4, మార్చి 2014, మంగళవారం

పద్య రచన – 525

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. ఎంత యుతికిన వీడడు పీత బ్రతుకు
    పెగ్గు పెగ్గుల రారాజు పెనిమి టితడు
    బండ పైనను బాదిన నుండ గలడు
    వేగ లేకుంటి నీతని వెఱ్ఱి మాన్ప

    రిప్లయితొలగించండి

  2. పొద్దెరగక పద్య రచన చేయుదువా
    నా మగడా, రా రమ్ము నా చేతికి
    చిక్కితివి ఈ వేళ నేను ఉతికెదను
    రసరమ్య నవ్య అర్ధ చంద్రోగీతిక !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. పీకదాక త్రాగి కేకలేయు పతిని
    బండకేసి భార్య బాదు చుండె
    బుడ్డి వదలి పెట్టి బుద్ధిమంతులవుడు
    చెడును వీడ కున్న చేటు మూడు

    రిప్లయితొలగించండి
  4. బట్టను బాదిన రీతిన
    గట్టిగ బాదేనుభార్య కారణ మేమో?
    కట్టిన తాళిని యాలిని
    పట్టకతిరిగేటి పతుల పనిగోవిందా

    రిప్లయితొలగించండి
  5. తప్ప ద్రాగిన మగనిని దలిరు బోడి
    బట్ట లుతికెడు విధముగ బాదు చుండె
    రా తి మీదన ,కోపంబు రగులు కొనగ
    చూడనా పైని చిత్రము చోద్య మాయె

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    ==============*==============
    కుక్క తోక వంకర సరగున సరియగు
    పరగ మూఢ తతులు వేగ భక్తులగును
    గాని వ్యసన కడలి నీదు కలుష మతుల
    బుద్ధి యెంత ఉతికిన శుద్ధి గాదు
    సోదరి!తమ కరములకు బాధ దప్ప!

    రిప్లయితొలగించండి
  7. పట్టుచు నీరును ధారగ
    గొట్టెను బిందెలనునేల కోపము తోడన్
    బట్టను పతిగా దలచుచు
    గట్టిగ యుతికేనుసతియె కలహాంతరితై

    రిప్లయితొలగించండి
  8. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    జిలెబీ గారూ,
    మీరిచ్చిన చక్కని భావాన్ని నాగరాజు రవీందర్ గారు పద్యబద్ధం చేశారు. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    జిలేబీ గారి భావాన్ని చక్కని పద్యంలో ఇమిడ్చినందుకు ధన్యవాదాలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    బాదేను, తిరిగేటి అని వ్యావహరికాలను ప్రయోగించారు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. బట్టను బాదిన రీతిన
    గట్టిగ యుతికెను మగనిని కారణ మేమో?
    కట్టిన తాళిని యాలిని
    పట్టక పొరలిడెడి పతుల పనిగోవిందా

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    త్రాగుబోతు మగని తన్నినా యుతికినా
    మందు మానబోడు సుందరాంగి
    ప్యాంటు నుండి బైట పడుచు నీ పొంకము
    యుతుకు చందమంత నుతియొనర్చు

    రిప్లయితొలగించండి
  12. శైలజ గారూ,
    మీ మూడవ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తాళిని + ఆలిని’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘తాళిని భార్యను’ అనండి.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పొంకము + ఉతుకు" అన్నప్పుడు యడాగమం రాదు. ‘పొంకము నుతుకు’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  13. పనికయి వచ్చిన దాసినిఁ
    గని తాగిన మైకమందు కలవరపడజే
    సినచో యద్దాసి కలబ
    డిన విధమును చిత్తరువున డించిరి, భళిరా!

    రిప్లయితొలగించండి