3, సెప్టెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1163 (శూలి తనయ గంగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
శూలి తనయ గంగ సోదరి యుమ.

35 కామెంట్‌లు:

 1. వేలుపులకు లేవు వివరమ్ముగా నెట్టి
  వావి వరుస లనెడి పగిది దెలిసి
  పలికె నొకడు పద్య పాదమ్ములో నిట్లు
  శూలి తనయ గంగ సోదరి యుమ

  రిప్లయితొలగించండి
 2. అన్నగారి మాట యారాధ్యమౌ నాకు
  గోలివారు విప్ప గోప్య ముడుగు
  ఉస్సురనగ బోను మిస్సన్న విఱువరే
  శూలి తనయ గంగ సోదరి యుమ.

  రిప్లయితొలగించండి
 3. సరదాకు...
  మూర్తి గారూ ... నన్ను విప్పమని, మిస్సన్న గారిని విరవమని చెప్పారు. మీరు మాత్రం పూరించారు...నేను విప్పలేక (మే) కప్పు చున్నాను. మిస్సన్న గారు విరుస్తారేమో చూడాలి.

  అన్నగారి నుడువు నారాధ్యమనుచును
  గన్నవరపు వారు కవిత జెప్పె
  విప్పి విరిచి మమ్ము జెప్పగా నిటు గోరె
  " శూలి తనయ గంగ సోదరి యుమ. "

  రిప్లయితొలగించండి
 4. "శివుడు, పుత్రి, నీరు, చెల్లెలు, పార్వతి "
  శిష్య! వేరు పేర్లు చెప్పమనిన
  తడుము కొనక జెప్పె తానిట్లు, గురువరా !
  " శూలి తనయ గంగ సోదరి యుమ. "

  రిప్లయితొలగించండి
 5. "శివుడు- పుత్రి- నీరు- చెల్లెలు- పార్వతి "
  శిష్య! వేరు పేర్లు చెప్పమనిన
  తడుము కొనక జెప్పె తానిట్లు, గురువరా !
  " శూలి- తనయ- గంగ -సోదరి- యుమ. "

  రిప్లయితొలగించండి
 6. తమ్ముడు చి. మూర్తి, శ్రీ గోలి వారు, శ్రీ మిస్సన్న గారు, శ్రీ శంకరయ్య గారు మొదలగు మనవారందరికీ శుభాశీస్సులు. ఇదొక ప్రయత్నము చూడండి:

  వేయ నొక నాటకమ్మును వేదికపయి
  పాత్రధారులు చేరిరి వారి పేళ్ళు
  వ్రాసె నీరీతి నచటి నిర్వాహకుండు
  శూలి, తనయ, గంగ, సోదరి, యుమ

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  మొండివాడు ఏం చెప్పినా బలంగానే చెప్తాడన్న భావంతో మొదటి పూరణ చక్కగా ఉంది.
  నాటక పాత్రధారుల జాబితాగా రెండవ పూరణ అద్భుతంగా ఉన్నా చిన్న పొరపాటు.. సమస్య ఆటవెలది అయితే పై మూడు తేటగీతి పాదాలయ్యాయి. నా సాహసాన్ని మన్నించమని కోరుతూ ఆ మూడు పాదాలను ఆటవెలదిగా మార్చుతున్నాను....

  వేయ నాటకమ్ము వేదికపై, దాని
  పాత్రధారు లెవరొ వారి పేళ్ళు
  వ్రాసి చూపె నచటి ప్రాయోజకుం డిట్లు
  శూలి, తనయ, గంగ, సోదరి యుమ.

  రిప్లయితొలగించండి
 8. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పూరణ తప్పించుకొని వెక్కిరించిన విధంగా ఉంది. ఇదీ సమస్యాపూరణకు ఒక ఉపాయమే. బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సరదాగా చెప్పిన మొదటి పూరణ గన్నవరపు వారి బాటే పట్టింది.
  మీ రెండవ పూరణ పర్యాయపదాల జాబితాగా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. అయ్యా! శంకరయ్యా గారూ! శుభాశీస్సులు.

  మీకు శ్రమ కలిగించి నందులకు చింతించుచున్నాను. మీ సవరణ ప్రశంసనీయమే. మొత్తము పద్యమును తేటగీతిలోనే ఉంచి -- 4వ పాదమును ఇలాగ మార్చితే నా పద్యమును ఎక్కువగా సవరించ నక్కరలేదు. "సూరి, శూలి, తనయ, గంగ, సోదరి, యుమ".
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. శ్రీరమణుడు శ్రీరమ తో:
  రమ్ము లక్ష్మి రూపరచనలనికనాపి,
  వేడ్క నెన్న నూత్న విఘ్నపతిని
  నేడు, నన్ను గూర్చి నిలచియుందురు- బావ
  శూలి తనయ గంగ సోదరి యుమ

  రిప్లయితొలగించండి
 11. ఊదం: రామకృష్ణ గారూ ! అసలైన వరసలను పట్టుకొన్నారు. బాగుంది..అభినందనలు.

  మీ ' వరస ' లోనే నా ప్రయత్నం...

  చిట్టి విఘ్న పతికి పుట్టిన రోజిది
  వేడ్క జూడ లక్ష్మి ! వెడలుదాము
  పిలచి నారు మనల ప్రియముగ నా బావ
  శూలి, తనయ గంగ, సోదరి యుమ

  రిప్లయితొలగించండి
 12. పండితులకె తెలియు పరమాత్మ బంధాలు
  తెలిపి రిటుల వరుస తీరుమనకు
  విశ్వ కారకుడగు విష్ణు మూర్తికి బావ
  శూలి, తనయ గంగ, సోదరి యుమ!!!

  రిప్లయితొలగించండి
 13. శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. పరమాత్మకి బంధము లుండవు. సర్వ స్వతంత్రుడు పరమాత్మ. అందుచేత మీ పద్యము మొదటి పాదమును మార్చితే బాగుంటుందని నా సూచన. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవుల ధన్యవాదములు
  =====*=====
  శూలి తనయ,గంగ సోదరి యుమతోడ,
  ప్రమద గణములకును రమ్య మైన
  శంకరాభరణపు సద్గోష్టి వివరము
  దెలుప,వారు దీవెనల నిడిరట!

  రిప్లయితొలగించండి
 15. ఈ దినము సహృదయ పండితుల సరస సంభాషణలు బ్లాగునకు క్రొత్త శోభనిస్తున్నవి.

  రిప్లయితొలగించండి
 16. విఘ్న నాయకుడగు విఘ్నేశ్వరుడు మఱి
  శూలి తనయ, గంగ సోదరి యుమ
  జగము నకు ను నిదియ సత్యము మఱియును
  గంగ యుమలి రువురు కంతు చెలులు

  రిప్లయితొలగించండి
 17. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  వారి పున: ప్రేరణతో చిన్న ప్రయత్నం.

  మాఘమాసమందు మాధవ చరితను
  దేవళంబు నందు దేశికుండు
  శ్రద్ధ తోడ జెప్పె చక్రికిన్ మిత్రుడు
  శూలి, తనయ గంగ, సోదరి యుమ.

  రిప్లయితొలగించండి
 18. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.

  సుతులు శరజుడు గణపతియు సుదర్శన
  శూలితనయ గంగ సోదరి యుమ
  భార్యసమేతులై ప్రమథ గణమ్ము తో
  తనరు చుండె శివుడు ధవళ గిరిని .

  రిప్లయితొలగించండి
 19. పండిత నేమాని వారూ,
  నా సవరణ మీకు నచ్చినందుకు ధన్యుడను. నాల్గవ పాదం విషయంలో మీ సూచన కూడా అమోదయోగ్యమే.
  *
  రామకృష్ణ గారూ,
  గోలి వారన్నట్టు అసలైన వరసలను పట్టుకొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీరు ఊ.దం. గారిని అనుసరించిన మీ పద్యం ప్రత్యేకతను చాటుతున్నది. బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  విష్ణువు యొక్క బాంధవ్యాలను వివరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ కొద్దిగా అగమ్యంగా ఉన్నట్టనిపించింది. వివరణ ఇస్తే బాగుంటుందేమో!
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  చాలా కాలానికి పువర్దర్శనం. సంతోషం!
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  శూలి శబ్దానికి ఆయుధం కలవాడనే అర్థాన్ని స్వీకరించారా? బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. శ్రీ పండిత నేమాని గారికి నమస్కారం. మీసూచన శిరోధార్యం.మొదటి పాదాన్ని ఈవిధంగా సవరిస్తున్నాను, ధన్యవాదములు.

