14, సెప్టెంబర్ 2013, శనివారం

పద్య రచన – 464 (గుణత్రయము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“గుణత్రయము”

18 కామెంట్‌లు:

  1. సత్వ గుణములు గలిగిన సాధు వగును
    తృష్ణ యనగను తీరని దు ఖ హేతు
    జ్ఞాన మజ్ఞాన మెంతేని శంక యనగ
    మాయ యనునది గుణత్రయ మార్గ మందు

    రిప్లయితొలగించండి
  2. మూడు గుణము లజ్ఞానజములు జగమున
    సత్త్వము, రజస్సును, తమస్సు సంజ్ఞ లొప్ప
    నలరు సకల జీవులయందు నంచితముగ
    జీవితము గుణములను బట్టి చెలగుచుండు

    రిప్లయితొలగించండి
  3. నరుల యందున నుండు గుణత్రయమ్ము;
    తామ సమ్మున్న నధమ వర్తనముఁ గలుగు;
    రాజ సమ్మున్న మధ్య వర్తనముఁ గలుగు;
    సాత్త్వి కమ్మున్న ధీర వర్తనముఁ గలుగు!

    రిప్లయితొలగించండి
  4. సత్వ గుణము యున్న సాధించు కీర్తిని
    రజోగుణము వలన రాజిల్లు జీవనం
    తమోగుణము నెపుడు తగ్గించుకోవలె
    గుణత్రయము మనుష్య గురుతు గాదె..

    రిప్లయితొలగించండి
  5. కాళిదాసుడుపమ కంఠీరవుండు భా
    రవుఁడు నర్థమందు కవివరుండు
    లలితమధుర వాణిఁ రహియించె దండి, మా
    ఘుఁడు "గుణత్రయము"న గొప్పనయ్యె.

    పైపద్యానికి ఆధారము.............

    "ఉపమా" కాళిదాసస్య
    భారవే"రర్థ"గౌరవం
    దండినం "పదలాలిత్యం"
    మాఘస్యైతే "త్రయోగుణా:"

    రిప్లయితొలగించండి
  6. శ్రీమతి శైలజ గారి పద్యమును సవరించుచు....

    సత్త్వగుణము వలన సద్యశమ్ము లభించు
    చొక్కు జీవితము రజోగుణమున
    విడువదగు తమస్సు విజ్ఞానవంతులై
    మహి గుణత్రయమ్ము రహి జెలంగు

    రిప్లయితొలగించండి
  7. మూ'డవ గుణమన్న ' మురికిలో నున్నట్లు
    రెండదైన కొంత మెండె యగును
    మొదటి దాని గోర ముచ్చటే బ్రతుకున
    మూడు గుణములందె నాడు జగతి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
    ఈ నాడు పద్య రచన మంచి పద్యములతో "గుణత్రయము" సజ్జనులకు మార్గము జూపుచున్నది.
    శ్రీ గోలి వారి పద్యము అదుర్స్ .
    కానీ వరుస క్రమము మారిన సరదాగా
    =======*========
    మూడవ గుణ మందు మునులు దిరుగు చుండు
    రెండవ గుణ మందు రిపులు మెండు
    మొదటి గుణ మందు పురజనులుండును
    మూడు గుణము లెల్ల వీడు ముందు!

    రిప్లయితొలగించండి
  9. సత్త్వ గుణమున కర్ధము సాధుతనము
    రాజసము గలిగించు నీ రాజొ గుణము
    తామసము నొనగూ ర్చు నధమ గతినిల
    ఈ గుణములే గుణ త్రయ మిందు వదన !

    రిప్లయితొలగించండి
  10. నేడు దుర్గుణములు దప్ప మంచి గుణములు లేవని
    ========*========
    త్రిగుణముల నిలయము త్రిభువ నమ్ములు
    తెలివి గలిగి జూడ తీరు దెలియు,
    రూప రహితమనుచు లోభు లెల్లరు నేడు
    గుణత్రయమును వీడె గుడ్డి గాను,

