9, మార్చి 2014, ఆదివారం

తిరుపతి ప్రయాణం

రేపు తిరుపతి ప్రయాణం
కవిమిత్రులకు నమస్కృతులు. 
రేపు మా ఆవిడతో (10-3-2014) కృష్ణా ఎక్స్‌ప్రెస్‍లో తిరుపతి ప్రయాణం. ఎల్లుండి (11-3-2014) అలిపిరి నుండి నడకదారిలో తిరుమలకు. 12-3-2014 నాడు కాణిపాకం, స్థానిక దేవాలయాల దర్శనం. 13-3-2014 నాడు కృష్ణా ఎక్స్‌ప్రెస్‍లో తిరుగు ప్రయాణం.
ఈ నాలుగు రోజులకు పద్యరచన, సమస్యాపూరణ శీర్షికలను షెడ్యూల్ చేసి ఉంచాను. అవకాశం దొరికినప్పుడు నెట్ సెంటర్‍లలో బ్లాగు చూస్తూ ఉంటాను. కవిమిత్రులు ఈ నాలుగు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. 
మిత్రుల పద్యాలను, పూరణలను సమీక్షించవలసిందిగా పండిత నేమాని వారిని సవినయంగా వేడుకుంటున్నాను.
అన్నట్టు.... తిరుపతిలో బ్లాగు మిత్రు లెవరైనా ఉన్నారా? కలుసుకునే అవకాశం ఉందా? తెలియజేయ వలసిందిగా మనవి.

3 కామెంట్‌లు:

  1. తిరుపతి కేగిన సామికి
    విరి విగ మఱి యిచ్చు గాక ! వేడిన వరముల్
    వర దుడు గద మఱి యాయన
    కరములు జోడింతు నెపుడు కరుణ లు గలుగన్

    రిప్లయితొలగించండి
  2. బుధత్వానికి అధీశుడగు వేంకటేశుడు గంగై నిలువగా!
    కవిత్వానికి కవీశుడగు గణేశుడు యమునై పిలువగా!
    గురుత్వానికి గుణేశుడగు 'శంకరయ్య ' అంతర్లీనమై పూరించగా!

    ఉరకలెత్తె ముప్పాయలు చిత్తూరు భాగాన త్రివేణి సంగమంగా!

    పలికించె నా నోట..అంబ పలుకు జగదంబ పలుకుగా!

    సందర్భోచితమవ్వీ కవిపున్నాగ అతిశయ్యమ్ముగాదుగా!

    రిప్లయితొలగించండి
  3. గురువుగారు,
    రెండురోజుల క్రిందటే దర్శనము జేసికొని తిరిగి వచ్చి మీ పోస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు జనం తక్కువే కాబట్టి మీకే ఇబ్బంది లేకుండ దర్శనము అవుతుంది.

    రిప్లయితొలగించండి