26, సెప్టెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1186 (రోఁకటిపో టౌషధము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్.

29 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    రూకలు గావలె కొనుటకు,
    కోకలకందం బిడుటకు కుచ్చిళ్ళెపుడున్,
    రోకటి సరకులు నలుగగ
    రోఁకటిపో, టౌషధము శిరోవేదనకున్.

    రిప్లయితొలగించండి
  2. చీకటి కాకుల గోలకు
    రోకటి పోటౌష ధము శిరో వేదనకున్
    యాకటికి మ్రింగ రోకలి
    నాకమ్మే శరణ మంట నళిన దళేక్షా !

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    రోకటిపోటుతో చేసే వైద్యమే రోకటిశాస్త్రం :

    01)
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌______________________________

    లోకమున బక్క వారికి
    రోకటి పోటౌషధము ! శి - రో వేదనకున్
    లోకమున నెన్ను కొనుటకు
    లోకోత్తరమైన మందు - లున్నవి గనినన్ !
    ______________________________
    బక్కవారు = బక్కచిక్కిన పిల్లలు

    రోఁకటిశాస్త్రము = చిన్నబిడ్డలు సన్నగా ఉన్నపుడు, రోటిలో కూర్చుండబెట్టి, ముగ్గురు ముత్తైదువులు
    పసుపుకుంకుమ పూసిన రోకళ్ల నెత్తి 'పొడుతునా, వేతునా' అని బెదరించి రోకళ్లతో తాకుట.
    (చి) [ఇట్లు చేసిన ఆ బిడ్డ తుండువలె బలియునని నమ్మకము.]

    లోకోత్తరము = మిక్కిలి ప్రసిద్ధమైనది లేక శ్రేష్ఠమైనది

    రిప్లయితొలగించండి
  4. "శిరోవేదన"
    శంకరార్యా ! సంధికార్యం వివరించండి !

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ!
    శిరోవేదన అనునది సంస్కృత సమాసము. శిరః + వేదన = శిరోవేదన.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. ఈ కథను చూచి యొక్కడు
    రోకటి పోటౌషధము శిరోవేదనకున్
    గైకొమ్మని వేయగనే
    రోకటితో పోయె నొప్పి రోగియు గూలెన్

    రిప్లయితొలగించండి
  7. సందేహ నివృత్తి గావించిన
    నేమాని వారికి ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  8. శిరోవేదచే విసిగి వేసారిన యొకఁడు విధిలేక పలికిన సందర్భము...

    "లోకము నందలి మందులు
    చేకొని పెక్కులుగ వేయఁ జిత్రము, పోదే
    నాకీ తలనొప్పి! యిఁకన్
    రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్!!"

    రిప్లయితొలగించండి
  9. ఈకాలపు వైద్యమ్మే
    యాకూ పంక్చరని వచ్చె నాహా చూడన్
    ' డాకటరు సింగు ' చెప్పెను
    రో ! కటిపో టౌషధము శిరోవేదనకున్.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీరు మంచి ప్రయత్నము చేసేరు. రో కటిపోటు అని విడదీసేరు. కటి అనునది సంస్కృత పదము దాని తరువాత పోటు అనే తెలుగు పదముతో సమాసము చేయరాదు కదా. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గురు వర్యులకు నమస్కారములతో...


    రోకలి పోటుకు నలుగును
    పోకగ వడ్లును తిలలకు పొట్టును తీయున్
    లోకమునందురు పూర్వము
    రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్

    రిప్లయితొలగించండి
  12. చేకొని నొసగిన మందులు
    మాకులనున్ మ్రింగ లేర ? మాన్పెద నిడుముల్
    పైకము కిచ్చెద మృదువగు
    రోఁకటి పోటౌషధము ! శిరోవేదనకున్!!

    ఈ కాలములో కూడా కల్వములో నూరిన మందులను వాడుతాము. మా తాతగారు ఆయుర్వేద వైద్యమునకు రోకట్లో లేహ్యాలు దంపించడము నాకు గుర్తే !

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..

    నిన్నటి దినము నెట్ సమస్య మరియు బంధువులతో వ్యస్తుడనైతిని గురువుగారు,
    నేటి రాజకియములపై
    ==========*============
    కోకలు గట్టి దిరుగుచు కోవిధులమని బలుకుచు
    కాకలు దీరిన వృద్ద కాంగ్రేసు నాయకు లెల్ల
    నీకలు పీకుచునుండె నీనాడు హస్తిన లోన,
    చేకొన్న మందులు వారి చేతుల జిల్లులు బెట్ట
    రోఁకటి పోటౌషధము శిరోవేదనకు నని దలచె!

    రిప్లయితొలగించండి
  14. సాఁకక వేధించ సతిని
    రూకల కొరకై,వగచుచు రోకలి పోటున్
    దాకించఁ గూలె పతియే!
    రోకటి పోటౌషధము శిరోవేదనకున్!

    రిప్లయితొలగించండి
  15. మరియొక ప్రయత్నము:

    రోకటి పోటౌషధముగ
    శ్రీకృష్ణుని యన్న ప్రజకు జేసెను వైద్యం
    బో కవివర! శంకర! విను
    రోకటి పోటౌషధము శిరోవేదనకున్

    రిప్లయితొలగించండి
  16. లోకులు పలుగాకులు చీ
    కాకుపరచుచు తలనొప్పి కలిగించుదు రా
    లోకుల నెదిరించి నిలువ
    రోఁకటి పోటౌషధము శిరోవేదనకున్

    రిప్లయితొలగించండి
  17. చీకటి చేతల నేతకు
    రోకటి పోటౌషధము శిరో వేదనకున్
    ఆకలి కన్నము దొంగల
    మూకకు శిక్షావసరము భూతలమందున్ .

    రిప్లయితొలగించండి
  18. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    పేకాడి రాతిరంతయు
    వేకువ పతి యిల్లు జేరి వేదన యనగా
    ఠీకుగ తెలిపెను పెండ్లము
    రోకటి పోటౌషధము శిరోవేదనకున్

    రిప్లయితొలగించండి
  19. రోకటి పోటున నలుగును
    షీకాయలు నంతెకాని శిరమున కదియా!
    ఈకలికాలపు మాటలు
    రోకటి పోటౌషధము శిరోవేదనకున్

    రిప్లయితొలగించండి
  20. చీకాకు చెంది యరచుట
    రోకటిపో, టౌషధము శిరోవేదనకున్
    శ్రీకరమగు శాంతంబును
    చేకొని విశ్రాంతి గొనుట క్షితివారలకున్

    రిప్లయితొలగించండి
  21. చీకాకు చెంది యరచుట
    రోకటిపో, టౌషధము శిరోవేదనకున్
    శ్రీకరమగు శాంతంబును
    చేకొని విశ్రాంతి గొనుట క్షితివారలకున్

    రిప్లయితొలగించండి
  22. కాకుల వలె పోటీపడి
    పోకిరి జను లరచుచు తలపోటు నిడగ నా
    పోకిరి జనుల మదమణచ
    రోకటి పోటౌషధము శిరోవేదనకున్

    రిప్లయితొలగించండి
  23. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఊళ్ళో లేని కారణంగా ఈరోజు సమస్యలను, పద్యాలను సమీక్షించలేక పోతున్నాను. ప్రయాణంలో ఉండి దారిలో ఉన్న నెట్ సెంటర్ నుండి ఈ వ్యాఖ్య పెడుతున్నాను. దయచేసి ఈ ఒక్కరోజు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    అసౌకర్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  24. రమణారెడ్డి; సూర్యకాంతం

    ఆకలి కేకలు వేయగ
    పాకము సరిలేదటంచు పడవేయంగా
    సాకులు చూపెడి వారల
    రోకటి పోటౌషధము. శిరోవేదనకున్?

    రిప్లయితొలగించండి
  25. శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు..మీరు సూచించిన విధముగా నా పూరణ లోని దోషమును సవరించుచున్నాను....

    ఈకాలపు వైద్యమ్మే
    యాకూ పంక్చరని వచ్చె నాహా చూడన్
    మోకాలి మీద నొక్కులు
    రోకటిపో టౌషధము శిరోవేదనకున్.

    రిప్లయితొలగించండి
  26. మోకాలి మెట్టు లెక్కరె
    చీకాకులు దీరుటకిట శ్రీహరి భక్తుల్
    శ్రీకరమది యెట్లన్నన్
    రోఁకటి పోటౌషధము శిరోవేదనకున్!

    రిప్లయితొలగించండి
  27. కేకలు వేయుచు సుదతియె
    తాకకు సీతమ్మననుచు దండము తోడన్
    దూకగ దశకంఠునిపై
    రోఁకటిపో టౌషధము శిరోవేదనకున్

    రిప్లయితొలగించండి