పరమ పావనము సుబ్రహ్మణ్య నిలయమౌ ....నట్టి తిరుత్తణి యందు బుట్టి పెరిగి శ్రీ వేలూరు తిరుపతి మదరాసు ....లందు దీక్షమెయి విద్యల గడించి ఆచార్య వృత్తిలో నత్యున్నత పదమ్ము ....లెన్నెన్నియో నిర్వహించి వేడ్క మన సనాతన ధర్మమును దేశదేశాల ....మతముల సార విస్తృతిని దెలిసి హైందవ సంప్రదాయమున కన్యములకు ....మధ్య వారధిగ సన్మానమంది హైందవ ధర్మ మహౌన్నత్యమ్మును విశ్వ ....మందు వ్యాప్తమొనర్చి యాదరమున వేదాంత విజ్ఞాన విషయ సర్వస్వమున్ ....ప్రచురించి పుస్తక ప్రకరణముల భరత దేశపు టగ్ర పదవుల నమిత స ....మర్థ సంపత్తితో వ్యవహరించి నట్టి శేముషీ వైభవాన్విత మనీషి భరత మాతకు సముచితాభరణ వరుడు అవని నాచంద్రతారార్క మలరు గాక! అతని స్ఫూర్తి యటంచు నే నంజలింతు
శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచన: గర్వము శ్రేష్ఠ లక్షణము కాదు. అందుచేత మీ పద్యములో 2వ పాదమును ఇలాగ మార్చుదామా? "పర్వము లలరించితీవు ప్రజ్ఞానిధివై" స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
శ్రీ రాజేశ్వరి గారికి,శ్రీ జిలేబి (మీ అసలు పేరు తెలియక) గారికి,శ్రీ గోలి వారికి, శ్రీ జయసారథి గారికి,శ్రీ మధుసుదన్ గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి,శ్రీ నరసింహ మూర్తికి గారికి,శ్రీ లక్ష్మి గారికి, శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారికి, శ్రీ శైలజ గారికి,శ్రీ మిస్సన్న గారికి,శ్రీ శ్యామలీయం గారికి,శ్రీ మంద పీతాంబర్ గారికి, శ్రీ బొడ్డు శంకరయ్య గారికి, శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారికి,శ్రీ వసంత కిషోర్ గారికి(సుస్వాగతము ),శ్రీ సుబ్బారావు గారికి,శ్రీ అందవోలు విద్యాసాగర్ గారికి,శ్రీ చంద్రమౌళి గారికి,శ్రీ నాగరాజు రవీందర్ గారికి,శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, శ్రీ రామకృష్ణ గారికి , శ్రీ పరుచూరి వంశీ గారికి సాహితీ మిత్రులకు, బ్లాగు వీక్షకులందరికీ,..ఉపాధ్యాయ దినోత్యవ శుభాకాంక్షలు
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు. వేమన గారి పద్యము నేటి గురువులపై
కారు కారు గురులు కా గుణితము చెప్ప శాస్త్ర సార ములను చదివి చెప్ప ముక్తి దారి చూపు మూలము గురుడు రా ! విశ్వదాభి రామ వినుర వేమ!
నా గురుదేవులకు పద్యహారము
నా గురు దేవులు జుపిరి నా గురుతులు దారి దప్పి నడచుచు నుండన్ ! నా గురు దేవుల పాదము, నా గురు దేవుల బలుకులు నమ్మి దిరిగితిన్,
తెలియజేయుచునుండు లెస్స ధీశాలి సామాన్య గురువు అలరుచు విశదీకరించు నాదృతి సమ్మాన్య గురువు బళి ప్రదర్శించుచు నెదల ప్రభలనింపు విశిష్ట గురువు విలువగు నుత్తేజమిడుచు వెలుగు నింపు వరిష్ఠ గురువు Source: The mediocre teacher tells The good teacher explains The superior teacher demonstrates The great teacher inspires
శ్రీ పండిత నేమాని గారూ మీరు సూ చించినదే సరియైనది. నా పద్యంలోని రెండవ పాదంలోని పదాన్ని ఇలా మార్చుతున్నాను .ధన్యవాదములు "ప్రాక్పశ్చిమంబుల " శ్రీ నేమానిగారూ శ్రీ కంది శంకరయ్య గారికి శుభాకాంక్షలు చెబుతూ "వరమతి! శంకరాభరణ వైభవ బంధుర! శంకరార్య!,,,, సుహృదాకర! జ్ఞానభాస్కరా! "అను పద్యం శో భాయమానంగా ఉంది శ్రీ వరప్రసాద్ గారికి ధన్య వాదములు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు. * డా. సర్వేపల్లి వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని గురించి, వారి ఆచార్యత్వాన్ని గురించి, వారి గొప్పదనాన్ని గురించి, ఉపాధ్యాయుల ఔన్నత్యం గురించి చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు..... జిలేబీ గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, పండిత నేమాని వారికి, శ్రీ యెర్రాజి జయసారథి గారికి, శైలజ గారికి, వరప్రసాద్ గారికి, లక్ష్మీదేవి గారికి, సుబ్బారావు గారికి, మంద పీతాంబర్ గారికి, బొడ్డు శంకరయ్య గారికి అభినందనలు, ధన్యవాదాలు. * పండిత నేమాని వారూ, నన్ను సంబోధిస్తూ వ్రాసిన మధురమైన పద్యానికి కృతజ్ఞుడను.
రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది పద్యం. అభినందనలు. చివరి పాదంలో గణదోషం. ‘అతని కంజలి నిడుదున్’ అనండి. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ ఖండికా రూపమైన సర్వేపల్లి వారి ప్రాశస్త్యం చాలా బాగుంది. అభినందనలు. మొదటి కందం నాల్గవ పాదంలో, చివరి ఆటవెలది నాల్గవ పాదంలో గణదోషం.
శంకరార్యా ! ఎలాగూ ఒకరోజు ముందే మీ ప్రకటనలను పంపి నిర్ణీత సమయానికి ప్రకటింప బడేలా చేస్తున్నారు గనుక అదేదో తారీఖు మారిన వెంటనే ప్రకటింప బడే ఏర్పాటు చేస్తే (అంటే రాత్రి 12 తరువాత) నావంటి నిశాచరులకూ మన అనేకమంది విదేశీ మిత్రులకూ ఎంతో అనుగుణ్యముగా నుండును !
ఫూజ్య గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గురువుగారికి,
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురువుగారికి,పాదాభివందనములతో,..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ..
శైలజ...
సాహితీ మిత్రులందరికీ,..ఉపాధ్యాయ దినోత్యవ శుభాకాంక్షలు...
రిప్లయితొలగించండిసోదర సోదరీ మణు లందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు పూజ్య గురువులకు ప్రణామములు
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసర్వేపల్లి వారి అత్యుత్తమ గురుత్వం
నాటి నించి నేటి దాకా దేశానికి అందిస్తోంది
సర్వ గురువులకు పల్లికట్టుమాన్యము
కాపాడుకొనుట గురువు లెల్లరి కర్తవ్యమ్ !
జిలేబి
శ్రీ శంకరార్యులకూ, గురువర్యులందరకూ ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు.
రిప్లయితొలగించండిగురువన జ్ఞానపు దృక్కులు
కరవగు నరులకు వెలుగును గానగ చేయున్
గురువన హరియే నరునిగ
ధర నరిగిన ధర్మ బోధ తానే చేయున్.
సర్వేపల్లి కులానందం
రిప్లయితొలగించండిరాధాకృష్ణం గురూత్తమం
వేదాంత జ్ఞాన వారాశిం
మహాత్మానం ప్రణామ్యహం
పరమ పావనము సుబ్రహ్మణ్య నిలయమౌ
....నట్టి తిరుత్తణి యందు బుట్టి
పెరిగి శ్రీ వేలూరు తిరుపతి మదరాసు
....లందు దీక్షమెయి విద్యల గడించి
ఆచార్య వృత్తిలో నత్యున్నత పదమ్ము
....లెన్నెన్నియో నిర్వహించి వేడ్క
మన సనాతన ధర్మమును దేశదేశాల
....మతముల సార విస్తృతిని దెలిసి
హైందవ సంప్రదాయమున కన్యములకు
....మధ్య వారధిగ సన్మానమంది
హైందవ ధర్మ మహౌన్నత్యమ్మును విశ్వ
....మందు వ్యాప్తమొనర్చి యాదరమున
వేదాంత విజ్ఞాన విషయ సర్వస్వమున్
....ప్రచురించి పుస్తక ప్రకరణముల
భరత దేశపు టగ్ర పదవుల నమిత స
....మర్థ సంపత్తితో వ్యవహరించి
నట్టి శేముషీ వైభవాన్విత మనీషి
భరత మాతకు సముచితాభరణ వరుడు
అవని నాచంద్రతారార్క మలరు గాక!
అతని స్ఫూర్తి యటంచు నే నంజలింతు
శ్రీ శంకరయ్య గురువులు, శ్రీ నేమాని గురువులకు పాదాభివందనాలు..
రిప్లయితొలగించండికవులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
.
గురుపూజోత్సవమున, నే
గురుచరణమ్ములఁగొలుచుచుఁ గోరిక తోడన్
గురువులకు వందనమ్ములు
మరువను గురువుల మహిమలు మరువను గురువున్!
గురువులు రత్న దీపములు కూరిమి శిష్యుల పాలి వేల్పులున్
రిప్లయితొలగించండినిరతము ఛాత్రబృందముల స్నిగ్ధ మనమ్ముల దిద్ది తీర్చుచున్
గరపుచు సర్వవిద్యలను జ్ఞాన ధనాఢ్యుల జేయు వైభవా
కరులు సుధీప్రభాకరులు గౌరవమొప్ప నుతింతు వారలన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅక్షరములు నేర్పు ఆచార్య దేవుళ్ళు
రిప్లయితొలగించండిలక్షణముగ వచ్చు లక్ష్య సిధ్ధి
అవని లోన గురువు ఆదర్శప్రాయుడు
అందజేతునయ్య వందనములు
తెలివిలేనివారితీరుదెన్నుజూసి
తల్లడిల్లుగురువు తండ్రివోలె
మందమతులనైన మార్చేటి దైవాలు
సకల గురుల స్ఫూర్తి సర్వేపల్లి
సర్వే సర్వత్రా గురు
రిప్లయితొలగించండిగర్వమ్మును బెంచినావు గౌరవమొప్పన్
సర్వేపల్లీ ! గురువర !
యుర్విని నీపథమెమాకు నూతముగాదా !
శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. చిన్న సూచన: గర్వము శ్రేష్ఠ లక్షణము కాదు. అందుచేత మీ పద్యములో 2వ పాదమును ఇలాగ మార్చుదామా?
"పర్వము లలరించితీవు ప్రజ్ఞానిధివై"
స్వస్తి.
శ్రీ కంది శంకరయ్య గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు:
రిప్లయితొలగించండివరమతి! శంకరాభరణ వైభవ బంధుర! శంకరార్య! స
ద్గురుడవు! కందివంశ శశి! తోరముగా నిను నాశ్రయించు భా
సురకవి మిత్ర బృందముల శోభల పెంపొనరించు నిన్ను సా
దరమున సన్నుతింతు బహుధా సుహృదాకర! జ్ఞానభాస్కరా!
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
రిప్లయితొలగించండిశ్రీ రాజేశ్వరి గారికి,శ్రీ జిలేబి (మీ అసలు పేరు తెలియక) గారికి,శ్రీ గోలి వారికి,
శ్రీ జయసారథి గారికి,శ్రీ మధుసుదన్ గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి,శ్రీ నరసింహ మూర్తికి గారికి,శ్రీ లక్ష్మి గారికి, శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారికి, శ్రీ శైలజ గారికి,శ్రీ మిస్సన్న గారికి,శ్రీ శ్యామలీయం గారికి,శ్రీ మంద పీతాంబర్ గారికి, శ్రీ బొడ్డు శంకరయ్య గారికి, శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారికి,శ్రీ వసంత కిషోర్ గారికి(సుస్వాగతము ),శ్రీ సుబ్బారావు గారికి,శ్రీ అందవోలు విద్యాసాగర్ గారికి,శ్రీ చంద్రమౌళి గారికి,శ్రీ నాగరాజు రవీందర్ గారికి,శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, శ్రీ రామకృష్ణ గారికి , శ్రీ పరుచూరి వంశీ గారికి
సాహితీ మిత్రులకు, బ్లాగు వీక్షకులందరికీ,..ఉపాధ్యాయ దినోత్యవ శుభాకాంక్షలు
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
వేమన గారి పద్యము నేటి గురువులపై
కారు కారు గురులు కా గుణితము చెప్ప
శాస్త్ర సార ములను చదివి చెప్ప
ముక్తి దారి చూపు మూలము గురుడు రా !
విశ్వదాభి రామ వినుర వేమ!
నా గురుదేవులకు పద్యహారము
నా గురు దేవులు జుపిరి
నా గురుతులు దారి దప్పి నడచుచు నుండన్ !
నా గురు దేవుల పాదము,
నా గురు దేవుల బలుకులు నమ్మి దిరిగితిన్,
రిప్లయితొలగించండిగురువర్యులకు, గురుతుల్యులకు వందనములు.
గురువు......
శార్దూలమ్ముగ గర్జనల్ సలుప జ్వాజ్యల్యంబు లోకంబులౌ.
నిర్దేశింపగ సూత్రముల్ సుళువులౌ నిక్కంబు శిష్యాళికిన్.
నిర్దగ్ధంబిక గర్వముల్ చరణసాన్నిధ్యంబు చేరంగ, నాం
తర్దీపమ్ములు వెల్గవే బ్రదుకు సార్థంబౌచు మోక్షమ్మిడన్.
రాధా కృష్ణున కిడుదును
రిప్లయితొలగించండిపాదాలకు వందనంబు వరమగు భక్తిన్
ఆదిని గురువే యాయన
మీదన నధ్యక్షు డయ్యె మేదిని మనకున్
ఒక ఆంగ్ల సూక్తికి స్వేఛ్ఛానువాదము:
రిప్లయితొలగించండిమధ్యాక్కర:
తెలియజేయుచునుండు లెస్స ధీశాలి సామాన్య గురువు
అలరుచు విశదీకరించు నాదృతి సమ్మాన్య గురువు
బళి ప్రదర్శించుచు నెదల ప్రభలనింపు విశిష్ట గురువు
విలువగు నుత్తేజమిడుచు వెలుగు నింపు వరిష్ఠ గురువు
Source:
The mediocre teacher tells
The good teacher explains
The superior teacher demonstrates
The great teacher inspires
(By: William Arthur Ward)
శ్రీ నేమాని గారూ ! గౌరవమొప్పు గర్వము ..అని అలా వ్రాశాను... చక్కని సవరణ తో మరింత శోభను గూర్చిన మీకు ధన్యవాదములు. మీ సవరణతో..
రిప్లయితొలగించండిసర్వే సర్వత్రా గురు
పర్వము లలరించితీవు ప్రజ్ఞానిధివై
సర్వేపల్లీ ! గురువర !
యుర్విని నీపథమెమాకు నూతముగాదా !
శంకర గురులకు నతులివి
రిప్లయితొలగించండివంకర మాపద్యములకు వాసిని గూర్పెన్
వంకలు లేకను వ్రాసెద
నింకను నేమాన నతులు నేమాని కవీ !
గురువులు శ్రీ శంకరయ్య గారికి, గురుతుల్యులకు మరియు కవిమిత్రులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.పేరుపేరునా శుభా కాంక్షలు తెలిపిన శ్రీ వరప్రసాదు గారికి ధన్య వాదములు.
రిప్లయితొలగించండిగురువుగా విజ్ఞాన తరువుగా విశ్వాన
....ఘనకీర్తి బొందిన ఘనుడెవండు ?
ప్రాక్పశ్చిమంబున పండితారాధ్యుడై
....విభవమ్ము వడసిన విభుడెవండు ?
రాయబారములందు రాజకీయములందు
....రాణించి మెరిసిన రత్నమెవరు ?
భారత రత్నయై పరతత్వ వేత్తయై
....ధర్మ కోవిదు డైన దక్షుడెవరు ?
పదవులకు వన్నె దెచ్చిన ప్రభువెవండు ?
సత్య సారమ్ము నెరిగిన సాధువెవరు ?
రాష్ట్రపతియెసర్వేపల్లి రాధ కృష్ణ
పండితుడతండు విజ్ఞాన మండితుండు !!!
శ్రీ పీతాంబర్ గారూ: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిపద్యమును అద్భుతముగా రూపొందించినారు. అభినందనలు.
2వ పాదములోప్రాక్పశ్చిమంబున అన్నారు -- ప్రాక్పశ్చిమంబుల అంటే అన్వయము సరిపోవును కదా. స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
రిప్లయితొలగించండి========*=====
పదవులకు వన్నె దెచ్చిన పండితుండు
గురువు దైవమనెడి గొప్ప గురువునతడు
తత్వమును వడబోసిన తపసియతడు
పాదపద్మములకు నేడు ప్రణతియందు!
శ్రీ మంద పీతాంబర్ గారు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీ పద్యము అదుర్స్!
పర్వదిన ముపాధ్యాయుల
రిప్లయితొలగించండికుర్విని గురువర్యులెల్ల నుత్సాహముగా
సర్వేపల్లిని దలతురు
నిర్వచనము గురుపదముకు నిక్కము మిత్రా!
శ్రీ పండిత నేమాని గారూ మీరు సూ చించినదే సరియైనది. నా పద్యంలోని రెండవ పాదంలోని పదాన్ని ఇలా మార్చుతున్నాను .ధన్యవాదములు
రిప్లయితొలగించండి"ప్రాక్పశ్చిమంబుల "
శ్రీ నేమానిగారూ శ్రీ కంది శంకరయ్య గారికి శుభాకాంక్షలు చెబుతూ "వరమతి! శంకరాభరణ వైభవ బంధుర! శంకరార్య!,,,,
సుహృదాకర! జ్ఞానభాస్కరా! "అను పద్యం శో భాయమానంగా ఉంది
శ్రీ వరప్రసాద్ గారికి ధన్య వాదములు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి*
డా. సర్వేపల్లి వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని గురించి, వారి ఆచార్యత్వాన్ని గురించి, వారి గొప్పదనాన్ని గురించి, ఉపాధ్యాయుల ఔన్నత్యం గురించి చక్కని పద్యాలను అందించిన కవిమిత్రులు.....
జిలేబీ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
శ్రీ యెర్రాజి జయసారథి గారికి,
శైలజ గారికి,
వరప్రసాద్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
మంద పీతాంబర్ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారూ,
నన్ను సంబోధిస్తూ వ్రాసిన మధురమైన పద్యానికి కృతజ్ఞుడను.
గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిసర్వము తానై యుండిన
రిప్లయితొలగించండిసర్వే పల్లి యనంగ నతని సామ్యము గలరే ?
సర్వము జ్ఞానాంబుధి యగు
సర్వేశ్వరు డనగ నతడు సాంజలి ఘటింతున్ !
పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.
రిప్లయితొలగించండివరములొసగు శరణభవుని
తిరుత్తణిని జన్మమొందె ధీమంతుడు మా
సరివేపల్లి సనాతన
పరబ్రహ్మ తత్వమందు భాసిల్లెనిలన్
చదువులయ్యగ పని చేసి పిదప దేశి
కుడుగ ఆచార్యుడై తత్వ కోవిదుడుగ
కలకతా యందు విఖ్యాతి గాంచినాడు
లండనందున ఆంగ్లేయులండ దొరక
వేదోపనిషద రస గీ
తాదుగ్ధపు చవి నితర మతమ్ముల గురువుల్
తాదాత్మ్యమ్మును జెందుచు
ఆదరమొనరించు రీతి వ్యాఖ్యలు జేసెన్
ఒకడే దైవము మాకను
ప్రకటించిన మతముకన్న పరమాత్ముండే
సకలమ్మగు జీవులలో
అకలంకము నుండునన్నదద్వైతమనెన్
ఆంగ్లదేశమందు నన్ని విద్యాలయ
ములును అతని ఘనత వెలుగునిచ్చె
హిందుమతపు కీర్తి నెంతయో పొగడిరి
పశ్చిమమున దేశవాసు లరయ
ఆంగ్లదొరల సత్కారములందుకొనెను
అమెరికా యందు విశ్వవిద్యాలయములు
అతనికిచ్చెను మంగళారతులు నాడు
విశ్వవిఖ్యాతుడాయెను శాశ్వతముగ
భరత దేశమతని భారతరత్నమ్ము
పట్టమిచ్చి రాష్ట్రపతిగ జేసె
అతని జన్మదినము అధ్యాపకులకగ్ర
పారితోషకమిచ్చి గారవిoచె
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిబాగుంది పద్యం. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. ‘అతని కంజలి నిడుదున్’ అనండి.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ ఖండికా రూపమైన సర్వేపల్లి వారి ప్రాశస్త్యం చాలా బాగుంది. అభినందనలు.
మొదటి కందం నాల్గవ పాదంలో, చివరి ఆటవెలది నాల్గవ పాదంలో గణదోషం.
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భమున
రిప్లయితొలగించండిచిన్నప్పటి నుండీ మంచీ చెడూ తెలియజెప్పిన
తల్లికీ ,తండ్రికీ ,గురువులకూ,అందరికీ
వందనములు !
శంకరార్యా !
రిప్లయితొలగించండిఎలాగూ ఒకరోజు ముందే మీ ప్రకటనలను పంపి
నిర్ణీత సమయానికి ప్రకటింప బడేలా చేస్తున్నారు గనుక
అదేదో తారీఖు మారిన వెంటనే ప్రకటింప బడే ఏర్పాటు చేస్తే
(అంటే రాత్రి 12 తరువాత)
నావంటి నిశాచరులకూ
మన అనేకమంది విదేశీ మిత్రులకూ
ఎంతో అనుగుణ్యముగా నుండును !