26, సెప్టెంబర్ 2013, గురువారం

శుభాశీస్సుమ మాల


శ్రీరస్తు!               శుభమస్తు!               సౌభాగ్యమస్తు!

శ్రీ గన్నవరపు వరాహ నరసింహ మూర్తి, శ్రీమతి నాగమణి దంపతుల కుమారుని వివాహ సందర్భముగా  
నూతన వధూవరులకు శుభాకాంక్షలతో...

శుభాశీస్సుమ మాల
వధువు: చి.ల.సౌ. హారిక

వరుడు : చి. భార్గవ నారాయణ మూర్తి

శ్రీరమా సముపేత నారాయణుని బోలె
సకల సల్లక్షణ సహితులైన
భద్రమూర్తులు నవ వధువును వరుడును
తనరారుచుండ నేత్రముల విందు 
గాగ నీ పావన కళ్యాణ వేదిపై
బంధు మిత్రాళి సంబరములలరు
వేద మంత్రాలతో నాదస్వరములతో
సముచిత కోలాహలముల తోడ
శ్రీకరములగు బహ్వలంకృతుల తోడ
వివిధ కాంతులతో చాల వెలుగు చున్న
భవ్య కళ్యాణ పర్వ వైభవవరమిది
అఖిల మంగళప్రదమయి యలరు గాక!

వధువు హారిక సకల సౌభాగ్య కలిత
పరిగె కుల పుణ్యముల రాశి పావన మతి,
వరుడు గన్నవరపు కుల వార్ధిజుండు
అపర నారాయణుండు విద్యాధికుండు.  

శ్రీ వధూ వరులకు శ్రీరస్తు శుభమస్తు!
భాగ్య వృద్ధిరస్తు భద్రమస్తు!
సకల వాంఛితఫల సంప్రాప్తిరస్తంచు
ఆశిషముల గూర్తు సాదరమతి.

అమలిన జీవితమ్ముల నిరంతర ధర్మపరాయణాత్ములై
సమ రస భావజాలముల సంతతమున్ వెలుగొందు చుండగా
ప్రముదిత మానసాబ్జులయి భాసిలుడీ సుఖ  శాంతులొప్పగా
మిము కృపతోడ బ్రోచుచును మేలొనగూర్తురు గాక వేలుపుల్

జయము మంగళ మూర్తులారా!
జయము సత్కుల దీప్తులారా!
జయము నిర్మల హృదయులారా!
జయము మీ కవకున్. 

నేమాని రామజోగి సన్యాసి రావు

& బాలా త్రిపుర సుందరి

12 కామెంట్‌లు:

 1. బ్రహ్మశ్రీ గన్నవరపు నారాయణమూర్తి పుణ్యదంపతుల కుమారుని వివాహనందర్భముగా వారికి శుభాభినందనలు వధూవరులైన చి.ల.సౌ. హారిక చి. భార్గవ నారాయణామూర్తులకు ఆశీస్సులు.

  రిప్లయితొలగించండి
 2. సోదరులు శ్రీ గన్నవరపు నరసిం హ మూర్తిగారి దంపతులకు కుమారుని వివాహ మహోత్సవ శుభ సందర్బమున హృదయ పూర్వక శుభా కాంక్షలు నూతన వధూ వరులు చిరంజీవి భార్గవ నారాయణ మూర్తికి , చిరం జీవి సౌభాగ్య వతి హారికకు శుభాభి నందన మందారములు

  రిప్లయితొలగించండి
 3. అయ్యా! శుభాశీస్సులు.
  డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తి అనునది వారి పూర్తి పేరు. అందుచేత వరాహ అను పదమును చేర్చండి. వారి కుమారుని వివాహ సందర్భముగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు అంటే బాగుంటుంది.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. అన్నయ్య గారికి అక్కయ్య గారికి గురువు గారికి, మిత్రవరులకు ధన్యవాదములు. వివాహము 12-10-2013 న కాలిఫోర్నియాలో జరుగుతుంది. మీ అందఱి అశీర్వచనాలను చి. భార్గవకు, చి.ల.సౌ హారికకు తప్పక అందజేస్తాను.

