అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ! అభినందనలు. మీ పద్యములు బాగుగ నున్నవి. చిన్న సూచన:
మీ ప్రయోగములు -- దీప్తివంతము మరియు కీర్తివంతుడు సరి కావు. దీప్తిమంతము మరియు కీర్తిమంతుడు అనవలెను. సమాసములో ఇకార ఉకారముల తరువాత మకారము వచ్చి కీర్తిమంతుడు, శ్రీమంతుడు, హనుమంతుడు మొదలగు రూపములు వచ్చును. స్వస్తి.
అయ్యా! శ్రీ తోపెల్ల వారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. గౌరవ న్యాయ స్థాన అనుటలో వ గురువగును; య గురువగును. కాబట్టి గణభంగము కనుపట్టుచున్నది. సరిజేయండి. స్వస్తి.
ఈ రోజు కారాగారం నుండి ఊరేగింపుగా లక్షల కోట్లు మింగిన వాడిని నల్లబాడ్జీలు ధరించి ఛీ కొట్టకుండా, ఆపై జేజేలు కొడుతూ తీసుకెళ్లటం టీవీలో చూసి తలదించుకొని చూడలేక వెంటనే కట్టేశాను. మనప్రజలు కొందరు ఆబోతులు, గొర్రెలమందలు అనటానికి ఉదాహరణేమో!
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘గౌరవ ధర్మాసనము వి/చారణ...’ అందాం. ‘ఇప్పట్టునన్’ అనవలసింది. అక్కడ ‘జగ నీవేళన్’ అనండి. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. ఒకటవ, నాల్గవ పాదాలలో గణదోషం... ‘గగనమున నుండి దిగెనట’ అనీ, ‘తమ జగనుని’ అనీ అంటే సరి! * వసంత కిశోర్ గారూ, మీ అయిదు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. * పండిత నేమాని వారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
గుండు మధుసూదన్ గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * ప్రభల రామలక్ష్మి గారూ, మీ పద్యం బాగుంది. ‘ఆకయిల్లు, బందిగము’ పదాల ప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు. ‘సమయానుకూలంగ’ అన్నదాన్ని ‘సమయానుకూలమై’ అనండి.
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండికారాగారంబున జా
గారంబు నెలల తరబడి గావింపంగన్
గౌరవ న్యాయస్థాన వి
చారణ పై విడుదలయ్యె జగనిప్పట్టున్.
గగనము నందుండి దిగెనట
రిప్లయితొలగించండిజగమేలెడి ప్రభు వటంచు జపముల్ జేయన్
భుగ భుగ మని ప్రజ లందరు
రగిలి రగిలి జగనుని రక్షణ కోరన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కారాగారమే శ్రీకృష్ణ జన్మస్థానము గదా :
01)
__________________________________
దేవదేవుడు కావగా ప్రజ - ధిక్కరించగ కంసునే
దేవ దుందుభి మ్రోగు చుండగ - తేజ మంతట నిండగా
దేవ మానవ జాతి మెండుగ - దివ్యరూపుని జూడగా
దేవకీ సుతు డక్కడే గద - దీప్తివంతము పుట్టెనే !
__________________________________
కారాగారమే శ్రీకృష్ణ జన్మస్థానము గదా :
రిప్లయితొలగించండి02)
__________________________________
వందనంబిడ రండురండని - వంతు వంతున దేవతల్
క్రింది కేగిరి కార యందున - కీర్తివంతుని మెచ్చగా
అందమొప్పుచు సుందరుండదె - యర్థరాత్రము నక్కడే
నందనందన దేవకీప్రియ - నందనుండదె పుట్టగాన్ !
__________________________________
నను బ్రోవ మని చెప్పవే సీతమ్మ తల్లీ - నను బ్రోవ మని చెప్పవే"
రిప్లయితొలగించండిఅని రామదాసన్నది కారాగారము లోనే గదా :
03)
__________________________________
రామదేవుని మందిరంబదె - రమ్యరమ్యము గట్టుటన్
రామనామము నిర్విరామము - రామదాసదె తల్చుచున్
రామ లక్ష్మణ సీతతోడుత - రక్షసేయగ రమ్మనీ
రామ దర్శన భాగ్యమైనట - రమ్యగానము జేసెనే !
__________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅదే మామూలు దొంగనైతే చిత్రహింసలు పెట్టేది కారాగృహము నందే గదా !
రిప్లయితొలగించండి05)
__________________________________
పాడు పొట్టను నింపు కోసము - వంద రూకల దొంగిలన్
పీడబెట్టుచు కర్రగొట్టుచు - పిచ్చిపిచ్చిగ తన్నుచున్
వాడువీడని యెంచకుండగ - పాడుసంకెల లేతురే
నీడనివ్వరు చూడనివ్వరు - నిర్దయాత్ములు రక్షకుల్
__________________________________
రక్షకుల్ = రక్షకభటులు
లక్ష కోట్లు దోచినా శిక్ష తప్పించుకొని విడుదలైనది కారాగారమునుండే గదా :
రిప్లయితొలగించండి04)
__________________________________
ఈ క్షరందున నెక్కడైనను - యెన్నడైనను వింటిమా ???
లక్షకోట్లను నిశ్చయంబుగ - రాజపుత్రుడు మెక్కినన్
పక్షపాతము జూపి కాంగ్రెసు - పాడుదారిని పట్టుటన్
శిక్ష లేదిక నక్షయంబుగ - సీబియై కరుణించుటన్!
రక్ష యెవ్వరు ?లక్ష్యమేమిటి ?- రాక్షసాధమ రాజ్యమే !!!
__________________________________
అయ్యా! శ్రీ వసంత కిశోర్ గారూ! అభినందనలు.
రిప్లయితొలగించండిమీ పద్యములు బాగుగ నున్నవి. చిన్న సూచన:
మీ ప్రయోగములు -- దీప్తివంతము మరియు కీర్తివంతుడు సరి కావు. దీప్తిమంతము మరియు కీర్తిమంతుడు అనవలెను. సమాసములో ఇకార ఉకారముల తరువాత మకారము వచ్చి కీర్తిమంతుడు, శ్రీమంతుడు, హనుమంతుడు మొదలగు రూపములు వచ్చును. స్వస్తి.
అయ్యా! శ్రీ తోపెల్ల వారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. గౌరవ న్యాయ స్థాన అనుటలో వ గురువగును; య గురువగును. కాబట్టి గణభంగము కనుపట్టుచున్నది. సరిజేయండి. స్వస్తి.
నేమానివారికి ధన్యవాదములతో :
రిప్లయితొలగించండికారాగారమే శ్రీకృష్ణ జన్మస్థానము గదా :
01అ)
__________________________________
దేవదేవుడు కావగా ప్రజ - ధిక్కరించగ కంసునే
దేవ దుందుభి మ్రోగు చుండగ - తేజ మంతట నిండగా
దేవ మానవ జాతి మెండుగ - దివ్యరూపుని జూడగా
దేవకీ సుతు డక్కడే గద - దీప్తిమంతుడు పుట్టెనే !
__________________________________
నేమానివారికి ధన్యవాదములతో :
రిప్లయితొలగించండికారాగారమే శ్రీకృష్ణ జన్మస్థానము గదా :
02అ)
__________________________________
వందనంబిడ రండురండని - వంతు వంతున దేవతల్
క్రింది కేగిరి కార యందున - కీర్తిమంతుని మెచ్చగా
అందమొప్పుచు సుందరుండదె - యర్థరాత్రము నక్కడే
నందనందన దేవకీప్రియ - నందనుండదె పుట్టగాన్ !
__________________________________
Pandita Nemani అన్నారు...
రిప్లయితొలగించండికారాగారము పంచభూతమయమై కన్బట్టు విశ్వంబు, సం
సారంబంచట పొందు బంధనము, శిక్షల్ పొందు వేవేలుగా
దారా పుత్ర విమోహియౌ నరుడు, సత్య జ్ఞాన తేజంబుతో
శ్రీరాజిల్లు పదమ్ము చేరుకొనుటే శ్రేయస్కరంబౌ సుధీ!
ఈ రోజు కారాగారం నుండి ఊరేగింపుగా లక్షల కోట్లు మింగిన వాడిని నల్లబాడ్జీలు ధరించి ఛీ కొట్టకుండా, ఆపై జేజేలు కొడుతూ తీసుకెళ్లటం టీవీలో చూసి తలదించుకొని చూడలేక వెంటనే కట్టేశాను. మనప్రజలు కొందరు ఆబోతులు, గొర్రెలమందలు అనటానికి ఉదాహరణేమో!
