22, మార్చి 2014, శనివారం

పద్య రచన – 543

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. నల్లవాడ వనుట గొల్లవాడ వనుట
    తుంటరీడు వెన్నదొంగ యనుట
    నీదు తత్త్వ మెరుగని జనుల మాటలే
    కాని సత్యములొకొ బాలకృష్ణ?

    నీదు లీలలందు నిక్కమౌ భావమ్ము
    నరయ గలరె? మూఢులైన వారు
    నటనసూత్ర ధారి జ్ఞానుల హృదయాల
    పరగు జ్యోతివీవె బాలకృష్ణ!

    గురువరుండ వీవు, గోకులమణి వీవు,
    సాధులోక పారిజాత మీవు
    సకల లోకములకు స్వామి వీవే దేవ!
    వందనములు నీకు బాలకృష్ణ!

    రిప్లయితొలగించండి
  2. గోపికల మనములు కుండలు వానిలో
    ప్రేమ యనెడు మంచి వెన్న ముద్ద
    లుంచుట గని దోచితో నీవు చల్లగా
    మేలు మేలు దేవ! బాలకృష్ణ!

    రిప్లయితొలగించండి
  3. ఉట్టికి కట్టిన గంటలు
    గట్టిగ మ్రోగంగ వలదు గణగణ మనుచున్
    పట్టెదరు గోప వనితలు
    చట్టిని మెండగు మిసిమిని జప్పున తినగా

    రిప్లయితొలగించండి
  4. వ్రజమండ లమునందు దిరుగు వాసుదే వుడవు నీవు
    వ్రజవని తలయిండ్ల లోన పాలుపె రుగువెన్న లుతిని
    వ్రజవని తలతోన యాడి బాలుడు గోవిందు డవనె
    వ్రజనాధు డవనుచు పొగడె వారిజాక్షులు మోద మలరి

    గురువులు క్షమించాలి నాఈ ప్రయత్నము నందు ఎన్ని తప్పులు ఉన్నాయో

    రిప్లయితొలగించండి
  5. వెన్నను మ్రుచ్చిలు చుండిన
    వెన్నుని గన ముద్దు వచ్చు వెనకనె నీడై
    వెన్నంటి నడచు రాముడు
    వెన్నంటిన చేయి దాచి వీధికి రారే !

    రిప్లయితొలగించండి
  6. చిన్ని కృష్ణయ్య రామయ్య వెన్న దొంగి
    లించు చుండిరి ముదముతో, లీల గనుడు
    వెన్న మీగడలన్ తాము తిన్న పిదప
    ఎట్టి తగవులు గల్గునో యెన్న తరమె

    రిప్లయితొలగించండి
  7. మెల్లగ వెన్నను మ్రుచ్చిల
    నల్లని కన్నయ్యజేరి నటనము లాడెన్
    అల్లన చట్టిని వాలిచి
    చల్లగ వెన్నంత గ్రోలు చక్రికి జోతల్

    రిప్లయితొలగించండి
  8. చిన్ని కృష్ణుని జూడుడు వెన్న నెట్లు
    దొంగి లించుచు నుండెనో దొంగ వోలె
    జగము నాడించు పరమాత్మ చట్టి తోడ
    నాడు చుండెను గొలుపంగ నబ్బు రమ్ము

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    బాలకృష్ణునకు వందన మంటూ మీరు చెప్పిన పద్యాలు మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అన్న రాముని తోడుగ వెన్న దొంగ
    వెన్న మ్రుచ్చిల జేయచు వేడ్క నొందె
    వన్నెచిన్నెల మోమున యెన్ని హొయలు
    చిన్ని కృష్ణయ్య నీలీల లెన్న తరమె

    రిప్లయితొలగించండి
  11. అన్న దమ్ములు వెన్న నార గించ
    ఎవరు లేనట్టి సమయాన యింట చేరి
    దొంగ లించుచు జుర్రగ దొరల వోలె
    చూడ ముచ్చట గొల్పును, వేడుకగును

    రిప్లయితొలగించండి
  12. శైలజ గారూ,
    మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    ‘మోమున నెన్ని’ అనండి.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘వెన్న’ అన్నచోట గణభంగ. ‘వెన్నల నారగించ’ అందామా?

    రిప్లయితొలగించండి
  13. వెన్నను దోచగ నట రా
    మన్నను తోడంటి వెళ్ళ, నమ్మకు నీవున్
    దిన్నది వెన్నని జెప్పక
    మన్నని చాడీలు జెప్ప మరచితి వయ్యా !

    రిప్లయితొలగించండి
  14. మత్తేభమ్మునుఁ గాచితీవు భళిరా! మర్యాద నిల్పంగ నా
    ముత్తైదున్ కడ చాచితో యభయమున్, పుణ్యాత్మ పిల్వంగనే;
    చిత్తమ్ముల్ పలు దోచితీవు భళిరా! చీరమ్ము లన్ వోలె; యె
    త్తెంతైనన్ బలరామునిం గలసితో? హేలావిధిన్ వెన్నకై.

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ,
    మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. గురువుగారు,
    బాగుందనడం మీ పెద్దమనసేగాని తొందరలో వ్రాసిన పద్యం నాకేమాత్రం తృప్తి కలుగలేదు.

    మీ ఆశీస్సులతో
    సవరణ.

    మత్తేభమ్మునుఁ గాచగా నురకవే!మత్తుల్ కయింబట్ట నిన్
    చిత్తమ్మందునఁ దల్చు కృష్ణకిడవే,చీరల్ దయాశీలువై!
    క్రొత్తేమున్నది యన్నతో కలసి యా గోపల్లె వెన్నల్ సదా
    చిత్తమ్ముల్ వలె దోచుకొంటివనగా, శ్రీకృష్ణదేవా! హరీ!

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మీదేవి గారూ,
    నేను ఛందోవ్యాకరణాంశాల మీదే ఎక్కువగా దృష్టి పెడతాను. భావానికి అంత ప్రాధాన్యత ఇవ్వను. పద్యాలు సలక్షణంగా ఉన్నాయా లేదా అనే దానినే నేను చూస్తాను.
    ఆ విధంగా మీ మొదటి పద్యం బాగుంది అన్నాను.
    మీరు సవరించిన పద్యం ఇంకా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. ధన్యవాదాలు గురువుగారు,
    అవును తప్పులు ఎక్కడ చేస్తున్నామో తెలుసుకోవడానికి మొదటి ప్రాధాన్యతే కదా!

    రిప్లయితొలగించండి