కవిమిత్రులకు శుభోదయం. నిన్నటినుండి నా ఇంటర్ నెట్ ఇబ్బంది పెడుతున్నది. అందువల్ల ఈనాటి పోస్టును షెడ్యూల్ చెయ్యలేక పోయాను. ఇప్పుడు కూడ మాటిమాటికి డిస్కనెక్ట్ అవుతున్నది. మన్నించండి.
నిన్న నేను ప్రకటించిన "శ్రీ పాండు రంగ భక్త మాలకీర్తనలు " పుస్తకము నందు గల జోల పాట రచయిత తెలియలేదు. గ్రంధ సందాత : శ్రీ లచ్చిరెడ్డి వెంకటస్వామి గారి మనవి ప్రకారము ఇది శ్రీ నారాయణ తీర్థులు, శ్రీజయదేవులు, శ్రీత్యాగరాజు, శ్రీసుబ్రహ్మణ్య, శ్రీరామదాసు,శ్రీ నరశింహదాసు లలో ఒక్కరు అని తెలియుచున్నది.
అయ్యా! తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు. మీ పద్యము మన ధర్మము లోని ఒక వర్గము వారిని మూర్ఖులుగా చిత్రీకరించుచున్న విధముగ కనుబట్టుచున్నది - అట్టి భేద భావములు శ్రేయస్కరములు కావు కదా. స్వస్తి.
సాహితీ మిత్రులందరికీ నమస్సులు. పెద్దలు శ్రీనేమాని పండితుల, అన్న మిస్సన్న గారి అభిప్రాయములతో ఏకీభవించుచూ మతమనగా అభిప్రాయము. దేని యెడల? పరమ సత్యము యెడల. ఎవరి అభిప్రాయములు వారికుండుటలో అభ్యంతరము లేదు. ఆ మార్గములో చరించుట తప్పుగాకపోవచ్చు. కాని ఇతర అభిప్రాయములు తప్పు అనే అధికారం యే ఒక్కరికిని లేదు. పరమత సహనము తో జీవించవలె ననుటకు ఇదే కారణము. శ్రీ తిమ్మాజీరావు గారిలాంటి వారు ఈ రీతి పల్కుట కడు బాధాకరము. వారి పద్య భావము తీవ్రమైనది. సుహృద్భావ శంకరాభరణ సాహితీ వ్యవసాయము చక్కగా సాగునట్లు ఏ ఒక్కరిని నొప్పించని రీతిలో సాగునట్లు చూడవలసిందిగా మనవి. మనమందరమూ ప్రయాణం చేయుచున్నదే “శంకరాభరణ” మనే వాహనము. తురీయ స్థాయిలో ఉండేది, గమనించేది శూన్యమే గదా!
శ్రీ నేమాని గారు , విస్సన్న గారు, TBS Sarma గారు ల స్పందనలను చవిదితిని. “ద్వైతము సుఖమా? అద్వైతము సుఖమా? అను మీమాంస లో పడి వ్రాసిన వ్యాఖ్య. కానీ ఏ ఇతర అనుయాయులను విమర్శించుటకు కాదు. అయినా మీ అందరి వ్యాఖ్యలు చదివిన తరవాత మీ అభిప్రాయములు సమంజసమే నని అనిపించి, నేను వ్రాసిన వ్యాఖ్యను ఉపసంహరించుకొనుచున్నాను. మీ అందరి మనసులు నొప్పించి నందులకు క్షమించ వలసినది. భక్తి మార్గమే ముక్తి కి సాధనమని భావించుచున్న.....
కవిమిత్రులకు వందనాలు. నా నెట్ సమస్య తీరలేదు. అందువల్ల అందరి పూరణలను విడివిడిగా సమీక్షించలేకపోతున్నాను. మన బ్లాగు మొదటినుండి వివాదాలకు, విమర్శలకు దూరంగా సుహృజ్జనహితమై నడుస్తున్నది. దయచేసి మీ పూరణలు కాని, వ్యాఖ్యలు కాని మత, ప్రాంత, భాషా (ఛందో వ్యాకరణాంశాలకు మినహాయింపు) వివాదాలకు తావివ్వని విధంగా ఉండే విధంగా చూడవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన మిత్రులు.... గుండు మధుసూదన్ గారికి, పండిత నేమాని వారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, వరప్రసాద్ గారికి, సుబ్బారావు గారికి, శైలజ గారికి, బొడ్డు శంకరయ్య గారికి, మిస్సన్న గారికి, కుసుమ సుదర్శన్ గారికి, మంద పీతాంబర్ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, కెంబాయి తిమ్మాజీ రావు గారికి అభినందనలు, ధన్యవాదాలు.
శ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు. భక్తి మార్గమే సులభమనుట నిర్వివాదాంశమే. కానీ మన సనాతన ధర్మము అతి పవిత్రమైనది. ముక్తికి అనేక మార్గములను బోధించినది. అన్ని మార్గములును ప్రశస్తములే. ఏ ఒక్క మార్గమును ఆశ్రయించినా మంచిదే - శ్రేయస్కరమే. "అద్వేష్టా సర్వభూతానాం" అన్నది మన భగవద్గీతాచార్యులు భక్తియోగములో పేర్కొనిన మొట్టమొదటి భక్తి లక్షణము అని ఎవ్వరునూ మరువ రాదు. ఇతరులం దెవ్వరి యందును ద్వేషము ఉండరాదు. భగవద్గీతా వాక్యమును వ్రాయుటకు నాకు ఈ విధముగా అవకాశము వచ్చినందులకు సంతోషము. స్వస్తి.
కవిమిత్రులకు శుభోదయం.
రిప్లయితొలగించండినిన్నటినుండి నా ఇంటర్ నెట్ ఇబ్బంది పెడుతున్నది. అందువల్ల ఈనాటి పోస్టును షెడ్యూల్ చెయ్యలేక పోయాను. ఇప్పుడు కూడ మాటిమాటికి డిస్కనెక్ట్ అవుతున్నది. మన్నించండి.
"మూఢులై మేము చెడితిమి; మోక్ష మందఁ
రిప్లయితొలగించండిజేయు బోధల ననుసరించెద"మటంచు,
మూఢమతు లాదరింత్రు ముముక్షువులను;
జ్ఞానులై తరియించఁగ నాస్థ తోడ!
తిన్ననికి బోలె భక్తి సంపన్ను లహర
రిప్లయితొలగించండిహమ్ము పరమాత్ము గొల్చుచు నంచితముగ
మూఢమతు లాదరింత్రు, ముముక్షువులను
దేవుడే ప్రేమతో జేరదీయు నయ్య!
జ్ఞానవైరాగ్యములు మోక్షకారకములు
రిప్లయితొలగించండిగాగఁ దలఁచుచు నతులనిష్కామమహిమ
బుద్బుధప్రాయ సంసార పోషణమున
మూఢ మతులాదరింత్రు ముముక్షువులను.
సంసారపోషణమున మూఢమతులు..........
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో .
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదములు.
మా తల్లి గారు పాడేది జోల పాట యది, మరలా ఫోన్ జేసి రచయిత,ఇతర వివరములను తెలిపెదను.
=========*======
పోడు రైతుల దరి జేరి పొంకమలర
పాడు రుచులార గించుచు మోడులయ్యి
వాడ వాడల దిరుగుచు కీడు జేయు
మూఢ మతు లాదరింత్రు ముముక్షువులను!
(పోడు రైతుల = మాతము మార్చు వారు)
========*========
మంచి జెడుల నడుమ కంచెను గానక
మాయ జగతి యందు మరులు గొన్న
మత మదమున మూఢమతు లాదరింత్రు ము
ముక్షువులను నేడు పుడమి యందు!
మొండి వాదన జేతురు ముఖ్యముగను
రిప్లయితొలగించండిమూఢ మతులా,దరింత్రు ముముక్షువులను
దేవతా గణ మనిశము దైవ మనుచు
స్వాగ తింతురు కూడను స్వర్గ మునకు
గురుదేవుల సవరణతో
రిప్లయితొలగించండిపోడు రైతుల దరి జేరి పొంకమలర
పాడు రుచులను మరగుచు మ్రోడులగుచు
వాడ వాడల దిరుగుచు కీడు జేయు
మూఢమతు లాదరింత్రు ముముక్షువులను!
(పోడు రైతుల = మాతము మార్చు వారు)
తాము నమ్మినదెల్లయూ తధ్యమనుచు
రిప్లయితొలగించండిమాయ జగమున మాయలో మసలుకొనుచు
మూఢ భక్తిపధ మందున ముక్తి గోరి
మూఢ మతులాదరింత్రుముమక్షువులను
ఇలను సంసార సాగర మీద లేక
రిప్లయితొలగించండిభక్తి మార్గము బట్టిన భక్తు డొకడు
శిష్యులను పొంద గారడీ చేయుచుండ
మూఢ మతు లాదరింత్రు ముముక్షువులను.
శ్రీ శైలజ గారు మీ పద్యపు మూడవ పాదములో గణదోషమును సవరించి
రిప్లయితొలగించండిమూఢ భక్తిపధమ్మున ముక్తి గోరి
కరుణ సుంతైన లేనట్టి కాపురుషులు,
రిప్లయితొలగించండిపాప భీతినెరుంగని పాడు జనులు,
మూఢ మతు, లాదరింత్రు ముముక్షువులను
గేలి జేసెడి దుష్టుల కేలుఁ బట్టి.
తెలివి మాలిన జనులెల్ల తెలుసుకొనక
రిప్లయితొలగించండిమందబుద్ధుల చెంతయే మసలుచుండు
చదువరులను జేరి తెలియ జాడ, రటుల
మూఢమతు లాదరిం(తు ముముక్షువులను
శక్తి పరిపూర్ణ లలితాంబ చలువ గలుగ
రిప్లయితొలగించండిమూఢ మతులు తత్వజ్ఞాన మూర్తు లవరె ,
సత్య మేలోన నిత్యమై నృత్యమాడ
మూఢ మతులాదరింత్రు ముముక్షువులను !!!
కలియుగ మ్మది మాయల నిలయ మంట
రిప్లయితొలగించండికాంత కనకమ్ము లనునవి సొంత మనుచు
మంత్ర తంత్రాల మహిమల యాస్తి కొఱకు
మూఢ మతు లాదరింత్రు ముముక్షువు లను
శ్రీ వసంత కిషోర్ గారికి ధన్యవాదములతో
రిప్లయితొలగించండినిన్న నేను ప్రకటించిన "శ్రీ పాండు రంగ భక్త మాలకీర్తనలు " పుస్తకము నందు గల జోల పాట రచయిత తెలియలేదు.
గ్రంధ సందాత : శ్రీ లచ్చిరెడ్డి వెంకటస్వామి గారి మనవి ప్రకారము ఇది శ్రీ నారాయణ తీర్థులు, శ్రీజయదేవులు, శ్రీత్యాగరాజు, శ్రీసుబ్రహ్మణ్య, శ్రీరామదాసు,శ్రీ నరశింహదాసు లలో ఒక్కరు అని తెలియుచున్నది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! తిమ్మాజీ రావు గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. మీ పద్యము మన ధర్మము లోని ఒక వర్గము వారిని మూర్ఖులుగా చిత్రీకరించుచున్న విధముగ కనుబట్టుచున్నది - అట్టి భేద భావములు శ్రేయస్కరములు కావు కదా. స్వస్తి.
నేమాని పండితుల అభిప్రాయంతో నేను సంపూర్ణంగా యేకీభవిస్తున్నాను.
రిప్లయితొలగించండిఅద్వైత సిద్ధాంత సారధులను మూఢులాదరింతు రనుట తిమ్మాజీరావుగారికి
తగదు. ఎవరినీ నొప్పించని రీతిలో సాగుతున్న శంకరాభరణంలో ఇటువంటి
పూరణలకు తావుండరాదు.
సాహితీ మిత్రులందరికీ నమస్సులు. పెద్దలు శ్రీనేమాని పండితుల, అన్న మిస్సన్న గారి అభిప్రాయములతో ఏకీభవించుచూ మతమనగా అభిప్రాయము. దేని యెడల? పరమ సత్యము యెడల. ఎవరి అభిప్రాయములు వారికుండుటలో అభ్యంతరము లేదు. ఆ మార్గములో చరించుట తప్పుగాకపోవచ్చు. కాని ఇతర అభిప్రాయములు తప్పు అనే అధికారం యే ఒక్కరికిని లేదు. పరమత సహనము తో జీవించవలె ననుటకు ఇదే కారణము. శ్రీ తిమ్మాజీరావు గారిలాంటి వారు ఈ రీతి పల్కుట కడు బాధాకరము. వారి పద్య భావము తీవ్రమైనది. సుహృద్భావ శంకరాభరణ సాహితీ వ్యవసాయము చక్కగా సాగునట్లు ఏ ఒక్కరిని నొప్పించని రీతిలో సాగునట్లు చూడవలసిందిగా మనవి. మనమందరమూ ప్రయాణం చేయుచున్నదే “శంకరాభరణ” మనే వాహనము. తురీయ స్థాయిలో ఉండేది, గమనించేది శూన్యమే గదా!
రిప్లయితొలగించండిపూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గారు , విస్సన్న గారు, TBS Sarma గారు ల స్పందనలను చవిదితిని. “ద్వైతము సుఖమా? అద్వైతము సుఖమా? అను మీమాంస లో పడి వ్రాసిన వ్యాఖ్య. కానీ ఏ ఇతర అనుయాయులను విమర్శించుటకు కాదు. అయినా మీ అందరి వ్యాఖ్యలు చదివిన తరవాత మీ అభిప్రాయములు సమంజసమే నని అనిపించి, నేను వ్రాసిన వ్యాఖ్యను ఉపసంహరించుకొనుచున్నాను. మీ అందరి మనసులు నొప్పించి నందులకు క్షమించ వలసినది. భక్తి మార్గమే ముక్తి కి సాధనమని భావించుచున్న.....
తిమ్మాజీ రావు
కవిమిత్రులకు వందనాలు.
రిప్లయితొలగించండినా నెట్ సమస్య తీరలేదు. అందువల్ల అందరి పూరణలను విడివిడిగా సమీక్షించలేకపోతున్నాను.
మన బ్లాగు మొదటినుండి వివాదాలకు, విమర్శలకు దూరంగా సుహృజ్జనహితమై నడుస్తున్నది.
దయచేసి మీ పూరణలు కాని, వ్యాఖ్యలు కాని మత, ప్రాంత, భాషా (ఛందో వ్యాకరణాంశాలకు మినహాయింపు) వివాదాలకు తావివ్వని విధంగా ఉండే విధంగా చూడవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.
ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన మిత్రులు....
గుండు మధుసూదన్ గారికి,
పండిత నేమాని వారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
వరప్రసాద్ గారికి,
సుబ్బారావు గారికి,
శైలజ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
మిస్సన్న గారికి,
కుసుమ సుదర్శన్ గారికి,
మంద పీతాంబర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
తిమ్మాజీరావు గారికి అభినన్దనలు.
రిప్లయితొలగించండిశ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిభక్తి మార్గమే సులభమనుట నిర్వివాదాంశమే. కానీ మన సనాతన ధర్మము అతి పవిత్రమైనది. ముక్తికి అనేక మార్గములను బోధించినది. అన్ని మార్గములును ప్రశస్తములే. ఏ ఒక్క మార్గమును ఆశ్రయించినా మంచిదే - శ్రేయస్కరమే. "అద్వేష్టా సర్వభూతానాం" అన్నది మన భగవద్గీతాచార్యులు భక్తియోగములో పేర్కొనిన మొట్టమొదటి భక్తి లక్షణము అని ఎవ్వరునూ మరువ రాదు. ఇతరులం దెవ్వరి యందును ద్వేషము ఉండరాదు. భగవద్గీతా వాక్యమును వ్రాయుటకు నాకు ఈ విధముగా అవకాశము వచ్చినందులకు సంతోషము. స్వస్తి.