2, సెప్టెంబర్ 2013, సోమవారం

పద్య రచన – 452 (రూపాయి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“రూపాయి”

18 కామెంట్‌లు:

 1. శ్రీమహాలక్ష్మి సంప్రీత చేతమ్ముతో
  ....నాశీర్వదింపగా నవని వెలసె
  శ్రీమహామాయకు ప్రియమైన రూపమై
  ....రూపాయి సంపత్ప్రదీప మగుచు
  సకల సంపదల నుచ్చస్థమై ధనలక్ష్మి
  ....యను ప్రశస్తిని గాంచి యలరుచుండి
  యర్చింప బడుచుండు ననునిత్యమును కుబే
  ....రాదుల చేత సమాదరమున
  వివిధ దేశాల నలరును పెక్కు రీతు
  లైన పేళ్ళతో నతి ముఖ్యమైన యట్టి
  డాలరే చేయు నీ జగత్పాలనమ్ము
  బ్రతుకు దుర్భరమయ్యె రూపాయి కకట!

  రిప్లయితొలగించండి
 2. ముచ్చటైన రూపమ్ముతో ముద్దులొలుకు
  వరిని కంకిగా చూపించి పరిఢవిల్లు
  పెద్ద నాణెము నేడింక విరళమయ్యె
  పావలా వలె తోచు రూపాయి మిగిలె.

  రిప్లయితొలగించండి

 3. చిల్లర నడుగరు జనులును
  చెల్లున యని చూడరికను ' ఛీ 'యన భిక్షుల్
  చిల్లి పడెను రూపాయికి
  తల్లడిలగ భారతమ్ము తరిగిన విలువన్ !

  రిప్లయితొలగించండి
 4. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
  =========*========
  రోగ తతులు దాడి జేయ రూప హీన మాయెరా
  భోగ మెల్ల గరగి పోయి బోసి పోయె జూడరా
  సాగు చున్న పతన మందు సన్న గిల్లి పోకురా
  ద్రాగు చుండె జీవజలము దాత ననుచు దెలుపరా
  త్యాగ ధనుల భూమి యనుచు యాగములను జేయరా
  ఈగ వలెను పగను జూపు నిలను డాలరునకురా!

  రిప్లయితొలగించండి
 5. శ్రీ నేమాని గురుదేవుల దుర్భర రూపాయి రూపము బహు సుందరము.
  శ్రీ లక్ష్మి దేవి గారి పావలా వలె రూపాయి మిగిలె ముచ్చటైన పద్యము
  శ్రీ నరసింహ మూర్తి గారి ' ఛీ 'యన రూపాయి చక్కని చిక్కని పద్యము.

  రిప్లయితొలగించండి
 6. రూపాయి కిలో బియ్యము
  నీ పాలన నున్న వరకు నిత్తురు కానీ
  నీ ప్లాను చివరి వరకును
  నాపాదితమగునె నిచట నార్ధిక మంత్రీ!

  రిప్లయితొలగించండి
 7. శ్రీ కంది శంకరయ్య గురువులు, శ్రీ నేమాని గురువులకు వందనాలు...

  సాపాటునకాధారము
  మా పాలిట వేల్పునీవు! మహిమాన్వితమౌ-
  మా పనులను నెరవేర్చగ,
  రూపాయీ! నీవులేని లోకము గలదే!
  .
  మనవి:
  ప్రాసలో: ణ- న, ర- ఱ, ల- ళ ' లాంటివి మరేమైన వున్నాయా?
  ప్రాస యతిలో: ణ- న, ర- ఱ, ల- ళ, లాంటవి వుంటే తెలియజేయగలరని మనవి.

  రిప్లయితొలగించండి
 8. రూపాయి కంటెను రుచికరంబెయ్యది ?
  కలియుగమందుకావలయు నెద్ది ?

  పంచ భూతములను మించినదెయ్యది ?
  ప్రభువుల కీనాడు పరమమెద్ది ?

  ఆపద లందున కాపాడు నెయ్యది ?
  కొండ దేవర నేడు కోరునెద్ది ?

  వైద్యులు ముందుగా పరికింతు రెయ్యది ?
  ఆచార్యులకు నేడు వలయునెద్ది ?

  పండు ముదుసలి, పాపాయి పరుగులెత్తు
  పడిన రూపాయి నెత్తగా పరవశించి
  సిరియె రూపాయియై పుట్టె ధరణియందు
  విలువ బెంచరే పాలక విబుధులార !!!

  రిప్లయితొలగించండి
 9. రూపాయి విలువ తగ్గెను
  పాపము హెచ్చిన విధంబు వస్తువుల ధరల్
  పైపైకి పోవు చుండెను
  పాపము సామాన్యు డెట్లు బ్రతుకీడ్చవలెన్

  రిప్లయితొలగించండి

 10. వేయిన్నొక్క రూపాయల ఫోటో కి
  పూదండ వేసి దాచుకోవలె !
  రాబోవు కాలం లో దీని వెల
  ఒక్క రూపాయి బిళ్ళ కి సరిపోవునెమో !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు

  నవనాగరికత లోమన
  అవసరములు పెరిగె నూత నార్ధిక విధముల్
  భవికము గూర్చగ రూపా
  యి విలువలు తగ్గిపోవ యేర్పడె కొరతల్

  రూపాయే సర్వస్వము
  రూపాయలు కాగితముగ రూపొందగ దు
  ర్వ్యాపారము సాగెను ఇక
  సాపాటుకు పేద ప్రజకు చాలక ధనముల్

  ఓపిక బూనుచు నేతలు
  కాపట్యము లేక పనులు గావింపంగా
  రూపాయి విలువ పెరుగును
  గోపనముగ ధనము దాచు కొనుటను విడువన్

  రిప్లయితొలగించండి
 12. గురువర్యుల పాదపద్మములకు నమస్కారములతో

  మాధవుండైన మహిని మనుజులైన
  పచ్చనోట్లకు అహరహం పరితపించు
  పరమపావన రూపమై పరిఢవిల్లు
  ఇచ్చురూపాయిలేకదా ఇహముపరము

  రిప్లయితొలగించండి
 13. వెండి రూకల నిలయమ్ము మెండు భూమి
  పరుల పంచల కెగబడె పరిత పించి
  చిన్న బోయిన శ్రీలక్ష్మి సిగ్గు పడగ
  రుపిని పడగొట్టి బుసగొట్టె రూపు మాపి

  రిప్లయితొలగించండి
 14. అక్కయ్య గారి పద్యము చాలా బాగుంది. శ్రీ మందపీతాంబర్ గారి అద్భుతమైన పద్యానికి నా సమాధానములు వేరుగా నున్నాయి. సిరులు సింధువు దాటకపోతే మన దేశమంత భాగ్యవంతదేశ మిలలో మరొకటి యుండదు !

  రూపాయి కంటెను రుచికరంబెయ్యది ?
  ఆంధ్రులు మెచ్చెడి యావకాయ !

  పంచ భూతములను మించినదెయ్యది ?
  పరమాత్మ గాదుటే పరగి జగము !

  ఆపద లందున కాపాడు నెయ్యది ?
  భగవంతు నామమ్ము భక్తిఁ దలప !

  వైద్యులు ముందుగా పరికింతు రెయ్యది ?
  జీవస్థితిని దెల్పు జీవనాడి !

  పండు ముదుసలి, పాపాయి పరుగులెత్తి
  పడిన రూపాయి నెత్తరే ! పరవశించి ?
  సిరులఁ గష్టించి సృష్టింప భరత భూమి
  వినుత కెక్కును ప్రజలంత వృధ్ధి నొంద !!!

  రిప్లయితొలగించండి
 15. శ్రీ వరప్రసాద్ గారికి వందనములు. మీ పద్యా లుత్తమ ప్రమాణములలో తులతూగుతున్నాయి. ఈర్ష్య , అసూయ నాకు తెలియవు, లేకపోతే మిత్రు లందఱి పద్యాలు చదివి యీర్ష్య నొందాలి, కాని నాకు సంతోషమే కలుగుతుంది. అందఱికీ అభినందనలు !

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న ఉదయం పోయిన కరెంటు సాయంత్రం వచ్చింది. రాత్రి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను. అందువల్ల నిన్న పూరణలు, పద్యాలు, వ్యాఖ్యలు చూసే అవకాశం దొరకలేదు. మన్నించండి.
  చక్కని పూరణలను వ్రాసిన
  పండిత నేమాని వారికి,
  లక్ష్మీదేవి గారికి,
  గన్నవరపు నరసింహమూర్తి గారికి,
  వరప్రసాద్ గారికి,
  సుబ్బారావు గారికి,
  శ్రీ యెర్రాజి జయసారథి గారికి,
  మంద పీతాంబర్ గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  శైలజ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  జయసారథి గారూ,
  మీ సందేహానికి ఈ సాయంత్రంలోగా సమాధానం ఇస్తాను.

  రిప్లయితొలగించండి
 17. ధనవంతుని గాంచి జనులు
  వినయము చూపుచు భజించి వీడరు చెలిమిన్
  కనుగొన రెవ్వరు సుమతిని
  ధనహీనుని స్నేహ మెపుడు తలచరు లోకుల్.

  రిప్లయితొలగించండి
 18. రూపాయికివిలువెక్కువ
  పాపాలనుచేయుజనులు ,పైసాకొరకే
  పాపాయికైనమక్కువ
  రూపాయేలేనినాడు ,రోచులుతొలగున్.

  రిప్లయితొలగించండి