16, సెప్టెంబర్ 2013, సోమవారం

పద్య రచన – 466 (తన్మయత్వము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“తన్మయత్వము”

27 కామెంట్‌లు:

 1. భగవంతుని ధ్యానించగ
  గగనము నందుండి వినగ గాంధర్వ మనన్
  జగమును మై మరపించగ
  తగులములే మరచి మిగుల తన్మయ మొందన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  పాండురంగమహత్మ్యం సినిమాలో పుండరీకుని వలె

  అంతర్ముఖం కాగలిగితే జన్మరాహిత్యమే గదా :

  01)
  ______________________________________

  జన్మయన్నది జన్మయన్నది - జన్మయన్నది సత్యమూ !
  చిన్మయాత్ముని చిన్మయాత్ముని - చిన్మయాత్ముని జూచినన్
  తన్మయత్వము తన్మయత్వము - తన్మయత్వము నొందినన్
  జన్మయుండదు జన్మయుండదు - జన్మయుండదు తథ్యమూ !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 3. చిన్మయుడైన శంకరుని సేవలలోన సమాదరమ్ముతో
  తన్మయమొంది సంతతము ధ్యాన జపార్చనలన్ బొనర్చుచో
  జన్మము సార్థకంబగును సర్వజగద్గురు శంభు సత్కృపన్
  సన్ముని వర్యు లిట్లె విలసన్మతులై పొనరింతు రాదృతిన్

  రిప్లయితొలగించండి
 4. హనుమంతుని వలె తన్మయత్వంతో రామ నామం
  గానం చేస్తే రామసన్నిధి లభించుగా :

  02)
  ______________________________________

  రామనామము రామనామము - రామనామము నిత్యమూ
  రోమరోమము రోమరోమము - రోమరోమము నిండగన్
  నేమనిష్ఠల నేమనిష్ఠల - నేమనిష్ఠల తోడుగన్
  సామగానము సామగానము - సామగానము జేసినన్
  రామసన్నిధి రామసన్నిధి - రామసన్నిధి చేకురున్ !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 5. సదా అరూపియైన పరమాత్మను తన్మయత్వంతో
  స్మరిస్తే జీవితం ధన్యమౌ గదా :

  03)
  ______________________________________

  అన్యథామరి యన్యథామరి - యన్యథామరి చేయకన్
  శూన్యరూపుని శూన్యరూపుని - శూన్యరూపుని కొల్చుచూ
  పుణ్యసంపద పుణ్యసంపద - పుణ్యసంపద బెంచినన్
  ధన్యజీవివి ధన్యజీవివి - ధన్యజీవివి కాగలవ్ !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 6. రంగుహంగుశ్రుంగమున్న రత్నగర్భ జూడగా
  తన్మయత్వ మొందుగాదె ధన్యులైన వారికీ
  ముచ్చటైన జెండయున్న భూమితల్లి జూడగా
  తన్మయత్వ మొందుగాదె ధన్యులైన వారికీ


  ఆలయాన విష్ణుజూడ అంతరంగ మందునా
  తన్మయత్వ మొందుగాదె ధన్యలైన వారికీ
  చిన్నిపాప బోసినవ్వు చిత్తరాలె జూడగా
  తన్మయత్వ మెందుగాదె ధన్యులైన వారికీ

  రిప్లయితొలగించండి
 7. శ్రీమతి శైలజ గారు! శుభాశీస్సులు.
  మీరు 2 సుగంధి వృత్తములను వ్రాసేరు. అభినందనలు. ప్రాస నియమమును పాటించ లేదు. శ్రుంగ అనరాదు - శృంగ అనవలెను. జెండ అనరాదు - జెండా అనవలెను, చిత్తరాలె అనే పదము లేదు;చిత్రము అని కాని చిత్తరువు అని కాని అనుట సాధువు. వారికీ అనరాదు. ప్రాసను వేయలేదు కాబట్టి ఏ మాత్రము సరిచేయుదమన్నా వీలు కాదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ శంకరయ్య గురుదేవులు, శ్రీ నేమాని గురువులకు పాదాభివందనాలు! శుభోదయం ..
  .
  నీదు నామమంత నిర్మలంబైనది
  యిలను లేనెలేదు యీశ్వరుండ!
  నిన్నుఁజేరి గొలుచు నిర్మలాత్ముులకును
  తన్మయత్వమొందు తథ్యముగను!.
  .
  గురువుగారు చిన్న ప్రశ్న....
  భగవంతునిపై వద్యాలు రాయడం భక్తి అ నిపించుకొంటుందా? .
  శ్లోకాలకు పద్యాల కు సంబంధాన్ని తెలియజేయగలరని మనవి.

  రిప్లయితొలగించండి
 9. గురుదేవులు మన్నించాలి,
  శ్రీ శైలజ గారి పద్యము నచ్చి నా చిన్ని ప్రయత్నము
  =========*========
  జన్మ రాశి మంచి దైన జాతకమ్ము లేలరా?
  జన్మ భూమి యుందు నీవు జన్మ జన్మ లెత్తరా,
  చిన్మ యాత్మ నాట్య మెల్ల చిత్త మందు జూడరా,
  తన్మయత్వ మొందు చుండు ధన్యు లైన పండితుల్!

  రిప్లయితొలగించండి
 10. చిన్మయ రూపము దలచిన
  తన్మయమే గలుగు చుండు ధరణిని నరుడా !
  సన్మార్గములో నడచుచు
  జన్మను పండించుకున్న జనుడే ఘనుడౌ!

  రిప్లయితొలగించండి
 11. శ్రీ జయసారథి గారూ! శుభాశీస్సులు.

  నారద భక్తి సూత్రలు ప్రకారము - "పూజ్యేషు అనురాగో భక్తిః" -- అనగా పూజనీయులయందు అనురాగమే భక్తి. అందుచేత భగవంతునిపై పద్యములు రచించుటయు నిస్సంశయముగా - భక్తియే.
  ఛందో బద్ధముగా రచించినచో సంస్కృతములో శ్లోకములు అందురు -- అలాగే తెలుగులో పద్యములు అందురు. తేడా లేదు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. మంగ ళం పల్లి గానము మధుర మగుచు
  నోల లాడించి హృదయాల నుత్స హించు
  తన్మ యత్వము పొందించు తట్టు మదిని
  మంగ ళం బును గలిగించు మనుజ తతికి

  రిప్లయితొలగించండి
 13. గురువుగారు చిన్న సందేహము ....
  శ్రీ వసంత కిషోర్ గారి వృత్తము తెలియకున్నది. కొంచెం వృత్తము, గణముల గూర్చి తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ నేమాని గురువుగారికి ప్రణమిల్లుతూ,..సుగంధి వృత్తదోషములకు మన్నించవలెను,..వేరొకరి బ్లాగులో ఈ వృత్తము చూసినపుడు వారు ప్రాసనియమం లేదని ఆ విధంగానే ఓపద్యం కూడా ఉదహరించారు,అది చూసి నేను పొరబడి అట్లే నోట్ చేసుకున్నాను..మీ సూచన చూసి సులక్షణసారం చూసాను..మళ్ళీ వ్రాసాను.సరిచేయ ప్రార్ధన..  జన్మనిచ్చే తల్లివంటి జన్మభూమి జూడగా
  తన్మయత్వ మొందుగాదె ధన్యులైన సర్వులూ
  జన్మలెన్ని యెత్తియైన జాతిఖ్యాతి చాటగా
  తన్మయత్వ మొందుగాదె ధన్యులైన సర్వులూ


  చిన్మయుండు విష్ణుజూడ చిత్తశాంతి నీయదా
  తన్మయత్వ మొందుగాదె ధన్యులైన ఎల్లరూ
  సన్మతీయ చిన్నిపాప షణ్ముఖుణ్ణి వేడగా
  తన్మయత్వ మెందుగాదె ధన్యులైన తల్లులూ

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నేమాని గురుదేవులకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ వర ప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
  శ్రీ వసంత కిశోర్ గారు వ్రాసిన పద్యములు "మత్తకోకిలలు కదా!".
  గణములు" ర స జ జ భ ర 11వ అక్షరము యతి స్థానము. ప్రాస నియమము కలదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. శ్రీమతి శైలజ గారి పద్యములను సవరించుచు:

  జన్మనిచ్చు తల్లి వంటి జన్మభూమినిన్ గనన్
  తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్
  జన్మ లెన్ని యెత్తియైన జాతి కీర్తి చాటుచున్
  తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్

  చిన్మయున్ ముకుందు జూచి చిత్త శాంతి నొందుచున్
  తన్మయత్వ మొందరొక్కొ ధన్య జీవు లెల్లరున్
  సన్మతిన్ భజించి స్వామి షణ్ముఖున్ నుతించుచున్
  తన్మయత్వ మొందరొక్కొ ధన్య లైన తల్లులున్

  రిప్లయితొలగించండి
 18. గురువుగారికి వందనములు.