  "పండితులకె దెలియు వరసలు బంధాలు"

  రిప్లయితొలగించండి
 21. అయ్యా! పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
  మీరు నా సూచనను హార్దికముగా అర్థము చేసికొని పద్య పాదమును సవరించి నందులకు మా ప్రశంసలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 22. అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్య పాదము "గన్నవరపు వారు కవిత చెప్పె" అన్నారు కదా - వారు అని బహువచనము వచ్చినప్పుడు చెప్పిరి అని ఉండాలి. అందుచేత ఈ ప్రకారముగా మార్చండి: "గన్నవరపు సుకవి కవిత చెప్పె".
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 23. వావి వరుస నడుమ వర్ణనలువినుడి
  బావగారునయ్యెభవుడు నేడు
  బ్లాగు జూడవచ్చెబ్రహ్మహరిబావ
  శూలితనయగంగసోదరియుమ

  సెప్టెంబర్ 03, 2013 5:12 PM తొలగించు

  రిప్లయితొలగించండి
 24. పూజ్యులు నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, కవి పండిత మిత్రులందఱకును నమస్కారములు. నేఁ డందఱి పూరణము లలరించుచున్నవి! సంతోషము. ఇఁక నా పూరణము...

  ఏకాదశి పర్వదినమును బురస్కరించుకొని శ్రీ మహా విష్ణువు శివకుటుంబము నాహ్వానించిన సందర్భము.

  "రండు, రండు, రండు! ప్రార్థింతు రారండు!
  శూలి! తనయ గంగ! సోదరి యుమ!
  గణప! శరజ! రండు ఘనమైన దినమిది!
  స్వాగత"మని శేషశాయి పిలిచె!!

  రిప్లయితొలగించండి
 25. శైలజ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మొత్తం శివకుటుంబాన్నే ఆహ్వానించారే! మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. సోము డనెడు వాడు శూలరోగి కనుక
  కడుపునొప్పి యనుచు గంతు లిడును
  అతని యూరి పేరు యమలాపురమ్ము; యా
  శూలి తనయ గంగ; సోదరి యుమ

  రిప్లయితొలగించండి
 27. పాట పాడు చుండె పామరు డొక్కండు
  పరమ శివుని గూర్చి పరవ శించి
  వావి వరుస లేల పాలించు పరమాత్మ
  శూలి తనయ గంగ సోదరి యుమ

  రిప్లయితొలగించండి
 28. శ్రీ శంకరార్యులకు నమస్సులు.

  విష్ణుపాదము గంగ పుట్టినిల్లు, ఉమ మాధవ సోదరియని విన్నాము. ఆ సంబంధాలతో
  హరి, హరునకు మిత్ర్రుడు, మామ, బావ అను అర్థముతో ఈ పూరణయత్నం. నా ’మాటవెలదిని’ మన్నించాలి.

  విష్ణుదేవుడన్న విషకంఠుడనియన్న
  వ్యత్యయంబు లేదు సత్య మిదియె
  మామ, బావ, హరియు మరిమెచ్చతన మిత్రు
  శూలి, తనయ గంగ, సోదరి యుమ

  రిప్లయితొలగించండి
 29. పండితార్యు పలుకు బంగారమై యొప్పె,
  శాస్త్రి బెట్టు జేసి సర్దె, మూర్తి
  గుంఫనముగ విసరె గొప్ప సవాలును
  శూలి తనయ గంగ సోదరి యుమ???????????????

  రిప్లయితొలగించండి
 30. గంగ, గౌరి సవతులు గాకున్నను, సరదాగా చేసిన పూరణ:


  ఎంత గొప్ప వాడ వీవోయి శ్రీహరీ!
  ఇద్ద రాడు వాండ్ర నిచ్చి తనుచు
  శూలి, తనయ గంగ సోదరి యుమ నీకు
  తగవు దీర్ప నీవె తగుదు వనెను.

  రిప్లయితొలగించండి
 31. మిస్సన్న గారూ ! మీ విరుపు మెరుపులకై చూచు నా యెదురు చూపులను ఫలింపజేశారు...బాగుంది..

  రిప్లయితొలగించండి
 32. నాగరాజు రవీందర్ గారూ,
  శూల రోగిని ఉద్దేశించి మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  చంద్రమౌళి గారూ,
  బహుకాల దర్శనం. కన్నడ బ్లాగు ‘పద్యపాన’లో వ్యస్తులై ఉన్నారా? మీ పునరాగమనం సంతోషదాయకం.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  సమస్యాపూరణంలో మిత్రు లెవరెలా తమ ప్రతిభను ప్రదర్శించారో చెప్పిన పద్యం బాగుంది.
  మీ పూరణ వైవిధ్యంగా చమత్కారశోభితమై రంజింపజేసింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. సమస్యను సక్రమముగా విప్పి, విఱుపలుతో పూరణలు చేసిన శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, మిస్సన్న మహాశయులకు మిగిలిన ఆప్త మిత్రులకు, అక్కయ్య గారికి కృతజ్ఞతాభినందనలు .

  రిప్లయితొలగించండి