9, సెప్టెంబర్ 2013, సోమవారం

వినాయక స్తుతి


వినాయక స్తుతి


వినాయకం విచిత్రాంగం

విఘ్న కారణ వారణమ్ |

విజ్ఞాన యోగదం దేవం

విఘ్నరాజ మహంభజే ||



భానుకోటి సహస్రాభం

భవానీ నందనాగ్రజమ్ |

భాగ్యదం భవరోగఘ్నం

భావాతీత మహంభజే ||



మహాకవిం మహాతేజం

మహేశ్వర తనూభవమ్ |

మహానందప్రదాతారం

మహాత్మాన మహంభజే ||



గంధసింధురరాడ్వక్త్రం

గంధర్వ ప్రముఖార్చితమ్ |

గంధలేపిత దివ్యాంగం

గణనాథ మహంభజే ||



మునిబృంద సమారాధ్యం

మూషికాద్భుత వాహనమ్ |

మూలాధారాంబుజావాసం

మోక్షప్రద మహంభజే ||



 శ్రీగణేశం చిదానందం
శ్రీమత్ప్రమథ నాయకమ్ |

శ్రీకరం చిన్మయాకారం

శివాత్మజ మహంభజే ||



వరప్రదం ప్రసన్నాస్యం

వరసిద్ధి వినాయకమ్ |

వందారు భక్త మందారం

వారణాస్య మహంభజే ||



త్రిలోకేశ సమారాధ్యం

త్రివిధాపన్నివారణమ్ |

త్రిజగఛ్ఛ్రేయదం నిత్యం

త్రికాలజ్ఞ మహంభజే ||



సర్వదా సర్వదాతారం

సర్వ విఘ్న నివారణమ్ |

సర్వ జ్ఞాన సుధాసింధుం

సర్వాత్మక మహంభజే ||

నేమాని రామజోగి సన్యాసి రావు

8 కామెంట్‌లు:

  1. నమస్కారములు
    శ్రీ పూజ్య పండితుల వారికి ,వారి గణేశ స్తుతికి శిరసాభి వందనములు

    రిప్లయితొలగించండి
  2. నవ శ్లోక భరిత వినాయక స్తుతి సకల జనులకు నిత్య దేవతా ప్రార్థనా రూపమున రచించిన శ్రీపండిత నేమాని గురువులకు అభినందనాపూర్వక నమ:ప్రసూనము

    కామిత వరదు వినాయక
    సామిని మధురామృతపద సాహిత్యమునన్
    వైమాల గొలుచు పండిత
    నేమాని గురూత్తములకు నే ప్రణతింతున్

    రిప్లయితొలగించండి
  3. అన్నయ్యగారి వినాయకస్తుతి చాలాబాగుంది. ఉదయము గణేశుని ఈ స్తుతితో పూజిస్తాము.

    రిప్లయితొలగించండి
  4. నేమాని పండితార్యా! సులువుగా నలువురూ నిత్యం గణేశుని ప్రార్థించుకోవడానికి అనువైన స్తోత్రాన్ని అందించారు.


    శ్రీ విఘ్నేశ! వినాయకా! గజముఖా! శ్రీ పార్వతీనందనా!
    భావింపందగు నన్ని కార్యములలో ప్రారంభమందున్ నినున్!
    రావే విఘ్నము లెందునన్ కొలువ దూర్వారమ్ములన్, నిత్యమున్,
    భావిన్ మంచి శుభమ్ము, కీర్తి గలుగున్ ప్రార్థించ నిన్ భక్తితో.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ నేమాని గురుదేవులకు,మీ గణేశ స్తుతికి పాదాభి వందనములు.
    =====*=====
    పరితోషమ్మున వ్రాసిరి
    సుర సేవితుడవని మ్రొక్కి సుందర కావ్యం,
    వర సిద్ధి వినాయక మా
    గురుదేవుల స్తుతి గని,నిడు కోరిన వరముల్!

    రిప్లయితొలగించండి
  6. నవవిధ శ్లోకమ్ములనే
    నవనవలాడగను వ్రాసి నతులందించెన్
    భవముల బాపును జదువగ
    భవు తనయుడు తృప్తిజెంది భాగ్యములొసగున్.

    రిప్లయితొలగించండి
  7. మంచి వినాయక స్తుతి నందించిన
    నేమానివారి కభినందన సహిత
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి