ , దుర్మార్గుడైన కంసుణ్ణెవరూ మెచ్చరు గదా :
01)
___________________________________
శిష్ట జనాళి మెచ్చెదరె ?- శ్రీరమణీ హృదయేశు, నచ్యుతు
న్నష్టమినాడు దేవకికి - యష్టమ గర్భము బుట్టినంత నే
నష్టము జేయ నెంచు కడు - నైకృతికుండును,క్రూరకర్ముడున్
దుష్టుడు ,పాపియున్ ,భగిని - ద్రోహపు చింతితు, గంసు నెవ్విధిన్ !
___________________________________
నష్టము = నాశనము
నైకృతికుడు = మోసగాడు
భగిని = చెల్లెలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమెచ్చెదరె అను పదమును ప్రశ్నార్థకముగా కాక, నిశ్చయార్థముగ గ్రహించి చేసితిని ఈ పూరణ:
రిప్లయితొలగించండిశిష్ట జనాళి మెచ్చెదరె శ్రీ రమణీహృదయేశు నచ్యుతున్
శిష్ట జనాళి మెచ్చెదరె శీతనగాధిపవాసు శంకరున్
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రేయము గూర్చెడు దేవతావళిన్
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీ గురువర్యు సమాదరమ్మునన్
సీతాపహారి రావణు న్నెవరూ మెచ్చరు గదా :
రిప్లయితొలగించండి02)
___________________________________
శిష్ట జనాళి మెచ్చెదరె ?- శ్రీరమణీ హృదయేశు, నచ్యుతున్
గష్టము బెట్టనెంచి , హరి - కాంతను, సాధ్విని, యొంటిదాని,యం
దిష్టము హెచ్చ, కామమున - దేవిలి రూపున మ్రుచ్చిలించు,నా
దుష్టుని , వజ్రపాణి భయ - దుజ్వలు, రావణు , నెన్నడేనియున్ !
___________________________________
దేవిలి = అర్చకుడు(శివార్చకుడు = జంగమయ్య)
స్రష్టనుఁ గన్న భర్త పద సన్నిధి కోరి వసించు భామినీ,
రిప్లయితొలగించండికష్టము కల్గెనంచునలుగన్ మరి పాడియె? పంతమేలనే?
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ? హృదయేశు నచ్యుతున్
దృష్టిని, గర్వభంగమును దాపసి కేర్పడ యుక్తి గాంచవో?
స్పష్టత లేని కేంద్ర పరిపాలనచే జన జీవనం బహో!
రిప్లయితొలగించండికష్టతరంబయెన్.హరియె కావగ రావలె నిప్పుడైన, యీ
కష్టము లెల్ల బాపి తను కావగ నింక నుపేక్ష సేసినన్
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్.
శ్రీ చింతా వారి పూరణ రమణీయముగా సందర్భోచితముగా నున్నది.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ చింతా వారి పూరణ బహు చక్కగ నున్నది ప్రస్తుత పరిస్థితులలో, వారి ప్రేరణతో
రిప్లయితొలగించండి======*==========
నష్టము గల్గు చుండెనని నాగలి బట్టగ నన్ని వర్గముల్
కష్టతరంబయెన్ మనకు కాలుని రాజ్యమునందునీ దినం
కష్టము లెల్ల బాపు హరి కావగ దండము జూప కుండినన్,
శిష్ట జనాళి మెచ్చెదరె? శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
దుష్టులు ప్రాణ మానములు దోచుచుధర్మమతిక్రమింపగా
శిష్ట జనాళి మెచ్చెదెరె ?శ్రీ రమణీ హృదయేశునచ్యుతున్
కష్టములన్ని దీర్చగను కాపురుషాళి వధించి చెచ్చెరన్
శిష్టుల బ్రోచి ధర్మమును స్త్రీలను రక్షణ సేయగోరరే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదుష్టుల సంహరించెదను దూరముజేసెద కష్టనష్టముల్
రిప్లయితొలగించండిశిష్టుల రక్ష జేతునని చెప్పెను గీతను చూడ నీధరన్
కష్టము లెక్కువాయె మరి గావగ నాతడు చేర రానిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండివిరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
‘సంతుష్టునిఁ జేతు’ అంటే బాగుంటుందేమో?
*
రాజేశ్వరి అక్కయ్యా,
మంచి ప్రయత్నం చేసారు. మీ పూరణలో అన్వయం లోపించినట్లుంది. ఒకసారి పరిశీలించండి.
*
వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
‘దేవకికి నష్టమ..’, ‘సాధ్విని నొంటిదాని..’, ‘భయదోజ్వల..’ అనండి.
*
పండిత నేమాని వారూ,
నిశ్చయార్థంగా మీరు వ్రాసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
వైవిద్యమైన విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందలు.
*
చింతా రామకృష్ణారావు గారూ,
కాలానుగుణమైన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘దినం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘రాజ్యములోన నిప్పుడే’ అందామా?
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘భ్రష్టము’ సాధురూపం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
అష్టమ గర్భమందు చెర సాలన దేవకి పుణ్య శీలికిన్
రిప్లయితొలగించండిదుష్టుల మట్టుబెట్ట మును తోయదళాక్షుడు బుట్టెనంద్రు, ప
ల్కష్టము లన్నిదీర్చి మము కావగ బుట్టుము మళ్ళి ,లేనిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీ రమణీహృదయేశు నచ్యుతున్
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సూచనలు:
1. 1వ పాదములో యతి మైత్రి మీరు పాటించలేదు.
2. 2వ పాదములో "తోయదళాక్షుడు" అనుట సరికాదు. తోయజదళాక్షుడు అనుట సాధువు. గణముల కొరకు "తోయజనేత్రుడు" అనండి.
3. 3వ పాదములో మళ్ళికి బదులుగా "వెండి" అనండి.
స్వస్తి.
శ్రీ కంది శంకరయ్య గారూ!
రిప్లయితొలగించండిఈ నాటి సమస్య "శిష్ట జనాళి మెచ్చెదరె" అను దానిని అదే అర్థములో (ప్రశ్నార్థకముగా)నుంచుట సనాతన ధర్మ పరాయణులమైన మనకు భావ్యము కాదు. శ్రీహరి సంకల్పములను కాని, చేష్టలను కాని మెచ్చక యెవరమైన ఆ స్వామి పట్ల కృతజ్ఞతలేని భావముతో ఉండగలమా. ఎందుకో నాకు మిత్రుల పూరణలను చూచిన తరువాత మనస్సులో కొంత వెలితి గోచరించుచున్నది. స్వస్తి.
అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవిగారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన: 4వ పాదములో యతి మైత్రిని మీరు పాటించినట్లు లేదు. స్వస్తి.
దుష్టకృతంబులన్ పరులదూరుట సజ్జనమానవాళికిన్
రిప్లయితొలగించండికష్టము కల్గఁజేయుటలకారణవైరములాత్మసంస్తుతుల్
శిష్టజనాళి మెచ్చెదరె, శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
స్రష్టసుపూజితున్ గొలిచి సంతసమందురు గాదె నిద్ధరన్.
మిత్రులు కంది శంకరయ్యగారికి నమస్కారములు. నా భావన ఏమనఁగా...
రిప్లయితొలగించండి"శిష్టజనాళి
అచ్యుతుని మనమున నిల్పి,
భజించి,
కొల్చి,
సంతుష్టునిఁ జేయు వస్తుతతిని నిడి,
మెచ్చ్చునట్లుగా...
రావణుని మెచ్చెదరా?" అని!
తప్పిదిము జరిగినది సవరణతో...................
రిప్లయితొలగించండికష్టము లెక్కువై ప్రజలు గమ్యము తోచక భారమైన యీ
భ్రష్టపు జీవితమ్ములను బాగుగ జేయుట యెట్టులంచు నా
యిష్టపు దేవునిన్ గొలువ యిమ్మగ విష్ణువు కావకుండినన్
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘సంతస మందుదురు’... ‘సంతస మందురు’ అయింది. ‘సంతస మందెద రీ ధరాస్థలిన్’ అందామా?
*
గుండు మధుసూదన్ గారూ,
పూరణలో ‘మెచ్చెదరె’ తర్వాత ప్రశ్నార్థకం ఉండడంవల్ల ఆ విధంగా పొరపాటు జరగడానికి అవకాశం కలిగింది. ప్రశ్నార్థకంతో వ్యాక్యం పూర్తయి, తరువాత చెప్పిన అంశము మరో వాక్యం అనుకున్నాను.
మీ వివరణ యుక్తంగా, సమర్థనీయంగా ఉంది. ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిదుష్టచతుష్టయం బకట! దుష్టపు కార్యము లెన్నొసల్పి ని
ర్దుష్ట ప్రణాళికన్ సభకు దూతగ వచ్చిన వాని దూరుటల్
శిష్ట జనాళి మెచ్చెదరె? శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
భ్రష్టుల పోయె కాలమిక వచ్చె ననెన్ కురు భీష్ముడంతటన్
నిజమే గురువుగారూ!!
రిప్లయితొలగించండితప్పిదమే. పొరబడ్డాను. సవరించినందులకు ధన్యవాదములు.
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘నిర్దిష్ట’ సాధురూపం. ‘భ్రష్టుల’...?
గురువు గారు, ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపెద్దవారి సూచించిన యతిమైత్రి దోషమును గమనించి, భావము కూడా సిరిని , హరిని అధిక్షేపించినట్లు కాకుండా వేరొక పూరణ చేసినాను.
దుష్టులు దీనులన్ మిగుల ధూర్తత తోడను బాధవెట్టుచున్
కష్టపు కాలమందు కడకంటి కటాక్షము కోర వచ్చినన్
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీరమణీ? హృదయేశు నచ్యుతున్
హృష్టిని దల్ప సత్త్వసిరి హృత్పదమందున నిల్చు నెప్పుడున్.
శిష్ట జనాళి మెచ్చగను శిష్టత నిల్పుము నామనమ్మునన్.
హృష్టి భజింప అని గమనించవలసినది.
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
గురువుగారూ,
రిప్లయితొలగించండిమీకు అనేకానేక ధన్యవాదాలండి.
నమస్కారములు
రిప్లయితొలగించండిఅన్వయమును సరిజేయుట నాకు సరిగా చేత కాలేదు గురువులు మన్నించ గలరు
శ్రీ పండిత నేమాని గారికి నమస్కారము , మరియు ధన్యవాదాలు మీ సూచనల పాటించి సవరించిన పూరణ
రిప్లయితొలగించండిఅష్టమ గర్భమందు సురలందరు మెచ్చగ పుణ్య శీలికిన్
దుష్టుల మట్టుబెట్ట మును తోయజనేత్రుడు బుట్టెనంద్రు, ప
ల్కష్టము లన్నిదీర్చి మము కావగ బుట్టుము వెండి ,లేనిచో
శిష్ట జనాళి మెచ్చెదరె శ్రీ రమణీహృదయేశు నచ్యుతున్!!!
స్పష్టపు మంత్రరాజముల సంస్కృత భాషను నేర్వకుండయే
రిప్లయితొలగించండితుష్టియు తృప్తి లేక వడి తోకలు కోయుచు తంత్రమందునన్
పుష్టిగ రూకలందుకొని పూజలు చేయగ మందిరమ్ములన్
శిష్ట జనాళి మెచ్చెదరె? శ్రీరమణీ హృదయేశు నచ్యుతున్
సుష్టుగ కొల్వుమోరి నిజ సుందర మందిర హృత్తునందునన్!