19, సెప్టెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1179 (పుస్తకములఁ జదువువాని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్.

27 కామెంట్‌లు:

  1. మస్తకము నందు భక్తిని
    మస్తుగ తాపెంచు వాడు మహదేవు డనన్
    నిస్తేజ మైన రచనల
    పుస్తకము లఁ చదువు వాని బుద్ధి నశించున్ !

    రిప్లయితొలగించండి
  2. శాస్తోల్లేఖిత సుకృతి ప్ర
    శస్త శుభ విశిష్ట నీతి శాస్త్ర విముఖుఁడై;
    యస్తుతిపాత్ర, దురితకర
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్!

    రిప్లయితొలగించండి
  3. అస్తవ్యస్తపు రచనల
    మస్తకమున్ జెరచునట్టి మలినాంశములన్
    ప్రస్తుతి జేసెడు కుమతుల
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్.

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి పూరణ వ్రాసారు. అభినందనలు.
    ‘మస్తుగ’ అని అన్యదేశ్యాన్ని ప్రయోగించారు. ఆ పాదాన్ని ‘నిస్తులముగఁ బెంచువాఁడు నిటలాక్షుఁ డగున్’ అందామా?
    *
    గుండు మధుసూదన్ గారూ,
    సుశబ్ద ప్రయోగంతో, చక్కని ధారతో మీ పద్యం అలరారుతున్నది. ‘దురతకర పుస్తకములు బుద్ధిజాడ్యాన్ని కలిగించు’నన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘కుమతుల పుస్తకముల’పై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. స్వస్తి! పరమార్థములుకల
    పుస్తకముల జదువు వాని బుద్ధి జ్వలించున్
    అస్త వ్యస్తపు తెరగుల
    పుస్తకముల జదువు వాని బుద్ధి నశించున్

    రిప్లయితొలగించండి
  6. మస్తకము నిలిపి నేర్వక
    విస్తరమగు జగతిలోని విజ్ఞానమునే
    స్వస్తిని గూర్పని వేవో
    పుస్తకముల జదువు వాని బుద్ధి నశించున్.

    రిప్లయితొలగించండి
  7. విస్తారమైన వ్యాఖ్యలఁ
    నాస్తికభావములఁ బెంచునట్టి విధమునన్
    శస్తము కానిది కుత్సిత
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్.

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు నేమానివారికి, మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సాహితీ కవి పండిత మిత్రులందఱికి నమస్కారములు. నేఁ డందఱి పూరణము లలరించుచున్నవి. అభినందనలు.

    నా రెండవ పూరణము...

    శస్తగుణోపేత ప్రభా
    వాస్తోతు స్తూయమాన భవనుతి విముఖ
    న్యస్త విదూషిత కవికృత
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్! (2)

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    అస్తవ్యస్త పుస్తకపఠనాన్ని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    స్వస్తిని గూర్పని పుస్తకములపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    కుత్సిత పుస్తకాలపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    సుదీర్ఘ సమాసయుక్తమైన మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మంద పీతాంబర్ గారూ,
    చక్కని భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘గ్రామస్థుల’ను ‘గ్రామస్తులు’ అన్నారు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
    =======*========
    పోకిరి రచయితల పాడు పుస్తకముల
    జదువు వాని బుద్ధి నశించి,మదము పెరిగి
    మాన హీనుడై,దుర్గుణ మద్య మందు
    నీదు లాడుచు నుండును పాదపమున.
    =========*========
    విస్తారమ్ముగ గనబడు
    నాస్తిక,నిస్తేజ మైన నవ్యరచనలన్,
    మస్తక మలినము జేసెడి
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్.

    రిప్లయితొలగించండి
  12. మస్తకము నిండి యుండును
    పుస్తకముల జదువువాని , బుద్ధి నశించున్
    సుస్థిరత లేని కవితల
    పుస్తకములు చదువు నెడల పొరలు పొరలుగాన్

    రిప్లయితొలగించండి
  13. వరప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు (ముఖ్యంగా కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన విధానం) బాగున్నాయి. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పొరపాటును తెలియ జేసిన శ్రీ శంకరయ్య గారికి ధన్య వాదములు. చిన్న సవరణ తో పూరణ.

    విస్తార భారతావని
    నిస్తే జమ్మయ్యెనేడునేతల దయతో
    పస్తుల దీర్చని నార్థిక
    పుస్తకములఁ జదువువాని బుద్ధినశించున్!

    రిప్లయితొలగించండి
  15. పుస్తకములు జదివినచో
    స్వస్తి నొసగును మనసుకి స్వాంతనగల్గున్
    మస్తకము ప్రకోపించే
    పుస్తకములజదువువాని బుద్ధి నశించున్

    రిప్లయితొలగించండి
  16. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    మస్తక మందున నిల్పెడి
    పుస్తకము చదువుట మాని మురిపెము తోడన్
    హస్తమునంగొని పాడగు
    పుస్తకములు చదువు వాని బుద్ధి నశించున్.

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    కాస్తంత శ్రద్ధ జూపక
    పుస్తక సాధన యొనర్చి పూజ్యుడు గురువున్
    ప్రస్తుతి సేయంగ మరచి
    పుస్తకముల జదువు వాని బుద్ధి నశించున్

    నాస్తికవాదము పెంచుచు
    మస్తకమున మన చరిత్ర మన సంఘమ్మున్
    త్రస్తరులాడుచువ్రాసిన
    పుస్తకములు జదువు వాని బుద్ధి నశించున్

    రిప్లయితొలగించండి
  18. పుస్తకము మంచి నేస్తము
    మస్తకమును సానబట్టు మనుజులకెల్లన్
    అస్తవ్యస్తాశ్లీలపు
    పుస్తకముల జదువాని బుద్ధి నశించున్

    రిప్లయితొలగించండి
  19. నాస్తికుడను నాధ్యాత్మిక
    పుస్తకములు జదు వారి బుద్ధి హరించున్
    ఆస్తికుడను నాధ్యాత్మిక
    పుస్తకములు ,ధర్మ శాస్త్రములు మేలొసగున్.

    నేస్తమువలె సద్గ్రంధము
    మస్తిష్కములోన జ్ఞాన మహిమను నింపున్
    వాస్తవ బాహ్య కురచనల
    పుస్తకములు జదువువారి బుద్ధి నశించున్ .

    రిప్లయితొలగించండి
  20. విస్తారముగా చదువెడు
    పుస్తకములు మంచివైన బుద్ధి లభించున్
    నిస్తేజము కలిగించెడు
    పుస్తకములఁ జదువు వాని బుద్ధి నశించున్.

    పుస్తకములె మన మిత్రులు
    స్వస్తినిడును శ్రద్ధ తోడ చదివిన యెడలన్
    దుస్తర్కపు రచనలు గల
    పుస్తకములఁ జదువు వాని బుద్ధి నశించున్.

    శస్తంబగు పుస్తకములు
    మస్తకమును తీర్చి దిద్ది మాన్యత నిడు న
    ప్రస్తుత, కుసంప్ర దాయపు
    పుస్తకములఁ జదువు వాని బుద్ధి నశించున్

    రిప్లయితొలగించండి
  21. నమస్కారములు
    మస్తు = అనగా సమృద్ధి అని నిఘంటువులో ఉంది అందుకని ఫర్వాలేదనుకొని వ్రాసాను సవరణ జేసినందులకు గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  22. మస్తిష్కమంత ధనమును
    వస్తువు వాహనము తోడ వర్ధిలు చుండ
    న్నస్తా వ్యస్తమ్ముగ పాస్
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్

    రిప్లయితొలగించండి


  23. హస్తంబునయంకోపరి,
    మస్తిష్కము శూన్యము! మజ మధురా పానమ్
    బస్తీ తిరుగుళ్ళ మురిసి
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. కస్తూరి రామలింగా!
    చస్తును బ్రతుకుచును నీవు చదువకు నవలల్!
    అస్తావ్యస్తమ్ములుగా
    పుస్తకములఁ జదువువాని బుద్ధి నశించున్

    రిప్లయితొలగించండి


  25. విస్తారంబగును భళా
    పుస్తకములఁ జదువువాని బుద్ధి, నశించున్
    మస్తిష్కపు దుర్బుద్ధియు,
    హస్తమునకు భూషణమది హద్దరి బన్నా!


    జిలేబి

    రిప్లయితొలగించండి