29, మార్చి 2014, శనివారం

సమస్యాపూరణం - 1366 (మల్లియతీవియకుఁ గాచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. తెల్లని పూవులు పూచెను
    మల్లియతీవియకు; కాచె మామిడికాయల్
    కొల్లలుగ చైత్రమందున
    నెల్లర ముదమందఁజేయ నీ పండుగకున్.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్య గారి పద్యము భలా! అభినందనలు.

    చెల్లీ! చూచితె పూవులు
    మల్లియ తీవియకు, గాచె మామిడి కాయల్
    కొల్లలుగా నా ప్రక్కనె
    యల్లవిగో భూజమునకు నబ్బురము కదా!

    రిప్లయితొలగించండి
  3. మల్లెలు పూచెను ఘుమ్మని
    మల్లియతీవియకు, గాచె మామిడి కాయల్
    కొల్లలుగతోట లందున
    నుల్లంబులు సంతసిల్ల యూరించెనుగా

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీనేమాని గురుదేవులకు
    నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో.

    సరదాగా
    ==========*===============
    అల్లరి కృష్ణుని గుడిలో
    మల్లియతీవియకు కాచె మామిడికాయల్
    మెల్లగ గోయగ వాటిని
    మల్లె సుమముల వలె వేగ మారెను జెలియా(చెల్లీ)!

    రిప్లయితొలగించండి
  5. వెల్లని పువ్వులు బూచెను
    మల్లియ తీవియకుఁ, గాచె మామిడి కాయల్
    నల్లని కోయిల కూతలు
    మెల్లగవినబడుచునిచ్చె, మిక్కిలి ముదమున్

    రిప్లయితొలగించండి
  6. లల్లీ చూడుము పూలను
    మల్లియ తీ వియకు, గాచె మామిడి కాయల్
    మల్లేశుని వృక్షమునకు
    కొల్లలుగా జూడు డా ర్య !కూరిమి తోడన్

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సంతసిల్ల నూరించెనుగా’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కందుల వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. తెల్లని పూవులు పూచెను
    మల్లియ తీవియకుఁ, గాచె మామిడి కాయల్
    మళ్ళీ, కోయిల గళములు
    నల్లన వినిపించియొసగె మెండగు ముదమున్

    రిప్లయితొలగించండి
  9. అల్లరి పిల్లడ యెక్కడ
    మల్లియ తీవియకుగాచె మామిడికాయల్ ?
    పుల్లారవింద లోచన
    కల్లలువ్రాయంగనీకు కరువౌగుణముల్ !!!

    (పరీక్షలో తప్పుగా వ్రాసిన విద్యార్థిని ఉద్దేశిస్తూ గురువుగారు చెప్పిన సందర్భం )

    రిప్లయితొలగించండి
  10. ఎల్లరి బాగును గోరెడు
    చల్లని ప్రభువని దలంప జాలి మరచి మా
    యెల్లలు మార్చ నుగాదికి
    మల్లియ తీవియకుఁ, గాచె మామిడి కాయల్
    (రాష్ట్రవిభజన దృష్ట్యా,తెల్లని పూవులు పూయల్సిన మల్లెతీవియకు వగరు మీమిడి కాయలు కాచాయను భావంతో )

    రిప్లయితొలగించండి
  11. పిల్లలు జూడన్ మంత్రపు
    జల్లులవెదజల్లి నింద్రజాలికుడనియెన్
    మెల్లిగ నబ్రక దబ్రా
    మల్లియ తీవియకుఁగాచె మామిడి కాయల్!!!

    రిప్లయితొలగించండి
  12. ఉల్లము రంజిల మల్లెలు
    మల్లియతీవియకుఁ గాచె ; మామిడికాయల్
    కొల్లలుగా తొడిగే ననుచు
    పిల్లలు చెట్లెక్కి తినిరి పింజ లుగాదిన్

    రిప్లయితొలగించండి
  13. మల్లీశ్వరి ప్రసవించెను
    పిల్లల కవ గనెను కనుల విందు గొలుపు నా
    పిల్లల గని యని రాప్తులు
    మల్లియ తీవియకు గాచె మామిడి కాయల్

    కల్లల నాడుట యెరుగని
    మల్లన్నయె సాక్షి కాగ మాట తడబడెన్
    ఝల్లుమన గుండె యతడనె
    మల్లియ తీవియకు గాచె మామిడి కాయల్

    రిప్లయితొలగించండి
  14. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘మళ్ళీ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘పెల్లున కోయిల గళములు..." అందాం.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    ప్రస్తుత పరిస్థితులకు అనుగుణమైన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీరు తాజాగా వ్రాసిన రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    సుందరమైన పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. అల్లన నడచుచు దిరిగెడి
    నల్లని కన్నయ్య మొలను నాణెముగానే
    అల్లిక బంగరు త్రాడది
    మల్లియ తీవియకుగాచె మామిడికాయల్

    రిప్లయితొలగించండి

  16. చిన్న సవరణతో...

    అల్లన నడచుచు దిరిగెడి
    నల్లని కన్నయ్య మొలను నాణెముగానే
    అల్లిన బంగరు త్రాడది
    మల్లియ తీవియకుగాచె మామిడికాయల్

    రిప్లయితొలగించండి
  17. గోలి హనమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. అల్లదిగో మామిడి పై
    నల్లుకొనిన తీవమల్లి; యయ్యారే నీ
    యల్లరి యూహలు భళిభళి!
    మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్.

    రిప్లయితొలగించండి
  19. నల్లని కొండల పాఱెడు
    చల్లని నీటి కెరటముల సాగినదదిగో
    తెల్లని గుఱ్ఱము సౌరుల
    వెల్లడి చేయగ పదములు విరళంబయ్యెన్.

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. అల్లరి లవకుశు లిరువురు
      పిల్లలు జన్మించి రింతి పేరిమి వరమై;
      వల్లియలారా! కనురిట,
      మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్!

      తొలగించండి


  21. అల్లుకొనగ పిరియముగా
    మల్లియతీవియకుఁ గాచె మామిడికాయల్
    మెల్లన విడివడి యుల్లము
    జల్లన మధురిమలతోడ చక్కగ యెదిగెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి