24, సెప్టెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1184 (సంతస మొసంగు మనకెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
సంతస మొసంగు మనకెల్లఁ జావుకబురు.

28 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    ఉచ్ఛ నీచముల్లేక యథేచ్ఛ నడచు
    మద్యపానమత్తుడయిన మదవతుండు
    స్త్రీల వృద్ధుల బాధించు చెనటి యొక్క
    సంతస మొసంగు మనకెల్లఁ జావుకబురు.

    ( మదవతుండు = రౌడీ, మదమెక్కినవాడు)

    రిప్లయితొలగించండి
  2. దుష్ట రావణ కాష్టము నిష్ట లేక
    మండు చున్నది మానవ మాయ లందు
    చేను మేసెడి కంచెల మేను నరుక '
    సంతస మొసంగు మనకెల్లఁ జావు కబురు

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    యింట్లో దూరిన పాము చస్తే ఆనందమే గదా :

    01)
    ________________________________

    సర్ప మొక్కటి యిలు దూర - సంతసమ్మె?
    చాటు మాటున డాగిన - సంశయంబు
    సకల గదులను వెదకుచు - జనులు తిరిగి
    సర్వ శక్తుల నొడ్డైన - జంపి నంత
    సంతస మొసంగు మనకెల్లఁ - జావుకబురు !
    ________________________________

    రిప్లయితొలగించండి
  4. మారణహోమం సృష్టించే యాసిన్‌భత్కల్ లాంటివాళ్ళు చస్తే :

    02)
    ___________________________

    మంచి కూడలు లందున - మంది మధ్య
    మందు కూరిన బాంబుల - మందసము ల
    మర్చి , పిల్లపాపల , పలు - మంది జంపు
    ముళ్ళమారుల బంధించి - బొందబెట్ట
    సంతస మొసంగు మనకెల్లఁ - జావుకబురు !
    ___________________________
    ముళ్ళమారి = దుర్మార్గుడు

    రిప్లయితొలగించండి
  5. శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో అన్వయము దెబ్బ తినినది - మరొక ప్రయత్నము చేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. కసబ్ ముఠా నా హొటల్లోనే ముగించేస్తే :

    03)
    ___________________________

    పడవలందున చాటుగా - పల్లె జేరి
    పట్టణంబున హొటలున - పాకశాల
    పదుల సంఖ్యన జొచ్చి, యా - ప్రజల నకట
    పట్టి పల్లార్చ సమకట్టు - పందల నట
    పిట్టలను కాల్చినట్టులె - మట్టుబెట్ట
    సంతస మొసంగు మనకెల్లఁ - జావుకబురు !
    ___________________________
    పంద = దుర్మార్గుడు

    రిప్లయితొలగించండి
  7. రావణుని చిత్రాన్ని ప్రతీ పండక్కీ కాలిస్తే :

    04)
    ___________________________

    రమణి సీతను సాధ్విని - రాక్షసముగ
    లంక కెత్తుకు వెళ్ళిన - రాలుగాయ
    రావణుండను రాక్షస - రాజు పటము
    రమ్యమైనట్టి పండుగ - లందు గాల్చ
    సంతస మొసంగు మనకెల్లఁ - జావుకబురు !
    ___________________________
    రాలుగాయ = దుర్మార్గుడు

    రిప్లయితొలగించండి
  8. జెట్ట్టు, హిట్టు కొట్టి దోమల్ని చంపేస్తే :

    05)
    ___________________________

    చెప్ప నలవియు గాదు, మా - చెడ్డబాధ !
    చీకటీగలు రొదబెట్టి - చెవుల యందు
    చేరి నిద్రను నడిరేయి - చెరిచినపుడు
    జెట్ట్టు, హిట్టుల వెంటనే - కొట్టి జంప
    సంతస మొసంగు మనకెల్లఁ - జావుకబురు !
    ___________________________
    చీకటీగ = దోమ
    జెట్ట్టు, హిట్టు = దోమల వినాశకములు

    రిప్లయితొలగించండి
  9. దొంగలముఠా దెబ్బకు ఠా అయితే :

    06)
    ___________________________

    దూరి గుడిలోన నగలన్ని - దోష మనక
    దొంగిలించుక పోయెడి - దొంగలంత
    దొడ్డ శకటమ్ము పైకెక్క - త్రుంగి నపుడు
    సంతస మొసంగు మనకెల్లఁ - జావుకబురు !
    ___________________________
    త్రుంగు = చచ్చు

    రిప్లయితొలగించండి
  10. ద్వారకలో నిద్దఱు గోపాలకులు సంభాషించుకొనుచున్న సందర్భము...

    "వెడలి రయ్య సత్యాకృష్ణు లెడఁదఁ బూని,
    దుష్ట నరకాసురుని, లోక దురిత కరుని
    నడఁచఁగను, లోక కళ్యాణ మిడఁగ! నపుడు
    సంతస మొసంగు మనకెల్లఁ జావు కబురు!!"

    రిప్లయితొలగించండి
  11. దేశ సరిహద్దు దాటిన తీవ్రవాదిని మట్టుబెట్టేస్తే :

    07)
    ___________________________

    దేశ సరిహద్దు దాటిన - తీవ్రవాది
    దేశ సరిహద్దు కాపలా - తిరుగువారు
    దేశ భక్తుల ధాటికి - త్రెళ్ళినపుడు
    సంతస మొసంగు మనకెల్లఁ - జావుకబురు !
    ___________________________
    త్రెళ్ళు = చచ్చు

    రిప్లయితొలగించండి
  12. సంతస మొసంగు మనకెల్ల జావు కబురు
    తప్పని, సదరు వ్యక్తి స్వాస్థ్యంబుగాంచి
    యలరుచుండగ, నాతని కంద జేతు
    నాశిషమ్ముల దీర్ఘాయు రస్తటంచు

    రిప్లయితొలగించండి
  13. భయము లేకనె చెరిచె నిర్భయను నాడు
    చెప్పనలవికి గాలేని చేష్టలవియె
    మరణ శిక్షను వేసెగా నురిని దీయ
    సంతస మొసంగు మనకెల్లఁ జావుకబురు.


    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురుదేవులకు , శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..

    =======*==========
    సంతు గలుగ సంతస మొసంగు మనకెల్ల
    జావు కబురు నిడునె సంత సమ్ము?
    చావు పుట్టుక లను భావమ్ము వీడిన
    మరణ భయము దూర మౌను వేమ(గదర)!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో ..
    =======*==========

    లేక లేక సంతు గలుగ రేయి పగలు
    సంతస మొసంగు మనకెల్ల,జావు కబురు
    విన్న జాలు మనము మూల నున్న జలము
    కనుల వెంట కారుచునుండు ఖలుల కైన!

    రిప్లయితొలగించండి
  16. రెండవ పద్యము నాల్గవ పాదమును కొంచెం మార్చి

    కనుల నందు జారుచునుండు ఖలుల కైన !

    రిప్లయితొలగించండి
  17. శ్రీ తోపెల్ల శర్మ గారూ!
    మీరు నల్లి గురించిన చాటువు గుర్తుకు రాలేదన్నారు కదా!
    ఇదిగో:
    శివు డద్రిని పవళించుట
    రవి చంద్రులు మింట నుంట రాజీవాక్షుం
    డవిరళ సముద్రమందున
    పవళించుట నల్లి బాధ పడలేక సుమీ!

    రిప్లయితొలగించండి
  18. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    పుత్రుడుదయింప మొదటి కాన్పునని వినగ
    సంతస మొసంగు మనకేల్ల జావుకబురు
    ఎంత యపకారి దైనను సుంత జాలి
    జూపెదరు “రామ రామ “ని పాపముడుగ

    భువినిభక్తుడౌ గోపన్న దివినిజేర
    సంతసమొసంగు మనకెల్ల జావుకబురు
    చావునిత్యమీ భువి గదా స్వర్గమంద
    మరులు వాంఛి౦త్రుజన్మింప భరత భూమి

    లంచగొండి యౌ గ్రామణి పెంచు కుక్క
    సంతసమొసంగు మనకెల్ల చావుకబురు
    వినగ దుఃఖమ్ము నటియింత్రు జనులు కాని
    గ్రామి మరణింప జచ్చేరా కర్కశుడని

    రిప్లయితొలగించండి
  19. మారుతి సీతతో :

    చింత వీడుము, జానకీ! సేమమగును
    రామచంద్రుడు త్వరలోనె లంక జేరి,
    రావణుని కోలనేయును రణమునందు
    సంతస మొసంగు మనకెల్లఁ జావుకబురు.

    రిప్లయితొలగించండి
  20. చిరుత తిరుగాడు చోటని యెఱిఁగి కూడ
    కాలి బాటన తిరుమల కదలఁ బోవ
    చిరుతఁ జంపిరి రక్షక వరులని విన
    సంతస మొసంగు మనకెల్లఁ జావు కబురు

    రిప్లయితొలగించండి
  21. మరి యొక ప్రయత్నము:

    జ్ఞాన ఖడ్గమ్ముతో శత్రు షట్క తతిని
    సంహరించిన యొక యోగ సాధకవరు
    సంస్తుతించరే? యాతని సరణి గాంచ
    సంతస మొసంగు మనకెల్ల జావు కబురు

    రిప్లయితొలగించండి
  22. దేశ శత్రువులను జంపు దేశభక్తి
    సంతసమొసంగు మనకెల్ల, జావు కబురు
    విన్న శత్రు సైన్యమునకు వెన్ను వనుక
    భారతీయ శక్తిని చాట వైభవమ్ము

    రిప్లయితొలగించండి
  23. తాజు మహలు హోటల్లోని దమనకాండ
    కారకుండైన కర్కోట కసబు గాన్ని
    కోర్టు తీర్పిచ్చి యురితీసి కూల్చివేయ
    సంతస మొసంగు మనకెల్ల జావుకబురు.

    రిప్లయితొలగించండి
  24. తనకు జరిగినదొషమ్ము తెలిపినాను
    తీరుపెట్టులు జరుగునో తెలియరాదు
    చెరచబోయిన చెండాలు చీల్చె నన్న
    సంతసమొసంగుమనకెల్ల జావు కబురు

    రిప్లయితొలగించండి
  25. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    తమరి సూచనానంతరం మరొక ప్రయత్నం

    ఉగ్ర వాదమని జనుల నూచ కోత
    కోసి పలుదే శాలకు కునుకు లేక
    జేసి నట్టి బిన్ లాడెను మాసెనన్న
    సంతస మొసంగు మనకెల్లఁ జావుకబురు.

    రిప్లయితొలగించండి
  26. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న మా బావమరదికి ఆపరేషన్ కారణంగా ఉదయమే కరీంనగర్ వెళ్ళి రాత్రి 11 గం.లకు తిరిగి వచ్చాను. అందువల్ల పూరణలను, పద్యాలను సమీక్షించే అవకాశం దొరకలేదు. మన్నించండి.
    చక్కని పూరణ లందించిన ....
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    వసంత కిశోర్ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    వరప్రసాద్ గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    మిస్సన్న గారికి,
    సహదేవుడు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    కుసుమ సుదర్శన్ గారికి,
    ప్రభల రామలక్ష్మి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. దేశ శత్రువులను జంపు దేశభక్తి
    సంతసమొసంగు మనకెల్ల, జావు కబురు
    విన్న శత్రు సైన్యమునకు వెన్ను వణక
    భారతీయ శక్తిని చాట వైభవమ్ము

    రిప్లయితొలగించండి