    రిప్లయితొలగించండి
  11. తొల్లి తమోగుణం బెల్లను దొలగించి
    ....యోగ సాధనముల నూనుచుండి
    మెల్లమెల్లగ రజస్సెల్ల నిర్మూలించి
    ....వినయ భావమ్ముతో వెలుగు చుండి
    చల్లగా దాటుచు సత్త్వగుణమ్మును
    ....నలరి సత్త్వాతీత మైన రీతి
    ఆనంద్రసాంద్రుడై జ్ఞానతేజమ్ముతో
    ....పరమార్థ విభవ సంపన్నుడగుచు
    సర్వ జీవుల యెడ సమభావ మలరంగ
    నెల్ల యెడల బ్రహ్మమే నటంచు
    చెలగుచుండి యోగ సిద్ధిచే ముక్తుడై
    యోగి పరమపదము నొందు లెస్స

    రిప్లయితొలగించండి
  12. నీదు గుణముఁ దెలిసి నిన్ను వంచింతురు
    లోక రీతి యిదయె శోక మీయ
    తామరాకుమీది తడివోలె మెలగుచు
    త్రిగుణ రహితు గొల్వఁ దీరు జన్మ

    రిప్లయితొలగించండి
  13. సత్త్వ గుణస్థుడైన సంతోషమును పొందు
    .. భౌతిక లోకపు భాదవీడి,
    భోగవాంచలతోడ రోగియౌనుగ రజో
    .. గుణము మెండుగ వాని గూడు జేర,
    ప్రాకులాడుచునుండు పాప జగతి యందు
    ... భార్యబిడ్డలనుచు బడుగుజీవి,
    వింత గుణముతోడ వేధన జెంది చిం
    ....తాక్రాంతుడైయుండు తామసమున,
    పతన మౌను జనులు ప్రగతి గానగ లేక
    ధనము కూడ బెట్టి వనము జేరు
    నిదుర నందు గడపు నెమ్మదియనుచును
    ధీరుడయిన మీరు త్రిగుణములను!
    (వనము=కాటికి, మీరు = అతిక్రమించు)

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .

    సత్వ రాజస తమ గుణ చయములన్ని
    ప్రకృతి జన్యము, దేహిని వశమొనర్చు
    సత్వగుణము నిర్మలము, తేజమ్మునొసగు
    జ్ఞాన సుఖముల యందు నాసక్తి పెంచు

    మమతల రాగమత్సరపు మాయకు లోబడి కర్మముల్ సదా
    క్రమమున లోభమోహముల కామ్యము తీరగ నాచరించి వి
    భ్రమమును జెంది చిత్తమున భార్యయు, బంధులు, పుత్రమిత్రులం
    చమితములైన జన్మముల నందుచు నుందురు రాజసుల్ కదా

    తమసగుణము నజ్ఞానము
    విముఖత పనిసేయ, నిద్ర వృద్ధిని జెందన్
    భ్రమయు పరాకును, కలుగును
    కుమతి యగును దుర్గుణముల కూటమి దొరకన్

    రాగద్వేషము లేక ర
    జోగుణము వెరవు వడకను సోమరిగాకన్
    బాగుగ సాత్విక కర్మల
    యోగిగ కృష్ణార్పణమ్ము యొనరించవలెన్

    రిప్లయితొలగించండి
  15. మూడు గుణములు నను ముంచి తేల్చుచునున్న
    జనన మరణ భ్రమణ చక్రగతిని
    నిలుప వేడుకొనెద- నిక్కము తెలుపుమా!
    నీలదేహధారి నిన్ను గొలుతు.

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పద్యాలు గుణత్రయ స్వరూప ప్రభావాలను జ్ఞానదాయకంగా వివరిస్తున్నాయి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సవరణను గమనించారు కదా!
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అనువాదరూపమైన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘రెండదైన’...? ‘రెండవ దది కొంత...’ అందామా?
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘తిరుగుచుంద్రు, పురజను లుందురు’ అనండి.
    రెండవ పద్యం సీసంలో మొదటి పాదంలో గణదోషం. ‘గుణస్థుడైన’ను ‘గుణస్థుండు’ అనండి. ఎత్తుగీతిలో ‘జనులు’ను ‘జనుడు’ అనండి. ‘నిదురయందు’ అనండి.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘రాజొగుణము’ అనడం దోషం. ఆ పాదాన్ని ‘చూడ రాజస మొసగు రజోగుణంబు’ అనండి.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి