5, మార్చి 2014, బుధవారం

వాల్మీకి స్తుతి

ఆదికవి స్తుతి

కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరమ్|
ఆరుహ్య కవితా శాఖాం
వందే వాల్మీకి కోకిలమ్||

స్వేఛ్ఛానువాదము
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సరస కవితా మహీరుహ శాఖ జేరి
ఆదరమ్మున రామ రామా! యటంచు
హాయిగా తీయతీయగా నాలపించు
ప్రథిత వాల్మీకి కోకిలా! వందనమ్ము. 

9 కామెంట్‌లు:

  1. చక్కని అనువాదము జేసిన కవి వరులకు నమస్సులు.

    నా చిన్ని ప్రయత్నము...

    శ్రీ కర రాముని కథనే
    కూకూయను కొమ్మపైని కోకిల వలెనే
    మాకందగ గూసిన యో
    శ్రీ కవివర వందనమ్ము శ్రీ వాల్మీకీ !

    రిప్లయితొలగించండి
  2. చక్కని అనువాదము జేసిన కవి వరులకు నమస్సులు.

    నా చిన్ని ప్రయత్నము...

    శ్రీ కర రాముని కథనే
    కూకూయను కొమ్మపైని కోకిల వలెనే
    మాకందగ జేసిన యో
    శ్రీ కవివర వందనమ్ము శ్రీ వాల్మీకీ !

    రిప్లయితొలగించండి
  3. ఆది కవియైన వాల్మీ కి యచట యుండి
    వ్రాసి యుండెను గావ్యము ల్వాసి గాను
    సం స్కృతంబున మనకుగా శ్రమను బొంది
    వందనంబులు వానికి వందలాది

    రిప్లయితొలగించండి
  4. మా అనువాద పద్యమును ప్రశంసించిన మిత్రులు --
    శ్రీ కంది శంకరయ్య గారికి,
    శ్రీ నాగరాజు రవీందర్ గారికి,
    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారికి, మరియు
    శ్రీ సుబ్బా రావు గారికి
    మా సంతోషము - అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  5. పందితనేమానిగారి వాల్మీకి స్తుతి ప్రశంసనీయము
    నాచిన్నిఅనువాదము ప్రస్తుతి చేయుచున్నాను
    ఆదికవిస్తుతి

    "రామ రామ ను మధురాక్షరములు" కవిత
    శాఖ పై నెక్కి పంచమ స్వరము నందు
    గానమొనరించు సుకవి పికమ్ము నకును
    వందనము సేతు భక్తి ప్రపత్తి మెరయ


    రిప్లయితొలగించండి
  6. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    తప్పక ప్రయత్నము జేయుదును సార్.
    మీ తెలుగు అనువాదం బహు బాగుంది గురువుగారు .

    రిప్లయితొలగించండి
  7. ప్రణామములు
    కోకిల గానమంత మధురంగా ఉంది ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  8. మా పద్యమునకు ప్రశంసలను తెలిపిన శ్రీమతి రాజేశ్వరి గారికి మరియు శ్రీ వరప్రసాద్ గారికి మా సంతోషమును శుభాశీస్సులను తెలియజేయు చున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. కవితను కొమ్మను నిల్చిన
    కవికిదె వందనము! పలుకగ దెలిసెనంచున్
    చెవికింపుగ రాముని కథ
    కవనమ్ముగఁ దీర్చి తనదు ఘనతను చాటెన్.

    రిప్లయితొలగించండి