13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1173 (పంజరమున నున్న చిలుక)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్.

23 కామెంట్‌లు:

 1. భంజను డను మాంత్రి కునకు
  నంజలి యను కొమరి తంట నతి గారమునన్
  కుంజర మును కోరగవిని
  పంజర ముననున్న చిలుక ఫక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 2. కంజాత పత్ర నేత్ర, స
  మంజస విధిఁ జనక, జాఱి, మఱఁదలి పైనన్
  శింజినులు మ్రోయఁ, బడఁగను,
  బంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్!

  రిప్లయితొలగించండి
 3. ధరణిపై భరత దేశము ధర్మ భూమి
  యనుచు పౌరాణికుండొక డనిన వినుచు
  భ్రమలు వలదుర యని పంజరమున నున్న
  చిలుక పక్కున నవ్వెన్ విచిత్రమనుచు

  రిప్లయితొలగించండి
 4. సంజయ! యుద్ధ విశేషము
  లం జెప్పు మనంగనె ధృతరాష్ట్ర క్షోణీ
  శుంజూచి యాత్రమేలని
  పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 5. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

  సోనియా యింటి వద్దకు చిరంజీవి బోవ
  =======*========
  అంజలి ఘటించి నేను చి
  రంజీవి నని బలుక కడు రమణీయముగన్,
  సంజయుడను నామము గల
  పంజర ముననున్న చిలుక ఫక్కున నవ్వెన్ !

  మెత్తగున్న వాడిని జూచిన మోద బుద్ది గలుగునట,అట్లు తెలుగు వారితో ఆటలాడ,
  =======*==========
  తేనె పట్టును బట్టగ తీపి కొరకు
  తేనె టీగను గుట్టెను తేలు వలెను
  ప్రభుత పరుగును గని పంజ రమున నున్న
  చిలుక ఫక్కున నవ్వెన్ విచిత్రముగను !
  ========*========
  గుంజకు గట్టి సింహమును కుళ్ళ బొడవగ,విసరిన
  పంజా దగిలి సృహ దప్పె,పంకజాక్షికి రాత్రి పగలు
  వింజామరను దాసి విసర వేగిరమ్మున,స్వేదము గని
  పంజర ముననున్న చిలుక ఫక్కున నవ్వెను చిత్రముగను!

  ( పంకజాక్షి= సోనియ)

  రిప్లయితొలగించండి
 6. అంజలి ఘటియించి కొలువ
  జంజాటము వదల గొట్టి శంభుడు నను పి
  ల్వంజాలడె యని యస్థుల
  పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్.

  రిప్లయితొలగించండి
 7. అంజలి ఘటియింతుము జన
  రంజకముగ నేలు దొరల రమ్మన, మూగెన్
  కుంజరమూకలు ,పాలక
  పంజరముననున్నచిలుక ఫక్కున నవ్వెన్ !!!

  (పాలక పంజరముననున్నచిలుక = కేంద్ర నేర పరిశోధక సంస్థ. CBI )

  రిప్లయితొలగించండి
 8. గుంజాటనలేక శుకము
  మంజులమౌ పలుకులొలుక మధురధ్వనులై
  కంజార మందు మ్రోగగ
  పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్.

  కంజారము=ఇల్లు.

  రిప్లయితొలగించండి
 9. అంజీ ! యెక్కడ నుం టివి ?
  ముంజులు మఱి వేగ దెమ్ము మూ షికమునకున్
  నంజుగ బెట్టుద మనగను
  పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్


  రిప్లయితొలగించండి
 10. పండిత గురువులకు నమస్సుమాంజలులతో..

  బాల్యమందున దేవతా భక్తిలేక
  యవ్వనమునందు భక్తియె అసలురాక
  పండువయసున భక్తిగని, పంజరమున
  నున్న చిలుక ఫక్కున నవ్వెన్! ఉర్విజూచి

  రిప్లయితొలగించండి
 11. మంజుల కవితామయమగు
  మంజూషగ నొప్పు సంస్థ మాదనుచు మనో
  రంజకముగ నలరించుచు
  పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 12. అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు.
  మీరు ఇంకా ప్రాథమిక స్థాయిలో నున్నారు. సమస్య కంద పద్య పాదముగా నీయబడినది. మీరు తేటగీతిని వ్రాయ బూనినారు. అందులో కొన్ని గణ భంగములు కలవు. కంద పద్య పాదమును తేటగీతిగా మార్చి చేయగల సాధన ఇంకా మీరు చేయలేదు. అందుచేత అవకాశముంటే కందపద్యముగనే సమస్యను నింపితేనే బాగుగ నుంటుంది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు
  శ్రీ పండిత నేమాని గారికి వందనములు

  కంజాతుని పృచ్చించె ధ
  నుంజయునిటు పేడిసేయ నొప్పున ? యనుచున్
  మంజుల శారద సరసన
  పంజరముననున్న చిలుక పక్కున నవ్వెన్

  మరియొక పూరణ

  మంజుల వీణా రవమున
  రంజింపగజేతుననుచు రమణి తలంచన్
  సంజ గడచె రాడనుచును
  పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 14. రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘కొమరిత + అట’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘అతి గారము’ అని సమాసం చేయడం దుష్టం. అక్కడ ‘కొమరిత యట యత్యనురక్తిన్’ అందాం.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ మనోహర చిత్రాన్ని కళ్ళ ముందుంచింది. చాలా బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ మూడు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో కందపాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన మీ నైపుణ్యానికి వందనాలు. కాని మొదటి పాదంలో గణదోషం. ‘ధరణిపై’ అన్నదానిని ‘ధరణిని’ అంటే సరి!
  *
  వరప్రసాద్ గారూ,
  మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉన్నవి. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘కుంజరమూకలు’ అని సమాసం చేయరాదు కదా! అక్కడ కుంజర సంఘము అందాం.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  వినోదాత్మకంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  ‘ముంజలు’ టైపాటు వల్ల ‘ముంజులు’ అయిందా?
  *
  శైలజ గారూ,
  మంచి బావాన్నిచ్చారు. మీ భావానికి నా కందపద్యం...
  రంజింప బాల్యమందు పు
  రంజనుపై భక్తి లేక బ్రతికి చివరకున్
  కంజాతనేత్రు దలచిన
  పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్!
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలూ మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. సంజ వెలుగుల నీడల
  రంజితమై దిరుగు రజని రాగము విరియన్
  మంజీర నాద మెఱుపుల
  పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 16. ఏంజేయుద మీరోజున
  రంజుగ నను పస్తి నడుగ రాడొకడైనన్
  మంజులవాణీ పల్కన
  పంజరమున నున్న చిలుక ఫక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 17. కుంజమునన్ దాగుకొనుచు
  మంజుల సుతు 'డత్త ' యనుచు మాటలు నేర్వన్
  మంజుల పలుకులు వినగనె
  పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 18. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘సంజ వెలుంగుల నీడల’ అంటే సరి.
  ‘నాద మెఱుపుల’ అని సమాసం చెయ్యడం తప్పే. ‘మజీర నాద రుచులకు’ అనండి. రుచి అంటే కాంతి అనే అర్థం ఉంది కదా!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  వ్యావహారిక పద ప్రయోగంతో మొదలు పెట్టినా మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  పంజరములోని చిలుకను
  నంజుటకై యుఱికె నెలుక; నడుకొని తలుపున్
  గుంజుచు వెలువడి, యెలుకయుఁ
  బంజరమున నున్న, చిలుక పక్కున నవ్వెన్.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 20. గంజాయి త్రాగి దొర్లుచు
  పంజాబీ యువతి నవ్వి పండ్లికిలించన్
  కంజాక్షి మోము జూచుచు
  పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి


 21. A cage is a cage golden or wooden :)

  బంజారా హిల్స్ లోనన్
  వింజామర ఛాయలనరవిందంబని యా
  కంజదళముఖి యనుకొనన్
  పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. గుంజుచు గ్రుద్దుచు మొత్తెడి
  జంజాటము నందు నోడి జైలున నున్నన్
  కుంజరమును గాంచి యచట
  పంజరమున నున్న చిలుక పక్కున నవ్వెన్

  రిప్లయితొలగించండి