కన్ను విందగు గాంతులొప్పగ గ్రామ దేవత పర్వముల్ సన్నయమ్ముగ వాడవాడల సల్పుచుందురు భక్తితో నెన్నొ హంగులు సంబరమ్ములు నృత్య గీత విశేష సం పన్న రీతుల ప్రీతినొందుచు మాత ప్రోచును భక్తులన్
రాజేశ్వరి అక్కయ్యా, మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు. ‘కాచి రక్షించున్’ అన్నచోట గణదోషం. ‘కాచును దయతో’ అంటే సరి. * శైలజ గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘ఉపారము లిడి..’? రెండవ పద్యం చివరి పాదంలో గణదోషం. ‘నామమ్ము స్మరణమ్ము జేయ’ అందాం. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు. ‘యూరి ప్రజలు కరముల మ్రొక్కన్’ అంటే బాగుంటుందేమో. లేకుంటే దేవతయే ప్రజలకు మ్రొక్కుతున్నట్లు అర్థం వస్తున్నది. * పండిత నేమాని వారూ, మీ పద్యం మత్త కోకిల పాటలాగా మనోహరంగా ఉంది. అభినందనలు.
శ్రీ శంకరయ్య గారు/శ్రీమతి శైలజ గారు! శుభాశీస్సులు. ఉప ఆహారము అను సమాసము ఉపారముగా వాడబడు చున్నది. గ్రామ దేవతకిచ్చే నైవేద్యమునే ఉపారము అంటారు మా ప్రాంతములలో. స్వస్తి.
జిలేబీ గారూ, ధన్యవాదాలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, గ్రామదేవతల నందరినీ ప్రస్తావిస్తూ వ్రాసిన మీ సీస మాలిక చాలా బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘వేళలా’ అన్నదానిని ‘వేళలను’ అనండి. * సహదేవుడు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం. ‘ప్రేమతో సిరి నింపి’ అందామా? * పండిత నేమాని వారూ/ శైలజ గారూ, ‘ఉపారము’ అనే మాండలిక పదాన్ని గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. రెండవ పద్యం మొదటి పాదంలో గణదోషం. ‘దేవిగ చెలగి’ అనండి. ‘శత్రువుల్ అదిరిపడగ’ అని విసంధిగా ఎందుకు వ్రాసారు? ‘శత్రువు లదిరిపడగ’ అనండి. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
నీమము వీడక సాలున
రిప్లయితొలగించండిప్రేమగ బోనమ్ము లిడిన ప్రీతిని జెందున్
క్షేమము గోరుచు దేవత
గ్రామము నందున్న జనుల కాచి రక్షించున్
గ్రామ దేవత యూరిని కాచు నెపుడు
రిప్లయితొలగించండినీమ నిష్టల బూజించ నిన్ను బ్రోచు
గ్రామ దేవత కొలువున్న గ్రామమందు
నిత్య కల్యాణ ముగనుండు నిక్కముగను
రిప్లయితొలగించండిప్రొద్దుట ప్రొద్దుటే వచ్చి తమ తమ
పూరణ ల తో చదువరులను అలరారించు
ఈ బ్లాగ్రామ దేవతలను ఏమని పొగడుదు !
వీరే కదా నేటి మేటి అంతర్ 'చాల' దేవతలు !
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్షేమము లొసగును దేవత
రిప్లయితొలగించండిగ్రామము నందున జనులను కావగ వచ్చున్
నీమము నఉపా రములిడి
నామము స్మరణ నుజేయ జ్ఞానము నిచ్చున్
గ్రామపు దేవత సాల
రిప్లయితొలగించండిగ్రామంబే యూరి ప్రజకు కరముల మ్రొక్కున్
గ్రామంబున కక్షలు సం
గ్రామంబులు లేక శాంతి గలుగగ గోరున్.
కన్ను విందగు గాంతులొప్పగ గ్రామ దేవత పర్వముల్
రిప్లయితొలగించండిసన్నయమ్ముగ వాడవాడల సల్పుచుందురు భక్తితో
నెన్నొ హంగులు సంబరమ్ములు నృత్య గీత విశేష సం
పన్న రీతుల ప్రీతినొందుచు మాత ప్రోచును భక్తులన్
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
‘కాచి రక్షించున్’ అన్నచోట గణదోషం. ‘కాచును దయతో’ అంటే సరి.
*
శైలజ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఉపారము లిడి..’?
రెండవ పద్యం చివరి పాదంలో గణదోషం. ‘నామమ్ము స్మరణమ్ము జేయ’ అందాం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
‘యూరి ప్రజలు కరముల మ్రొక్కన్’ అంటే బాగుంటుందేమో. లేకుంటే దేవతయే ప్రజలకు మ్రొక్కుతున్నట్లు అర్థం వస్తున్నది.
*
పండిత నేమాని వారూ,
మీ పద్యం మత్త కోకిల పాటలాగా మనోహరంగా ఉంది. అభినందనలు.
గురువుగారికి కృతజ్ఞతలతో...
రిప్లయితొలగించండిప్రతీ ఏడాది గ్రామ దేవతకు నివేదించిన నైనేద్యాన్ని మావైపు "ఉపారము" అని అంటాము..
ఎల్లమ్మదేవతా! యిమ్ము మాకులమందు
రిప్లయితొలగించండి........సంతానసౌఖ్యంబు సంతతంబు,
పోచమ్మ మైసమ్మ లాచంద్రతారకం
........బైన సత్కీర్తుల నందజేసి
కాచుచుందురుగాత, క్రమత ముత్యాలమ్మ
........గంగమ్మ దుర్గమ్మ ఘనముగాను
సంపదల్ కురిపించి సాకుచుందురు గాత,
........బాలమ్మ పెద్దమ్మ భావశుద్ధి
నిచ్చుచుందురుగాత, యీదమ్మ చౌడమ్మ
........మాకందజేతురు మమత, సమత,
నూకాంబికాదేవి నూతనోత్సాహంబు
........మానసంబుల నింపు తాను, పిదప
కోటదుర్గాదేవి కోరిక లీడేర్చు,
........నానందమును గూర్చు నక్కలమ్మ,
ఉప్పలమ్మయు బెంచు నుపకార కాంక్షను
........కనగ పోలేరమ్మ ఘనత గూర్చు,
పైడితల్లియు మాకు భవ్యమై వెలుగొందు
........ఐక్యతాభావంబు నందజేయు,
నిక మహాలక్ష్మమ్మ సకలసంపదలిచ్చి
........రక్షించుగావుత లక్షణముగ,
పురుషరూపము దాల్చి భువనంబు లన్నింట
........తిరుగుచు దయజూపి ధరనుగాచు
పోతురాజాదులు పుణ్యకార్యములందు
........బలమంద జేతురు భవ్యరీతి
భక్తిభావమలర పరమహర్షంబుతో
కొలుతు మెల్లవేళ నిలిచి మిమ్ము,
కావవలయు మమ్ము గ్రామదేవతలార!
స్వాస్థ్యసుఖములిచ్చి, సత్వమొసగి.
మానకుండ యెపుడు బోనాలు జాతరల్
పర్వదినములందు నిర్వహించి,
క్రమము తప్పకుండ ఘనముగ సంబరాల్
చేయుచుండ గలము సిరుల నిండు.
భరతభూమిలోన నిరతంబు ధార్మిక
వర్తనంబు నిలిపి వసుధలోన
శాంతి నింపుచుండి సంతోషదీప్తుల
నందజేయవలయు నందరకును.
గ్రామదేవతలనువారు గ్రామగ్రామ
రిప్లయితొలగించండిమునకునూరిచివరనుండి మనకు నెల్ల
వేళలా రక్షణగ నుంద్రు వేయి నతుల
నిడుదు నిరతమా తల్లికి నిమ్ముగాను
ఊరి ప్రజలు మ్రొక్కు యుమ్మడి దేవత
రిప్లయితొలగించండియైకమత్య పథము నంద రుండి
గ్రామ శోభ మెరయ ప్రేమ నింపి
సకల శుభము లొసగి శాంతి నిచ్చు
శ్రీ శంకరయ్య గారు/శ్రీమతి శైలజ గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఉప ఆహారము అను సమాసము ఉపారముగా వాడబడు చున్నది. గ్రామ దేవతకిచ్చే నైవేద్యమునే ఉపారము అంటారు మా ప్రాంతములలో. స్వస్తి.
మిత్రులు శ్రీ హరివేంకటసత్యనారాయణమూర్తిగారూ! మీ సీసమాలిక అనుపమానము. చక్కని పద్యము నందించినందుల కభినందనలు.
రిప్లయితొలగించండిగ్రామ గ్రామాన నిలిపిన గ్రామ దేవ
తలు, జనులఁ గష్ట సుఖములఁ దయనుఁ బూని,
యెల్ల వేళలఁ గరుణించి, యేలుచుండ్రు;
దుష్టతనుఁ ద్రుంచి, కాతురు శిష్టత నిడి!
పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిఆదిశక్తియే తానుగా అవతరించి
వివిధ రూపుల పేర్లను వెలయుచుండు
గ్రామగ్రామాన ప్రజలను గాచుటకును
పాడిపంటలతో ప్రజ వర్దిలగను
గ్రామమొక దేవియై చెలగి ప్రజలు తనకు
బిడ్డలనుచును రక్షణ ప్రేమ నొసగి
అన్నదమ్ములై మెలగుచు చెన్నుమిగుల
శాంతి సుఖముల బడసి జీవింతు రనగ
ఊరి పొలిమేరలో వెలసి యుండు నెపుడు
అష్టదిక్కుల శత్రువుల్ అదిరి పడగ
రోగముల్ ప్రవేశి౦చనిరోధమిడుచు
ఎల్లమాంబయైనిలుచును ఎల్లరకును
ఆర్యా!
రిప్లయితొలగించండిమధుసూదన్ గారూ,
ధన్యవాదములు
మాస్టరుగారూ ! నిజమే ..చక్కని సవరణ చేశారు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసవరణతో....
గ్రామపు దేవత సాల
గ్రామంబే యూరి ప్రజలు కరముల మ్రొక్కన్
గ్రామంబున కక్షలు సం
గ్రామంబులు లేక శాంతి గలుగగ గోరున్.
ఊరి ప్రజలనెల్ల నొప్పుగా గాచెడు
రిప్లయితొలగించండిగ్రామదేవతలకు కరములొగ్గి
జోత లిడెడు నాడు- జాతర యనుపేర
బంధు తతినిఁ గూడ పరవశమ్ము.
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
గ్రామదేవతల నందరినీ ప్రస్తావిస్తూ వ్రాసిన మీ సీస మాలిక చాలా బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వేళలా’ అన్నదానిని ‘వేళలను’ అనండి.
*
సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘ప్రేమతో సిరి నింపి’ అందామా?
*
పండిత నేమాని వారూ/ శైలజ గారూ,
‘ఉపారము’ అనే మాండలిక పదాన్ని గురించి తెలియజేశారు. ధన్యవాదాలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పద్యం మొదటి పాదంలో గణదోషం. ‘దేవిగ చెలగి’ అనండి.
‘శత్రువుల్ అదిరిపడగ’ అని విసంధిగా ఎందుకు వ్రాసారు? ‘శత్రువు లదిరిపడగ’ అనండి.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పండిత నేమాని, శంకరయ్య గురువులకు వందనములు.
రిప్లయితొలగించండిసంతునిచ్చి తమకు సంతసమొందింప
పట్టుపుట్టములిడి, బలులనిచ్చి
గ్రామదేవతలను ఘనముగా పూజించి
సాకములను జేసి సాగనంపు.
ప్రభల రామలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.