11, సెప్టెంబర్ 2013, బుధవారం

సమస్యాపూరణం – 1171 (పాయసమ్మునఁ గారమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పాయసమ్మునఁ గారమ్ము వేయఁదగును.

19 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు శుభోదయం...
    ఈమధ్య నా ఇంటర్‌నెట్ ఇబ్బంది పెడుతున్నది. ఈనాటి పద్యరచన, సమస్యలను షెడ్యూల్ చెయ్యడానికి నిన్న సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. ఇప్పుడుకూడా ఇది నా సిస్టం కాదు. వ్యాఖ్యలు పోస్ట్ చేయాలన్నా ఇబ్బంది అవుతున్నది.

    రిప్లయితొలగించండి
  2. రాజకీయములందు చిత్రములు మెండు
    నాల్గు కాలాలు బ్రతుకంగ నాయకులకు
    కలవనేక ప్రణాళికల్ కాంచు డొకటి
    పాయసమ్మున గారమ్ము వేయవలెను

    రిప్లయితొలగించండి
  3. పెండ్లివారింటికి వేంచేసిన వియ్యాలవా రాఁడు పెండ్లివారితో మేలమాడు సందర్భము...

    "పాయసమ్మునఁ గారమ్ము వేయవలెను;
    కూరలోఁ జక్కెరను వేయగా రుచియగు;
    మజ్జిగా యిది? పా"లని మఱి మఱి నగి,
    మేల మాడిరి యచట వియ్యాలవారు!

    రిప్లయితొలగించండి
  4. వేడియున్నపుడును తేనె వేయవలెను
    పాయసమ్మున; గారమ్ము వేయదగును
    కూరలకు మంచి గుణములు కోరికోరి
    జిహ్వకింపైన రుచు లను చేర్చుటకయి.

    రిప్లయితొలగించండి
  5. వేడి యుండగ చక్కెర వేయదగును
    పాయసమ్మున , గారమ్ము వేయదగును
    ఆలు వేపుడు రుచిగను నాహ రించ
    ఉప్పు కారాల వలననే నొప్పు కూర .

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురుదేవులకు నమస్సుమాంజలులతో

    పాలయందును కలియును పంపునీరు
    పంచదారను చేరును పాడురవ్వ
    పాయసమ్మున గారమ్ము వేయదగును
    కల్తీ గానిదేమున్నది కాలమందు...

    పాయసమ్ము చేయగ పరమశుభము
    పాయసమ్ము ను తిన్నను పరమ రుచియు
    పాయసమ్ము న మమకారపాలు కలిపి
    పాయసమ్మున గారమ్ము వేయవలెను ...

    రిప్లయితొలగించండి
  7. తినుట భారమౌ కారమ్ము తీపిలేక
    వేరు వేరైన రుచులకై ,వేయదగు ప
    కోడి యందున కారమ్ము;కూడదుగద
    పాయసమ్మున కారమ్మువేయ;దగును
    పంచ దారను వేయంగ పాలతోడ !!!

    రిప్లయితొలగించండి
  8. జీడి పప్పులు పలుకులు వాడవలెను
    పాయసమ్మున ; గారమ్ము వేయదగును
    కూర లందున తగురీతి, కొత్తిమీర
    కాడ లల్లము వెల్లుల్లి కలుప దగును

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    సరదాగా:
    =====*=====
    చీమలను జంపి దినిచున్న దోమలకును,
    చక్కెరకు సరితూగెడి సహజులకును,
    పాయ సమ్మున గారమ్ము వేయ దగును
    శాప భయము వలదు నీకు సత్యభామ!

    ( చీమలను = సామాన్యులను, దోమలకు= రాక్షసులకు )
    ======*=======
    పగ"టి" నిగనిగల తోడ పచ్చనోట్లను పొందినట్టి
    నగరజీవి సద్గురువని నమ్మి దిరుగు చున్న పాప
    "జగతి" జనులకెల్ల పాయ సమ్మున గారమ్ము వేయ
    దగును,పాప భయము వలదు ధరణి పైనను సత్యభామ!
    (పగ= పగలు "టి" ట్రేడ్ మార్క్, పగ"టి" = అధికారము, నగరజీవి= కలుషమ్మున దిరుగువాడు)
    =====*======
    వలదు వలదు చెల్లి పాయస మందున,
    పండుగ దినమందు బావతోడ
    సరసమాడ పాయ సమ్మున గారమ్ము
    వేయ దగును నీవు వేడ్కతోడ!

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ,
    రాజకీయప్రణాళికలపై మీ వ్యంగ్యోక్తిగా పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    వియ్యాలవారి ఛలోక్తిగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీరూ జయసారథి గారి బాటే పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘వేయ నొప్పు నాలువేపుడు..’ అనండి.
    *
    శైలజ గారూ,
    మీ మొదటి పూరణ కల్తీల గురించి, రెండవ పూరణ మమ‘కారం’ గురించి చెప్తూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పాదంలో ‘పాయసమును’ అనడంలో టైపాటువల్ల ను పోయినట్టుంది.
    *
    మంద పీతాంబర్ గారూ,
    కూడదంటూ సమస్యను పరాస్తు చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. వాయ సమ్ములు తినగను పాయ సమ్ము
    తీపి తరుగుచు తరుగుచు తిక్త మవగ
    మనిషి మనిషికి నడుమను మమత బెంచ
    పాయ సమ్మున ఁ గారమ్ము వేయఁ దగును

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు
    శ్రీ పండిత నేమాని గారికి వందనములు

    కలిసియుండిన తెలుగులఖ్యాతి ప్రగతి
    యినుమడింపగ కొందరి కనులు కుట్ట
    జీడిపప్పులు కిసిమిసుల్ క్షీరమిళిత
    పాయసమ్మున గారము వేయవలెను
    యనుచు తెలగాణ మును విభజన మొనర్చె

    రిప్లయితొలగించండి
  13. వేయ వలయును చక్కెర, నేయి, తేనె
    పాయసమ్మున; గారమ్ము వేయ దగును
    కూరలోన తగు విధమ్ము, కొత్తిమీర,
    ఉల్లి, వెల్లుల్లి, కరివేప, ఉప్పు కూడ

    రిప్లయితొలగించండి
  14. బాగు కానట్టి మధు మేహ రోగ మున్న
    వార లాహార నియమాలు, వైద్యుల సల
    హాలు పాటింపగా వలె నందు వలన
    పాయసమ్మున గారమ్ము వేయ దగును

    రిప్లయితొలగించండి

  15. పాయసమ్మును వండగా పత్ని నడిగి
    పంచదారను తెమ్మని భార్య చెప్ప
    బద్ధకముతోడ నిట్లనె భర్త 'నేడు
    పాయసమ్మున గారమ్ము వేయవలెను.'

    రిప్లయితొలగించండి
  16. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వలెను + అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘వలెన/టంచు’ అనండి.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు.
    ఎంత మధుమేహ రోగులైనా పాయసంలో కారం వేసుకుంటారా? :-)

    రిప్లయితొలగించండి
  17. మిస్సన్న గారూ,
    బద్ధకిస్టు మొగుడిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. రోషమిసుమంత చూపక రోజుగడపు
    పాలకులకును రోషము పట్టజేయ
    సభకు దయచేయుడంచును చాల బిలచి
    పాయసమ్మున గారమ్ము వేయదగును.

    రిప్లయితొలగించండి