కళ్యాణకటక మను పట్టణములోన
కలఁడు భైరవుఁ డనెడు వేటగాఁ డొకఁడు
వాఁ డొక్కనాఁడు విల్లమ్ములును వలలు
పట్టుకొని వింధ్యాటవికి వేట కేగె;
నొకచోట నెరపెట్టి మరుగైన చోట
నొదిగి కూర్చుండి వాఁ డెదురుచూడంగ
నటువచ్చు మృగ మొక్కదానినే చంపి
కట్టి కఱ్ఱకు మోసికొని వచ్చుచుండ
నడగొండ వలె నొక్క పందినే చూచె;
“నేమి నా భాగ్యమీ పంది మాంసమ్ము
దొరికె”నని సంతోషపడి మృగము దించి
బాణమ్ము సంధించి పందినే వేసె;
దెబ్బ తిన్నట్టి యా పంది కోపమున
శరవేగమున వచ్చి కోరతోఁ గొట్టె;
మొదలు నరికిన చెట్టు వలె భైరవుండు
బాధతో అఱచి నేలను గూలి చచ్చె;
బాణమ్ము తగిలి యా సూకరము మడిసె;
నా కిరాతుని, పంది కాళ్ల త్రొక్కిడికి
నచటఁ దిరుగాడు నొక పాము మరణించె;
దీర్ఘరావము పేరు గల నక్క యొకటి
తిండికై వనములోఁ దిరుగాడుచుండి
యచ్చోటి కేతెంచి చచ్చిపడియున్న
మృగ, కిరాతులఁ, బందిఁ, బాములను జూచి
“పుష్కలంబుగ నాకు భుక్తి దొరికినది,
మూడు మాసముల కీ మాంసమ్ము చాలు,
నీ కిరాతుని మాంస మొక నెలకు చాలు,
మృగ సూకరములు రెండు నెలలకు చాలు,
నీ పాము మాంస మొక దినమునకు తిండి,
యీ పూట యాకలికి నీ వింటినారి
నరముతో సరిపెట్టుకొందు”నని తలఁచి,
వింటినారిని పంటితోఁ ద్రెంచగానె
పట్టు తప్పిన విల్లు బలముగా వచ్చి
దాని రొమ్మున తాకఁగా నేలఁ గూలి
బాధతోడ విలవిల తన్నుకొని చచ్చె;
నవసరమ్మును మించి కూడఁబెట్టకుఁడు
లోభగుణ మెంత గతి తెచ్చెనో కనుఁడు.
(ఎప్పుడో విద్యార్థుల కోరికపై వారి పాఠ్యపుస్తకములోని కథకు నేనిచ్చిన గేయరూపము)
కలఁడు భైరవుఁ డనెడు వేటగాఁ డొకఁడు
వాఁ డొక్కనాఁడు విల్లమ్ములును వలలు
పట్టుకొని వింధ్యాటవికి వేట కేగె;
నొకచోట నెరపెట్టి మరుగైన చోట
నొదిగి కూర్చుండి వాఁ డెదురుచూడంగ
నటువచ్చు మృగ మొక్కదానినే చంపి
కట్టి కఱ్ఱకు మోసికొని వచ్చుచుండ
నడగొండ వలె నొక్క పందినే చూచె;
“నేమి నా భాగ్యమీ పంది మాంసమ్ము
దొరికె”నని సంతోషపడి మృగము దించి
బాణమ్ము సంధించి పందినే వేసె;
దెబ్బ తిన్నట్టి యా పంది కోపమున
శరవేగమున వచ్చి కోరతోఁ గొట్టె;
మొదలు నరికిన చెట్టు వలె భైరవుండు
బాధతో అఱచి నేలను గూలి చచ్చె;
బాణమ్ము తగిలి యా సూకరము మడిసె;
నా కిరాతుని, పంది కాళ్ల త్రొక్కిడికి
నచటఁ దిరుగాడు నొక పాము మరణించె;
దీర్ఘరావము పేరు గల నక్క యొకటి
తిండికై వనములోఁ దిరుగాడుచుండి
యచ్చోటి కేతెంచి చచ్చిపడియున్న
మృగ, కిరాతులఁ, బందిఁ, బాములను జూచి
“పుష్కలంబుగ నాకు భుక్తి దొరికినది,
మూడు మాసముల కీ మాంసమ్ము చాలు,
నీ కిరాతుని మాంస మొక నెలకు చాలు,
మృగ సూకరములు రెండు నెలలకు చాలు,
నీ పాము మాంస మొక దినమునకు తిండి,
యీ పూట యాకలికి నీ వింటినారి
నరముతో సరిపెట్టుకొందు”నని తలఁచి,
వింటినారిని పంటితోఁ ద్రెంచగానె
పట్టు తప్పిన విల్లు బలముగా వచ్చి
దాని రొమ్మున తాకఁగా నేలఁ గూలి
బాధతోడ విలవిల తన్నుకొని చచ్చె;
నవసరమ్మును మించి కూడఁబెట్టకుఁడు
లోభగుణ మెంత గతి తెచ్చెనో కనుఁడు.
(ఎప్పుడో విద్యార్థుల కోరికపై వారి పాఠ్యపుస్తకములోని కథకు నేనిచ్చిన గేయరూపము)
ఒక మంచి నీతి కథకు గేయరూపము నిచ్చిన శ్రీ కంది శంకరయ్య గారికి శుభాభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిమాస్టారూ, మా చిన్నతనంలో చదివిన కథకి మీ గేయరూపం చూసి చాలా ఆనందించాను. అయితే ఈ సందర్భంలో మేము మా తెలుగు మాష్టారిని ఆ రోజుల్లో అమాయకంగా అడిగిన ప్రశ్న - "మాస్టారూ! వింటినారి తెగిన మీదట తగిలిన దెబ్బకే నక్క యెట్లా చచ్చిపోతుంది సార్" అని. ఆయన నవ్వుతూ ఇచ్చిన సమాధానం - "ఒరేయ్ పిల్లలూ! తగలాల్సిన చోట తగిలితే చిన్నదెబ్బ అయినా ప్రాణాంతకమౌతుందిరా, ఎక్కడ తగిలిందో మీరే ఉహించుకోవచ్చు!".అనగానే మేమూ గొల్లున నవ్వేశాం.
రిప్లయితొలగించండిమిత్రులు శంకరయ్యగారికి...తమరు, గత ఏఁడవ తరగతి తెలుఁగు వాచక మందలి "దురాశ" కథకుఁ జక్కని గేయరూప మిచ్చితిరి. చాల బాగుగ నున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండి‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
గుండు మధుసూదన్ గారూ,
....... ధన్యవాదాలు.
మాస్టరు గారూ ! చక్కని గేయము ... చదువుతూంటే కర్ణపేయముగా నున్నది.
రిప్లయితొలగించండిఆశ యుండ దగు మఱి దురాశ యుండ
రిప్లయితొలగించండికూడ దెప్పుడు , మనముగా గోరి కలను
నణచి పెట్టుకొ నవలెను నపుడు గలుగు
మనసునకు హాయి , సత్యము మనుజు లార !
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసుబ్బారావు గారూ,
........ ధన్యవాదాలు.
గురువుగారికి ప్రణమిల్లుతూ...
రిప్లయితొలగించండిదురాశ తగదని తెలిపే నీతి కధను మంచి గేయంగా మలిచి అందించారు..గేయంగా ఈ కధ చాలా బాగుంది...
శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..
రిప్లయితొలగించండిదురాశ వలదను నీతి కథకు ఒ మంచి గేయరూపము నిచ్చి, యువ కవులకు గేయములు వ్రాయమని తెలియ జేసినందులకు ధన్యవాదములు.
పాఠ్యపుస్తకాంతర్గత పాఠమంత
రిప్లయితొలగించండిగేయ రూపము దాల్చ మీ కృతిని జదువ
బోధ పడుచుండె మీరలు బోధ చేయు
విధము శిష్యుల కెప్పుడు ప్రియము గాను
సహృదయాభినందనలివె శంకరార్య!
శ్రీ శంకరయ్య గురువు గారికి
రిప్లయితొలగించండినమస్సులు.
మీ గేయం చాలా బాగున్నది. మీరు అనుమతిస్తే, ఢిల్లీలో మా పాఠశాలలో ఉన్న కొద్ది మంది తెలుగు పిల్లలకు ఈ పాట నేర్పుకుంటాను.
మృగ మృగయ కిటి పన్న గామిషముఁ బొంది,
రిప్లయితొలగించండిలోభ బుద్ధిచే నారీ విలోల యైన
జంబుక మ్మొండు విలుదెబ్బఁ జచ్చె కాదె;
శంకరార్యు గేయము "దురాశ"యను కథను!
నమస్కారములు
రిప్లయితొలగించండిచాలా మంచి నీతి కధ గేయ రూపమున వినిపించిన గురువులకు ధన్య వాదములు