కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్.
(జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కరీంనగర్ శతావధానం నుండి)
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్.
(జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కరీంనగర్ శతావధానం నుండి)
అట్టుడికి నట్టు లుడుకుచు
రిప్లయితొలగించండిగట్టున జేరిన వనితలు కాకోలము నన్
పట్టాభి వారి యింటను
ముట్టుడి గిన సతికి నొక్క పుత్రుడు పుట్టెన్
అట్లుడికి నట్టు లుడుకుచు
రిప్లయితొలగించండిగట్లను దిరుగాడు జనులు కాకోలము నన్
కొట్లాటలు బెట్టు రాముని
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుడు పుట్టెన్
క్షమించాలి నేను సరిగా చూడ లేదు అందుకని రెండవ పూరణ
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిఎట్లయినన్ దన సతికిన్
కుట్లు ప్రజనమందున పడ కుండగ వైద్యుం
డట్లుండగ నాతనిపని
ముట్లుడిగిన, సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్.
(ప్రజనము= ప్రసవము; పనిముట్లుడిగిన = పనిముట్లు పనికిరాకుండుట)
చెట్లను పుట్లను మ్రొక్కగ
రిప్లయితొలగించండినట్లే యని వరము నిచ్చె నారా యణుడే
కట్లను త్రెంచుకు మురియగ
ముట్లు డిగిన సతికి నొక్క పుత్రుడు పుట్టెన్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
పరమ పురుష ! నీదుకరుణ
పరుగు దీయు కుంటివాడు
మాతయౌను గొడ్రాలే
నటన సూత్ర ధారీ
దేవదేవ పరంధామ
నీలమేఘశ్యామా !
అని "సీతారామకల్యాణం"లో నన్నట్లు
శ్రీహరి కృప ఉంటే కానిదేముంది :
01)
________________________________
కట్లున్న కాళ్ళ తోడను
జట్లను నోడింప వచ్చు - జగపతి కరుణన్
యిట్లెట్లొ జరిగె ,పూర్వము
ముట్లుడిగిన సతికి నొక్క - పుత్రుఁడు పుట్టెన్ !
________________________________
ఇది యొక్క వాస్తవముగా వార్తాపత్రికలలో వచ్చెను - కొన్ని దశాబ్దముల క్రితము ఎనుబది యేండ్లు వయస్సు కల ఇద్దరు కవలగు సోదరీమణులు ఒకే మారు గర్భము దాల్చి యొప్పుగా ప్రసవించిరట. ఆ వార్త ఆధారముగా:
రిప్లయితొలగించండివాస్తవమ్మిది వచ్చెను వార్తలందు
నెనుబదేడుల స్త్రీ ప్రసవించె ననుచు
నగును విపరీతములు ముట్లుడిగిన సతికి
నొక్క పుత్రుడు పుట్టెన్ సముజ్జ్వలాంగ!
ప్రసవ సమయములో తల వైపునకు చేతులు చాచి చేతులకు
రిప్లయితొలగించండిచిక్కిన ఆధారాన్ని ముట్టుకొని గట్టిగా పట్టుకుంటారు గదా !
ప్రసవానంతరం పట్లూ , ముట్లూ విడిచి విశ్రాంతి నొందెదరు గదా !
02)
________________________________
పట్లవి విడివడె , చివరకు
ముట్లుడిగిన సతికి నొక్క - పుత్రుడు పుట్టెన్ !
చిట్లగ శరీర మామెకు
కుట్లను వైద్యులు గలిపిరి - కోమలి శుభమై !
________________________________
ముట్టు = ముట్టుకొను(ఒక చేతితో)
ముట్లు = ముట్టుకొను(రెండు చేతులతో)
శుభమై = శుభము కోసమై
ఆజ్ కీ తాజా ఖబర్ :
రిప్లయితొలగించండి03)
________________________________
సట్లెజు నది సామీప్యము
చెట్లవి చుట్టూ పెరిగిన - చిన్న గుడిసెలో
బట్లరు భార్యయు ,ముసలిది
ముట్లుడిగిన సతికి నొక్క - పుత్రుడు పుట్టెన్ !
________________________________
రాణీగారికి ప్రసవ సమయం !
రిప్లయితొలగించండిజట్లు జట్లుగా కోటను చుట్టుముట్టిన శత్రు సేనలు !
అడిగిన వన్నీ యిచ్చి శత్రు రాజుతో రాజీ !
కోటకు పట్టిన గ్రహణం విడుపు !
చుట్టుముట్టిన సైన్యం వెనక్కు మళ్ళింది !
ఆ ప్రశాంత వేళ
రాజ్యానికి వారసుని జననం !
04)
________________________________
జట్లుగ సేనలు ముట్టగ
నెట్లనొ రాజీ నెలకొన - నిరు రాజులకున్
పట్లవి సడలిన కోటను
ముట్లుడిగిన; సతికి నొక్క - పుత్రుడు పుట్టెన్ !
________________________________
పట్టు = గ్రహణము
ముట్టు = చుట్టుముట్టు
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పూరణ.....
రిప్లయితొలగించండిఎట్లాత్మవిభుఁడు గోరెనొ
యట్లే సతి చూలు దాల్చె నాచారములౌ
పాట్లుడిగినఁ దగు నెలలన్
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్.
ఇట్లన తప్పేమున్నది
రిప్లయితొలగించండిముట్లుడుగును గర్భవతికి ముందుగ, మారాం
భట్లవధానికి పెండ్లై
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్.
శ్రీ శర్మగారూ.. పనిముట్లుడగటం...బాగుంది.
రిప్లయితొలగించండిశాస్త్రి గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపట్టిన నోములు పట్టక
రిప్లయితొలగించండిచెట్టును పుట్టను దిరుగుచు చేయగ పూజల్
పట్టిని కోరిన, వరముగ
ముట్టుడిగిన సతికి నొక్కపుత్రుడు పుట్టెన్
శైలజ గారూ! మీ పద్యం చాల బాగున్నది. కాని ఇచ్చిన సమస్యలోని ప్రాసాక్షరం "ట్లు". ఇది బాగున్నది. మరొక పద్యం వ్రాయండి. దీనిని మార్చకండి. అభినందనలతో
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
=======*============
గట్లను దిను ఘన భట్లను
నట్లుగ జేసి చెరసాల యందున బెట్టన్,
కట్లను వీడిన ఖగమై
ముట్లుడిగిన,సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్
(గట్లను= సరి హద్దులను,భట్లను = తెలివి గల అత్తమామలు,ముట్లుడిగిన = కష్టములు దీరిన)
ఏక్టోస్ ( పయోగ్లిటసోన్ ) అనే మధు మేహపు మందు వాడితే అండోత్పత్తి మరల మొదలయి గర్భధారణ వయస్సు మీరిన వనితలలో కూడా సాధ్యమే ! మరి శిశు పోషణ భారము వైద్యునిపై పడవచ్చేమో !
రిప్లయితొలగించండిచీట్లగ నేక్టోస్ వ్రాయగ
కొట్లో కొని మ్రింగి కుతిని కూడగ పతితో ,
కోట్లను వైద్యుడె క్రక్కగ ,
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్ !
చిట్లెనుతల మెట్లెక్కగ
రిప్లయితొలగించండిముట్లుడిగినసతికి, నొక్క పుత్రుడు బుట్టెన్
అట్లమ్ము వారి పడతికి
తొట్లెకురమ్మనెనుసతిని తోయలి వేడ్కన్ !!!
కట్టుంగ నగర మందున
రిప్లయితొలగించండిముట్లుడిగిన సతికి నొక్క పుత్రుడు పుట్టెన్
అట్లని యంటిర ! చిత్రము
ఇట్లయె కలికాల మౌర ! యేమని జెపుదున్ ?
మత్పితృ స్నేహితులైన సుబ్బారావుగారికి నమస్సులు.పద్య ప్రథమ పాదములో ప్రాస తప్పినది సరి జూడగలరు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. ‘కొట్లాట బెట్టు రాముని’ అంటే సరి!
*
తోపెల్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారూ,
‘పనిముట్లుడిగిన’ మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
వసంత కిశోర్ గారూ,
మీ నాలుగ్ పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
వాస్తవ ఘటనను పూరణకు చక్కగా వినియోగించుకున్నారు. మంచి పూరణ. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
శైలజ గారూ,
మంచి ప్రయత్నం. తొందరలో ప్రాసను గమనించలేదనుకుంటాను. మీ పద్యానికి నా సవరణ....
ఎట్లో నోములు నోచియు
చెట్లను పుట్టలను దిరుగి శ్రీ తిరుమలపై
మెట్లకు మ్రొక్కగ, వరముగ
ముట్లుడిగిన సతికి నొక్కపుత్రుడు పుట్టెన్.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చమత్కార భరితమైన మీ పూరణ అలరించింది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘కట్టుంగ’ నగరాన్ని ‘కట్లుంగ’ అందాం. ప్రపంచంలో ఎక్కడో ఉండక పోతుందా?
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిపాట్లు బడుచు సంతు కొరకు
రిప్లయితొలగించండికొట్లాడక ప్రేమ తోడ గూడుచు భర్తన్
చెట్ల రసవైద్యమందగ
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్
పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి
రిప్లయితొలగించండిటి .బి.యెస్.శర్మ గారికి వందనములు
ఎట్లో గురువులు చెప్పిన
యట్లే సంతాన లక్ష్మ్జ్ ఆలయమునకున్
మెట్లను కట్టించంగను
ముట్లుడిగనసతికి నొక్క పుత్రుడు పుట్టెన్
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మంచి పూరణ వ్రాశారు. అభినందనలు.
కుట్లిడి రమణీయమ్మౌ
రిప్లయితొలగించండిచెట్లు పువులు పిట్టలు విలసిల్లెడు చీరల్
పుట్లుగ నమ్మి, పిదప, పని
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిచీరలకు కుట్లు వేసే పనిముట్లుడిగిన పడతిని గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
చదువు నిమిత్తం దూర ప్రాంతానికి వెడలిన తన ఒక్కగా నొక్క తనయుని తలచుకుంటూ ఎముక విరిగిన ఒక తల్లి :
రిప్లయితొలగించండిచిట్లె నెముక క్రింద పడగ
ముట్లు డిగిన సతికి ; “ నొక్క పుత్రుడు పుట్టెన్
గట్లకు మ్రొక్కగ, నయ్యో !
కట్లను వేయించు నపుడు కష్టము తోచెన్ "
చెట్లకు నీరివ్వని నది
రిప్లయితొలగించండిగట్లను భళ తెంచుకొనుచు గడగడ పారె
న్నెట్లో యిది తెలుసుకొనుడు:
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్
రిప్లయితొలగించండిఅట్లాంటాలో నన్నట
చెట్లూ పుట్టల తిరుగుచు చేవయు గూడన్
చిట్లించగ వైద్యంబును
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్!
జిలేబి
కుట్లను త్రుంచగ మమతకు
రిప్లయితొలగించండిపెట్లో దొరికెనుగ పదవి పేదల కొరకై...
ఎట్లగు నిదియన్న కనుము:
"ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్"
రిప్లయితొలగించండిఅట్లాంటావైద్యమిదియె
ముట్లుడిగిన సతికి నొక్క పుత్రుఁడు పుట్టెన్!
తూట్లేమియు పొడవమయా
గిట్లాంటిది కనివినియెరిగియు నుండరయా
జిలేబి