  తన్మయత్వము పొందగా తలచినంత
  పద్యమునుఁ జెప్ప దగినట్టి ప్రతిభ కొంత
  కరుణనిడిన గొప్ప గురువు కమల చరణ
  ములను భక్తితోడ నెపుడు మ్రొక్కుదాన.

  నారదునికి వందనములు.

  సన్ముని వర్యుడై నిరత సంస్మరణమ్మునుఁ జేయు భక్తుడై
  తన్మయ మొంది విష్ణువని తల్చుట భాగ్యమనంగ నొప్పుగా
  జన్మను దాల్చినట్టి యొక సత్పురుషుండుగ నారదుండుగా
  సన్మతి తోడ మంగళము చల్లగ గూర్చెడు స్వామి! మ్రొక్కెదన్.

  రిప్లయితొలగించండి
 19. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  శ్రీమత్స్వరూపునిఁ బ్రేమస్వరూపుగాఁ గౌఁగిట బంధింపఁ గలలఁ దేరు
  నాదిమీనాకృతి నవతీర్ణు కథలన్న ఱెప్ప లల్లార్పదు ఱేపుమాపు
  శ్రీకృష్ణ! శ్రీకృష్ణ! శ్రీకృష్ణ! యని యాహ్వయంబున నాహ్వయనంబుఁ గొలుపుఁ
  బరమస్వరబ్రహ్మపరిణతమురళిపై నూరెడు రాగంబు లూహసేయు

  రుక్మిణీకాంత పరమాత్మ రూప నామ
  చింతనామృతపరవశచిత్త యగుచుఁ
  జిన్మయాకారు నాత్మీయహృన్మయునిగఁ
  దలఁచి, కనుమోడ్చి, తన్మయత్వము భజించి.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 20. తన్మయతన్ స్మరింప నిను దారయు పుత్రులు నడ్డమౌదురే
  పెన్మమకారపుంబొరలు పేర్కొని యుండుటఁ గాక బుద్ధిలో!
  జన్మము నీ పదార్చనను సద్వినియోగము గాక నేలనో
  చిన్మయరూపిణీ! నిను భజించెడు భాగ్యము నిచ్చి బ్రోవవే!

  రిప్లయితొలగించండి
 21. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
  ======&=========
  జన్మజన్మల రహస్యమ్ము చక్రమునందున గాంచి
  చిన్మయ రూపుని చిన్ని చిన్ని రూపమ్ములు జూచి
  తన్మయత్వము నొంది జనులు తంబురాదుల తోడ దిరిగె
  జన్మ ధన్యము, చిదంబరపు సామిని సేవింప మనుచు!
  (సామి- స్వామి తమిళులు బలుకు విధమున)

  పళనిలో ఒక సారి మేము ౫ లక్షల భక్తులను గని యుంటిమి, ౭౦ కిలోమిటర్ల దూరము వరకూ రహదారిపై భక్తులు నిద్రించి యుండెను.
  ======&====
  కరగించు కంటకములను కౌపీన ధారిని వేడ!
  పొరుగిండ్ల వారు దెలుపగ పోతి పళని వాసునిగన!
  కరవాడి శూలులై జనులు కదలుచు నుండంగను గిరి
  దరికి జేరి శరణు యనుచు తన్మయత్వమొందు చుండె!
  (కరవాడి= మిక్కిలి పదునైన)

  రిప్లయితొలగించండి
 22. భక్తి భావముతోడ భగవంతుని దలచ
  ..... తన్మయత్వము భక్త తతికి దొరకు
  దేవాలయమునందు దేవతార్చన జేయ
  ..... తన్మయత్వము గల్గు తాపసులకు
  సత్యమ్ము దప్పక నిత్య పూజలు జేయ
  ..... తన్మయత్వము గల్గు సన్మతులకు
  పారవశ్యము తోడ భక్తి పాటలు పాడ
  ..... తన్మయత్వము గల్గు ధాత్రి నందు

  మనసు నిలిపి చేయు మంచి కార్యములన్ని
  యాత్మ తృప్తి నిచ్చి హాయి గూర్చు
  మానవత్వ విలువ మరవని వారికి
  నవని మెచ్చి తన్మయత్వ మిడును.

  రిప్లయితొలగించండి
 23. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  ‘పద్య మన్నది పద్య మన్నది పద్య మన్నది మీదెగా’ మంచి పద్యాలు వ్రాసారు. అభినందనలు.
  ‘నేమనిష్ఠలు’ అన్న సమాసం, ‘కొల్చుచూ, కాగలవ్’ అన్న ప్రయోగాలు సవరించవలసిన దోషాలు
  *
  పండిత నేమాని వారూ,
  విలసత్ భావి విభాసితమైన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  సవరించిన మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  కొన్ని లోపాలు... నేమాని వారి సవరణలను గమనించండి.
  *
  శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘నిర్మలం బైనదీ/ యిలను...’ అనండి.
  మీ సందేహాలకు నేమాని వారి సమాధానాలు చూశారు కదా!
  *
  వరప్రసాద్ గారూ,
  మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  ‘ఒందుచుంద్రు’ అని బహువచనాన్ని ఉపయోగించండి.
  మీ తాజా పద్యాలు చిదంబరం, పళని గురించినవి బాగున్నవి.
  ‘శరణ మనుచు తన్మయత్వమొందు చుంద్రు!’ అనండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
  *
  ఏల్చూరి మురళీధర రావు గారూ,
  తన్మయత్వాన్ని కలిగించే మనోహరపద్యాన్ని చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
  ‘ఊదెడు’ టైపాటు వల్ల ‘ఊరెడు’ అయినట్టుంది.
  *
  మిస్సన్న గారూ,
  ప్రశంసనీయమైన పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

  తొలిచూపుల పరవశమున
  కలవరమున కౌగిలింత, కాంక్షలు హెచ్చన్
  పలుమారు మూగ సైగల
  వలపులు పండించు ఆశవలయము నందున్

  ప్రతి పూవున పరిమళమే
  ప్రతి బాతువు హంస వోలె భాసిల్లు నికన్
  ప్రతి దివసము పున్నమియే
  ప్రతి గడియయు తన్మయత్వరాగము కూర్చున్

  సతిపతి అనురాగము దం
  పతులకు మాత్రమె తెలియును వర్ణింపను ధీ
  మతులగు కవులకు సైతము
  అతీతమగు భాష తెలుపగా పరవశముల్

  కురియగ మేఘముల్ తడిసి క్షోణి వధూటి పిపాస దీఱగా
  విరిసిన పూలు లేవగరు పిందెలు కాయల చీర దాల్చుచున్
  మురిసిన తన్మయత్వమున ముగ్ధకు తొల్లి ప్రసూతివేళ దు
  ర్భరముగ వేధ పొంది యనురాగపు సంతతి యిచ్చువేళలన్

  కడు వార్ధక్యము నందున
  జడివానలు కురియువేళ సతి సన్నిధిలో
  గడచిన జీవిత వరమును
  అడుగకనే నొసగువేల్పు నారాధింపన్

  ఆత్మగ నాత్మజ్ఞానము
  నాత్మీయులుగా నెరింగి అవసానదశన్
  ఆత్మానందముతో పర
  మాత్మను జేరుటయె గాదె ఆనందమనన్

  రిప్లయితొలగించండి
 25. నిత్య హరినామ స్మరణముచేఁ బ్రహ్లాదుఁడు తన్మయత్వమునఁ దేలియాడు ఘట్టము...

  సీ.
  "కంజాక్షునకునిడు కాయమే కాయమ్ము;
  .....పవన గుంఫిత చర్మ భస్త్రి గాదు!
  వైకుంఠుఁ బొగడెడు వక్త్రమే వక్త్రమ్ము;
  .....డమడమ ధ్వని తోడి ఢక్క గాదు!
  హరి పూజనము సేయు హస్తమే హస్తమ్ము;
  .....తరుశాఖ నిర్మిత దర్వి గాదు!
  కమలేశుఁ జూచెడి కన్నులే కన్నులు;
  .....తనుకుడ్య జాల రంధ్రములు గావు?

  ఆ.వె.
  చక్రి చింతయున్న జన్మమే జన్మమ్ము;
  తరళ సలిల బుద్బుదమ్ము గాదు!
  విష్ణు భక్తియున్న విబుధుఁడే విబుధుండు;
  పాద యుగము తోడి పశువు గాదు!"

  తే.గీ.
  అనుచు మనమున హరినిల్పి, యనిశము హరి
  కథల భజియించి, యర్చించి కమలనాభు,
  సంస్మరణము సేసియు విష్ణుఁ, జరణ కమల
  ములను స్తుతియించి, ప్రహ్లాదుఁ డిలను మిగులఁ
  దన్మయత్వానఁ బాడుచుఁ దనను మఱచు!

  రిప్లయితొలగించండి
 26. తిమ్మాజీ రావుగారూ అపురూపం. అభినన్దనలు.

  రిప్లయితొలగించండి