ఐన నేమాయె ! _____________________________ కృష్ణశాస్త్రిగారి "కృష్ణపక్షము" నుండి
****** 03) మీరు మనసారగా ..... _____________________________
మీరు మనసారగా నేడ్వ - నీరు నన్ను ! నన్ను విడువుడు ! ఒకసారి - నన్ను విడచి నంత, యేకాంత యవనికా - భ్యంతరమున వెక్కి వెక్కి రోదింతును, - విసువు లేక విరతి లేక దుర్భర శోక - విషమ గీతు లేడ్చి వైతు ! ఎలుంగెత్తి - యేడ్చి వైతు !
ఈ మహానంద వీచికా - స్తోమడోలి కాగ్రముల నింక నే నాట్య - మాడ లేను ! నేను చిరునవ్వు పెదవుల - నిలుప లేను ! ఏ విరామ మేనియు లేని - యీ శుభోత్స వప్రణయ కేళికామోద - భార మింక నేను వహియింప లేను ! జీ - వింప లేను ! _____________________________ కృష్ణశాస్త్రిగారి "కృష్ణపక్షము" నుండి *****
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, అరణ్యరోదనాన్ని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. మూడవ పాదాన్ని ఇలా మార్చండి. ‘బాధలను వీడి స్వార్థ భావాల నుండ’ * వసంత కిశోర్ గారూ, కృష్ణశాస్త్రి గారు ఎన్ని రకాలుగా రోదించారు సోదాహరణంగా చెప్పారు. ధన్యవాదాలు. ‘రోదనము లేక జీవి లేడు’ అన్న మీ పద్యం బాగుంది. అభినందనలు. * శైలజ గారూ, చాలా మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు. ‘భుక్తికై యేడ్చును, పొగిలి తా నేడ్చును’ అనండి. * రాజేశ్వరి అక్కయ్యా, బాగుంది మీ పద్యం. అభినందనలు. (ఇది స్వానుభవమా?) చివరి పాదంలో గణదోషం. ‘పగుల నదె రోదించెన్’ అనండి. * పండిత నేమాని వారూ, ఆదిదంపతులకు నమస్కరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, ఒకరి అమ్మ, అందరి అమ్మల గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, ‘రోదనము లేని రోజు గలదె’ అంటూ మీరు చెప్పిన రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ఒక పెద్ద సంతలో నొకనాడు పెనువాన ....కురిసి నష్టము వర్తకులకు గూర్చె నా "ఉప్పు" నీరయ్యె నాకేమి గతియింక ....నని ఉప్పు నమ్ము వ్యాపారి యేడ్చె నా పప్పు తడిసెనే నా కేమి దారంచు ....పప్పుల నమ్ము వ్యాపారి యేడ్చె నా కెంతయో కదా నష్టమను కొ ....బ్బరి కాయలమ్ము వ్యాపారి యేడ్చె నా కేమి దిక్కు రన్నా! చెడినానంచు ....తమలపాకమ్ము వర్తకుడు వ్రేలె ఉప్పు వానినేని పప్పు వర్తకునేని పలుకరించ రైరి ప్రజలు కాని ఆకులమ్ము వాని నా బొండముల వాని గూర్చి చెప్పు కొనిరి గొప్ప గాను
నా 2 పద్యములలో చిన్న సవరణలు: 1వ సీసములో 2వ పాదము 2వ భాగమును ఇలాగ మార్చుదాము: "నని యుప్పు నమ్ము వాడంత యేడ్చె" 2వ సీసములో: 3వ పాదములో "చుల్కన" (చుల్కకి బదులుగా) అని చదువుకొనవలెను. స్వస్తి.
