22, సెప్టెంబర్ 2013, ఆదివారం

పద్య రచన – 472 (విశ్వాస ఘాతకుఁడు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“విశ్వాస ఘాతకుఁడు”

16 కామెంట్‌లు:

  1. శ్రీ కంది శకరయ్య గురు దేవులకు మరియు పండిత నేమాని గురు వర్యులకు నమస్కారములు, సాహితీ మిత్రులందరకు శుభోదయంతో నమస్కారములు.

    విశ్వాసము శునకమునకు
    శాశ్వతముగ నిలచియుండు సహజగుణంబై,
    విశ్వాస ఘాతకుల కిల
    నశ్వరమౌ జీవితమ్ము నరకము కాగా.

    రిప్లయితొలగించండి
  2. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    ఎన్నికల యందు విశ్వాసమెంతొ జూప
    నెన్నికలలతో జనులంత నెన్నుకున్ను
    నేత మరువ తా చెప్పిన నీతులన్ని
    యదియె విశ్వాస ఘాతక మనగ చెల్లు
    వాని నేమని యందురు వార్త లందు?

    రిప్లయితొలగించండి
  3. శ్వానము విశ్వస నీయము
    మానవ నైజమున కంటె మాయల కంటెన్
    కానగ విశ్వాస ఘాతకు
    లీ నేలను దొరకని దొర లేయనగన్

    రిప్లయితొలగించండి
  4. విశ్వాసము జూపనిచో
    నా శ్వానము వలెనె బుట్టు నవనిని నరులే
    విశ్వాసము జూపంగ న
    విశ్వాసపు పాపమపుడు వీడును గాదే !

    రిప్లయితొలగించండి
  5. జన్మ నిచ్చిన వారిని జంపు వారు
    తిన్న ఇంఠికి వాసాలు తీయు వారు
    చేయు మేలుకు చేటును చేయు వారు
    విశ్వాసఘాత కులనగ వీరు గాదె

    రిప్లయితొలగించండి
  6. సాయపడిన వారిని తాము చావు దెబ్బ
    తీయ కుట్రలు పన్నుచు తెలివి మీరి
    కలియ తిరిగెడి విశ్వాస ఘాతకుల,స
    జీవ దహనము దయలేక జేయ వలెను

    రిప్లయితొలగించండి
  7. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    నాల్గవ పాదంలో గణదోషం... మీ పద్యానికి నా సవరణ....
    జన్మ నిచ్చిన వారిని జంపు వారు
    తిన్న ఇంటి వాసమ్ముల నెన్నువారు
    చేయు మేలుకు చేటును చేయు వారు
    కనగ విశ్వాసఘాత కు లనబడుదురు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. లేదు లేదని వచ్చిన బీద వాని
    చేర దీ సియు మఱియును జిదిమి పండ్లు
    కోసి యిచ్చెను దినుమని , క్రూరు డతడు
    కత్తి ఝ ళిపించె విశ్వాస ఘాత కుండు

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    జంతుజాలము కుండు విశ్వాస గుణము
    చేత మరువవు మేలును ప్రీతులగుచు
    మనసు బుద్ధ్యహంకృతులను మనిషి పొంది
    ఊత నిచ్చిన వారినే నూత ద్రోయు

    నాడీజంఘు౦డను బక
    మోడక మానవునకు హితమొనరింప౦గా
    కీడొనరించెను స్వార్ధము
    తోడవ బకమును వధించె దుష్టాత్ముండై
    పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    రిప్లయితొలగించండి
  10. తిమ్మాజీ రావు గారూ! మనిషి గూడ ఒక పశువే అయిన విజ్ఞత చేతనధికుండయి విశ్వాసగుణము లేనివాడగుచున్నాడను మీ పద్యము చాల బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నాడు నేడు కలదు నరులను ప్రభుభక్తి
    కలదు నమ్మకమున ఘాతకమ్ము
    మానవ గుణములివి మారశక్యమగునె?
    లాభనష్టములవి రాతఫలము.

    రిప్లయితొలగించండి
  12. వరకట్నమ్ములు వలదని
    వరులందరియెదుట చేసె వాగ్దానమ్ముల్
    "హరి"యనుచు పిల్లనీయగ
    హరియించెను సొమ్ములన్ని, ఆహా! అరియె.

    రిప్లయితొలగించండి
  13. కాళ్ళకూరి నారాయణ రావుగారి పద్యం:

    అర్ధాంగ లక్ష్మియైనట్టి యిల్లాలిని తమయింటి దాసిగా తలచువారు

    చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లాము నూరక యేడ్పించువారు

    పడపుగత్తెల ఇండ్ల బానిసెంచై ధర్మపత్ని యన్నను మండిపడెడివారు

    బయట నెల్లరచేత పడివచ్చి యింటను పొలతినూరక తిట్టి పోయువారు

    పెట్టుపోతల పట్లగలట్టి లోటు తిట్టుకొట్టులతోడను తీర్చువారు

    ఖలులు, కఠినులు, హీనులు, కలుషమతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    తల్లిదండ్రులను
    పూజించనివారూ
    పట్టించుకోనివారూ
    హింసించేవారేగదా
    విశ్వాసఘాతకులు :

    01)
    ___________________________________

    సర్వశక్తులు విద్య బుద్ధులు - జన్మనిచ్చిన వారలన్
    పర్వమేయని ప్రేమతోడను - పట్టుకొనకే పాదముల్
    గర్వపోతులు బుద్ధిహీనులె- కన్నవారికి కూళలే
    సర్వదామరి వారలే గద - సంప్రసాదపు ఘాతకుల్ !
    ___________________________________
    కూళలు = క్రూరులు
    సంప్రసాదము = విశ్వాసము

    రిప్లయితొలగించండి