26, సెప్టెంబర్ 2013, గురువారం

పద్య రచన – 476 (పోస్టు కార్డు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పోస్టు కార్డు”
ఈ అంశమును సూచించిన పరుచూరి వంశీ గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    ప్రేమ పక్షులకానాటి ప్రేమ లేఖ
    మధ్యతరగతి జనులకు మధ్యవర్తి
    శుభమశుభమని దెలియని సూత్రధారి
    సకల విషయము లందించు సన్నిహితుడు

    రిప్లయితొలగించండి
  2. కార్డు ముక్కకు గతిలేని ఘనుడు వాడు
    వానితో మన కేలరా వావి వరుస
    అడుగనే యడుగడు గదా అయిన వారి
    క్షేమములు, చెప్పుకొనుటకే సిగ్గుసిగ్గు!

    రిప్లయితొలగించండి
  3. పోస్టు కార్డుల కీనాడు పొత్తు లేదు
    తంతి తెలియదు నేడట వింత గాదె
    ప్రియుడు వ్రాయడు ముదమార ప్రేమ లేఖ
    హస్త భూషణి సెల్ ఫోను మస్త కమ్ము

    రిప్లయితొలగించండి
  4. తోక లేని పిట్ట తొంబది యామడల్
    దూరమేగు ననుచు తొల్లి ప్రజలు
    చక్కనైన యొక్క సామెత పల్కరే
    పోస్టు కార్డ! నిన్ను పొగడు చుండి

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఈ తరం వారెరుగరేమో గాని
    పోష్టుకార్డుల సేవల నెన్నటికీ మరువలేము గదా !

    01)
    __________________________________

    ప్రేమ పూర్వక భాషణంబులు - ప్రేమపక్షుల కిచ్చుటన్ !
    భామ వీడిన భర్తకేమరి - భామ కోరిక దెల్పుటన్ !
    సీమ వీడిన బంధుమిత్రుల - క్షేమవార్తల బొందుటన్ !
    తామె గొప్పవి పోష్టుకార్డులు - ధారుణంతయు దిర్గుటన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  6. చంద్ర శేఖరులవారూ ! బావున్నారా !
    బహుకాల దర్శనం !

    రిప్లయితొలగించండి
  7. "నేను నిచ్చట క్షేమమ్ము! నీవు బాగె?
    యుభయ కుశలోపరి; యింక వ్రాయునది యేమ
    నఁగ" యటంచును వ్రాసి, పద్నాలు గేండ్లు
    నాయె నో మిత్ర, పోస్టు కార్డీయఁ గాను!!

    రిప్లయితొలగించండి
  8. మమ్మీ దీన్నేమందురు
    అమ్మూలన స్టాంపులోన నట తాతుండెన్
    అమ్మమ్మ నాడు తాతకె
    సెమ్మెస్ వ్రాసెడిదిదనుచు చెప్పెను నాకే.

    రిప్లయితొలగించండి
  9. వార్త లిపుడు చేరు వాయువేగము మించి
    ఖండ ఖండములకు కాంతి రయము
    జాల మహిమ జూచి జవసత్వములు నూడి
    మూత బడెను నేమొ ? వ్రాత దళము

    రిప్లయితొలగించండి
  10. చిన్న నాటినే స్తంకద చిట్టి జాబు
    చిత్త గించక యుండెను చిత్త మందు
    పేద మధ్యతరగతికి పెన్ని ధయిన
    తంతి పోస్టలు కార్డులు తరలి పోయె

    రిప్లయితొలగించండి
  11. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    నేటి కాలాన సెల్ఫోన్ల ధాటి పెరిగె
    ఫేసు బుక్కులు గూగుల్సు వార్తలన్ని
    బాస లందున గనవచ్చు వర్తకములు
    సాగు కంప్యూటర౦దున సరళ ముగను

    పోస్టుకార్డుల కాలమ్ము పోయె గాని
    “కవనవిజయము”వారి యాకాశవాణి
    తెలుగు సాహితీ పత్రికల్ చెలిమి మీర
    “పూరణల్””దత్తపదు”లన్ని పోస్టుకార్డు
    పైన వ్రాయగ వలెనన్న బ్రతికె కార్డు

    చిన్ననాటిది పత్రిక “చిత్రగుప్త “
    “కార్డుకథ “”గుసగుస “శీర్షికలను యుంచ
    పాఠకులు స్పందనలు కార్డు పైన వ్రాసి
    తెలుపుచుండిరియన్ని పత్రికలలోన

    పోసగబ్రహ్మయు నైనను నొసటి వ్రాత
    ల్యాపుతాపున వ్రాయంగ నత్త లక్ష్మి
    తోడ ఫేసుబుక్కున వాణి మాటలాడు
    పోస్తుకార్డులెందుకు నేడు వేస్టట౦చు

    రిప్లయితొలగించండి
  12. కాస్టు తక్కువ లోననే కబురు జేర్చి
    యందు బాటున నుండెగాఁ నందరికిని
    దూరదర్శిని కైనను కోరి నేను
    పద్య పూరణ లంపితి పట్టి కార్డు!

    రిప్లయితొలగించండి


  13. ఒకరి వార్తలింకొకరికిని తెలుపను
    పోస్టుకార్డు పైన వ్రాసెడిరిగ
    మృగ్యమయ్యె యిపుడు పోస్టుకార్డులుమఱి
    సెల్లు ఫోను వచ్చె క్షేమములకు

    రిప్లయితొలగించండి
  14. శ్రీయుతులు గురువర్యులకు, కవిమిత్రులకు నమస్కారములు,
    ఈ మధ్య సమయం దొరకక, వీలుకుదరక సభకు హాజరు కాలేక పోవుట జరుగుచున్నది. క్షమించప్రార్థన.

    ......పోస్టు కార్డు......
    దూరదేశ మనక ధారుణీతలమంత
    వరుస తప్పకుండ తిరుగుచుండి
    నిరత మఖిలజగతి కరుస మందించెడి
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 1.

    కారణాంతరాల దూరస్థులై యున్న
    బంధుజనుల జేరి బహువిధాల
    పలుకరించుచుండు నిలవారి చుట్టంబు
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 2.

    కులము మతము లెంచ దిలనుండు వారంద
    రన్నదమ్ములంచు నందరికడ
    చేరుచుండు కూర్చు శ్రేయంబు లెల్లెడ
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 3.

    తోకలేని పిట్ట తోయదమండలం
    బాకసంబు దాటి యద్భుతముగ
    పరహితంబు గోరి యరుగు నెందైనను
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 4.

    పిన్న పెద్ద యనెడు భేదమించుకయైన
    చూపకుండ జనుల సుఖము గోరి
    సమత జూపుచుండి సత్వమందించెడు
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 5.

    మోద మందజేయు పేదవారలకైన
    వ్యయము స్వల్ప మగుట, జయద మగుట
    స్వార్థ మింత లేక సాయ మందించెడు
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 6.

    ఎర్రపెట్టెలోన నింపుగా కూర్చుండి
    ఖాకిగోతమందు కట్టుబడుచు
    చేరు తప్పకుండ చిరునామ వద్దకు
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 7.

    ఇంధనంబు పూన దిసుమంతయైనను
    దారి ఖర్చుకొరకు ధనము కోర
    దెగిరి పోవుచుండు నేప్రాంతమునకైన
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 8.

    ఆప్తయగుచు సతత మన్నివర్గాలకు
    వలయు సంగతులను తెలియబరచు,
    సమయమంత గడుపు సాంఘిక సేవలో
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 9.

    వర్తమానమందు వరుసలు గట్టిన
    సాధనాలవలన సన్నగిల్లె
    వైభవంబు తనకు, వాస్తవం బేమన్న
    పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 10.

    రిప్లయితొలగించండి
  15. కంది శంకరయ్య గారికి ధన్యవాదములు !మంచి పద్యాలు అందించిన కవి వర్యులందరికీ ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  16. దూర దేశము లోని బంధువులకు మన
    క్షేమమును తెలియ పరచ చీటి వ్రాసి
    పోస్టు బాక్సులో వేయగ పోస్టు కార్డు
    దూర తీరాలు జేరును భారమనక

    రిప్లయితొలగించండి
  17. అలుపు సొలుపు లేక నామడ దూరము
    పయనమయ్యి బోవు భారమనక
    అందజేసి కబురు బంధుజనులకు తా
    పొసగ నాయి నిచ్చు పోస్టుకార్డు

    రిప్లయితొలగించండి
  18. దూరపు బంధు చావగను, దుడ్డును కోరగ నాన్నగారినిన్,
    కూరిమి తెల్ప నెచ్చెలికి కుండను బ్రద్దలు కొట్టురీతినిన్,
    మీరిన దుఃఖమున్ తెలుప మెండుగ నోడిన మంత్రివర్యుకున్,
    కోరిక తీర్చుగా ప్రభుత కోరుచు పావల పోస్టుకార్డుకున్

    రిప్లయితొలగించండి