రిప్లయితొలగించండికారాగారము కాదది
రిప్లయితొలగించండిశౌరియె జన్మించి నట్టి సౌధము కాదే?
నీరాజన మర్పించరె?
కారాగారము విడువగ కైమోడ్పిడరే?
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘గౌరవ ధర్మాసనము వి/చారణ...’ అందాం. ‘ఇప్పట్టునన్’ అనవలసింది. అక్కడ ‘జగ నీవేళన్’ అనండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
ఒకటవ, నాల్గవ పాదాలలో గణదోషం... ‘గగనమున నుండి దిగెనట’ అనీ, ‘తమ జగనుని’ అనీ అంటే సరి!
*
వసంత కిశోర్ గారూ,
మీ అయిదు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
The Other గారూ (మిస్సన్న గారేనా?)
....!....?
కారాగారములయ్యవి
రిప్లయితొలగించండియారామములయ్యె యిపుడ యదికారులకున్
పోరాములైనవారికి
నీరకముల శిక్షలుండు నిష్టతగలుగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి1. కంచెర్ల గోపన్నను సంబోధించుచు....
రిప్లయితొలగించండికారాగారమె గోప
న్నా! రామ సుగుణ విశేష నామ జపముచే
నారామమయ్యెఁ గాదా!
ధీరా! దాశరథి శతక దివ్య కృతీశా! (1)
2. నెహ్రూ సంస్మరణము:
కారాగారస్థుఁడు నె
హ్రూ రచియించె నఁటఁ బెక్కులుగఁ బుస్తకముల్!
కారాగార మనంగ న
పారమయిన బుద్ధికుశల వర్ధిత గృహమే!! (2)
కారాగారమునుండిరి
రిప్లయితొలగించండిభారతమునకపుడు స్వేచ్చ ఫలమీయంగా
కారాగారమునుండెడు
వారే కన స్వేచ్చగిపుడు బయటన నుండెన్.
పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిజగమే కారాగారము
వగలు పగలు శృంఖలములు బంధించును జీ
విగనడు మోహితుడగుచును
నిగమాతీత !నిను గొల్తు నీయుము ముక్తిన్
కారాగారము నందున
రిప్లయితొలగించండినేరస్థుల బట్టి యుంచి నేర్పగ నీతిన్
మారిన ఖైదీ లందరు
ప్రారంభింతురు బ్రతుకును బాగుగనిలలో.
అధికారమందుండ అందని పండైన
రిప్లయితొలగించండిఆనందమున్నది ఆకయింట
పనిలేకపోయిన పలుమార్లు తిరిగెడి
పనిలేదురాయన్న బందిగమున
సమయానుకూలంగ సాపాటు వచ్చును
వేళతప్పెడి తిండి వేడిచేయు
చెరసాలగాదది సరసాల శాలరా
ఏలవీడితి వీవు ఏవకాడ
తిరిగిపోవయ్య తీరైన స్థానమునకు
కరగి పోవును నీచేతి కణములన్ని
పదవి రాదయ్య నొచ్చును పెదవి నీకు
సందియము లేదు, పడునయ్య సంకెలేపుడొ.
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
ప్రభల రామలక్ష్మి గారూ,
మీ పద్యం బాగుంది. ‘ఆకయిల్లు, బందిగము’ పదాల ప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు.
‘సమయానుకూలంగ’ అన్నదాన్ని ‘సమయానుకూలమై’ అనండి.
అధికారమందుండ అందని పండైన
రిప్లయితొలగించండిఆనందమున్నది ఆకయింట
పనిలేకపోయిన పలుమార్లు తిరిగెడి
పనిలేదురాయన్న బందిగమున
సమయానుకూలమై సాపాటు వచ్చును
వేళతప్పెడి తిండి వేడిచేయు
చెరసాలగాదది సరసాల శాలరా
ఏలవీడితి వీవు ఏవకాడ
తిరిగిపోవయ్య తీరైన స్థానమునకు
కరగి పోవును నీచేతి కణములన్ని
పదవి రాదయ్య నొచ్చును పెదవి నీకు
సందియము లేదు, పడునయ్య సంకెలేపుడొ.
ధన్యవాదములతో....