3, మార్చి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1340 (రావణుని పత్ని సీతమ్మ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రావణుని పత్ని సీతమ్మ రామభగిని.
ఈ సమస్యను సూచించిన కొర్నెపాటి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. మయుని కొమరిత పతివ్రత మండొ దరియె
    రావణుని పత్ని , సీతమ్మ రామ భగిని
    కిప్రియ మైన వదినయై కీర్తి నొంద
    జనకు పుత్రిక జానకి జగతి నిలచె

    రిప్లయితొలగించండి

  2. పాంచాలి పంచ భర్త్రుక,
    సావిత్రీ సత్యవాన్ తారా భాస్ఫతి
    మండోదరి రావణుని పత్ని
    సీతమ్మ రామ భగిని పంచ పతివ్రతా !


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. రావణుని పత్ని, సీతమ్మ, రామ, భగిని
    మున్నుగా నెన్నొ వేషాలు మున్ను నేను
    చాల నాటకములలోన సరస గతుల
    వేసి ప్రఖ్యాతి గాంచితి విశ్వనటిగ

    రిప్లయితొలగించండి
  4. శ్రీ నేమానిగారు చక్కని పూరణ చేశారు..నేనూ ఆబాటలోనే...

    రామచరితము ' సీరియల్ ' రమ్యముగను
    తీయదలచితి నూరూరు తిరుగుచుంటి
    పాత్రధారులకోసమై వరుస మిగిలె
    రావణునిపత్ని, సీతమ్మ, రామభగిని

    రిప్లయితొలగించండి
  5. దైవముగ భర్తనే గొల్చె దైత్యవనిత
    పుడమి తల్లినే గొంపోవ నుడివెనొకతె
    దశరధాత్మజగా వెల్గె తరుణియొకతె
    రావణుని పత్ని సీతమ్మ రామభగిని.

    రిప్లయితొలగించండి
  6. తన్వి మండోదరి మయుని తనయ, యసుర
    రావణుని పత్ని, సీతమ్మ రామ భగిని
    శాంత కువదిన, రాముని సహచరి, జన
    కునకు, పేటికఁ దొరకిన కోమలంగి

    రిప్లయితొలగించండి
  7. పై పద్యములో మూడవ పాదమును సవరించితిని

    ''దశరధుడు పెంచ ,పుత్రిక తరుణి యొకతె ''

    రిప్లయితొలగించండి
  8. పడతి మండోదరెవరికి పత్ని యయ్యె?
    రామ చంద్రుని భార్యయౌ రమణి యెవరు?
    భామ సోదరి పర్యాయ పదములేవి?
    రావణుని పత్ని,సీతమ్మ, రామ భగిని

    రిప్లయితొలగించండి
  9. మయుని కొమరిత మండోద రి,యర యంగ
    రావణుని పత్ని, సీతమ్మ, రామ భగిని
    కియగు వరుసకు వదినమ్మ కీ రవాణి !
    బందు రికములు దెలియంగ బఱగు నిటుల .

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    =============*===============
    పద్య కావ్యము విని బలికె శిష్య తతులు
    దశ దినముల యందు విశద మయ్యె,
    ఘనముగాను రావణుని పత్ని సీతమ్మ,
    రామ భగిని యన్న రాజ్యలక్ష్మి !

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్యా,
    మంది పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘పతివ్రత’ అన్నప్పుడు గణదోషం. ‘మండోదరి’ సరియైన శబ్దం. మీ మొదటి పాదానికి నా సవరణ... ‘మయుని తనయ మండోదరి మానవతియు’ అనండి. మూడవపాదంలో ప్రియమైన అన్నప్పుడూ గణదోషం. ప్రియమైనట్టి అంటే సరి.
    *
    జిలేబీ గారూ,
    అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఒక నటి మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నేమాని వారి నటి మాట్లాడితే మీరేమో నటులకోసం అన్వేషిస్తున్నారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ప్రశ్నోత్తర పద్ధతిలో మీ మొదటి పూరణ బాగుంది.
    సీతమ్మను సంబోధిస్తూ చెప్పిన రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘భక్తుడు + అల’ అన్నప్పుడ్ యడాగమం రాదు. అక్కడ ‘హరికి భక్తుడౌ నల.." అనండి.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘భగినికి నగు..’ అనండి.
    *
    వరప్రసాద్ గారూ,
    మూఢశిష్యులు అలా అర్థం చేసుకున్నారా? తేటగీతి సమస్యను ఆటవెలదిలో చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    ఇంద్రజిత్తుని గనిన నా యింతి యెవరు ?
    రామచంద్రుని పత్ని యా రమణి యెవరు ?
    దశరథుని పుత్రి యైనశా౦తమ్మ యెవరు?
    తెలియ జేయుము వెంటనే తెలిసేనేని
    రావణుని పత్ని సీతమ్మ రామభగిని

    రిప్లయితొలగించండి
  13. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    నేటి విద్యార్థులు చదువుట,వినుట మరచి సెల్ ఫొన్ తో గడుపు చున్నారు. ఏమి అడిగిన వారికి తోచినది జెప్పుదురు గాని మనము జెప్పినది చెప్పరు.

    రిప్లయితొలగించండి
  15. సీత పైన రావణు మోహ సిరుల జూచి
    ప్రభువటన్న మదిన భక్తి భావము న్న
    రక్కసొక్కతె స్వప్నము రాత్రి కనెను
    రావణుని పత్ని సీతమ్మ రామభగిని!

    రిప్లయితొలగించండి
  16. సహదేవుడు గారూ,
    విపరీతబుద్ధుల రక్కసికి విపరీత స్వప్నము. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి