5, సెప్టెంబర్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1165 (పాపాత్ములె పూజ్యులగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్.

45 కామెంట్‌లు:

  1. ఫూజ్య గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గురువుగారికి,
    శ్రీ నేమాని గురువుగారికి,పాదాభివందనములతో,..
    ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ..
    శైలజ...

    రిప్లయితొలగించండి
  2. సాహితీ మిత్రులందరికీ,..ఉపాధ్యాయ దినోత్యవ శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  3. క్ష్మాపయి వేల్పులు గురువులు
    దీపములై నింపి జ్ఞానతేజము నాత్మన్
    జూపెద రుత్తమ మార్గము
    పాపాత్ములె? పూజ్యులగు నుపాధ్యాయు లిలన్

    రిప్లయితొలగించండి

  4. ఉపాధ్యాయుల చెంత ఉప అధ్యాయము గావించి
    ఆ పై పైవాని సంగతుల్ మదిని మెక్కుగ గ్రహించి
    జీవనమున సుఖ సంతోష 'అముల్' పొందవే పాపా ,
    ఆత్ములే పూజ్యులగు నుపాధ్యాయులిలన్ తరచి చూడన్ !

    ఉప అధ్యాయులకు శుభాకాంక్ష ల తో !
    చీర్స్ సహిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. పూజ్యులు వేమానివారికి, మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, కవి పండిత మిత్రులందఱకు నుపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో....

    కాపాడిన భక్షింతురు
    పాపాత్ములె! పూజ్యులగు నుపాధ్యాయు లిలన్
    గోపము తాపము పాపము
    లాపఁగఁ జూచెదరు శిష్యు లానందింపన్!!

    రిప్లయితొలగించండి
  6. ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిలోనున్న సాహితీమిత్రులకు మరియు విశ్రాంత ఉపాధ్యాయులూ, మనందరికీ మాష్టారైన శ్రీ కంది శంకరయ్య గారికీ, నన్ను ప్రోత్సహించి తీర్చిదిద్దిన కీర్తిమంతులూ, కీర్తిశేషులూ అయిన ఉపాధ్యాయులకూ శతాధిక వందనాలతో,
    మనతెలుగు-చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  7. చంపుట అనే క్రియ పాపము అనే ఉదేశ్యం తో ఇలా పూరించాను.
    పాపపు తలపులను చంపాడు కనక పూజ్యుడు అని నాభావం....

    కోపము జూపక ధరలో
    చేపట్టుచు జ్ఞానగదను చెండుచు నెపుడున్
    పాపపు తలపుల జంపెడు
    పాపాత్ములె, పూజ్యులగు నుపాధ్యాయు లిలన్.

    రిప్లయితొలగించండి
  8. ఏ పగిదినైన నింద్యులు
    పాపాత్ములె; పూజ్యులగు నుపాధ్యాయు లిలన్
    పాపల భవితను దిద్దుచు
    రేపటి పౌరులుగఁ జేతు రెల్లరు పొగడన్.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. 3, 4 పాదములను ఈ విధముగా మార్చి చూడండి:

    "రేపటి పౌర వరేణ్యుల
    గా పాపల దీర్చి దిద్దగల ధీమంతుల్"

    చొరవ తీసికొన్నందుకు మన్నించండి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. పూజ్యనీయులైన అన్నగారికి, శ్రీ శంకరార్య గురువర్యులకు , నా గురుకోటికి పాదాభివందనములు!


    రాపాడిన భూతాళిని
    పాపాత్ములె ! పూజ్యులగు నుపాధ్యాయు లిలన్
    దాపరు నే జ్ఞానమ్మును
    తాపనుడికి వెల్గు డాచు తత్వము తరమే !

    తాపనుడు = తపనుడు = సూర్యుడు

    రిప్లయితొలగించండి
  11. చి. తమ్ముడు మూర్తికి శుభాశీస్సులు.
    తపనుడు అంటే సూర్యుడే. తాపనుడు అంటే మాత్రము సూర్య పుత్రుడు కదా. సూర్యునికి కుమారులు -- యముడు, శని, మొదలగు వారు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో

    ఫూజ్య గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు ,
    శ్రీ నేమాని గురుగురుదేవులకు ,పాదాభివందనములతో,..
    ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.

    గురుదేవులకు, సాహితీ మిత్రులకు, బ్లాగు వీక్షకులందరికీ,..ఉపాధ్యాయ దినోత్యవ శుభాకాంక్షలు

    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
    =====*=======
    పాపము జేసిన మనుజులు
    పాపాత్ములె!పూజ్యులగు నుపాధ్యాయు లిలన్
    దాపున జేరిన వారికి
    దీపపు కాంతులను జూప దేహము నందున్!

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
    శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    నిశ్చయాత్మకమైన పదాన్ని ప్రశ్నార్థకంగా విరిచి చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    నా పూరణకు మీ సవరణ పూవుకు తావియే.. ధన్యవాదాలు.
    *
    జిలేబీ గారూ,
    ధన్యవాదాలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. పాపాలను చంపే పాపులయ్యారన్నమాట. బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తాపనుడికి’ అన్నదానిని ‘తాపకరుని’ అంటే?
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. కోపము జూపుచు బెత్తము
    చేబూ నినపుడుచెరుపును చెడుగుణమెల్లన్
    రేపటి పౌరులదీర్చగ
    పాపాత్ములె! పూజ్యులగు నుపాద్యాయు లిలన్

    రిప్లయితొలగించండి
  15. అన్నయ్యగారికి గురువు గారికి నమస్సులు. నా పద్యాన్ని యిలా సవరిస్తున్నాను.


    రాపాడిన శిష్యాళిని
    పాపాత్ములె ! పూజ్యులగు నుపాధ్యాయు లిలన్
    దాపరు సుజ్ఞానమ్మును
    తాపకరుని వెల్గు డాచు తత్వము గనురా !

    రిప్లయితొలగించండి
  16. గురువులు శ్రీ శంకరయ్య గారికి, గురుతుల్యులకు మరియు కవిమిత్రులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

    కోపోద్రేకుల పాలిటి
    పాపాత్ములెపూజ్యులగు,నుపాధ్యాయులిలన్
    దీపశిఖలు, విజ్ఞానపు
    రూపమ్ముల జూపునట్టి ఋషులకు బ్రణతుల్ !!!

    రిప్లయితొలగించండి
  17. శ్రీపాదపు గొప్పవిలువ
    లే పాలకులు, గురుశిష్యులెఱుగని కాలమ్
    మ్మౌ! పాటులు బడ పుట్టిరి
    పాపాత్ములె! పూజ్యులగు నుపాధ్యాయు లిలన్.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ పీతాంబర్ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 4వ పాదములో రుకి ఋకి యతి మైత్రి కుదురదు. సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. నాకు పద్యరచనయందు ఆసక్తిని కలిగించి, మెళకువలు నేర్పించి, ఇప్పటికీ, నా తప్పులను చాలా ఓపికగా పరిశీలించి గుణదోషములను వివరముగా తెలియజెప్పే శ్రీ ఆదిత్య గారికి,
    ఈ బ్లాగునందు నేను వ్రాసిన పద్యములన్నిటినీ చక్కటి సూచనలు చేస్తూ, సరిదిద్దుతున్న శ్రీ శంకరయ్య మాష్టారు గారికి, శ్రీ నేమాని మాష్టారు గారికి, మిత్రులందరికీ నమస్కారసహిత గురుపూజ్యోత్సవ దిన శుభాకాంక్షలు.

    లోపములెన్నియొగలిగిన
    కోపాధికులు దురితాధికులు రాక్షసులున్
    భూపాలననిడ కారే
    పాపాత్ములె పూజ్యులగునుపాధ్యాయులిలన్ ||

    రిప్లయితొలగించండి
  20. కాపురుషు లనెడి వారలు
    పాపాత్ములె , పూజ్యులగు నుపాధ్యాయులిలన్
    పాపాలు సేయ కుండగ
    ప్రాపుగ మన వెంట నుండి రక్షణ సేయున్

    రిప్లయితొలగించండి
  21. శ్రీ పండిత నేమానిగారికి నమస్కారం . నాల్గవ పదాన్ని ఈ విధంగా సవరిస్తున్నాను. ధన్య వాదాలు .

    .....విజ్ఞానపు
    "రూపాలను జూపు సద్గురువులకు ప్రణతుల్ . "

    రిప్లయితొలగించండి
  22. ఒక ఆంగ్ల సూక్తికి స్వేఛ్ఛానువాదము:

    మధ్యాక్కర:

    తెలియజేయుచునుండు లెస్స ధీశాలి సామాన్య గురువు
    అలరుచు విశదీకరించు నాదృతి సమ్మాన్య గురువు
    బళి ప్రదర్శించుచు నెదల ప్రభలనింపు విశిష్ట గురువు
    విలువగు నుత్తేజమిడుచు వెలుగు నింపు వరిష్ఠ గురువు

    Source:
    The mediocre teacher tells
    The good teacher explains
    The superior teacher demonstrates
    The great teacher inspires
    (By: William Arthur Ward)

    రిప్లయితొలగించండి
  23. రాక్షస రాజు ప్రహ్లాదునితో:

    ఆపుము హరిఁ వినుతించెడు
    నీ పలుకుల, దేవుడన్న నీ పిత యనుచున్
    జూపెడు నీ గురువు లకట
    పాపాత్ములె? పూజ్యులగునుపాధ్యాయులిలన్.

    రిప్లయితొలగించండి
  24. విజ్ఞాన తేజస్సుతో అజ్ఞాన తిమిరాన్ని పాఱద్రోలే గురువులకు ప్రణామములు.

    రిప్లయితొలగించండి
  25. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు మరియు కవి మిత్రులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో నమస్సులు.

    ఓపికతో విద్యార్థుల
    వీపును దట్టుచు దెలియని విషయము లెల్లన్
    దాపరికము లేక దెలుప
    పాపాత్ములె? పూజ్యులగు నుపాధ్యాయులిలన్!

    రిప్లయితొలగించండి
  26. ఆపాదించుచు జ్ఞానము
    లోపములను దిద్ది మంచి రూపము నిచ్చే
    యీ పృథ్విని గల గురువులు
    పాపాత్ములె? పూజ్యులగు నుపాద్యాయులిలన్!

    రిప్లయితొలగించండి
  27. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.

    క్రమశిక్షణనేర్పిన జ్ఞానదాతలు పూజ్యులగు గురువులను స్మరిస్తూ
    వారి పాదకమలములకు ప్రణామములు
    పాపమొనరింప వలదను
    పాపాత్ములె పూజ్యులగునుపాధ్యాయులిలన్
    జ్ఞాపకము సేయు మార్యా !
    ఈపుణ్యదినమ్మునందు ఏపనికైనన్

    రిప్లయితొలగించండి
  28. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    ======*=======
    దాపరికుల కాప్తులు గద
    పాపాత్ములె,పూజ్యులగునుపాధ్యాయులిలన్
    దీపపుశిఖలనిశమ్మున,
    దీపమ్ము వెలుగదు వారి దేవిడి యందున్!
    (దేవిడి= వాకిట)

    రిప్లయితొలగించండి
  29. శ్రీ రఘు రామ్ గారు నన్ను మన్నించగలరు,
    శ్రీ రఘు రామ్ గారికి,శ్రీ ఆదిత్య గారికి
    ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  30. శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు వారూ,
    నా సూచనను ఆమోదించినందుకు సంతోషం.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ విరుపు వైవిధ్యంగా ఉంది. పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సూచన ననుసరించి సవరించారు కదా. సంతోషం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గూడ రఘురామ్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఆంగ్లసూక్తికి మీ పద్యరూపం చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శ్రీ శంకరయ్య మరియు నేమాని గురువర్యులకు నమస్కృతులు. కవిమిత్రు లందరికీ శుభాకాంక్షలు

    లోపాలను దిద్దు ఘనులు
    పాపాత్ములె ? పూజ్యులగు నుపాధ్యాయు లిలన్
    కోపించక శిష్యుల కె
    న్నో పాఠాలను గఱపుదు రోపిక తోడన్

    రిప్లయితొలగించండి
  32. పాపలను తీర్చి దిద్దని
    పాపాత్ములె ..పూజ్యులగు నుపాధ్యాయు లిలన్
    కాపాడుచు నెల్లప్పుడు
    నేపాపము లెరుగ నట్టి నేరుపు గరుపన్

    రిప్లయితొలగించండి
  33. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________

    లోపాలను సవరింపగ
    పాపంబని యెంచకుండ - భద్రము కొఱకై
    పాపల , బరిగెను గొట్టే
    పాపాత్ములె, పూజ్యులగు ను - పాధ్యాయు లిలన్ !
    ____________________________
    భద్రము = శుభము
    బరిగె = బెత్తం

    రిప్లయితొలగించండి
  35. శంకరార్యా !
    నిన్నటి నా పూరణను వేరే వారిదిగా భ్రమించారు !

    రిప్లయితొలగించండి
  36. చిన్నప్పటి నుండీ మంచీ చెడూ తెలియజెప్పిన
    తల్లికీ ,తండ్రికీ ,గురువులకూ,అందరికీ
    వందనములు !

    రిప్లయితొలగించండి
  37. శంకరార్యా !
    ఎలాగూ ఒకరోజు ముందే మీ ప్రకటనలను పంపి
    నిర్ణీత సమయానికి ప్రకటింప బడేలా చేస్తున్నారు గనుక
    అదేదో తారీఖు మారిన వెంటనే ప్రకటింప బడే ఏర్పాటు చేస్తే
    (అంటే రాత్రి 12 తరువాత)
    నావంటి నిశాచరులకూ
    మన అనేకమంది విదేశీ మిత్రులకూ
    ఎంతో అనుగుణ్యముగా నుండును !

    రిప్లయితొలగించండి
  38. అన్నయ్య గారి మధ్యాక్కరతో వివిధ గురువుల లక్షణములను వర్ణించారు. కాని అన్నయ్యగారిలోను శ్రీ కంది శంకరయ్యగారి లోను నలుగురి గురువుల లక్షణాలను నేను గాంచ గలుగుతున్నానే!

    చెప్పుచు విషయము దెల్పుచు
    నొప్పుగ విశదీకరించి యోపిక తోడన్
    మప్పగను ఋజువు పరచుచు
    గొప్పగ నుత్తేజమిచ్చు గురులకు ప్రణతుల్ !

    రిప్లయితొలగించండి
  39. వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    మీరు కోరినట్లే రేపటినుండి పోస్టుల ప్రకటన సమయాన్ని సవరిస్తాను.
    *
    గన్నవరపు నరసింహమూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  40. రిప్లయిలు
    1. సరదాగా స్వానుభవం:

      కోపముతో కొట్టబడియు
      తాపముతో తిట్టబడిన తండ్రుల కొమరుల్
      శాపముతో మరుజన్మన
      పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్

      తొలగించండి


  41. వ్యాపారంబాయెన్ వి
    ద్యా! పారెను దస్కముల్ నిదానము బోయెన్
    సాపాటు రాయులగుచున్
    పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  42. త్రేపుచు ఖురాను మదినిన్
    రాపిడి పెట్టుడని చెప్పి రాబడి పొందన్
    శాపమ్మొందిన వృత్తిని
    పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్

    రిప్లయితొలగించండి