3, సెప్టెంబర్ 2013, మంగళవారం

పద్య రచన – 453 (బావ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“బావ”

40 కామెంట్‌లు:


  1. ఫెబ్రవరి పరువం లో వచ్చే ఫైనాన్సు బావ
    ఈ మారు ఆగష్టు లో వేషం గట్టి వచ్చాడు
    ముంబై మరదలు ఖుషీ ఖుషీ గా కైపెక్కి
    పైకీ కిందకీ ఎగసి ఎగసి మేళ మాడింది !




    జిలేబి
    (ఆగష్టు నెల లో స్టాక్ మార్కెట్టు!)

    రిప్లయితొలగించండి
  2. వెనుక ప్రక్కగ నేగి కనులు మూసిన వేళ
    ....వడి చేయి పట్టి ముద్దిడిన బావ
    కమ్మగా నున్నదీ కాయ గైకొనుమన్న
    ....కొరికి సగమ్మిచ్చు కొంటె బావ
    పెండ్లి వేడుకలందు విందు వినోదాల
    ....పరిహాసముల దేల్చు పసిడి బావ
    సంప్రదాయము లొప్పు సంసార సౌధాన
    ....నానందసాంద్రుడై యలరు బావ
    ఒప్పుగా మది నూయల లూచు బావ
    బావ యారాధ్య దైవమ్ము బావ గురుడు
    బావ ప్రాణమ్ము బావయే పరమ హితుడు
    బావ నామమే వదినెకు భాగ్యవరము

    రిప్లయితొలగించండి
  3. బావను గూరిచి సీసము
    ' పావన మూర్తిగను ' జెప్పె పండితవరులే
    భావము బాగుగ నున్నది
    బావలకందరికిదిగద " భాగ్య వరమ్మౌ "

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గోలి వారికి శుభాశీస్సులు. మీ ప్రశంసలకు మా సంతోషము.

    రిప్లయితొలగించండి
  5. జిలేబీ గారూ,
    ఫైనాన్సు, స్టాక్ మార్కెట్టు నాకు కొరుకుడు పడని సబ్జెక్టులు.. ప్చ్..
    *
    పండిత నేమాని వారూ,
    బావ మీద ఇంత చక్కని పద్యాన్ని నేను ఊహించలేదు. అద్భుతంగా ఉంది. ‘సంప్రదాయము లొప్పు సంసార సౌధాన
    నానందసాంద్రుడై యలరు బావ’ అనడం మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    చివరి పాదంలో ‘నామమే వదినెకు’ అన్నది ‘నామ మక్కయ్యకు’ అని ఉండాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నేమాని వారి సీసాన్ని భావల భాగ్యవరంగా గుర్తించి ప్రశంసించినందుకు ధన్యవాదాలు.
    *
    పరుచూరి వండీ గారూ,
    నేమాని వారి పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    చిన్నప్పుడు మేనబావ, మేన వదిన. పెండ్లి తరువాత భర్తను బావా అనే వారుంటారు కదా. అందుచేత బావయే భర్త - ఆ విధముగా నా పద్యమును సవరించ నక్కరలేదు. అక్క బావ వరుసలను నేను ప్రస్తావించ లేదు. నా భార్య కూడా నాకు మేనమామ కుమార్తెయే. మా అమ్మగారు మరియు మామగారు కూడ "కవగా" జన్మించేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి


  8. శ్రీ పరుచూరి వంశీ గారికి శుభాశీస్సులు. మీ ప్రశంసలకు మా సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవుల ధన్యవాదములు

    రాధ తన చెలికత్తెలకు ఈ రీతిన "బావ" కృష్ణుని కొరకు దెలుపు చున్నది
    =====*======
    సరస మాడుటకు దొరకెను సద్గునుడగు వాడు,మంచి
    వరుస గలిపి బిల్వవంగ బంధు వయ్యెను వాడు,పరమ
    పురుషు డని దెలియ వేగ మ్రొక్కితి నేను,ముదమున
    వరములిచ్చి వెడలె వాడు, వాడికై వెదకుచు నుంటి!

    రిప్లయితొలగించండి
  10. అక్క భర్త బావ యగును గదా మఱి
    అత్త కొడుకు బావ యగును నిలను
    మామ కొడుకు బావమరది య గును గద
    వరుస లిటులె యుండు బంధు వు లలొ

    రిప్లయితొలగించండి

  11. కొంగ్రొత్త బావా(బావ)లను పరిచయము జేసిన శ్రీ నేమాని గురుదేవుల ధన్యవాదములు.




    రిప్లయితొలగించండి
  12. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    అక్క మగడు బావ, మగని యన్న బావ,
    మామ కొమరుండు బావయె మహిని జూడ
    మేనమామ కూతు మనసు మెచ్చినట్టి
    అసలు సిసలు బావ మేనత్త కొడుకు.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! Sree T.B.S.Sarma Garoo! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగగనున్నది. 4వ పాదములో ఒక అక్షరము తక్కువ. ఆ పాదమును ఇలాగ మార్చుదామా: "అసలు సిసలైన బావ మేనత్త కొడుకు". స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీపండిత నేమాని గురువులకు సహజ సిద్ధమైన బావామరదళ్ళ అన్యోన్యతను స్వానుభవాన్ని రంగరించి వెలయించిన మీ పద్యం అమోఘం. ఇందు కూడ మీరు తాత్విక దృష్టిని వదలలేదు. మిక్కిలి అభినందన పూర్వక నమస్సులు.

    ఎంకి పాటల నండూరి నిచట నిల్పి
    పద్య భాగాన “బావ” ను పదిల పరచి
    అర్థ భావ సమ్మిళితమై యలరు చున్న
    పంచె పండిత నేమాని పద్య సుమము.

    రిప్లయితొలగించండి
  15. గురువులకు నమస్సులు. చిత్తు ప్రతిలో అలాగే వ్రాసికుని టైపు చేయడంలో తప్పు దొర్లినది. తెలియ జేసి సవరిమ్చినందులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. వరప్రసాద్ మహోదయా! ధన్యవాదములు. పని వత్తిడిలో మీ దూర శ్రవణిని గుర్తించలేదు. నా దూర శ్రవణికి మీఅంత దూరం ప్రయాణంచేసే సౌలభ్యంలేదు. మీ మెయిల్ అడ్రస్ ఇవ్వగోరుచున్నాను.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీరు రాధను గురించి వ్రాసిన పద్యము బాగుగ నున్నది. ఒక సూచన: ఇంద్రగణములను సూర్యగణములను వేయునప్పుడు ఒక్కొక్క గణమునకు ఒక పదము చొప్పున వేయగలిగితే పద్యము మంచి బాగుగ నడచును. అటులనే ఏ పాదమునకు ఆ పాదమును విరిచినటుల భావమును సవరించ గలిగితే చాల బాగుగనుండును.
    మీ పద్యములో: 2వ పాదములో టైపు పొరపాటు ఉందేమో. అలాగుననే 4వ పాదములో వాడిని అనుటకు బదులుగా వానిని అనుట సాధువు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. అక్కకుమగడగుబావన్
    చక్కనిజోడగు వరుసకు చెల్లెలిభర్తగున్
    హక్కుగమేనమామకుతా
    నక్కడసుతుడగునుబావనలుగురుమెచ్చన్

    హితుడుగనిలుచునుతనుస్నే
    హితుడుగనలరించునెపుడుహితవచనములన్
    సతతము సన్నిహితుడగున్
    జతగా బావని పిలుచుచు జగడములాడున్

    రిప్లయితొలగించండి
  19. పరుచూరి వంశీ గారూ,
    నా వ్యాఖ్యలో టైపాటుకు చింతిస్తున్నాను. మన్నించండి.
    *
    పండిత నేమాని వారూ,
    మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. స్వస్తి!
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘సద్గునుడు, పిల్వవంగ’ ఇవి టైపాటులనుకుంటా.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    బావ వరస అయ్యే వాళ్ళ జాబితా ఇస్తూ చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    చివరి పాదానికి నేమాని వారి సవరణ గమనించారు కదా!
    నేమాని వారిని ప్రశంసిస్తున్న మీ పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.
    *
    శైలజ గారూ,
    మంచి భావాలతో పద్యాలను వ్రాసారు. అభినందనలు.
    కొన్ని లోపాలున్నాయి. నా సవరణలను మీ పద్యాలతో పోల్చి చూసి దోషాలను గుర్తించండి.


    అక్కకుమగడగుబావన్
    చక్కనిజోడగు వరుసకు చెల్లి మగడగున్
    హక్కుగను మేనమామకు
    నక్కడ సుతుడగును బావ నలుగురు మెచ్చన్

    హితుడుగ నిలుచును తనస్నే
    హితుడుగ నలరించు నెపుడు హితవచనములన్
    సతతము సన్నిహితుడగున్
    జతగా బావని పిలుచుచు జగడములాడున్

    రిప్లయితొలగించండి
  20. బావా! యను పిలుపే మది
    కోవావలె తీయనగును కోమలి నగవే
    భావావేశముతో మది
    వేవెలుగులు నింపి చాల వేడుక గూర్చున్

    రిప్లయితొలగించండి
  21. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. గురువుగారు పద్యమును మార్చితిని.
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు, అవునండి చూడలేదు.
    శ్రీ టి బి యస్ శర్మ గారికి ధన్యవాదములు, తప్పక ఇచ్చెదనండి.
    ======*========
    పరమపురుషు డని దెలియ పరుగున జేరితి వాని
    సరసపు బలుకులు వినినె జగములు మరచితి బాగ
    వరుసలు గలువగ బావ వరములు నిచ్చిరి చాల
    వరములు వలదని జెప్ప వానిని వెదకుచు నుంటి!

    రిప్లయితొలగించండి
  22. పండిత నేమాని వారూ,
    కోవా వంటి బావ భావావేశాన్ని కలిగించినందుకేనా అంత అందమైన పద్యాన్ని చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
    మీరు మంచి ప్రయత్నముతో పద్యమును మార్చి వ్రాసేరు. చాలా బాగుగ నున్నది. అభినందనలు.
    సరసపు బలుకులు వినినె : (వినుచు) అందాము;
    జగముల మరచితి బాగ (నంత) అందాము. బాగ అనుట సాధువు కాదేమో - బాగుగ అనుట సాధువు.

    అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.

    బావయె విషయం బగుటను
    భావావేశంబు గలిగి పరువిడె కలమే
    నీవనినది సత్యంబే
    దీవింతును శంకరయ్య! తేజోమూర్తీ!

    రిప్లయితొలగించండి
  24. చిన్న నాటకమాడి చెల్లి సుభద్ర ను
    ...నింద్ర కుమారునికిడిన బావ !
    లక్కయింటను చిక్క, లౌక్యమ్ము జూపించి
    ...యిక్కట్ల నార్పిన చుక్క బావ !
    కురురాజ సభలోనకుంతి కోడ లినీడ్వ
    ...కాపాడినట్టి శ్రీ కరుడు బావ !
    సంగ్రామ రంగాన సంశయమ్ముల దీర్చి
    ...సత్యమ్ము జెప్పిన శౌరి బావ !

    జ్ఞాన మొసగిన వేద విజ్ఞానిబావ !
    వక్ర బుద్దుల నణచిన చక్రి బావ !
    నరుని తరియింప జేసిన నావ బావ!
    బావ రావయ్య నొకసారి ప్రజల బ్రోవ !!!

    రిప్లయితొలగించండి
  25. నక్క బావ - కొంగ బావ విందులు:

    ఒక నక్క బావకు నొక కొంగ బావకు
    ....కుదిరెను స్నేహమ్ము గూర్మి మీర
    అంత వారిరువురు నెంతయు బ్రేమతో
    ....విహరింప సాగిరి విపిన తతుల
    నక్క బావయు నొక్క నాడు విందునకని
    ....కొంగ బావను బిల్చె హంగు మెరయ
    పాయసమ్మును పెద్ద పళ్ళెరమ్మునబోసి
    ....జుర్రుకోమని చెప్పె సోకులాడి
    త్రాగలేదయ్యె యత్నము చేసియును కొంగ
    ....వడి వడిగా నక్క బావ జుర్రె
    ఆ తీరునకు చాల వ్యథనొంది మరియొక్క
    ....పర్యాయమా కొంగ బావ కూడ
    నక్క బావను బిల్చినది విందు కొరకంత
    ....బాగుగ చేసెను పాయసమును
    పోసి దానిని చిన్న మూతి కూజాలోన
    ....నక్క బావ కొసంగె నయము మీర
    నక్క బావయు నంత దిక్కులు చూడగా
    ....గుట గుట ద్రావెను కొంగ బావ
    వారి విందు లటుల పరిహాసములె గాగ
    పరుగు దీసె నక్క బావ యంత
    నట్టి వారి నెయ్య మాదర్శముగ నిల్చె
    యుగ యుగమ్ములందు నొప్పు మీర

    రిప్లయితొలగించండి
  26. గురువులు శంకరయ్య గారు , చక్కటి అంశం ఇచ్చినందుకు ధన్యవాదములు ..అన్ని పద్యాలు అందంగా ఉన్నాయి ..అందరికీ ధన్యవాదములు ...

    ఒక కొంటె మరదలు బావని ఇలా ఏడిపిస్తున్నది ట
    అందమున చూడ రాము బంటైన వాడు
    నాగరికతను జము వాహనమునకీడు
    శుచికి హేమాక్షుఁజంపిన శూరు జోదు
    వసుధలో లేడు మా బావ వంటి వాడు !!

    మా బావ అందంలో రామ బంటుతొ సమానం. ( కోతి) నాగరికతలో యముని వాహనంతో సమానం ( దున్న పోతు) శుభ్రతలో హిరణ్యాక్షుని చంపిన వాడితో సమానం ( వరాహావతారం. పంది)
    మా బావలాంటి వాడు లోకం లోనే లేడు !

    నాకు ఈ పద్యం విన్నప్పటి నుండి ఆ బావ గారు కొంటె మరదలకి పద్యం రూపం లోనే ఎలా సమాధానం చెప్తారో వినాలని కోరిక ..ఇక్కడ ఎవరైనా ప్రయతిస్తే ధన్యవాదములు ...

    ఈ పద్యం నేను జోగారావు గారి బ్లాగ్ లో చదివాను
    http://kathamanjari.blogspot.in/2010/08/blog-post_6303.html

    నా సమాధానం ఐతే

    "అందం లో కాదు రామ బంటుని , అనుకున్నది సాధించడం లో "
    "నాగరికత లో కాదు యమ వాహనాన్ని , నిన్ను భరించవలసి వస్తే "

    రిప్లయితొలగించండి
  27. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
    బావ యన్న వారులేక నా పద్యము బావము లేకున్నది
    =======*=======
    బావా!యన నొక మరదలు
    కోవా యగునట మనమ్ము కోవిధులకు,నా
    బావా యన్న బలుకు నీ
    బావ వినక కష్టబడెను పద్య రచనకున్!

    రిప్లయితొలగించండి
  28. శ్రీ నేమాని గురుదేవుల
    నక్క బావ - కొంగ బావ విందులు నా చిన్న నాటి గురువు గారు శ్రీ మొలుగు పార్థసారధి గారి(తెలుగు పంతులు)పాఠము వలె బహుపసందుగా నున్నది.

    రిప్లయితొలగించండి
  29. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.

    బావయనుమాట వినినంత ప్రణయ మూర్తి
    మరదలలునకు మదిలోన మరులు కలుగు
    భావడోలల విహరిoత్రు బ్రహ్మ గూర్చ
    సతిపతులుగ జీవింత్రు హితులనంగ

    బావ యింటి పెద్ద బాధ్యత వహియించి
    మరదిమరదలులకు మనువు గూర్చి
    చదువుసంధ్యలందు సాయము జేయుచు
    చేరి యత్తమామ సేవజేసె

    బావశ్రీ కృష్ణ పరమాత్మ భారతమున
    సఖుడు గురువును దైవమ్ము సారథిగ ను
    పాండవులను గెల్వగ జేసె యండ నిల్చి
    భరత భూమిని ఆదర్శ బావ యితడు

    రిప్లయితొలగించండి
  30. అత్త కొడుకు బావ యానంద నిలయమ్ము
    కొసరి కొసరి చిలిపి కోర్కె లందు
    వెసను బడక ముదము పాశమై బంధించు
    పసిడి మూట యనగ బావ మనసు

    రిప్లయితొలగించండి
  31. బా యందురు కన్నడమున
    వా యందురు తమిళమందు బళి బళి పిలువన్
    రా యందురు తెలుగున లే
    బ్రాయపు నా ప్రేమ రాయ రావా బావా!

    రిప్లయితొలగించండి
  32. అయ్యా! శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ 3 పద్యములును ముచ్చటగా నున్నవి. అభినందనలు. ఆదర్శ బావ అను సమాసము సాధువు కాదు. బాహుకః అంటే సంస్కృతములో బావ అని అర్థము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  33. ద్రౌపది - పాండవుల వావి వరుసలు:

    ద్రౌపదికి పాండు తనయులు వత్సరమున
    కొక్క సారిగ మారుచు నుందురంట
    పతిగ, బావగ, మరదిగా, వారి లోన
    మరది కాలేడు కాదె ధర్మజుడటులనె
    బావ కాలేడు కద సహదేవు డనఘ!

    రిప్లయితొలగించండి
  34. వంశీ గారి కోరికపై కొంటె.మరదలికి నా సమాధానం...

    మరదల నీవేం తక్కువ
    వరలెదవుగ నీవు రామ వైరికి చెల్లై (శూర్పణఖ)
    వరకృష్ణు క్షీర దాతవు (పూతన)
    మరిజూడగ లక్ష్మికక్క మాటను వినవే ! (పెద్దమ్మ)


    రిప్లయితొలగించండి
  35. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.

    బావను చేరిన మరదలు
    కోవాతినిపింతు ననుచు కోరిక దీరన్
    బావ ముఖము నందు పులిమె
    గావిరిచెందిరము పసుపు కైసేయంగ న్

    బావాపన్నీర నుచును
    బావపయిన్ బంతిపూలు వలచుచు నాడన్
    సేవలుజేసేదమనుచును
    నీవారము పోసి మేము నీవారమనెన్

    నీవా నేనా యనుచును
    బావపయిన్ పూవుటమ్ము వరుసగ వేయన్
    నీవే నేనై తిని యని
    బావపలుక సిగ్గుపడుచు పరవశ మొందెన్

    రిప్లయితొలగించండి
  36. మంద పీతాంబర్ గారూ,
    పాండవులకు అడుగడుగునా మేలు చేసిన బావ కృష్ణుని గురించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఎప్పుడో చిన్నప్పుడు చదువుకొన్న నక్క - కొంగల కథకు సీసమాలికలో మనోజ్ఞమైన పద్యరూపాన్నిచ్చి ఆనందింపజేశారు. ధన్యవాదాలు.
    *
    పరుచూరి వంశీ గారూ,
    మరదలి కొంటె పద్యం చాలా బాగుంది. ఇది నాకు క్రొత్తది. ఎప్పుడూ వినలేదు. మీరిచ్చిన భావంతో కాకున్నా గోలివారు చక్కని పద్యం చెప్పారు. చూడండి.
    *
    వరప్రసాద్ గారూ,
    మరదళ్ళు లేని బాధను చక్కగా చెప్పారు. అభినందనలు.
    మనలో మాట... నాకూ మరదళ్ళు లేరు. మా అత్తామామలకు మా ఆవిడ ఒక్కతే కూతురు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘మరదలలునకు...’?.. ఆ పాదాన్ని ఇలా మారుద్దాం. ‘మరులు కలుగు మరదళ్ళకు మనమునందు’
    బావామరదళ్ళపై ఖండికా రూపమైన మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    మూడవ పాదంలో యతి తప్పింది.
    *
    పండిత నేమాని వారూ,
    రా రమ్మంటూ కవితామాధుర్యాన్ని జుర్రుకోమంటున్నారు. ధన్యులము.
    పాండవులతో వరుసలకు సంబంధించిన పద్యం చాలా బాగుంది. దీని మూలశ్లోకం ఒకటుంది. గుర్తుకు రావడం లేదు. (గతంలో ‘చమత్కార పద్యాలు’ శీర్షికలో చెప్పానేమో?)
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వంశీ గారి కోరికను తీరుస్తూ వ్రాసిన పద్యం బాగుంది. అభినందనలు.
    కానీ ‘నీవేం, చెల్లై’ అన్న వ్యావహారికాలను ప్రయోగించారు. మీ భావాన్ని తేటగీతిలో ఇమిడ్చే ప్రయత్నం చేసాను.
    మరదలా! నీకు గలదేమి కొరత? వినుము,
    వరలెదవు రామవైరి సోదరి వగుచును
    క్షీరదాతవు గోపాల కృష్ణునకును
    లక్ష్మికే యక్క వీవు భళా! భళి! భళి!

    రిప్లయితొలగించండి
  37. మాస్టరు గారూ ! భళా! భళి! భళి ! బాగున్నది.
    ధన్యవాదములు.

    నా పద్యమునకు సవరణ...సరిపోతుందంటారా...

    మరదల తక్కువ నీవా ?
    వరలెదవుగ చెల్లి రామ వైరికి నీవై ! (శూర్పణఖ)
    వరకృష్ణు క్షీర దాతవు (పూతన)
    మరిజూడగ లక్ష్మికక్క మాటను వినవే ! (పెద్దమ్మ)

    రిప్లయితొలగించండి
  38. శ్రీ కంది శంకరయ్య గారు & శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
    శుభాశీస్సులు.
    "క్షీరదాత" అనే శబ్దము పురుషవాచకము కదా. క్షీరదాత్రి/క్షీరదాయిని అంటే సాధువు (స్త్రీలింగము).
    స్వస్తి.

    రిప్లయితొలగించండి