21, మార్చి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1358 (శల్యుఁడనఁగ నెవ్వఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

11 కామెంట్‌లు:

  1. శల్యు డనగను రణమున శక్తి యుతుడు
    పాండు సుతులను పడగొట్టె బాణ తతిని
    శల్యుడ నగ నెవ్వడు పార్ధ సారధి కద
    ధర్మ జునిచేత మరణించి ధరను కూలె

    రిప్లయితొలగించండి

  2. రావణు డనగ నెవ్వడు రాముడు కద
    వాలి అనగ నెవ్వడు సుగ్రీవుడు కద
    కర్ణు డనగ నెవ్వడు అర్జునుండు కద
    శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కర్ణు నాజిని గూల్చగ నిర్ణయించి
    తేరు నా రీతి నడిపిన తీరు జూచి
    యడిగె నోయోధుడర్జునునాజిలోన
    శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థ !, సారథి కద.?

    రిప్లయితొలగించండి
  4. శల్యు నిగనిక్రీడినడిగె సన్నిహితుడు
    శల్యు డనగ నెవ్వడు పార్ధ? సారధి కద
    కర్ణుని రధమునకుతాను కదనమందు
    మేటి విలుకాడు మాకౌను మేనమామ
    ననుచు పలికెను పార్ధుడు ఘనము గాను

    రిప్లయితొలగించండి
  5. శల్యుడనగనెవ్వడు పార్థ! సారథి గద
    కర్ణునకు యుద్ధమందున, కలువ వైరి
    పుత్రునపజయంబునకును ముఖ్యుడతడు
    శల్య సారథ్య మనుమాట జగతి నిలచె(సార్థకమ్ము)

    రిప్లయితొలగించండి
  6. శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద
    నమున నెదిరింప కడు నైపుణ్యముగను
    కదము త్రొక్కుచు కర్ణుని ఖ్యాతి పొడగ
    ని కథ కెక్కిన నిరుపమ సారథి కద

    రిప్లయితొలగించండి
  7. శల్యుడ నగ నెవ్వడు పార్ధ!సారధికద
    సహజ కవచ కుండల ధారి సామి కతడు ,
    పాండవుల మేలు కొఱకునై పాటు పడిన
    మేటి యోధుడు ,పార్ధుని మేన మామ .

    రిప్లయితొలగించండి
  8. నకుల సహదేవుల సంభాషణ

    పరుడు కాదయ్య మామ, మా పక్షమతడు
    శల్యుఁ డనఁగ; నెవ్వఁడు పార్థసారథి కద
    లించు రథములనెదిరింప లేడనుచును
    కర్ణునికి పిరికితనము కలుగఁ బలికె.

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మాజేటి సుమలత గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింపదగినది.
    రెండవ పాదంలో గణదోషం. రెండవ నాల్గవ పాదాల్లో యతి తప్పింది.
    నిరుత్సాహపడకుండా పద్యరచన కొనసాగించండి. స్వస్తి!
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. శల్యుఁ డనఁగ నెవ్వఁడు పార్థసారథి కద
    నమున నెదురిడ కడు నిపుణతనమునను
    కదము త్రొక్కుచు కర్ణుని ఘనత గాంచి
    రథము నడుపగ ఖ్యాతి నెరసె గదా! హ !

    గురువు గారు, ప్రోత్సాహానికి ధన్యవాదములు. రాత్రి పది తర్వాతే నాకు టైము దొరుకుతుంది. రోజు వ్రాయాలని ఆశ. ఆఫీసు, పిల్లలు, వంటా, వార్పు...స్వవిషయాలు ఎకరువు పెట్టాను. క్షమించండి.

    రిప్లయితొలగించండి