23, సెప్టెంబర్ 2013, సోమవారం

పద్య రచన – 473 (దోమ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“దోమ”

27 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    ద్వాపరాంత శేషంబగు దనుజు లెల్ల
    కలియుగాన మశకములై కాటు వేసి
    జీవులన్నిటి బాధించు జీవు లగుచు
    వాని జాతి నివారణ లేని వరము
    శివుని మెప్పించి పొందిరో శివుని కెరుక?

    రిప్లయితొలగించండి
  2. దోమా యేమది భోగము
    లేమల చెక్కిలిని మీటి లేజవ్వనివై
    ధీమగ నంతట దిరుగుచు
    మామనుజుల చేత జిక్కి మలిగెద వౌరా

    రిప్లయితొలగించండి
  3. మామానవ జాతికి పడ
    కేమాత్రము కుదురనీక నిత్తువు బాడ్ నైట్
    దోమా! నీవిటెగిరి పడ
    కే మా చెంతను గలదిక నిదిగో గుడ్ నైట్.

    రిప్లయితొలగించండి
  4. దోమా ! రాక్షస ! చంపుదు
    ధీమాగా నాయుధముల దెచ్చితి నిలుమా !
    ఈమస్కిటొ కాయిల్సును
    ఈమాట్లాలౌట్లు బ్యాట్ల నీ గుడ్నైట్లన్ !

    రిప్లయితొలగించండి
  5. దోమా! పద్యము వ్రాయగ
    లేమా! నీపై! నిదురను లేదే ధీమా
    కామా! పెట్టక కుట్టుచు
    టీముగ తిరిగిన తమరిని ఢీకొన గలమా

    చక్రమున కైనను దొరకవు
    చక్కగ ఆలవుటుకసలు జడవవె నీవున్
    చుక్కలు చూపుతు జనులకు
    చిక్కక తిరిగెదవుగాదె చీయన లేమే

    రిప్లయితొలగించండి
  6. కంద గీత, గర్భ ఉత్పలమాల.
    దోమ కుటుంబమే కవికిఁ ద్రోవ కనుంగొన, గాన మెన్న, వా
    ఙ్నీమ మదేభమై కవిత ఘీంకృతి నోంకృతి కల్గఁ జేయు, నీ
    దోమ కుటుంబమే కరుణతో సకలాత్మ ప్రకాశమిచ్చు, సం
    క్షేమ మిడున్ గదా! కొలువ శ్రీహరి నాతని కూర్మి నెన్నికన్.
    ఉత్పల గర్భస్థ కందము.
    మకుటుంబమే కవికిఁ ద్రో
    వ కనుంగొన, గాన మెన్న, వాఙ్నీమమదే.
    మకుటుంబమే కరుణతో
    సకలాత్మ ప్రకాశమిచ్చు, సంక్షేమమిడున్.
    ఉత్పల గర్భస్థ గీతము
    కవికిఁ ద్రోవ కనుంగొన గాన, మెన్న
    కవిత ఘీంకృతి నోంకృతి కల్గఁ జేయు,
    కరుణతో సకలాత్మ ప్రకాశమిచ్చు,
    కొలువ శ్రీహరి నాతని కూర్మి నెన్ని.

    రిప్లయితొలగించండి
  7. దోమ లు దోమలుదోమలు
    దోమలతో నిండి యుండె దుహినము కంటే ?
    దోమల జంపుట కొఱకై
    ధూ మము మఱి యింటి నిండ దూ రగ జేతున్

    రిప్లయితొలగించండి
  8. శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి "కంద గీత, గర్భ ఉత్పలమాల" చాలా చాలా బాగున్నది.
    గర్భ కవిత్వపు మార్గమును జూపిన వారికి ధన్యవాదములు.

    శ్రీ శైలజ గారి పద్యములు బాగున్నవి.రెండవ పద్యములో గణదోషమున్నది.

    చక్రము కైనను దొరకవు
    చక్కగ ఆలవుటు కసలు జడవవె దోమా!
    చుక్కలు చూపుచు జనులకు
    చిక్కక తిరిగెదవుగాదె చీయన లేమే!

    రిప్లయితొలగించండి
  9. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యం మొదటి పాదాన్ని ‘చక్రమునకైన దొరకవు’ అంటే సరి!
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    మీ చిత్రకవితా ప్రావీణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు. సంతోషం. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
    ‘తుహినము’ దోమలతో నిండడం ఏమిటి? ‘దోమలతో నిండెనుగా గదులు మా యింటన్’ అంటే ఎలా ఉంటుంది?
    *
    వరప్రసాద్ గారూ,
    మీరు సవరించిన శైలజ గారి పద్యంలో ప్రాస తిప్పింది.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శైలజ గారి పద్యము జదివి నచ్చుటతో ప్రాసను పట్టక పోతిని మన్నించగలరు.
    గురువు గారు ఆ పాదము " చక్కెర కైనను దొరకవు" అంటే సరినా? తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  11. దోమాయణము:

    ఏదో మా నేస్తంబిది
    కాదో మా పద్యరచన కారణము భళా!
    రాదో మాకు ప్రశంసయు
    ఓ దోమాయణము కవుల కుత్సాహమిడున్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నేమాని గురుదేవుల దోమాయణము చాలా బాగుగా నున్నది.

    రిప్లయితొలగించండి
  13. దోమల కాటుకు బలియగు
    సామాన్యుల తిప్పలెన్నొ జ్వర బాధలతో
    దోమల నిర్మూలనకై
    యే మందులు వాడుచున్న వృధయే మిత్రా.

    రిప్లయితొలగించండి
  14. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి
    టి.బి.యెస్.శర్మగారికి వందనములు

    దోమల బాధ తీరగను తొల్లి వికుంటుడు మత్స్యరూపుడై
    ఆమును వీడి సాగరము నందున దాగెను శంకరుండు తా
    భామల నెత్తి పైన నెడ ప్రక్కన జేరిచి పారె నా
    దోమలులేని శైలమున దుర్గమమైన హిమాలయమ్ముపై

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    అధ్యాత్మిక చింతనలో, పద్యరచనా ప్రావీణ్యంలో మీకు, నాకు హస్తి మశకాంతరం.
    మోదం బిడు మీ మాటలఁ
    గాదను ధైర్యమ్ము తెలివి గలవాఁడనె? నే
    నేదో యొక దోమను, మీ
    రో దంతి, సమానుఁడనె గురువరా మీతో?
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మంచి ఉత్పలమాలను వ్రాసారు. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘పారెను’ అన్నదాన్ని ‘పారిపోయె’ అందామా?

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి
    టి.బి.యెస్.శర్మగారికి వందనములు

    మీ సూచన మేరకు పద్యము సవరించితిని

    దోమల బాధ తీరగను తొల్లి వికుంటుడు మత్స్యరూపుడై
    ఆమును వీడి సాగరము నందున దాగెను శంకరుండు తా
    భామల నెత్తి పైన నెడ ప్రక్కన జేరిచి పారిపోయెనా
    దోమలులేని శైలమున దుర్గమమైన హిమాలయమ్ముపై

    రిప్లయితొలగించండి
  17. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    సరదాగా
    =======*========
    ముట్టిన మధుమేహ నరుని మట్టి పాలు,
    కుట్టిన ఖలులను వలచు కుష్టిరోగ
    ము,క్షయ రోగిని జూచిన ముప్పు గలుగు
    సుధను ద్రాగు వారిని కుట్టి సుఖము నొందు!

    రిప్లయితొలగించండి
  18. పూజ్యులు నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సాహితీ మిత్రులందఱికి నమస్కారములు. నేఁ డందఱి పద్యములు బాగుగ నున్నవి. ముఖ్యముగా మిత్రులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారి కంద గీత గర్భి తోత్పలమాలా వృత్త మద్భుతముగ నున్నది. అభినందనలు! ఇఁక నా పద్యము...

    దోమయ చిన్నది యైనను
    గోముఖ శార్దూలము వలె కొంపలు ముంచున్!
    దోమతెఱలున్న రోగము
    లేమియుఁ దరిఁ జేరలేవు లీలగ నైనన్!

    రిప్లయితొలగించండి
  19. దోమా! నీ కాటువలన
    మేమాయాసమ్ము నొంది మేల్కొని జూడన్
    ఏ మాటున దాగెదవో
    దోమాయణము సలిపెదవు దొరకక నీవున్

    రిప్లయితొలగించండి
  20. ఆదరమున ప్రశంసల నందజేయు
    చుండి మోదము గూర్చెడి సోదరులగు
    శంకరాభరణ సమాఖ్య సభ్య తతికి
    నాశిషమ్ముల గూర్తు సమంచితముగ

    నేమాని రామజోగి సన్యాసి రావు

    రిప్లయితొలగించండి
  21. వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    శైలజ గారి పద్యంలో మీ తాజా సవరణ బాగుంది.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. తిమ్మాజీరావుగారూ! నల్లి బాధపైన ఒక చాటువు ఉన్నది. గుర్తులేదు. ఆ రీతిగానే మీ కల్పన చాల బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. తోచనీయదు యిసుమంత తోవయున్న
    కుట్టి క(కు)దుపును కంటికి కునుకు రాదు
    ఎన్నిజన్మల వైరమ్మొ ఏమి చెపుదు?
    దోషమెన్నడు చేయించు దోమ మనను.

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఇందుగలవందు లేవని సందేహము వలదు దోమలు...... :

    01)
    _____________________________________

    యిందు యుండును యందు లేవని - యెన్న నెవ్వరి వీలురా
    సందు గొందుల నెందు జూచిన - సర్వ వేళల దోమలే !
    మందు మాకులు యెన్ని వచ్చిన - మానవే యవి కుట్టుటన్
    బొందబెట్టుట కష్ట సాధ్యము - వూళ బెట్టెడి దోమలన్ !
    అందుకోమరి జాలకమ్ముల - నడ్డుగోడగ కట్టుకో
    చందనాదులు కిర్సనాయిలు - చక్క వంటికి పూసుకో !
    _____________________________________
    వూళ = కేక(రొద)
    జాలకము = వల(దోమతెర)
    చందనాదులు = గంధాదులు(దోమలక్రీములు)

    రిప్లయితొలగించండి
  25. కవివర్యులందరికీ ధన్యవాదములు ...

    శర్మ గారు , నల్లి పై నుండిన చాటువు మీరనుకొనుచున్నది ఇది ఏనా ?

    "శివుడద్రిని శయనించుట
    రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం
    డవిరళముగ శేషునిపై
    బవళించుట నల్లి బాధ పడలేక సుమీ! "

    రిప్లయితొలగించండి