పండిత నేమాని వారూ, మీరు ప్రస్తావించిన వ్యాపారుల వృత్తాంతం బాగుంది. మూడవ పాదం పూర్వార్ధంలో ‘నష్టమనుచు’ లో టైపాటు వలన ‘చు’ తప్పిపోయిందనుకుంటాను. మన కవుల నాయికల ఏడుపులను గురించిన చాటు వొకటి ఉండాలి. ఉదయం నుండి ఎంతకూ గుర్తుకు రావడం లేదు. మీ రెండవ సీసానికి ఆ పద్యమే స్ఫూర్తి అనుకుంటాను. చాలా బాగుంది. అభినందనలు. ‘చుల్కగా నన్ను జూచునే యని వరూ’ అన్నచోట ‘చుల్కగా నన్ను జూచునె యని యా వరూ’ అని ఉండాలనుకుంటాను. టైపాటు కానోపు!
అవును స్వాను భవమే . ఎల్బి నగర్ .దాటి వెళ్ళను అన్న చిన్నవాడు అమాంతంగా అమ్మా అమెరికా వెడుతున్నాను అంటే గుండాగి నంత పనైంది .అప్పుడు హైకూల్ గా రాసి పంపితే ఆంధ్ర భూమి వారు ప్రచు రించారు హైకూల్ అబ్బాయి అమెరికా పయనం గుండె ఆగిన అమ్మ ఖననం కోడలు స్వేచ్చా విహంగం
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘రోదనమ్ము + ఏ = రోదనమ్మే’ అవుతుంది. అక్కడ ‘బాలురకు రోదనమె చాల బలమటంచు’ అందాం. * రాజేశ్వరి అక్కయ్యా, మీ హైకూ బాగుంది. అయినా కొడుకుతోనే ఉంటున్నారుగా ప్రస్తుతం. సంతోషం! * మంద పీతాంబర్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘రోదనలే + అడుగడుగున’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. * గుండు మధుసూదన్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, క్షమించాలి. నేను మీ వ్యాఖ్యను సరిగా పరిశీలించక ఆ పొరపాటు జరిగింది.
శంకరార్యా !
రిప్లయితొలగించండినా విన్నపం మన్నించినందులకు ధన్యవాదములు !
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిస్వపరి పాలన సాధించి స్వజన పాల
కులిల గద్దెనెక్కి బొక్కుచును జనుల
బాధల నొదలి స్వార్థ భావాల యుండ
పేద వారిదెపుడరణ్య రోదనంబు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిమిత్రులారా !
కృష్ణశాస్త్రిగారి హృదయ రోదనము నొకసారి విందామా !
01)నన్ను గని...
_____________________________
నన్ను గని యేరు జాలి జెం - దంగ వలదు !
ఎవ్వరని యెంతురో నన్ను? - ఏ ననంత
శోక భీకర తిమిర లో - కైక పతిని !
కంటక కిరీట ధారినై - కాళరాత్రి
మధ్య వేళల , జీమూత - మందిరంపు
కొలువు కూటాల , నేకాంత - గోష్ఠి దీర్చి
దారుణ దివాంధ రోదన - ధ్వనుల , శ్రుతుల
పొంగి , యుప్పొంగి , యుప్పొంగి - పొరలి పోవు
నా విలాప నిబిడ గీతి - కావళీ వి
రావముల , నర్థరాత్ర గ - ర్భమ్ము, మరియు
మరియు , భీషణ కాళికో - న్మత్త గాగ
చేయుతరి , నన్ను మీరు వీ - క్షింప లేదొ !
నన్ను గని యేరు జాలి జెం - దంగ వలదు
నాకు నిశ్శ్వాస తాళ వృం - తాలు కలవు
నాకు కన్నీటి సరుల దొం - తరలు కలవు
నా కమూల్య మపూర్వ మా - నంద మొసగు
నిరుపమ నితాంత దుఃఖంపు - నిధులు కలవు
ఎవ్వరని యెంతురో నన్ను ?
_____________________________
కృష్ణశాస్త్రిగారి "కృష్ణపక్షము" నుండి
*****
02) నేను కూడ
_____________________________
ఏను మీ వలెనే కంఠ - మెత్తి పాడ
నెంతొ యుబలాటపడి సవ - రింతు గొంతు
ఏను మీవలెనే నవా - నూన గాన
విస్తృతవ్యోమయానాల - వెడలి వెడలి
భావ లోకాంచలమ్ముల - వాల వలతు !
ఐన నేమాయె ! ఆపుకో - లేని పాట
యెడద రొద సేయునో లేదొ - యింకి పోవు
నంత లోననె కట కటా ! - యంతు లేని
దారి లేని శోకంపు టె - డారు లందు !
అంత లజ్జా విషాద దు - రంత భార
వహనమున కోర్వ లేని యీ - పాడు బ్రతుకు
వంగి పోవును మరి మరి - క్రుంగి పోవు
లో తెరుంగని పాతాళ - లోకములకు !
మూగ వోయిన నా గళ - మ్మునను గూడ
నిదుర వోయిన సెలయేటి - రొదలు గలవు !
ఐన నేమాయె !
_____________________________
కృష్ణశాస్త్రిగారి "కృష్ణపక్షము" నుండి
******
03) మీరు మనసారగా .....
_____________________________
మీరు మనసారగా నేడ్వ - నీరు నన్ను !
నన్ను విడువుడు ! ఒకసారి - నన్ను విడచి
నంత, యేకాంత యవనికా - భ్యంతరమున
వెక్కి వెక్కి రోదింతును, - విసువు లేక
విరతి లేక దుర్భర శోక - విషమ గీతు
లేడ్చి వైతు ! ఎలుంగెత్తి - యేడ్చి వైతు !
ఈ మహానంద వీచికా - స్తోమడోలి
కాగ్రముల నింక నే నాట్య - మాడ లేను !
నేను చిరునవ్వు పెదవుల - నిలుప లేను !
ఏ విరామ మేనియు లేని - యీ శుభోత్స
వప్రణయ కేళికామోద - భార మింక
నేను వహియింప లేను ! జీ - వింప లేను !
_____________________________
కృష్ణశాస్త్రిగారి "కృష్ణపక్షము" నుండి
*****
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
కన్ను తెరిస్తే జననం-కన్ను మూస్తే మరణం " అన్నారెవరో !
నోరు తెరిస్తే జననం-నోరు మూస్తే మరణం " అంటాన్నేను !
మీరేమంటారు ?
01)
_________________________
రోదనము తోడనే జీవి - రోహమెత్తు
రోదనము మధ్య నే జీవి - రూపుమాయు
రోదనము రోదనము మధ్య - రూఢికెక్కు
రోదనము లేనిదే జీవి - లేదు ! లేదు !
_________________________
రోహము = మొలక
రూపుమాయు = నశించు
రూఢికెక్కు= ప్రసిద్ధిజెందు
పుట్టినపుడునేడ్చుభుక్తికైనేడ్చును
రిప్లయితొలగించండిగిట్టినపుడునేడ్చుకీర్తికేడ్చు
పొరుగుపచ్చజూడ పొగిలియేడ్చును
రోదనమ్ము లేని రోజు గలదే
అబ్బాయి పయన మమెరిక
రిప్లయితొలగించండిసుబ్బరమై యుండు నంచు స్నుష పోరిడగన్
తబ్బిబ్బు బడిన తల్లియె
నబ్బురమై గుండె పగుల నరణ్య రోదనమున్
రోదనముననేని మోదమ్మునందేని
రిప్లయితొలగించండిఅమ్మ అయ్య యనెద రఖిల జనులు
అఖిల లోకములకు అమ్మయు నయ్యయు
నైన తొంటి కవకు నంజలింతు
పాల నిచ్చును గాతల్లి బాలలకును
రిప్లయితొలగించండిరోదనమ్మును వినగానె రోజు రోజు
పాలనమ్మును జేయును పార్వతియును
నరులు రోదించ భక్తితో నమ్మకమున.
రోదన పాల్బడజేసెడు
రిప్లయితొలగించండినాదను చింతలను బాపు నారాయణుడే
మోదము మీరగ నామము
నే దలతును, పాపరాశి నిక్కము తొలగున్.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో,
రిప్లయితొలగించండిరోగ తతులకు ననిశమ్ము రోదనమ్ము!
లోభులు ప్రగతిని గనిన రోదనమ్ము !
రూప సౌందర్యము గనిన రోదనమ్ము!
రోజు రూపాయి బడు చుండె రోదనమ్ము!
రోడ్డు కెక్కి నరులు బెట్టు రోదనమ్ము!
లోక పాలకులకు నేడు రోదనమ్ము !
రోదనమ్ముల నడుమన రోదనమ్ము!
రోదనము లేని మునుజుని రోజు గలదె?
ఆదరువు లేని చోటన
రిప్లయితొలగించండివేదనములు గలిగి మనసు వివశత నొందున్
బాధలు పెరిగిన యెడ ల ను
రోదనమే చివరి మెట్టు ఋ షులకు నైనన్
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రిప్లయితొలగించండిఅరణ్యరోదనాన్ని గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
మూడవ పాదాన్ని ఇలా మార్చండి. ‘బాధలను వీడి స్వార్థ భావాల నుండ’
*
వసంత కిశోర్ గారూ,
కృష్ణశాస్త్రి గారు ఎన్ని రకాలుగా రోదించారు సోదాహరణంగా చెప్పారు. ధన్యవాదాలు.
‘రోదనము లేక జీవి లేడు’ అన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
చాలా మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
‘భుక్తికై యేడ్చును, పొగిలి తా నేడ్చును’ అనండి.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు. (ఇది స్వానుభవమా?)
చివరి పాదంలో గణదోషం. ‘పగుల నదె రోదించెన్’ అనండి.
*
పండిత నేమాని వారూ,
ఆదిదంపతులకు నమస్కరించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ఒకరి అమ్మ, అందరి అమ్మల గురించిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
‘రోదనము లేని రోజు గలదె’ అంటూ మీరు చెప్పిన రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
ఒక పెద్ద సంతలో నొకనాడు పెనువాన
రిప్లయితొలగించండి....కురిసి నష్టము వర్తకులకు గూర్చె
నా "ఉప్పు" నీరయ్యె నాకేమి గతియింక
....నని ఉప్పు నమ్ము వ్యాపారి యేడ్చె
నా పప్పు తడిసెనే నా కేమి దారంచు
....పప్పుల నమ్ము వ్యాపారి యేడ్చె
నా కెంతయో కదా నష్టమను కొ
....బ్బరి కాయలమ్ము వ్యాపారి యేడ్చె
నా కేమి దిక్కు రన్నా! చెడినానంచు
....తమలపాకమ్ము వర్తకుడు వ్రేలె
ఉప్పు వానినేని పప్పు వర్తకునేని
పలుకరించ రైరి ప్రజలు కాని
ఆకులమ్ము వాని నా బొండముల వాని
గూర్చి చెప్పు కొనిరి గొప్ప గాను
మన ప్రబంధములలో వనితామణులు చాల
రిప్లయితొలగించండి....రోదించుచుండు తీరును గనునెడ
సత్యభామా దేవి స్వాంతంబు నలగగా
....కలకంఠ నాయిక కరణి నేడ్చె
చుల్కగా నన్ను జూచునే యని వరూ
....ధిని యేడ్చెనట కల స్వనము తోడ
యెటుల నోర్చెదు తాప మేనని గిరిక కాం
....భోజీ సురాగమ్ము పొంగ నేడ్చె
బాలలకు రోదనమ్మిల బలమె కాని
భామలకు రోదనము చాల బలమటంచు
బహు కవీంద్రులు పల్కిన పల్కులెల్ల
జగతి సత్యములై యొప్పు శాశ్వతముగ
నా 2 పద్యములలో చిన్న సవరణలు:
రిప్లయితొలగించండి1వ సీసములో 2వ పాదము 2వ భాగమును ఇలాగ మార్చుదాము:
"నని యుప్పు నమ్ము వాడంత యేడ్చె"
2వ సీసములో: 3వ పాదములో "చుల్కన" (చుల్కకి బదులుగా) అని చదువుకొనవలెను.
స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమీరు ప్రస్తావించిన వ్యాపారుల వృత్తాంతం బాగుంది.
మూడవ పాదం పూర్వార్ధంలో ‘నష్టమనుచు’ లో టైపాటు వలన ‘చు’ తప్పిపోయిందనుకుంటాను.
మన కవుల నాయికల ఏడుపులను గురించిన చాటు వొకటి ఉండాలి. ఉదయం నుండి ఎంతకూ గుర్తుకు రావడం లేదు.
మీ రెండవ సీసానికి ఆ పద్యమే స్ఫూర్తి అనుకుంటాను. చాలా బాగుంది. అభినందనలు.
‘చుల్కగా నన్ను జూచునే యని వరూ’ అన్నచోట ‘చుల్కగా నన్ను జూచునె యని యా వరూ’ అని ఉండాలనుకుంటాను. టైపాటు కానోపు!
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో,
రిప్లయితొలగించండిభరత భూమిని ప్రజలెల్ల బాలురనుచు
బాలురకు రోదనమ్ముయే బలమటంచు
బలము చేకూర్చ రోదన ప్రజలకిడుచు
కలిమి సుఖములు నేతల నిలయమాయె
పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిరోదించగ నీ దుఃఖము
బాధ యుపశమించుననగ వాస్తవముగనన్
రోదించ వలదు మాతా
యోధనమున మరణమందె యోధులు తనయుల్
అవును స్వాను భవమే . ఎల్బి నగర్ .దాటి వెళ్ళను అన్న చిన్నవాడు అమాంతంగా అమ్మా అమెరికా వెడుతున్నాను అంటే గుండాగి నంత పనైంది .అప్పుడు హైకూల్ గా రాసి పంపితే ఆంధ్ర భూమి వారు ప్రచు రించారు
రిప్లయితొలగించండిహైకూల్
అబ్బాయి అమెరికా పయనం
గుండె ఆగిన అమ్మ ఖననం
కోడలు స్వేచ్చా విహంగం
అదన్నమాట అసల్ సంగతి
రోదన జననము నుండియె
రిప్లయితొలగించండివేదనలే నడుగడుగున,విజ్ఞానమ్మే
మోదమునిడు జీవులకును
రోదనలను రూపుమాపు రూడిగ ధరణిన్ !!!
తాను రోదించుచుం బుట్టు మానవుఁ డిల;
రిప్లయితొలగించండివృద్ధి నొందుచు నెన్నియో వెతలఁ బొంది,
మరణ మందెడు దాఁక వనరుచుఁ దాను
మరణ మందియు నేడ్పించు వరుసఁ గనుఁడు!
శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ప్రశంసలకు మా సంతోషము. చుల్కన అని సవరించుచు నేను ముందుగనే తెలిపితిని. వేరు సవరణలు అక్కర లేదు కదా. స్వస్తి.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
‘రోదనమ్ము + ఏ = రోదనమ్మే’ అవుతుంది. అక్కడ ‘బాలురకు రోదనమె చాల బలమటంచు’ అందాం.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ హైకూ బాగుంది. అయినా కొడుకుతోనే ఉంటున్నారుగా ప్రస్తుతం. సంతోషం!
*
మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘రోదనలే + అడుగడుగున’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
*
గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
క్షమించాలి. నేను మీ వ్యాఖ్యను సరిగా పరిశీలించక ఆ పొరపాటు జరిగింది.