  రిప్లయితొలగించండి
 5. డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తి గారి కుమారుని వివాహ సందర్భముగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 6. డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తి గారి కుమారుని వివాహ సందర్భముగా నూతన వధూవరులకు ముందుగా శుభాకాంక్షలు....

  రిప్లయితొలగించండి
 7. బ్రహ్మశ్రీమంతులు డా. గన్నవరపు వరాహ నరసింహ మూర్తి గారి కుమారుని వివాహ సందర్భముగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 8. చి.(తమ్ముడు) గన్నవరపు వరాహ నరసింహమూర్తి మరియు చి.సౌ. నాగమణి దంపతుల జ్యేష్ట కుమారుదు చి. భార్గవ నారాయణమూర్తి వివాహము పవిత్రమైన పర్వదినము మహర్నవమి నాడు(శరన్నవరాత్రులలో) జరుగబోవుట మహాయోగప్రదము. ఆ జగన్మాత యొక్క కృపా కటాక్షములు ఆ దంపతులకు సుదీర్ఘమైన నిత్యానందకరమైన జీవితమును ప్రసాదించు గాక! అని మా శుభాశీస్సులు. మేము ఆ వివాహమును ప్రత్యక్షముగ చూడలేక పోయిననూ మా మనస్సులు ఆ నాడు ఆ లగ్నమునందే లగ్నమై యుండును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. Nuutana Dampatulaaraa!


  సకల శుభములు గలిగించు శంకరుండు
  ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
  కంటికిని రె ప్ప యట్లయి కాచు గాత !
  ఎల్ల వేళల మిమ్ముల చల్ల గాను .

  రిప్లయితొలగించండి
 10. బ్రహ్మశ్రీ గన్నవరపు వరాహ నరసింహమూర్తిగారి కుమారుని వివాహసందర్భముగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 11. అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని రామజొగి సన్యాసి రావు గారు అద్భుతమైన పద్య సుమసౌరభాలతో మా భార్గవను, హారికమ్మను ఆశీర్వదించారు . గురువు గారు శ్రీ కంది శంకరయ్య గారు కృపతో ఆ పద్యాలను వారి శంకరాభరణములో ముద్రించారు. రాజేశ్వరి అక్కయ్య గారు , భాతృసమానులు శ్రీ తోపెలా బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, మిత్రులు శ్రీ వసంత కిశోర్ గారు, శ్రీ గోలి హనుమఛ్ఛాస్రి గారు, శ్రీ వరప్రసాద్ గారు, పండిత వరేణ్యులు శ్రీ మురళీధర రావు గారు, శ్రీ సుబ్బారావు గారు, శ్రీ హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు వధూవరులకు నాశీస్సులు పలికారు. మీ ఆశీస్సులు పొందిన చి. భార్గవ, చి.ల. సౌ. హారిక, శ్రీ పరిగె సుధాకర్ గారు, శ్రీమతి పరిగె సుందరి లక్ష్మి గారు , మా దంపతులము నిజముగా అదృష్టవతులము. మేమంతా మీకు సవినయముగా ధన్యవాదములను తెల్పుకొంటున్నాము. ఛి. భార్గవ , చి.ల. సౌ. హారిక మాన్యులైన మీకు వారి ప్రణామములు తెలుపమని చెప్పారు. శ్రీ సుధాకర్ గారు, శ్రీమతి లక్ష్మి గారు కూడా వారి ధన్యవాదములను తెలుపమని చెప్పారు. అన్నయ్య గారికి, గురువు గారికి, అక్కయ్య గారికి, మిత్ర బృందానికి కృతజ్ఞతా పూర్వక శుభాకాంక్షలు !

  రిప్లయితొలగించండి