రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, విష్ణుప్రీతికరమైన తులసిని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. ‘చూడ నింపలరు’ అంటే బాగుంటుందేమో! * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ ఖండికా రూప పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు. ‘భాగ్యము లవని’ అంటే సరిపోయేది కదా.. విసంధిగా ఎందుకు వ్రాసారు? * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, చాలా మంచి పద్యం వ్రాసారు. అభినందనలు. ‘దోయిలు పడుదున్’ అన్నాక మళ్ళీ పునరుక్తిగా ‘మ్రొక్కెద’ అన్నారెందుకు? * వరప్రసాద్ గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘కొలువులందు’ అన్నది టైపాటు వల్ల ‘కొలవలందు’ అయింది. రెండవ పద్యం రెండవ పాదంలో గణదోషం. ‘వెలగట్టెడి తరువు కొఱకు...’ అనండి.
కొలిచిన భక్తి ప్రప త్తుల
రిప్లయితొలగించండిఫలితము లీయంగ మనల పాలించు నిలన్
వెలసిన మహిమాన్విత మగు
తులసిని పూజించి నంత ద్యోతము విరియన్
మంచి ఔషధమ్ము మహనీయ తత్త్వమ్ము
రిప్లయితొలగించండిశ్రీకరమ్ము విష్ణు ప్రీతికరము
కొలుచు చుండు వారి కొంగు బంగారమౌ
నట్టి తులసి మాత కంజలింతు
ప్రతి యింట నొకమొక్క పెంచ వలెనయ్య పర్యావరణము
రిప్లయితొలగించండిసతతము సమతుల్యముగను సాగి సజీవులకునది
హితమును కలిగించు చుండి యిలలోని కాలుష్యములను
హతమొనరించును, తులసి యందున నొకమొక్క గాదె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితులసిని కోటయందు నిడి తోయము తోడను పూజ సల్పు నా
రిప్లయితొలగించండిలలనను చూడనింపులగు, రమ్యము కాదొకొ దృశ్యమయ్యదే!
యిలనిక నిట్టి పూజలకు నెక్కడి దండ్రును కాలమయ్యహో,
వెలదులు కొంత యో/నోరిమిని వీడుట నెల్లరెఱుంగు సత్యమే.
సత్యమౌ.
రిప్లయితొలగించండితులసి కోట లోని తులసి మొక్కను జూడ
రిప్లయితొలగించండిమనసు పొంగు చుండు ననవ రతము
పచ్చదనము గలిగి బహు ళ శాఖల నొప్పు
అమ్మ ! తులసి ! నతుల నందు కొనుము
రిప్లయితొలగించండితులసి కోట దరిన ధూపదీపమ్ముల
హారతీయవలయు అనుదినమ్ము
తులసి యున్నఇంట దురితమ్ముతొలగును
పెంచవలయు తులసి ప్రేమతోడ.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
విష్ణుప్రీతికరమైన తులసిని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘చూడ నింపలరు’ అంటే బాగుంటుందేమో!
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పండిత నేమాని గారికి, శంకరయ్య గురుదేవులకు
రిప్లయితొలగించండినమస్కారములు.
ఇంటికీశాన్యదిక్కున యింపుమీర
తులసి కోటను నిర్మించి తోరముగను
తులసి మాతను పూజింప కలుగు సిరులు
ఆయురారోగ్య భాగ్యముల్ అవని యందు
తులసి తీర్థమ్ము త్రాగిన తొలగు రుజలు
ఔషధమ్ముగ వైద్యులు ఆదరింప
కఫము కాసమజీర్ణమ్ము కంఠరోగ
ముపశమించు నాకులరసము చవిగొన
తులసి నీకెంత భాగ్యమ్ము కలిగె నీవు
శౌరి మెడలోన నిరతము సరము గాను
వెలసి యిత్తువు నరులకీ యిలను సుఖము
అంతకాలమునందున హరినిలయము
ఇలలో నీతో సరిగా
రిప్లయితొలగించండితులదూగెడు మొక్క లేదు దోయిలి పడుదున్
తులసీ ! మ్రొక్కెద మా మొగ
సాలన కోటగ నిలచుచు సద్గతులిమ్మా !
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
=====*=======
తులసి వనము నందు తులతూగు సిరులని
దెలిసి భక్తి తోడ గొలిసిరపుడు,
కొలువలందు వనిత గొలుచుట మరచెను
ఫలితము గను చుండె పాపజగతి.
ఇలలో తులసికి సరియగు
రిప్లయితొలగించండివెలగట్టు వృక్షతతి కొరకు వెదకిన వారల్
ఫలితము లేదని దెలుపుచు,
తులసికి దిద్దిన తిలకము దుర్జను లనియెన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితులసి తీర్థమ్ము ద్రాగిన దొలగు సర్వ
రిప్లయితొలగించండిపాపములని పోయుచు నుండె పాడి పైన
నిలచిన మనుజులకు,నేడు నేరమనుచు
బలుకు చుండెను వింతగ బలుపుతోడ!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ ఖండికా రూప పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
‘భాగ్యము లవని’ అంటే సరిపోయేది కదా.. విసంధిగా ఎందుకు వ్రాసారు?
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చాలా మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
‘దోయిలు పడుదున్’ అన్నాక మళ్ళీ పునరుక్తిగా ‘మ్రొక్కెద’ అన్నారెందుకు?
*
వరప్రసాద్ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘కొలువులందు’ అన్నది టైపాటు వల్ల ‘కొలవలందు’ అయింది.
రెండవ పద్యం రెండవ పాదంలో గణదోషం. ‘వెలగట్టెడి తరువు కొఱకు...’ అనండి.
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ మూడవ పద్యం కూడ బాగుంది. అభినందనలు.
గురువు గారు,
రిప్లయితొలగించండిచూడ నింపలరు - మీ సవరణ కూడా ఎంతో బాగుంది.
యో/నో దగ్గర సందేహం ఉండిపోయింది.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమొదటి సారి పుస్తకము,కలము వాడకుండా వ్రాసిన పద్యములు గురువుగారు.
మొదటిది టైపాటు,రెండవది నాపాటు(నా తప్పిదము) గురువుగారు.
పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండివిసoధి చేయుట తొందర లో గమనించలేదు
క్షమించవలెను
తిమ్మాజీరావు