గాంధీ మళ్ళీ పుట్టి బ్రాందీ బతుకుల జూసి ఏమయ్యింది దేశానికి నాదేశానికి విచారించి మళ్ళీ సత్యాయుధం బట్టి జైలుఖానా కి జేరి బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ. !!
రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. అభినందనలు. మూడవ పాదంలో గణదోషం. దానిని ‘మౌనముగా మిన్నకునికి’ అందాం. * పండిత నేమాని వారూ, నయమైన పూరణ చెప్పరు. సంతోషం. అభినందనలు. గాంధీని స్తుతిస్తూ బ్లాగుకే శిఖరాయమైన పద్యాన్ని చెప్పారు. ధన్యవాదాలు. * జిలేబీ గారూ, మీ భావానికి మిత్రులెవరైనా పద్యరూపాన్నిస్తారేమో చూద్దాం. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ తేనియలూరుతున్నది. అభినందనలు. * మంద పీతాంబర్ గారూ, జనగణం మెచ్చే రెండు పూరణలు చెప్పారు. అభినందనలు. రెండవ పూరణలో ‘ఈనాటి + అవినీతి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘ఈనాటి కునీతి..’ అనండి. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. కాని కొన్ని లోపాలు.. మీ పద్యానికి నా సవరణ.... మానమునే యమ్ముకొనుట బానిస బ్రతుకే, నయమని పలికెను గాం ధీ పూనికతో ప్రాణములిడి మానక స్వాతంత్ర్య మిపుడు మనకు లభింపన్. * శైలజ గారూ, మంచి ప్రయత్నం.. కాని కొన్ని లోపాలు. నా సవరణ... మానమ్ములు తొలగియు నభి మాన మ్మంగడులబడిన మాదిరి కనగా హీనమ్ముగనయి నానది బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి సమస్యకు వచ్చిన వివిధములైన పూరణలు చాలా బాగుగ నున్నవి. అందరికీ అభినందనలు. శ్రీ వరప్రసాద్ గారి 3 పద్యములు ప్రశంసార్హములై నున్నవి. స్వస్తి.
కాని పని జేసి జగతిని
రిప్లయితొలగించండిహీనముగా బ్రతుకు టన్న హేయము గాదే ?
మౌనము గా మిన్నకున్న
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
స్వయముగ నిలబడ లేమా?
రిప్లయితొలగించండిభయమేలనొ? కాంచుడిదొక బానిస బ్రతుకే,
నయమని పలికెను గాంధీ
జయ భారత మాతృసేవ సౌజన్యముతో
రిప్లయితొలగించండిగాంధీ మళ్ళీ పుట్టి బ్రాందీ బతుకుల జూసి
ఏమయ్యింది దేశానికి నాదేశానికి విచారించి
మళ్ళీ సత్యాయుధం బట్టి జైలుఖానా కి జేరి
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ. !!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూనుచు వినుమా విడుమా
రిప్లయితొలగించండిబానిస బ్రతుకే, నయమని పలికెను గాంధీ
జ్ఞానము సంపాదించుచు
మానవుడే స్వేచ్ఛగాను మనుచుండినచో.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినానా విధ స్కాములు కుహ
రిప్లయితొలగించండినా నాయకులెల్ల జేయ నయనమ్ములతో
నా నాకమునుంచి గనుచు (కానగ లేకను వీరికి)
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
బానిస బ్రతుకు కన్న మరణమే మేలని నిరాశతోఁ జావఁ గోరు నొక భారతీయునకు ధైర్యముఁ గూర్చుచు గాంధీ పలికిన సందర్భము…
రిప్లయితొలగించండి“నేనుంటి, స్వేచ్ఛఁ గొను, మో
బానిస! బ్రతుకే నయ”మని పలికెను గాంధీ
తేనియ లూరెడి స్వేచ్ఛా
గానము వినిపించి, ప్రజకు జ్ఞానముఁ బెంచన్!
కాననివాడైనననడు
రిప్లయితొలగించండిబానిస బ్రతుకే నయమని ; పలికెను గాంధీ
మానవ ప్రగతికి స్వేచ్చా
గానమె ప్రాణమ్మని జనగణములు మెచ్చన్ !!!
మానని ధైర్యోత్సాహము
రిప్లయితొలగించండిలేనాఁటికి తరిగిపోనివీ సాహసముల్
పూనికఁ జేపట్టుము ఓ
బానిస! బ్రతుకే నయమని పలికెను గాంధీ.
ఆనాకము నుండి జూచెను
రిప్లయితొలగించండినీనాటవినీతినెల్ల నీశ్వర యనుచున్ ,
నీ నల్లదొరలువల దా
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ !!!
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో...
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
భారతదేశమున మహాత్మాగాంధి మరల దిరుగుచుండ
======*=======
మానవ రూపమున దిరుగ
వానర విద్యలను నేర్చి పరితోషమునన్
గానము జేయగ ఖలులను
బానిస బ్రతుకే నయమని బలికెను గాంధీ!
=======*==========
గయుని వలె దిరిగెడి జనుల
భయమ్మును గనుగొని నాటి బానిస బ్రతుకే
నయమని బలికెను గాంధీ!
దయలేని ప్రభుతలు వేయు దండన ములకున్!
=======*=======
మాన హీనులు మంత్రులుగను- మానవ సేవను మరచి
వానర, రాక్షస తతిని - పావనులని గొలువంగ
దానవ రాజ్యము నందు- దన వారలను గని,నాటి
బానిస బ్రతుకే నయమని- బలికెను గాంధీ!మహాత్మ!
రిప్లయితొలగించండిమానమునే నమ్ముకొనుట
బానిస బ్రతుకే నయమని పలికెను గాం ధీ
పానంబు లిచ్చియైనను
మానక స్వాతంత్ర్య మిపుడు మనకుం దేవన్
మహాత్ముని తలచు నపుడు వారికి అంజలి ఘటించవలెనను భావముతో:
రిప్లయితొలగించండిశిఖరిణి:
మహాత్మా గాంధీజీ! మహిత గుణ సంపన్న హృదయా!
సుహృద్భావౌన్నత్యా! సురుచిర యశశ్శోభిత! సదా
అహింసా యుక్తాత్మా! భువన హిత! సత్యాగ్రహ బలా!
అహో! నేతా! పుష్పాంజలి నిడుదు నత్యాదరమునన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువులకు నమస్కారములతో...
రిప్లయితొలగించండిమానమ్ములుపోయి అత్మాభి
మానము అంగడులబడిన మారణాలు కనగా
హీనమ్ముగానయి నానది
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. దానిని ‘మౌనముగా మిన్నకునికి’ అందాం.
*
పండిత నేమాని వారూ,
నయమైన పూరణ చెప్పరు. సంతోషం. అభినందనలు.
గాంధీని స్తుతిస్తూ బ్లాగుకే శిఖరాయమైన పద్యాన్ని చెప్పారు. ధన్యవాదాలు.
*
జిలేబీ గారూ,
మీ భావానికి మిత్రులెవరైనా పద్యరూపాన్నిస్తారేమో చూద్దాం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ తేనియలూరుతున్నది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
జనగణం మెచ్చే రెండు పూరణలు చెప్పారు. అభినందనలు.
రెండవ పూరణలో ‘ఈనాటి + అవినీతి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘ఈనాటి కునీతి..’ అనండి.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
కాని కొన్ని లోపాలు.. మీ పద్యానికి నా సవరణ....
మానమునే యమ్ముకొనుట
బానిస బ్రతుకే, నయమని పలికెను గాం ధీ
పూనికతో ప్రాణములిడి
మానక స్వాతంత్ర్య మిపుడు మనకు లభింపన్.
*
శైలజ గారూ,
మంచి ప్రయత్నం.. కాని కొన్ని లోపాలు. నా సవరణ...
మానమ్ములు తొలగియు నభి
మాన మ్మంగడులబడిన మాదిరి కనగా
హీనమ్ముగనయి నానది
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
“ఓ నవ భారత యువకుడ !
రిప్లయితొలగించండియీ నీచపు బ్రతుకు లిట్లు యీడ్చుట తగునా ?
మానుటె వరమౌ నెట్టుల
బానిస బ్రతుకే నయ? "మని పలికెను గాంధీ
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిమానము ప్రాణము దోచుచు
హీనులుగా బ్రతుకు ధర్మహీనులకంటెన్
దీనులనార్తిని తీర్చిన
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
మరియొక పూరణ
ఆనాడు గాంధి మహాత్ముడు
దీనులుగా బ్రతుకు భరత దేశీయులకున్
మానగ ఆలోచనలను
‘బానిస బ్రతుకే నయమని’ పలికెను గాంధీ
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు శిఖరిణి వృత్తము అద్భుతమైన పద్యము.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్యకు వచ్చిన వివిధములైన పూరణలు చాలా బాగుగ నున్నవి. అందరికీ అభినందనలు. శ్రీ వరప్రసాద్ గారి 3 పద్యములు ప్రశంసార్హములై నున్నవి. స్వస్తి.
దేశ పరిస్థితి జూసి భరత మాత
రిప్లయితొలగించండిదీన వదనయై కన్పడ
నానాకమునుండి నిస్సహాయత తోడన్
"జననీ భారతి వీరికి
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ"!
గానము గార్దభరవమై
రిప్లయితొలగించండిమౌనమ్మున నుండలేక మ్రగ్గుటకంటెన్
దానము జేయుచు రాజ్యము
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ ;)
జానెడు నిటలీ దేశపు
రిప్లయితొలగించండిదీనులు రోమను జనములు తికమక బుద్ధిన్
సోనియ నెన్నక రాణిగ
బానిస బ్రతుకే నయమని పలికెను గాంధీ
రిప్లయితొలగించండిఏనాటికైన నింగ్లాండ్
బానిస బ్రతుకే నయమని పలికెను; గాంధీ
మానక సత్యాగ్రహమున్
దీనావస్థ తొలగింప తీరుగ చేసెన్ !
జిలేబి