8, సెప్టెంబర్ 2013, ఆదివారం

పద్య రచన – 458 (ప్రపత్తి)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“ప్రపత్తి”

13 కామెంట్‌లు:

 1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

  తల్లి దండ్రుల యందున తగిన రీతి
  గురువు లందున నెప్పుడు కుదురు గాను
  దైవ భావంబున ద్వివిధంబు లేక
  మిగుల భక్తి ప్రపత్తుల మెలగ వలయు.

  రిప్లయితొలగించండి
 2. తల్లిని గొల్చి, తండ్రికిని దండ మొనర్చి, గురున్ నుతించియున్,
  జల్లఁగ నాతిథేయమిడి సాంగతికున్ బ్రణిపత్తి సేసి, రం
  జిల్లుచు దైవమందు విలసిల్లెడు భక్తి ప్రపత్తితోడ నే
  నుల్లము పుల్కరింప మహితోక్తుల వందన మాచరించెదన్!

  రిప్లయితొలగించండి
 3. గణముల కధి పతి నీవని
  గణు తింతును భక్తి మీర ఘన ముగ నిన్నే
  రణమంటి జగతి నివ్విధి
  పణముగ నేనుండ లేక ప్రపన్నుడ నై

  రిప్లయితొలగించండి
 4. మిత్రులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు !

  అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  __________________________

  భాద్రపద శుక్ల చవితిని - భద్రము గను
  పార్వతీ సుత , విఘ్నేశ - పాహి యనుచు
  ప్రజలు పూజింప భక్తి ప్ర - పత్తి తోడ
  భోగభాగ్యాలు లభియించు - భూమి మీద !
  __________________________

  రిప్లయితొలగించండి
 5. తల్లి ధండ్రి గురువు ధరణిలో దైవాలు
  వారి సేవ చేయ వరము గాదె
  పరమ భక్తి యోగ ప్రపత్తుల గలిగియు
  దైవ చింత యున్న ధన్యు లగును

  రిప్లయితొలగించండి
 6. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ‘దైవభావంబునను’ అంటే సరి!
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘రణమంటి’ అనడం గ్రామ్యం. ఆ పాదాన్ని ‘రణమును బోలు జగతి నిటు’ అందామా?
  చివరి పాదంలో గణదోషం. ఆ పాదాన్ని ‘పణముగ నుండగ లేక ప్రపన్నుడ నైతిన్’ అందాం.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
  మూడవ పాదంలో గణదోషం. ఆ పాదాన్ని ‘పరమ భక్తితో ప్రపత్తుల గలిగియు’ అందాం.

  రిప్లయితొలగించండి
 7. శరణము దేవా! నీ శుభ
  చరణము నా కనుచు గొలుతు సాదరమున, సం
  స్మరణము నొనరింతు కృపా
  భరణము కద నీ విభవము పరమానందా!

  రిప్లయితొలగించండి
 8. శ్రీ పండిత నేమాని గురువులు..
  శ్రీ కంది శంకరయ్య గురువులకు పాదాభివందనాలు..
  .........................

  సకల భక్తజనులు శరణుజొచ్చినఁజాలు
  కాచువాడివయ్య కరుణతోడ
  నిన్ను నమ్ము వారికెన్నడే కష్టంబు
  రాదు! రాదు! నిజము! రామచన్ద్ర!
  .
  కష్టపెట్ట వలదు నష్టపెట్ట వలదు
  నిన్ను నమ్మి నాడ నన్ను బ్రోవు!
  భక్తజనులకెల్ల ముక్తినొసగె దేవ!
  ప్రేమమూర్తివయ్య ! రామచంద్ర!

  రిప్లయితొలగించండి
 9. భక్తి మఱియు ప్ర పత్తుల భరిత మగుచు
  శివుని పూజించు మనుజుడు శీ ఘ్ర ముగను
  మోక్ష పదమును జేరును ముక్తు డగుచు
  సంది యంబును నిసుమంత పొంద వలదు

  రిప్లయితొలగించండి
 10. పండిత నేమాని వారూ,
  మీ పద్యం ప్రపత్తికి లక్ష్యంగా ఉంది. అభినందనలు.
  *
  శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  టైపాటు వల్ల ‘ముక్తి నొసగు’ అనేది ‘ముక్తి నొసగె’ అయినట్టుంది.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. ఈ విషయంలో ‘సందియంబును నిసుమంత పొందవలదు’. అందుకోవయ్య మా యభినందనములు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ పండిత నేమాని గురువులు..
  శ్రీ కంది శంకరయ్య గురువులకు పాదాభివందనాలు..
  =====*======
  భక్తి ప్రపత్తులతోడ -భజన జేయ వరము నొసగె
  ముక్తి ప్రదాత ముదమున-పుడమి యందున భక్త వరులు
  యుక్తి తోడను పొందె ముక్తి - యోగ సాధనమున భవుని
  శక్తి కొలదిగ పూజింప జనులార మీరు రారండి !

  రిప్లయితొలగించండి

 12. శ్రీ పండిత నేమాని గురువులు..
  శ్రీ కంది శంకరయ్య గురువులకు పాదాభివందనాలు..

  ప్రపత్తి
  నామ సంకీర్తనల్ జేయు నారదువలె
  పరమభక్తుడౌ ప్రహ్లాదువలెను గాని
  అంబారీషునివోలె నిన్నంజలించి
  సంస్తుతించంగలేను నిన్ శరణుజొచ్చి
  వేడుచుందును నాథ నాతోడు నీవె
  ఎల్లవేళల నిన్ను నా యుల్లమనేడి
  యింట సేవించు కొందు నీ బంటు నేను
  నీకు సమ్మత మైనదే నీయవయ్య

  రిప్లయితొలగించండి