22, సెప్టెంబర్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1182 (జింకను గని బెదరి పాఱె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్.

24 కామెంట్‌లు:

  1. లంకను ముట్టడి జేయగ
    బింకముగా నుండ లేక భీతిగ యసురుల్
    శంకించి మదిని రావణు
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుత పులివడిన్
    ________________________________________----
    లంకేశుడు రావణు డట
    పొంకముగా బయలు వెడల పోరా దెదుటన్
    జంకును యముడే యైనను
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుత పులివడిన్

    రిప్లయితొలగించండి
  2. జింకకు గల శాబకమును
    జంకక వేటాడు చిఱుత జాడను గనుచున్
    బింకముతో లంఘించెడు
    జింకను గని బెదిరి పాఱె జిఱుత పులి వడిన్

    రిప్లయితొలగించండి
  3. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    అంకించగ సీతమ్మను
    పంకించగ తాటకేయు బంగరు జింకై
    లంక వదలి యడవిదిరుగు
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    ఆజ్ కీ తాజా ఖబర్ :
    రాజీనామాలకు సంకోచించే ఎంపీలకూ మంత్రులకూ
    జింకల వంటి అమాయక ప్రజల చేతిలోశృంగభంగం :

    01)
    ____________________________

    శంకించి ప్రజలు ఛీ యని
    శంకాయుత మంత్రులంత - సంకోచించన్
    బింకము దీసిన విధి గన
    జింకను గని బెదరి పాఱెఁ - జిఱుతపులి వడిన్ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  5. అడవిలో సింహాన్ని చూసి చిఱుత పాఱుట సహజమే గదా :

    02)
    ____________________________

    జింక యనిన సారంగమె !
    శంకే లేదిక "మృగపతి" - సారంగ మనన్ !
    యింకేం !!! సహజం బడవిని
    జింకను గని బెదరి పాఱెఁ - జిఱుతపులి వడిన్ !
    ____________________________
    జింక = సారంగము = సింహము

    శంకరార్యా ! ఈ రకమైన పూరణ సమంజసమేనా ?

    రిప్లయితొలగించండి
  6. కాలు వలె వచ్చెడు హిరణ్య కశిపు గాంచి
    తరుణ మిది కాదటంచు మాధవుడు దాగె
    వింత కాదు జింకను గని బెదరి పారె
    జిరుత పులి వడిన్ శంకర శ్రీ కవీశ!

    రిప్లయితొలగించండి
  7. శంకను దాగగ చాటున
    పకించుచు వేటగాడు బాణము వేసెన్
    చంకన బెట్టెను చచ్చిన
    జింకను, గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్

    రిప్లయితొలగించండి
  8. ముంచుకు వచ్చిన ముప్పును
    జంకక తలపడి నిలచిన జరుగును మేలున్
    బింకముతో నెదిరించిన
    జింకను గని జెదరి పాఱె జిఱుతపులివడిన్

    రిప్లయితొలగించండి
  9. జంకుచు పరుగిడెనధిపుం
    డుంకించెడి యాంధ్రులంత నుద్ధృతిఁ గన. హా!
    శంకర! విధినేమనియెద!
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో
    ==========*=========
    జింకగ మారీచుడు దన
    వంకర గొమ్ములను జూపి వచ్చుచు నండన్
    శంకించి ప్రాణభీతిని
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్.
    ======*==========
    జింకగ మారీచుడు దన
    యంకము జూపుచు దిరుగగ నడవి నలయకన్
    జంకించుచుండ, జంకని
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్.

    రిప్లయితొలగించండి
  11. సంకట ఘడియలు వచ్చిన
    జింకకు చిఱుత పులి వలన, జీవించుటకై
    జంకక పోరును సలిపెడు
    జింకను గని బెదిరి పాఱె జిఱుత పులి వడిన్

    రిప్లయితొలగించండి
  12. దుర్గాదేవి నబల యను తృణీకార భావనచే నని సేయ నుంకించిన మహిషుని నా మాత పాఱఁద్రోలిన ఘట్టము...

    జంకువిడి, దుర్గ, మహిషుని
    సంకటమునఁ ద్రోయ; వాఁడు శక్తి నశించన్,
    గొంకుఁ గొని పాఱెఁ! జిత్రము!
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్!!

    రిప్లయితొలగించండి
  13. సంకట హరుడౌ తిరుమల
    వెంకటపతికొండపైన వేడుకగా ప
    ల్వంకల్మెరియగ విద్యుత్
    జింకనుగనిబెదిరి పాఱె జిఱుతపులివడిన్!!!

    రిప్లయితొలగించండి
  14. జింకకు గల శాబకమును
    జంకక వేటాడు చిఱుత జాడను గనుచున్
    బింకముతో లంఘించెడు
    జింకను గని బెదరి పాఱె జిఱుత పులి వడిన్

    రిప్లయితొలగించండి
  15. సంకట ఘడియలు వచ్చెను
    జింకకు చిఱుత పులి వలన, జీవించుటకై
    జంకక పోరును సలిపెడు
    జింకను గని బెదిరి పాఱె జిఱుత పులి వడిన్

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో

    జింకగ మారీచుడు దన
    యంకము జూపుచు దిరుగగ నడవి నలయకే
    జంకించుచుండ,జంకని
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్.

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘జింక + ఐ’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘మృగమై’ అనండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    ప్రస్తుత పరిస్థితులకు తగిన మీ మొదటి పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    రెండవ పూరణలో మీరు తర్కశాస్త్రాన్ని ఆశ్రయించినా ‘సారంగ’ శబ్దానికి జింక, ఏనుగు అనే తప్ప సింహం అనే అర్థం ఉన్నట్టు లేదు.
    మూడవ పాదాన్ని ‘ఇంకేమి సహజ మడవిని’ అనండి.
    *
    పండిత నేమాని,
    తేటగీతిలో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ఒకే భావంతో మీరు చెప్పిన రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ విద్యుజ్జింక పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    జింకగమారిన రక్కసు
    వంకనుగని జింక లన్ని వహ్వా యనగా
    శంకించెను రక్కసుడని
    జింకనుగని బెదరి పారె చిరుత పులి వడిన్

    జింకల యేలిక కూనను
    కంకణముగ జేసి నోట గఱచిన చిరుతన్
    జంకక గుంపుగ వచ్చిన
    జింకనుగని బెదరి వారే చిరుత పులి వడిన్

    రిప్లయితొలగించండి
  19. బింకమున శరశతంబులఁ
    గ్రుంకించి వశిష్ఠుపైన రోషమెసంగన్
    శంకలు తీరఁ వెనుదిరిగెఁ
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్.

    రిప్లయితొలగించండి
  20. డొంకల మాటున నొదిగిన
    జింకను గని బెదరి పారె చిరుత పులి వడిన్
    బింకమగు సింహ మనుకొని
    అంకము పై నున్న పిల్ల యదురుచు నుండన్

    రిప్లయితొలగించండి
  21. జంకునుఁ జూపక తల నెల
    వంకను ధరియించువాని భస్మాసురుడా
    టంకపరచినంత గనుడు-
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్

    వానికంతముఁ జూపగ పాప నాశ
    కరుడు శివుడదె సాగగ కలికి రూప
    మందు శ్రీహరి యరుదెంచె యల్లదె గను
    మా హరి హరుల నెయ్యపు మహిమ నచట.

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యా ! ధన్యవాదములు !
    "సారంగ"మిటనున్నది !
    సింహము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) Report an error about this Word-Meaning
    దేశ్య.

    ఏనికదిండి, ఏనుగుగొంగ, ఏనుగుదాయ, ఏనుగులసూడు, జడలమెకము, తెట్టతెఱవామెకము, తెఱనోటిమెకము, తెఱనోరు, తెఱవామెకము, తెలిడాలుమెకము, తెలిమెకము, తెల్లడాలుమెకము, నెఱపరి, పచ్చకన్నులమెకము, బాకినోటిమెకము, బొబ్బమెకము, మెకములఱేడు, రెంటత్రాగుడుతిండి, వెడదమోముమెకము, వెల్లిమెకము, సటలమెకము, సింగము

    సం.

    అగోకసము, కంఠీరవము, కరిదారకము, కరిమాచలము, కేశి, కేసరి, గజరిపువు, గజమోటనము, జటిలము, దీప్తము, నదనువు, నభఃక్రాంతి, నాగారి, పంచాస్యము, పశురాజము, పా(రిం)(రీం)ద్రము, బహుబలము, భారి, భీమవిక్రాంతము, మృగపతి, మృగరాజు, మృగరిపువు, మృగారాతి, మృగాశనము, మృగేంద్రుడు, రక్తజిహ్వము, శూరము, సటాంకము, సారంగము, హరి, హరితము, హర్యక్షము, హస్తికక్ష్యము, హేమాంగము

    రిప్లయితొలగించండి
  23. పంకజముఖిఁ జూచి వడిగ
    జంకుచు రాహులుడు పారె జగడము నందున్
    శంకర! ఇది యెట్లన్నన్
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్

    రిప్లయితొలగించండి


  24. ఇంకగ ధైర్యంబరరే
    జంకు తనకు తానుగ మన సన్నిధి చేరున్!
    ఢంకా మ్రోతల తోడై
    జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి