29, సెప్టెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1189 (జారుల కృత్యములు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్.

34 కామెంట్‌లు:

  1. శ్రీగురుభ్యోనమ:

    భారతి సూక్తము జదువుచు
    శారదకున్ పూజ జేసి సద్భావమునన్
    హారతుల నిచ్చు యా పూ
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !


    పూజారులు జేసే పూజలు గొప్ప ఆనందము నిచ్చు గదా !

    01)
    ________________________________

    ధారుణి తెలవారక మును
    తారాపతి యింటి కేగ - తలచక ముందే
    తీరుగ జేసెడి ఘన పూ
    జారుల కృత్యములు మనకు - సంతోష మిడున్ !
    ________________________________

    రిప్లయితొలగించండి
  3. కారుణ్యామృత జలధులు
    సార యశోధాములును ప్రసన్న తర శుభా
    కారులు, ధీరులునౌ దితి
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

    రిప్లయితొలగించండి
  4. (సర్వజ్ఞ సింగ భూపాలుని వలచిన భోగినికి తల్లి హితబోధ...)
    ఆ రాజును వలచి కులా
    చారము మన వృత్తి విడుట సరి గాదమ్మా!
    వారక సొమ్ముల నిచ్చెడి
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్.

    రిప్లయితొలగించండి
  5. బాజాలు, బొమ్మలాటలు,
    తాజా భక్ష్యాలు, ప్రభలు, ధర జాతరలన్
    రాజిత దీపము లాబా
    జారుల కృత్యములు మనకు సంతోషమిడున్

    రిప్లయితొలగించండి


  6. Sri H.V.S.N.Moorti Gaaru! అయ్యా!
    మీ పద్యము బాగుగ నున్నది. మరి ప్రాసను మరిచారు కదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. దారను వీడుచు వచ్చెడి
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్
    కోరిన కానుక లందుచు
    బేరము లాడంగ వలదు బేలగ తల్లీ

    గురువు గారి స్పూర్తితో

    రిప్లయితొలగించండి
  8. తూరుపు తెలవారకనే
    తీరుగ పూజలు జరుగును తిరుపతి లోనన్
    హారతు లీయగ యాపూ
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

    రిప్లయితొలగించండి
  9. ఆర్యా!
    నమస్కారములు,
    పెద్ద పొరపాటే జరిగింది, ప్రాస మరచాను. క్షమించ ప్రార్థన.
    ప్రాసతో మరో పద్యం.

    బారులు దీరిన బొమ్మల
    తీరులు, జాతరలలోన తేరులు, ప్రభలున్
    కోరిన నృత్యంబులు బా
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్.

    రిప్లయితొలగించండి
  10. కోరియుఁ బ్రహ్లాదాదులు
    మీరిన భక్తిని భజించి, మేల్గాంచి, హరిన్
    జేరిరి! యాహా! కన, దివి
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్!

    రిప్లయితొలగించండి
  11. నా రెండవ పూరణము:

    పోరాని పోకఁ బోయిరి
    కారే! కాముని భజించి, కని, శాపములన్
    గూరిరి! యెట్టుల తారా
    జారుల కృత్యములు మనకు సంతోషమిడున్? (2)

    రిప్లయితొలగించండి
  12. నా రెండవ పూరణమునఁ జిన్న సవరణము:

    పోరాని పోకఁ బోయిరి
    కారే! కాముని భజించి, కని, శాపములన్
    గూరి! రహల్యా తారా
    జారుల కృత్యములు మనకు సంతోషమిడున్!?!? (2)

    (వారా కృత్యముల ద్వారమున మేలే చేసిరో, కీడే చేసిరో? ఆ కథ లెఱిఁగిన మనకు విదితమే కదా!)

    రిప్లయితొలగించండి
  13. కోరిన వరముల నొసగెడు
    చారిత్రము గలిగియున్న శంభుని గొలువన్
    నీరాజన మిచ్చెడి పూ
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

    రిప్లయితొలగించండి
  14. నేమాని పండితార్యా! దితిజారులు పద ప్రయోగం అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  15. ధీరులు, పుణ్యకృతార్థులు,
    వారింపగనలవిగాని బలయుతు, లధిక
    శ్రీరాజిత మూర్తులు, దను
    జారుల కృత్యములు మనకు సంతోషమిడున్.

    దనుజ + అరులు = దనుజారులు

    రిప్లయితొలగించండి
  16. చేరం బిల్వ సుదినమని
    తీరిన రాజమహలంత తేజము నిండన్
    వారల నృత్యాదులతో
    జారుల కృత్యములు మనకు సంతోషమిడున్!

    రిప్లయితొలగించండి
  17. గౌరవహీనములగునుగ
    జారుల కృత్యములు, మనకు సంతోషమిడున్
    జారులు మంచిగమారుచు
    వారందరు కలిసి మెలసి వర్తిలి యుండన్

    రిప్లయితొలగించండి
  18. శ్రీ మిస్సన్న మహశయా! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు మా సంతోషము. మీ పద్యము మా కంటబడలేదే. కొంచెము మాకు ఆ విందు చేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. నా మూఁడవ పూరణము:

    చారులె రాజుల కన్నులు;
    చారులు లేకున్న రాజు ససిఁ గనఁడు భువిన్;
    జారులె ముఖ్యులు! కన, భువిఁ
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్!!

    (భువిన్+చారుల=భువిఁ జారుల)

    రిప్లయితొలగించండి
  20. పూజ్యులు నేమానివారికి, కవి పండిత మిత్రులందఱికి నమస్సుమాంజలులు.

    నేఁడందఱి పూరణములు చాల బాగుగ నున్నవి. అలరింపఁజేయు పూరణలనందించిన శ్రీయుతులు:

    శ్రీపతిశాస్త్రి్గారికి
    వసంత కిశోర్‍గారికి
    పండిత నేమానివారికి
    కంది శంకరయ్యగారికి
    హరివేంకటసత్యనారాయణమూర్తిగారికి
    శ్రీమతి రాజేశ్వరిగారికి
    శ్రీమతి శైలజగారికి
    బొడ్డు శంకరయ్యగారికి
    మిస్సన్నగారికి
    సంపత్ కుమార్ శాస్త్రిగారికి
    గుండా సహదేవుడుగారికి
    సుబ్బారావుగారికి

    మనః పూర్వక అభినందనలు!

    రిప్లయితొలగించండి
  21. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    శూరులవీరుల గాధలు
    ధారాశుధ్ధిగచెవులకు ధన్యత కలుగన్
    తీరుగ వినిపించెడి బం
    జారుల కృత్యములు మనకు సంతోషమిడున్

    రిప్లయితొలగించండి
  22. ఇదొక చిన్న ప్రయత్నము:

    ధీరులు, నకలంక సరసి
    జారులును గజారులు దితిజారులు కన న
    వ్వారలు, నా నృపకుల కం
    జారుల కృత్యములు మనకు సంతోషమిడున్

    రిప్లయితొలగించండి
  23. పయిజారులు= పాదరక్షలు....

    జోరుగ పోటీ లచటను
    జారెడు హైహీ లుతోడ జాణల నడకల్
    బారెడు వేదిక పై,పయి
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

    రిప్లయితొలగించండి
  24. వైరుల కృత్యములన్ గని
    చారులు తగు సూచనలను చప్పున నీయన్
    తీరును కష్టము లిట్టుల
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

    రిప్లయితొలగించండి
  25. బారులు తీరిన భక్తుల
    హారములరిపించి మంగళా రాతులిడుచున్
    నారాయణు గొల్చెడి పూ
    జారుల కృత్యములు మనకు సంతోషమిడున్ .

    నారు పొలమ్మున నాటియు
    పైరును కడు ప్రేమతోడ పండించెడి సా
    ధారణ జనజాతులు బం
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్


    రిప్లయితొలగించండి
  26. పోరుల వైరిని దునిమెడు
    వీరుల సాహసములున్, వివిధ రీతుల నిం
    పారెడు వ్యూహములా, కై
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్.

    రిప్లయితొలగించండి
  27. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    సినిమా లోని జారుల పాత్రలు మనకు సంతోషము నిడునని
    =======*=========
    ఊరినడుమ నూపుచు దన
    కారు నలుపు చెంబుతోడ కచ్చేరిలకై
    దారులు వెదకుచు నుండెడి
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్.

    రిప్లయితొలగించండి
  28. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు ఉదయమే హుస్నాబాద్ వెళ్ళి ఇంతకుముందే తిరిగి వచ్చాను. మా మేనల్లుడి ఇంట్లో దొంగలు పడి 13 తులాల బంగారం, 50 వేల రూపాయలు దోచుకున్నారు. పరామర్శించి వచ్చాను. అందువల్ల మీ పూరణలను సమీక్షించలేకపోయాను. ప్రయాణపు అలసట వల్ల ఇప్పుడూ చేయలేను.
    మంచి మంచి పూరణలు చెప్పిన కవిమిత్రులు.....
    శ్రీపతి శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    వసంత కిశోర్ గారికి,
    పండిత నేమాని వారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    శైలజ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    వరప్రసాద్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. కారులు మేడలు బంగరు
    షేరులు స్టాకుల భుజించి
    క్షేమమ్ముగనే
    నేరముల జేయు నల్లబ
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

    రిప్లయితొలగించండి


  30. హేరా ఫేరీ ల జిలే
    బీ రీతిగ జేయుచు మజ! భీకర పోరుల్
    నేరముల జేయు హీరో,
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్‌ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. పోరుచు భర్తల మాలుల
    కోరిక తీరగ పడిపడి కుండలముల్ పల్
    హారము లన్నియు కొను బం
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్


    మాలులు = Malls
    బంజారులు = Residents of posh Banjara Hills

    రిప్లయితొలగించండి


  32. వారెవ్వా ! స్టాక్మార్కెట్!
    వూరించుచు ప్రేయసివలె నుత్సాహముతో
    రారమ్మని బిల్చెడు బా
    జారుల కృత్యములు మనకు సంతోష మిడున్ :)



    జిలేబి

    రిప్లయితొలగించండి