27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

పద్య రచన – 477 (దొంగల ముఠా)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
 “దొంగల ముఠా” 
ఈ అంశమును సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    ఆంగ్ల పాలక చెరనుండి యపుడు గాంధి
    భరతమాతను విడిపింప భద్రముగను
    ప్రజల పాలనయను పేర ప్రజల నెపుడు
    దోచు కొనెడి దొంగలముఠా దొరకె మనకు.

    రిప్లయితొలగించండి
  2. గుంపులు గుంపుల కూటమి
    యింపుగ తా పొంద గోరి నింద్రా సనమున్
    సొంపుగ నుచ్చులు పన్నుచు
    పెంపగు దొంగల ముఠాలు పెనగు చు నుండెన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పూర్వం నల్ల దొంగల ముఠాలు - నేడు తెల్ల దొంగల ముఠాలూ :

    01)
    __________________________________

    తల్లిపిల్లల తిండి కోసమె - తప్పలేదది వారికిన్
    నల్ల రంగును పూసుకొందురు - నాడు దొంగల నందురే !
    తెల్ల పంచెల గట్టుకొందురు - తీరు నేడది మారెనే
    తల్లి దేశము నెల్లవీరలు - తస్కరించగ జూతురే !
    __________________________________

    రిప్లయితొలగించండి
  4. నమ్మినట్టి జనుల నట్టేట ముంచియుఁ
    గోట్లు కోట్లు ధనముఁ గొల్లఁగొట్టి,
    దోచుకొనెడివారె దొరలయ్య! యీనాఁడు
    నాయకులయిరి యిల నయరహితులు!!

    రిప్లయితొలగించండి
  5. దొంగలు దొంగలు కలియుచు
    హంగుగ నూళ్ళన్ని పంచు ననెరా వినరా !
    ఇంగిత మింతయు చూపని
    దొంగలె పాలకులగుమన దుర్గతి కనరా !

    రిప్లయితొలగించండి


  6. దొంగలందఱు నొకటయి మంగపతిని
    నిలువునా దోచుకొనియును నిలువ నీడ
    లేక గావించిరా దొంగలే ముఠాగ
    వచ్చి మఱి యేది లేదిక పస్తులు గతి.

    రిప్లయితొలగించండి
  7. దోచుకొనుచు దిరుగు దొంగలముఠాలవి
    దోషు లెవరు యిలను దెొరలు వారె
    ప్రజల సొమ్ము దినుచు పదవుల కెక్కిన
    వారి నామ మేమి వాయు సుతుడ

    రిప్లయితొలగించండి
  8. ఎందు జూచిన దేశాన నీయుగాన
    నక్రమార్జన విధియయ్యె, ననుపమముగ
    దోచుచుండిరి జనులను బూచులగుచు
    పలురకంబుల నేడు దొంగల ముఠాలు.

    రిప్లయితొలగించండి
  9. కామమును క్రోధమును మున్నుగా ననేక
    దుర్గుణములను బలిసిన దొంగలు మది
    జ్ఞాన సంపద దోచుచున్నారు కాదె
    వారి నెల్ల నిర్మూలించ వలెను లెమ్ము

    రిప్లయితొలగించండి
  10. కాయ కష్టమందు కర్షక కార్మికుల్ ,
    చదువు పణము బెట్టి విదుర జనులు
    బ్రతుకు నీడ్చు చుండ , బరి తెగించిన వారు
    దొరతనమ్ము కూడ దోచు కొనరె !

    రిప్లయితొలగించండి
  11. దొంగల జెప్ప నెల్లరును దొంగలె, సందియమేల? స్వాంతమే
    దొంగట, యింద్రియమ్ములును దొంగలె, ధర్మ పథమ్ము వీడి దు
    స్సంగము బూని కన్పడెడు సంపద లన్నిటి గొల్లగొట్టు నీ
    దొంగల, దేవ దేవ! వడి త్రోయుము నీ పద పంజరమ్మునన్

    రిప్లయితొలగించండి
  12. దొరల రీతి నేలి దుష్టుల దునుమాడి
    జనుల సేమ మొకటె చాలు ననుచు
    బొక్కసమ్ము మ్రింగ పుణ్యాత్ము లౌదురా?
    "దొంగల ముఠ" కాదె దొరల మంద!

    రిప్లయితొలగించండి
  13. పూజ్యగురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు

    పద్య రచన దొంగలముఠా
    జ్ఞానమపహరి౦ప౦గ దొంగలముఠాయె
    కామక్రోధలోభమ్ములు కడగి మోహ
    మత్సరమ్ములు మదమును యుత్ సృజించి
    బుద్ధిసారథి గ మనసు శుద్ది జేసి
    ఆత్మనాత్మలభేదమ్ము అహముతెలిసి
    శరణు జొచ్చుము శ్రీహరి చరణములను
    అఘములన్నియుబాపును అభవమొసగు
    వెన్న దొంగని పేర్వడిన వెన్నుడతడు

    రిప్లయితొలగించండి

  14. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘దొంగలదే ముఠా’ అనండి.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘యుత్ సృజించి..’? ‘శరణు జిచ్చుము’ను ‘శరణు జొచ్చిన’ అనండి.

    రిప్లయితొలగించండి
  15. కుటిల బుద్ధితో నేతలు కుత్సితముగ
    ఓట్లకోసమొచ్చితుదకు సీట్ల నెక్కి
    దేశ సంపదలను జేయ నాశనంబు
    దొందలముఠాగ మారచు దోచుచుండ్రి.

    రిప్లయితొలగించండి
  16. కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    'ఒచ్చి' అనేది గ్రామ్యం. 'కొఱకు వచ్చి' అనండి.
    'మారుచు' టైపాటు వల్ల 'మారచు' అయింది.

    రిప్లయితొలగించండి