25, సెప్టెంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1185 (గతి లేని మనుష్యుఁడే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.

29 కామెంట్‌లు:

  1. శంకరార్యా ! ఇది కందమేనా ?
    అయితే గణ భంగమున్నట్టుంది !

    రిప్లయితొలగించండి
  2. "గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనగ దగున్."
    అంటే సరిపోతుందేమో

    రిప్లయితొలగించండి
  3. శ్రీపండిత నేమాని గురువులకు శ్రీ శంకరార్యులకు నమస్సులతో! ఈ నాటి సమస్య యందు (కందము) ఒక అక్షరము తక్కువగా యున్నట్లు కన్పట్టుచున్నది. గావున కందముగా కాకుండ తేటగీతిలో ప్రయత్నించుచూ

    సత్పురుషల చరి త జూచి చదువు చుండి
    సంగ తి సముపా ర్జించుచు సతతమున్ జె
    డు “ గతి లేని మనుష్యుడే సుగతు డనద
    గున్” గురుని బోధ వినుచు సాగు చుండ.

    రిప్లయితొలగించండి
  4. మతిలేని పిచ్చి వాడట
    యతి వెంటను దిరుగు చుండె యాచిం చుటకై
    యతి మతిని గాంచి యొక్కడు
    గతిలేని మనుష్యు డేసు గతుఁ డనఁ దగున్ !

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఏ దారీ లేనప్పుడు గోదారే గతన్నట్టు :

    01)
    _____________________________

    అతి బల కాయుం డొక్కడు
    మతి లేనటు వంటి వాడు - మారణ హోమం
    బతి క్రూరము సలుపగ నే
    గతి లేని మనుష్యుఁడే సు - గతుఁ డనగ దగున్ !
    _____________________________

    రిప్లయితొలగించండి
  6. శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ తేటగీతి ప్రయోగము బాగుగ నున్నది. 4వ పాదములో గణభంగము కలదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    నిజమే. ప్రయాణం చేసి వచ్చిన అలసటలో గమనించలేదు. దోషాన్ని సవరిస్తున్నాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. అతి దీక్షాతత్పరుడై
    బ్రతుకు సఫలముగ నొనర్చు ప్రాజ్ఞుండలరున్
    క్షితి సాధువనగ నే దు
    ర్గతి లేని మనుష్యుడే సుగతు డనగదగున్

    రిప్లయితొలగించండి

  9. పతితులె జీవిత మందున
    నతి హేలగ గెలుపు లొంద యవినీతులతో
    మతి బ్రమయని ధర్మేతర
    గతిలేని మనుష్యుడే సుగతుఁ డనగ దగున్ !

    రిప్లయితొలగించండి
  10. గతమంత తరచి చూడుడు.
    మతినేపో కొట్టు దుష్ట మాయాగతి. స
    ద్గతిలేకపోయినను, దుర్
    గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.

    రిప్లయితొలగించండి
  11. శ్రుతిసారమునెఱిగిన ధీ
    మతులను సేవించువాడె మాన్యుడగునుమా
    పతినిగొలుచుమతికేదు
    ర్గతిలేని, మనుష్యుడే సుగతుడనగ తగున్!!!

    రిప్లయితొలగించండి
  12. మతియందు దైవ చింతన
    చితికైనను వెఱవ నట్టి స్థైర్యము తోడన్
    బ్రతుకున నక్రమ మను సం
    గతి లేని మనుష్యుఁడే సుగతుఁడనగఁ దగున్!

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మంచి ప్రయత్నం. బాగుంది. అభినందనలు.
    సమస్యను ఇవ్వడంలో నావల్ల, యతి విషయంలో మీవల్ల పొరపాటు జరిగింది. ‘డనగ/ దగు” ననెడి గురు బోధను వినుచు సాగ’ అందాం.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. ‘ఏ సుగతుడు, ఏసు(Jesus) గతుడు’ అన్న శ్లేష ధ్వనిస్తున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘ధర్మేతర గతి’ యని చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఒంద నవినీతులతో’ అనవలసి ఉంటుందనుకుంటాను.
    *
    చింతా రామ కృష్ణా రావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మతి మెచ్చఁ ద్రిపిటక, సుసం
    హిత, సమ్య ఙ్మార్గము లిడి, మిక్కిలి కరుణన్
    హిత మొనఁగూర్చిన శరణా
    గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్!
    (సుగతుఁడు=బుద్ధుఁడు)

    రిప్లయితొలగించండి
  15. గుండు మధుసూదన్ గారూ,
    ‘సుగతుడు’ శబ్దానికి నిఘంటువు లిచ్చిన ఒకే ఒక అర్థం ‘బుద్ధుడు’. ఆ అర్థాన్ని మీరు సమర్థంగా వినియోగించుకొని చక్కని పూరణ వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. హితమొన గూర్చెడి సజ్జన
    మతిమంతుల చెలిమిగోరు మనుజోత్తముడా !
    మతి దప్పిన దుర్జన సం
    గతిలేని మనుష్యుడే సుగతుడగున్.

    రిప్లయితొలగించండి




  17. అతిగనునున్నను మఱిదు
    ర్గతి లేని మనుష్యుడే సుగతు డనదగున్
    మితిమీరి పొగరుగలిగిన
    పతితునిగా ననగదగును బశుపతి నాధా!

    రిప్లయితొలగించండి
  18. గతులవి రెండే కన దు
    ర్గతియు సుగతి చూడ మనకు కాలపు గతిలో
    గతియొక్కటుండుగద దు
    ర్గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.

    రిప్లయితొలగించండి
  19. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    పతితుడ !పాపిని !నే నా
    శ్రిత రక్షక !శరణమిమ్ము !జేరితి లక్ష్మీ
    పతి !యనుచు నుతులు జేసిన
    గతి లేని మనుష్యుడే సుగతు డన దగున్

    రిప్లయితొలగించండి
  20. మతిమంతులతో స్నేహిత
    మతి హితమును గలుగ జేయు నాద్యంతంబుల్
    హితమెరుగని దుర్జన సం
    గతి లేని మనుష్యుఁడే సుగతుఁడనదగున్

    రిప్లయితొలగించండి
  21. మతిలేని వానితోడున
    జతకూడక మసలుచుండి సద్గతి తోడన్
    బ్రతుకీడ్చుచు దుర్జన సం
    గతి లేని మనుష్యుఁడే సుగతుఁడనదగున్

    రిప్లయితొలగించండి
  22. సతి, సుతులను వదలిన పతి
    క్షితిలో దు:ఖమ్ము బాప జేసెను తపమున్
    హితమతియై గతి జూపిన
    గతి లేని మనుష్యుఁడే సుగతుఁడనఁదగున్

    రిప్లయితొలగించండి
  23. మితిమీరిన మోహంబును
    సతిలేమియు రిపుగణంబు సతిగొణుగుడుయున్
    అతిరుణ దరిద్ర దుస్సం
    గతిలేని మనుష్యుడే సుగతు డనగ దగున్

    రిప్లయితొలగించండి
  24. మతిలేని పనులనెన్నియొ
    గతి కలిగినవాడు చేయు గదరా భువిలో
    అతిశయమింతయు చూపని
    గతి లేని మనుష్యుడే సుగతుడనగదగున్

    రిప్లయితొలగించండి
  25. గురువు గారికి నమస్సులు. మీరు చెప్పినట్లే అక్కడ నుగామమే రావాలి. పొరబాటుని దిద్దినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  26. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    టైపాటు వల్ల ‘అనదగున్’ అన్నది ‘అగున్’ అయింది.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తోడున’ అన్నదానిని ‘తోడను’ అనండి.
    *
    ఎన్.కె. దుర్వాసుల గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘గొణుగుడుయున్’ అన్నదాన్ని ‘గొణుగుడులున్’ అనండి.
    *
    ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. వ్రతములు పూజలు స్మృతులన్
    శృతులను నమకము చమకము శ్రీసూక్తములన్
    క్రతువులను దాటుచు తిరో
    గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్

    రిప్లయితొలగించండి
  28. పతిగా నీశ్వరు నెన్నుచు
    మతినిన్ భస్మముగ జేసి మాయయె విడగన్
    గతి నీవేయని వేరొక
    గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్

    రిప్లయితొలగించండి


  29. అతుకుల బొంతగ వరలెడు
    బతుకున నిలదొక్కుకుని గబగబ జిలేబీ
    అతిగా వాగక యే దు
    ర్గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్


    జిలేబి

    రిప్లయితొలగించండి