శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
శ్రీ నేమాని గురుదేవుల పాతాళ భైరవి కథ,శ్రీ లక్ష్మి దేవి గారి ప్రస్తుత డిల్లి ఘటన,శ్రీ మధుసూదన్ గారి తాటకి పద్యములు బ్లాగునకు ప్రాతః కాలపు వెలుగును నిచ్చు చున్నవి.
తేట గీతి గర్భిత ఉత్సాహ =======*======= (పంతమునను పరుగు తోడ పంట చేల) నడువనన్ చెంత జేరి సిరులు దినగ చింత మీరు(ర)చుండగన్ శాంతి నొసగ వీరు డొకడు జంప చీడ పురుగులన్ హంతకునకు వర మొసంగె నలర జగము జూడరా!
లక్ష్మీ దేవి గారి పూరణ ప్రస్తుత న్యాయమూర్తుల తీరుకు అద్దం పడుతుందినేనూ అదే భావనతోప్రయత్నించాను విరమించాను. అభినందనలు. శ్రీ పండిత నేమాని మరియు గుండు మధుసూదన్ గారల పూరణలు ప్రశస్తంగా యున్నాయి అభినందనలు.
కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న ఉదయం పోయిన కరెంటు సాయంత్రం వచ్చింది. రాత్రి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను. అందువల్ల నిన్న పూరణలు, పద్యాలు, వ్యాఖ్యలు చూసే అవకాశం దొరకలేదు. మన్నించండి. చక్కని పూరణలను వ్రాసిన లక్ష్మీదేవి గారికి, పండిత నేమాని వారికి, గుండు మధుసూదన్ గారికి, వరప్రసాద్ గారికి, మంద పీతాంబర్ గారికి, సుబ్బారావు గారికి, కెంబాయి తిమ్మాజీ రావు గారికి, బొడ్డు శంకరయ్య గారికి, మిస్సన్న గారికి, రాజేశ్వరి అక్కయ్యకు అభినందనలు, ధన్యవాదాలు.
ఘోర నేరములకు నైన గురుతెఱింగి
రిప్లయితొలగించండిదండన నొసగ వెఱచెనో ధర్మమిచట?
చిన్న ప్రాయము వాడను చింతనమున
హంతకునకు వర మొసంగె నలర జగము.
అంబ పాతాళ భైరవి కాదరమున
రిప్లయితొలగించండిమాయల పకీరునే విక్రమమ్ము మెరయ
బలిగ జేసె డింభకుడంత బళిర! దుష్ట
హంతకునకు వరమొసంగె నలర జగము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం.
రిప్లయితొలగించండిఎంతయు ముదమున నస్త్రపు
సంతతి రామునకు నిడఁగఁ జని కౌశికుఁ డా
కాంతను దాటకిఁ గూల్చిన
హంతకునకు వరమొసంగె నలర జగములున్!
అంతకాంతకుండు గౌరి యగ్ని జొచ్చినంతనే
రిప్లయితొలగించండిస్వాంతమున్ గలంగ వీరభద్రు ననిపె కూల్చె న
త్యంత భీకరముగ నతడు దక్షునిన్ మహేశుడా
హంతకునకు వరమొసంగె నలర జగము లెంతయున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవుల పాతాళ భైరవి కథ,శ్రీ లక్ష్మి దేవి గారి ప్రస్తుత డిల్లి ఘటన,శ్రీ మధుసూదన్ గారి తాటకి పద్యములు బ్లాగునకు ప్రాతః కాలపు వెలుగును నిచ్చు చున్నవి.
తేట గీతి గర్భిత ఉత్సాహ
=======*=======
(పంతమునను పరుగు తోడ పంట చేల) నడువనన్
చెంత జేరి సిరులు దినగ చింత మీరు(ర)చుండగన్
శాంతి నొసగ వీరు డొకడు జంప చీడ పురుగులన్
హంతకునకు వర మొసంగె నలర జగము జూడరా!
శ్రీ నేమాని గురుదేవుల దక్షుని పద్యము నిజమైన ఉత్సాహ వృత్తము.
రిప్లయితొలగించండిశ్రీ పీతాంబర్ గారి దుష్ట హంతకుని పద్యము బాగు బాగు.
లక్ష్మీ దేవి గారి పూరణ ప్రస్తుత న్యాయమూర్తుల తీరుకు అద్దం పడుతుందినేనూ అదే భావనతోప్రయత్నించాను విరమించాను. అభినందనలు. శ్రీ పండిత నేమాని మరియు గుండు మధుసూదన్ గారల పూరణలు ప్రశస్తంగా యున్నాయి అభినందనలు.
రిప్లయితొలగించండిధర్మ సంస్థాప నార్ధమై ధరను కృష్ణు
నిగనవతరించితి విజయ, నిజమువినుము
పాపమంటదు బుణ్యంబు వచ్చుదుష్ట
హంతకునకు; వరమొసంగె నలరజగము!!!
రాము డ వతార పురుషుడై రావణున్ని
రిప్లయితొలగించండిజంపి హంతకు డయ్యును సకల జనులు
సంత సంబును బొందుచు సాదరముగ
హంతకునకు వర మొసంగె నలర జగము
పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు
రిప్లయితొలగించండిజగడ మాయెను సాంబువిజయుల మధ్య
పంది జచ్చె నెవరి కోల?భవుడు పార్ధు
తపము నకు మెచ్చి పాశుపతము వరాహ
హంతకునకు వరమొసంగె నలర జగము.
పరశురాముండు పితృవాక్య పాలకుండు
రిప్లయితొలగించండిచంపె దల్లి నంతట దండ్రి సంతసించి
హంతకునకు వరమొసంగె నలర జగము
మరల బ్రతికించె దల్లి నా వరము వలన
కలియుగమున నరాచకములు పెరుగగ
రిప్లయితొలగించండికల్కి దేవుడు గమనించి కనికరమున
దుష్కృతముల నొనర్చెడి దుర్గుణ జన
హంతకునకు వర మొసంగె నలర జగము.
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండిపాశుపతమును గోరి, తపముఁ గిరీటి
సేయఁ, బరికించి, శివుఁడయ్యి బోయ, కిటిని
బంపె; నరుఁడుఁ గొట్టె! శివుఁడు పరుగునఁ గిటి
హంతకునకు వరమొసంగె నలర జగము!!
పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.
రిప్లయితొలగించండినా రెండవ పూరణ.
ద్రౌపదేయుల జంపిన ద్రౌణి యొకడు
ఘోర శిశుహంత.,నిదురించు వారి జంపె
గురువునకు పుత్రుడని చంపకుండ విడిచె
హంతకునకు వరమొసంగె నలర జగము
చిచ్చు కంటను జూడంగ చచ్చె నతను,
రిప్లయితొలగించండిరతికి పతిభిక్ష వేడె పార్వతి మగనిని,
మదను పత్నిని గనఁ గల్గె మాల్మి మరుని
హంతకునకు, వర మొసంగె నలర జగము.
రాజ కీయపు రక్కసి రాజ్య మందు
రిప్లయితొలగించండిధర్మ నిరతిని పాలించి మర్మ మనక
దుష్ట సం హార మొనరించి నిష్ట యనెడి
హంత కునకు వర మొసంగె నలర జగము
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న ఉదయం పోయిన కరెంటు సాయంత్రం వచ్చింది. రాత్రి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను. అందువల్ల నిన్న పూరణలు, పద్యాలు, వ్యాఖ్యలు చూసే అవకాశం దొరకలేదు. మన్నించండి.
చక్కని పూరణలను వ్రాసిన
లక్ష్మీదేవి గారికి,
పండిత నేమాని వారికి,
గుండు మధుసూదన్ గారికి,
వరప్రసాద్ గారికి,
మంద పీతాంబర్ గారికి,
సుబ్బారావు గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
మిస్సన్న గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.