20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

పద్య రచన – 470 (ఋణానుబంధము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“ఋణానుబంధము”

22 కామెంట్‌లు:

 1. మేనునకు బంధ నములట
  నేనూ నాదను మమతల నీహా మృగముల్
  మానస మున భగ వంతుని
  ధ్యానించిన ఋణ విముక్తి తరియించ దగున్ !

  ఈహా మృగము = తోడేలు మాయ లేడి

  రిప్లయితొలగించండి
 2. ఋణము చేయగవచ్చు ఋణము వీలైనంత
  ....త్వరగనే తీర్చుట ధర్మమగును
  అటుల దీర్చకయుండు నాతడు ఋణదాత
  ....పుత్రుడై పుట్టును పుడమి పైని
  అటుల జన్మమునొంది యా తండ్రి ఋణమెల్ల
  ....తీర్చుచో ఋణమెల్ల తీరిపోయి
  అనుబంధ మంతయు నారీతి జెల్లును
  ....చాలించు పుత్రుడు జన్మ మవని
  ఋణము చెల్లినంత క్షణమైన నిలువరు
  కాన ఋణమె జన్మ కారణమ్ము
  అదియె తెలియబడు ఋణానుబంధమ్మని
  శ్రేయమొదవు ఋణము లేని విధము

  రిప్లయితొలగించండి
 3. పశు గణంబులు సుతులును పత్ని యరయ
  ఋణమున కనుబంధములుగ బృధివి యందు
  కలుగు చుందురు మఱి ఋణ ములుము గియగ
  పోవు చుందురు నిజమిది పూవు బోడి !

  రిప్లయితొలగించండి
 4. ఈ ఋణములవే నాటివో యిచట పతియు
  పత్ని సంతానమందుచు పాప పుణ్య
  చయము ననుభవించుచునుంద్రు- సహజమిదియె
  పెద్దవారి మాట, నిజము; వింతగాదు.

  రిప్లయితొలగించండి
 5. తల్లిదండ్రి ఋణము తనయుడై దీర్పంగ
  ఋషుల ఋణము దీర్ప కృషిని సల్పి
  దైవ ఋణముదీర్ప ధన్యుడే యగుగాని
  తీరనప్పు లవియె తీరు గనుడు.
  (తీరవెపుడు జన్మ తీరు గనుడు)

  రిప్లయితొలగించండి
 6. ఇన్నిజన్మల బంధనమ్ములు ఏఋణమ్ముల రూపముల్
  అన్నదమ్ములు ఆలుబిడ్డలు అన్నిబంధము లందరున్
  అన్నివేళల కన్నవారిని ఆదరమ్మున చూచుచున్
  అన్నికర్మలు ఆచరించుచు ఆదిదేవుని గొల్వుమా


  తల్లి ఋణము దీర్చ తనయుని ధర్మంబు
  భోగ భాగ్య మ్ముల పొందు కన్న
  నమ్ము కున్న వారి నట్టేట ముంచని
  తనయులున్నవాడె ధన్య జీవి

  రిప్లయితొలగించండి
 7. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  ఋణానుబంధాన్ని గురించి చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఋణత్రయాన్ని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి.
  రెండవ పద్యం రెండవ పాదంలో గణదోషం.

  రిప్లయితొలగించండి
 8. గురువుగారికి ధన్యవాదములతో...

  తల్లి ఋణము దీర్చ తనయుని ధర్మంబు
  భోగ భాగ్య ములను పొందు కన్న
  నమ్ము కున్న వారి నట్టేట ముంచని
  తనయులున్నవాడె ధన్య జీవి

  రిప్లయితొలగించండి
 9. ఏ ఋణము కారణముగానొ యిట్టి బంధ
  ములిలఁ గలుగును; పసులు, సుతులును, బత్ని,
  గృహ మటంచు? ఋణమ్ము తీఱిన తఱి వెసఁ
  దొలఁగిపోవును! గావున దుఃఖ మేల?

  (ఋణానుబంధ రూపేణ, పశుపత్నీసుతాలయాః|
  ఋణక్షయే క్షయం యాంతి, కా తత్ర పరిదేవనా||)

  రిప్లయితొలగించండి

 10. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  ధనములుండవలయు ధర్మ జీవనముకై
  ధనము పొంద జనులు రుణముసేయ
  ఋణము దీర్చకున్న జనమలు కలుగును
  జనమలంతమౌను ఋణము దీర

  ధనమును, ఋణమును, జనములు
  వినియోగిoపంగ కలుగు విద్యుత్ శక్తుల్
  వినుమా దీనినె యందురు
  రుణానుబంధమ్ము యనుచు దృష్టాంతముగా

  కలదు వింత గాధ కాశీ పురమ్మున
  ఋణము దంపతులకు ధనము సుతుడు
  ఆమ్ల వాహకముగ నారెండు కలుపుచు
  మౌన యోగి యొకడు జ్ఞాననిధియె

  పనుప చింతామణీ గురువు పాదరక్ష
  లిడిరి దంపతుల్ యోగికి నిసుక యందు
  ఎండ వేడిమి బాధ భరించలేక
  తొడిగె పాదరక్షలు యోగి పడెను ఋణము

  ఋణము తీర్చంగ యోగికి జనమ కలిగె
  జనమ నుండి విముక్తికై జాలినంత
  ధనమునార్జిoచి నాయోగి ఋణము దీర్చు కొనుచు
  బ్రహ్మమున్ జేరుకొనియె ననగ

  ధనము పురుషుడవంగను, ఋణము ముదిత
  కలియ నూతన సృష్టికి కారణ మయి
  సంతు కలుగంగ జీవిత చక్రమందు
  ధనము ఋణముల నడుమను తగులుకొంద్రు

  రిప్లయితొలగించండి
 11. ఋణము తెచ్చుకొన్నను దీర్చి ఋణవిముక్తి
  పొందవలయును లేకున్న నిందవచ్చు
  ఋణము జేసిన ప్రజ లభివృద్ధి లేక
  కష్టముల నొందుచుండుట కానవచ్చు.

  రిప్లయితొలగించండి
 12. ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః|
  ఋణక్షయే క్షయంయాతి కా తత్ర పరివేదనా||
  తా. సకలజనులకు పశువులు, పెండ్లాము(భార్య), కొమాళ్ళు, ఇండ్లును(ఆలయము - 1.ఇల్లు 2.స్థానము 3.కలిసిపోవుట 4.గుడి), జన్మాంతర ఋణసంబంధముల చేత గలిగి, ఋణము తీరగానే నశించు చున్నవి. కాబట్టి చింతించుటవలన లాభమేమి. - నీతిశాస్త్రము

  రిప్లయితొలగించండి
 13. గుండు మధుసూదన్ గారూ,
  ప్రఖ్యాతమైన శ్లోకానికి మీ అనువాద పద్యం బాగుంది. అభినందనలు.
  ‘సుతాలయః’కు ‘సుతాదయః’ అన్న పాఠాంతరం ఉన్నట్టుంది?
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  ఖండికా రూపమైన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘జనమ’... ‘జన్మ’కు వికృతి కాదు. ఆ శబ్దం గ్రామ్యమే.
  ‘బంధమ్ము + అనుచు’ ... సంధి నిత్యం. యడాగమం రాదు. దానిని ‘బంధ మ్మటంచు’ అనండి.
  ‘చింతామణీ గురువు’ అంటే గణదోషం. ‘చింతామణి గురువు’ అంటే సరి.
  ‘ఆర్జించి యా యోగి’ అనండి. ‘బ్రహ్మమున్ దాఁ జేరుకొనియె’ అనండి. లేకుండే గణదోషం.
  ‘అవంగను’ సాధువు కాదు. ‘పురుషుడై యుండగ’ అందామా?
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  *
  సాహిత్యాభిమాని గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి